April 27, 2024

కంది గింజ

రచన : శ్రీధర్ ఆయల             “ మిస్టర్  నూర్  భాషా ! నువ్వు  ‘ఖురాను’   మీద  ప్రమాణం  చేసావు. నీ  వృత్తి  వివరాలు  కోర్టు  వారికి ఉన్నది, ఉన్నట్లుగా  తెలియజెప్పు.” “ హుజూర్ ! నేనొక  శిల్పిని.  పాలరాయి,  సుద్దరాయిల  మీద,  ఇంకా  మీనియేచర్  వస్తువుల  మీద  పేర్లు,  చిత్రాలు  గీస్తాను.” “  మీనియేచర్  వస్తువులు  అంటే ?” “  కందిగింజలు,  బియ్యం   గింజలు  వగైరా  హుజూర్ !” “ కందిగింజల  మీద  వ్యక్తుల  పేర్లు,  […]

భారతంలో బాలకాండ

రచన: శారదామురళి               ప్రియమైన మీనా, బాగున్నావా? ఇక్కడ నేను బాగానే వున్నాను. కనీసం అలా అనుకుంటున్నాను. ఇంటా బయటా ఊపిరాడనంత పని. శారీరకమైన శ్రమ  కంటే మానసికమైన అలసట ఎక్కువ కృంగ దీస్తుందేమో! కొద్ది రోజులు ఉద్యోగం మానేసి విశ్రాంతి తీసుకో అంటాడు ప్రశాంత్. కానీ నీకు తెలుసుగా, నా పనంటే నాకెంత ఇష్టమో.   నిజానికి, ఆస్ట్రేలియా వచ్చింతరువాత ఏం చేయాలో నాకు చాలా రోజులు […]

రామానుజ

రచన : రహ్మానుద్ధీన్..   [pullquote]యోనిత్యమచ్యుత పదాంబుజ యుగ్మరుక్మ వ్యామోహదస్తదితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే [/pullquote]               ఈనాడు మనం పూర్తి అజ్ఞానంలో బ్రతుకుతున్నాం. మనకు మనం తెలియని మాదక దశలో జీవిస్తున్నాం. స్వదేశంలోనే విదేశీయులుగా జీవిస్తున్నాం. మన  కట్టు-బొట్టు ఏనాడో వదిలేసాం. మన పరిసరాల్ని కూడా పాశ్చాత్య సంస్కృతికి అద్దం  పట్టేలా మార్చేస్తున్నాం. మన సంస్కృతి మన ముందు వెలవెలబోతున్నా […]

ఓ పాలబుగ్గల జీతగాడా…..

  రచన : ఎన్నెల ఏందో నాకు ఏడుద్దామంటె ఏడ్పొస్తల్లేదు…యెందుకిట్లనో సమజైతల్లేదు. ఆకలయితాందా అయితలేదా తెసుస్తల్లేదు..బాధయితాందా లేదా అస్సలుకె తెల్వదు. మొన్ననంగ తిన్నదే, నోరంత గడ్డి వెట్టుకున్నట్టు కొడతాంది. నాలుగు దినాల్సంది పానం ఒక్క కాడ నిలుస్తల్లేదు…బుడ్డొడిని సూసి రెండెండ్లాయె. ఎట్లున్నడొ ఏమొ! తల్సుకుంటె ఖుష్ అయితాందో దుఖమయితాందో ఏందో…ఎవలన్న మాట్లాదితె బాగుండు. ఎవరున్నరీడ? ఉన్న గుడంగ వాల్ల బాస నాకర్థం గాదు…మంచిగ మన బాసల మాట్లాడెటోల్లు కాన్రాక ఎన్ని దినాలయ్యె. నోరెండుకపోతున్నట్టుంది ఇంటికాడ ఎట్లుందో అందరు […]

ప్రళయమూ, ఆ తరువాతి జీవితమూ

  రచన : తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం నవజాతి ప్రతి కొన్నివేల సంవత్సరాలకీ ఒకసారి దాదాపు పూర్తిగా నశిస్తుంది. విచిత్రమేంటంటే – ఈ నశించడం ప్రపంచంలో అన్నిచోట్లా ఒకేసారి జఱుగుతుంది. దీనికి ప్రళయం అని పేరు. ఇది రెండురకాలుగా ఉంటుంది. మహాప్రళయమూ, అవాంతర ప్రళయమూ అని ! మహాప్రళయంలో మానవులతో పాటు యావత్‌జీవజాలమూ నిశ్శేషంగా నశించిపోతుంది. అటువంటప్పుడు భగవంతుడు సృష్టి మొత్తం మొదట్నుంచీ ప్రారంభించాల్సి వస్తుంది. అలా కాక చాలా వఱకూ నశించి కొంతభాగం మాత్రం మనగల్గి […]

వాడొచ్చేశాడు!!!

రచన: డా. రజని వాత్సల్యా అనాధ శరణాలయం పిల్లల సందడితో కోలాహలంగా ఉంది. గేటు ముందు కారుదిగి లోపలకు వెళ్లాం మేము. పిల్లలు ఆటలు ఆపి మావైపు చూస్తూ నిలబడ్డారు. మేము వస్తున్నట్లు ముందే ఫోను చెయ్యడంవల్ల మాకోసమే కనిపెట్టుకుని ఉన్నారు కాబోలు, ఆ శరణాలయం మేనేజ్‌మెంట్‌వారు మమ్మల్ని చూస్తూనే బయటికి వచ్చి, లోపలికి ఆహ్వానించారు. ఆ రోజు మా అరవింద్ తొలి పుట్టినరోజు. అప్పుడే వాడు పుట్టి సంవత్సరం గడిచిపోయింది. వాడిని చూసుకుని మాలో ఎన్నో […]