May 6, 2024

పూలగుత్తులు-2

పోగుల విజయశ్రీ

 

హృదయం నిండా
పూలగుత్తులు
పరిమళాలు తుపాన్లు
తీరాచూస్తే నానీలు.

మా ఊరు
ఒక బృందావనం
తుపాను వచ్చిందా
కడగండ్ల గానం

మనిషికేమో
కోరికల కుప్ప
దేవుడికి మిగిలేది
కొబ్బరిచిప్ప.

మాటల పదును
తూటాల కెక్కడ
అందుకె గుండె
ముక్కలు… ముక్కలు

వెర్రోడా!
చెట్టును అమ్ముకున్నావా?
నమ్ముకోవాలిగాని
రేపటి ప్రాణమిదే!

పూలగుత్తులు (నానీలు) కవితామాలిక నుండి)