April 27, 2024

ఎంత ఘాటు ప్రేమయో!

— మధురవాణి అనగనగా ఒక ఊర్లో మహా రద్దీగా ఉండే ఒక వీధి. ఆ వీధి ఎల్లప్పుడూ తూనీగల్లాగా ఝూమ్మని బైకులేసుకు తిరిగే కుర్రాళ్ళతోనూ, రంగుల రంగుల దుస్తుల్లో మెరిసిపోతూ నవ్వుతూ, తుళ్ళుతూ అందమైన సీతాకోకచిలుకల్లా విహరించే అమ్మాయిలతోనూ కళ కళలాడిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఊర్లోనే పేరుపొందిన రెండు అతి పెద్ద కాలేజీలు అక్కడే ఉన్నాయి మరి! ఆ రెండు కాలేజీల్లో కలిపి వేలల్లో ఉంటారు విద్యార్థులు. పేరుకి విద్యార్థులే అయినా కూడా విద్య కోసం […]

వర్ణ చిత్రాల మాంత్రికుడు వడ్డాది

రచన : సురేఖ అప్పారావు   మనకు ఎందరో చిత్రకారులున్నారు. కానీ వడ్డాది పాపయగారి చిత్రరచనాశైలి వేరు ! ఆయన కుంచె అనే మంత్ర దండంతో చేసే మాయావర్ణ చిత్రవిన్యాసాలు అద్భుతం! శ్రీ వడ్డాది పాపయ్య చిత్రకారుడిగా ఎంతమందికి తెలుసో అలానే ఆయన గురించి తెలియని వాళ్ళూ మన తెలుగు దేశంలోఉన్నారు. 1945లో ప్రారంభించిన బాలన్నయ్య , బాలక్క్యయ్యల “బాల”లో ఆయన ముఖ చిత్రాలతో బాటు లోపలి బొమ్మలూ వేశారు. ఆయన “లటుకు-చిటుకు” శీర్షికకు లటుకు చిటుకుల […]