April 27, 2024

విశ్వనాధవారి నాయికలు – రణరంభాదేవి

రచన :  డా.  కౌటిల్య II శ్రీ గురుభ్యోన్నమః II విశ్వనాథవారి సాహిత్యంలో ఒక అంశాన్ని తీసుకుని విశదీకరించి రాయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను కాని రాద్దామని మొదలు పెట్టాక తెలుస్తోంది, అది ఎంత దుస్సాహసమో! నాలుగైదు సముద్రాలమీద పడి బారలేసి ఈదినట్లనిపిస్తోంది. ఎలా మొదలు పెట్టాలో, ఎలా సాగించాలో అస్సలు తీరు తెన్నూ కనిపించలేదు. చివరాఖరికి విశ్లేషణలా కాకపోయినా పరిచయంగా రాయగలిగినా చాలులే అనుకుని నాకు తెలిసిన, నేను చదివిన నాలుగు విషయాలు ఇలా మీముందు పెడుతున్నాను.   […]

హిందోళరాగం

రచన :  భారతీ ప్రకాష్ జన్యరాగం. 20 వ మేళకర్త నఠభైరవి నుండి జన్మించినది. ఆరోహణ: స మ గ మ ద ని స అవరోహణ: స ని ద మ గ స షడ్జమంతోబాటు సాధారణగాంధారం, శుధ్ధమధ్యమం, శుధ్ధదైవతం మరియు కైశికినిషాదాలు ఈ రాగంలోని స్వరాలు. ఔడవ-ఔడవ రాగం. ఆరోహణలో వక్రం. ’మ’ వక్రస్వరం- మరియు ’గ’ వక్రాంత్యస్వరం. ఆరోహణ ’స గ మ ద ని స’ గా కూడా కావచ్చు. మోహనరాగం […]

అన్నమయ్య – ఒక పరిచయం

రచన :  మల్లిన నరసింహారావు                           మాలిక పత్రికలో ప్రచురణ నిమిత్తం ఏదైనా ఓ వ్యాసాన్ని  పంపించరాదా – అని ఆ పత్రిక సంపాదకవర్గం నుండి ఒక ప్రతిపాదన ఈ మెయిల్లో వచ్చింది. సరే అని ఒప్పుకున్నాను. తరువాత  ఏ విషయం మీద వ్రాస్తే బాగుంటుందని ఆలోచిస్తే అన్నమాచార్యుల కీర్తనల గుఱించిన ఓ పరిచయ వ్యాసం అయితే బాగుంటుందని అనిపించింది. అన్నమాచార్యులు, పెదతిరుమలాచార్యులు, చిన తిరుమలాచార్యుల సంకీర్తనలను తిరుమల తిరుపతి దేవస్థానం వారు చాలా […]

మహా సాధ్వి – గార్గి

రచన : ఎ.జె. సావిత్రీ మౌళి   అంతశ్శత్రువులను అణచి, ఆదర్శాలకు విలువనిచ్చి, ధార్మిక జీవనాన్ని గడిపిన మహానుభావులు ఎందరో వున్నారు.  అందుకు ఆడ, మగ తేడా లేదు.  ప్రతిభ దైవ దత్తం.  ప్రతిభకి స్త్రీ , పురుష బేధం లేదు.  ప్రతిభావంతులు అన్ని దేశాలలో, అన్ని రంగాలలో, అన్ని కాలాల్లో వున్నారు.  వేదాంత విద్యలో కూడా ప్రవీణులయిన బ్రహ్మవాదినులు వున్నారు. భారతీయులకు పరమ పవిత్రమైనది వేదం.  అందులో మంత్రద్రష్టలయిన మహిళలున్నారు. వారిని ఋషీకలు అంటారు.  ప్రాచీనకాలంనాటి […]

చెప్పబడనిది, కవితాత్మ!

రచన: వెంకట్.బి.రావ్   పూర్వం ఒక పల్లెటూరి పాఠశాలలో ఒక పంతులుగారుండేవారట. ఆయన పాఠం చెపుతున్నపుడూ చెప్పనపుడూ అని లేకుండా, ఎప్పుడు చూసినా పిల్లల మీద చిర్రుబుర్రులాడుతూండేవాడట. ఒకరోజలా చిర్రుబుర్రులాడుతూ పాఠం చెబుతూండగా, ఒక పిల్లవాడు పాఠం సరిగా వినకపోతూండడం గమనించి, కోపంతో ఆ పిల్లవానిని లేపి నిలుచుండబెట్టి బెత్తం చూపుతూ “ఈ బెత్తం చివర ఒక మూర్ఖుడు ఉన్నాడు!” అన్నాడట. దానికా పిల్లవాడు తడుముకోకుండా “ఏ చివరన పంతులుగారూ?” అన్న ప్రశ్నతో సమాధానం చెప్పాడట. ఆ […]

పుత్రోత్సాహము తండ్రికి…

రచన : జి.ఎస్. లక్ష్మి   ఉదయం ఆరుగంటల సమయం. ధనంజయరావు బెత్తెడు వెడల్పున్న అత్తాకోడలంచు పట్టుపంచె కండువాతో, చేతికి బంగారు చైనున్న ఫారిన్ రిస్ట్ వాచీతో, రెండుచేతులకీ కలిపి ధగధగలాడిపోతూ మెరిసిపోతున్నఎనిమిది వజ్రాలూ, మణులూ పొదిగిన ఉంగరాలతో, మెడలో పెద్ద ఉసిరికాయలంతున్న రుద్రాక్షమాలతో హాల్ లో అసహనంగా భార్యా, కొడుకుల కోసం ఎదురుచూస్తున్నాడు. నెమ్మదిగా వస్తున్న భార్య ప్రభావతిని చూసి విసుగ్గా అడిగాడు. “ఎక్కడ నీ కొడుకు..? ఇంకా లేవలేదా..?” “వాడికి వాడి ఫ్రెండ్స్ తో […]

మీనా

రచన :     M రత్నమాలా రంగారావ్ ….వైజాగ్     “మీనా…” అనే గద్దింపు కేకతో ఉలిక్కిపడి లేచాను. మద్యాహ్నం భోజనం తరువాత పేపరు చదువుతూ వాలుకుర్చీలో కూర్చున్నప్పుడు కన్ను మూతపడింది. ఇంతలో మీనా.. అనే గద్దింపు కేకతో మెలకువ వచ్చేసింది. లేచి శబ్దం వచ్చిన దిశగా కిటికీలోనుండి బయటకు చూశాను. ప్రక్క యింటిలో నుండి కాస్త గట్టిగానే కేకలు వినిపిస్తున్నాయి. మద్యాహ్నం వేళ కావటంతో వీధులన్నీ నిర్మానుష్యంగా,  నిశ్శబ్ధంగా వుండటంతో స్పష్టంగా వినిపిస్తున్నాయి […]

అంచేత నేను చెప్పొచ్చేదేమిటంటే

రచన: బులుసు సుబ్రహ్మణ్యం                9-30  గంటలకి  ఆఫీసు చేరుకొని, లాబ్ లోకి వెళ్ళి శ్రద్ధగా, కష్టపడి  పనిచేస్తున్న వాళ్లని ఇంకా కష్టపడి పని చేయాలని, ఈ దేశ సౌభాగ్యం, పురోగతి మనమీదే, మన ఒక్కరిమీదే  ఆధార పడి ఉందని మీకింకా తెలియక పోవడం దురదృష్టకరమని ఉద్భోదించి, తిట్టి, కేకలేసి, ధూమ్ ధాం చేసి,  పనిచేయని వాళ్ళ దగ్గరికెళ్లి,   బాబ్బాబు,  పెద్ద బాసు ఒచ్చినప్పుడైనా ఆ తెల్ల కోటు తగిలించుకొని ఈ రూమ్ నించి ఆ […]

పెళ్లి చేసి చూపిస్తాం! మేమూ పెళ్లి పెద్దలనిపిస్తాం!!!

   రచన : కృష్ణప్రియ     ఇంటి నుండి అమ్మ ఫోన్!  “మన మధు గాడున్నాడు కదా.. వాడికి ఏమైనా సంబంధాలున్నాయా అని వాళ్లమ్మ, నాన్న తెగ అడుగుతున్నారే! నువ్వు కాస్త సహాయం చేసి పెట్టు..” మామూలప్పుడు అయితే  “చాల్లే.. నేనా? ఇంకా నయం..” లాంటివి అనేసేదాన్ని. కానీ.. ఆఫీసు లో ఒక భయంకరమైన బగ్ వెనక తెగ తిరుగుతున్నానేమో.. ఏదో పరధ్యానం లో “ఓకే” అని పెట్టేసి వేరే పని చూసుకుంటూ ఉండిపోయాను.  గంట […]

మాలికా పదచంద్రిక – 1

ఆధారాలు: అడ్డం: 1.ఏ పనినైనా మొదలెట్టడానికి తీపి కానిదానిని చుట్టుతారు.(4) 3.వైదిక ధర్మమునకు సంబంధించినవి ఈ సాంగు ఉప అవయవాలు.(5) 6.ఖాకీవనం రచైత.(4) 9.లిమిట్‌లో ఉన్న మిడతంబొట్లు.(2) 10.డాంబికమా అంటే మిద్దెను చూపుతావేమయ్యా?(2) 12. రోమను చరిత్రకాదు మనదే!(5) 13.పూర్వం రాజులు చేసేవారు. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నది.(5) 14.అప్పున్న యువకుడు.(7) 15.చలనచిత్రములో మే మే అనే జంతువు దాగివుంది.(3) 17.ఏదో సామెత చెప్పినంత మాత్రాన కాలు కడిగేముందు ఇది తొక్కితీరాలా అని అడుగుతున్నావ్ భలే ‘గడుసు’పిండానివే!(3) 19.విశ్వవిఖ్యాత […]