April 26, 2024

మేల్ అబార్షన్

మేల్ అబార్షన్ – పురుషుడికి తండ్రి అవ్వాలా వద్దా అని నిర్ణయించుకునే అధికారం..!!

మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు దీని గురించి ఆలోచించండి. ఒక స్త్రీ, తనకు ఇష్టము లేక పోయినా గర్భాన్ని ధరించవలసి వచ్చింది. బహుశా ఆమె ఇప్పుడే పిల్లలు వద్దు అని అనుకొని ఉండొచ్చు. దానికి ఆమె కారణాలు ఆమెకుండొచ్చు. దురదృష్టవశాత్తూ ..ఆమె ఆ గర్భాన్ని తొమ్మిది నెలలు మోసి, బిడ్డకు జన్మ నివ్వడం తప్ప వేరే మార్గం లేదనుకుందాం. మరొక సందర్భాన్ని తీసుకుంటే, స్త్రీ ఒక బిడ్డకు జన్మనివ్వాలని నిర్ణయించుకున్నా .. తన వారు దాని అంగీకరించట్లేదు. వారు భర్తైనా కావచ్చు మరెవరైనా కావచ్చు, ఆమె ఖచ్చితంగా అబార్షను చేయించుకోవలసిందే. ఆమెకు మరో మార్గం లేదు. ఈ విధంగా, స్త్రీలకు తన గర్భం మీద ఎటువంటి నిర్ణయాధికారం లేకపోవడాన్ని సమాజము స్త్రీ-పురుషుల మధ్య సమానత్వానికి చిహ్నంగా వర్ణిస్తే, ఆ సమాజములో స్త్రీల స్థానం ఏమిటి? ప్రస్తుతం సమాజములో పురుషుడి స్థానం ఏమిటో అదే అవుతుంది.

ఒకమ్మాయి, అబ్బాయి కలిసి తిరిగారు. కలిసి సుఖపడ్డారు. దాని ఫలితంగా అమ్మాయి గర్భవతి అయింది. తనతో తిరిగిన అబ్బాయికి విషయం చెప్పింది. కానీ ఆ అబ్బాయికి అప్పుడే తండ్రి అవడం ఇష్టం లేదు. అసలు ఆమెకు పుట్టే పిల్లాడికి తండ్రిగా ఉండడం అసలే ఇష్టం లేదు. అందుకే అబార్షన్ చేయించుకోమన్నాడు. అమ్మాయి మాత్రం అబార్షనుకు ససేమిరా అంది. అప్పుడు ఆ అబ్బాయి, నువ్వే కనుక బిడ్డను కంటే .. ఆ బిడ్డకు తండ్రిని నేను కాదు పొమ్మన్నాడు. ఇలాంటివి మనం ఎన్నో చదివుంటాం. ఎన్నో సినిమాలలో చూసుంటాం. నిజజీవితములో కూడా కొంత మందికి ఇలాంటి వ్యక్తులు తారస పడి ఉండవచ్చు. ఇక్కడ అందరూ అబ్బాయిదే తప్పంటారు. అతన్ని మోసగాడిగా, హీనుడిగా చిత్రీకరిస్తారు.

ఇప్పుడు ఇదే సంఘటనను కొంచెం మార్చి చూద్దాం. అమ్మాయికి ఆ గర్భం ఇష్టం లేదు. అబార్షన్ చేయించుకోవాలనుకుంది. అబ్బాయికి మాత్రం అబార్షన్ ఇష్టం లేదు. ఆమె కడుపులో పెరుగుతున్నది తన వంశాంకురం కాబట్టి అబార్షను చేయించుకోవడానికి వీలు లేదు అని ఆ అబ్బాయి కోరాడు. కానీ, ఆ అమ్మాయి అబార్షను చేయించుకోవడానికే మొగ్గు చూపింది. ఇక్కడ తప్పెవరిది? ఖచ్చింగా ఆ అమ్మాయిది మాత్రం కాదు. కనీసం చట్టపరంగా లేదా ప్రస్తుతం ఉన్న స్త్రీవాదుల భావజాల పరంగా. ఎందుకంటే, ఒక స్త్రీకి ఆమె శరీరం మీద పూర్తి హక్కులున్నాయి. ఆమె శరీరానికి సంభందించిన గర్భం పై ఎటువంటి నిర్ణయమైనా తీసుకునే హక్కు కేవలం ఆమెకు మాత్రమే ఉంది కాబట్టి.

పై రెండు సందర్భాలలో మనం గ్రహించ గలిగేది ఏమిటంటే, బిడ్డకు జన్మనివ్వడం లేదా ఇవ్వకపోవడం కేవలం స్త్రీకి మాత్రమే సంబందించిన విషయం. మగవారి భావాలకు కానీ, వారి అభిప్రాయాలకు కానీ విలువుండదు. హక్కులన్నీ ఆడవారివి, భాద్యతలు మగాడివి. ఒక సారి ఆ అమ్మాయి బిడ్డకు జన్మనిచ్చిన తరువాత, అతనికి ఇష్టమున్నా లేక పోయినా అతను తండ్రిగా ఆ బిడ్డ బాధ్యతలు స్వీకరించాలి. ఆ బిడ్డకు సంబందించిన అవసరాలను తీర్చాలి. అవి సామాజికమైనవి కావచ్చు, ఆర్థికమైనవి కావచ్చు. లేదా, మోసగాడనే అపవాదుతో పాటు, శిక్షను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. మగవారికి సంతానాన్ని పొందడం విషయములో ఎలాంటి హక్కులు ఉండవు. తన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా పుట్టిన బిడ్డ తరపున భాద్యతలు మాత్రం ఉంటాయి. దీన్నే మన స్త్రీవాదులు సమానత్వం అని ముద్దుగా పిలుచుకుంటుంటారు.

ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఒకరి హక్కులు మరొకరి హక్కులకు భంగకరం కాకుండదు. మరి ఏమి చేయాలి. స్త్రీల హక్కులను గౌరవిస్తూనే, మగవారు తమ హక్కులను సాధించుకోవడం ఎలా?

మేల్ అబార్షన్: స్త్రీ-పురుషులిరువురికీ బిడ్డను కనడం ఇష్టం లేదనుకోండి. అప్పుడు ఎటువంటి సమస్యా ఉండదు. స్త్రీ అబార్షను చేయించుకుంటే సరిపోతుంది. లేదా, స్త్రీ – పురుషులిరువురికీ బిడ్డను కనడం ఇష్టమే అనుకోండి, అప్పుడు కూడా ఎటువంటి సమస్యా లేదు. హాయిగా స్త్రీ బిడ్డను కనవచ్చు.ఒక వేళ, స్త్రీకి గర్భం ఇష్టం లేదు అనుకోండి, ఆమె తన హక్కులకు ఎటువంటి భంగమూ కలగకుండా అబార్షను చేసుకోవచ్చు. పురుషుడి నిర్ణయముతో సంబందము లేకుండా. (ఈ సందర్భములో పురుషుడు ఏమి చేయాలి అనేది, ఈ వ్యాసం పరిధిలో లేదు).

ఒకవేళ స్త్రీకి బిడ్డకు జన్మనివ్వడం ఇష్టమై, పురుషుడికి ఇష్టం లేకపోతే మాత్రం, ఆ స్త్రీ అబార్షనన్నా చేయించుకోవాలి లేదా ఆ పుట్టబోయే బిడ్డ విషయములో పురుషుడికి ఎటువంటి బాధ్యతా లేకుండా ఉండాలి. అంటే, ఆ పురుషుడు ఆ పుట్టబోయే బిడ్డకి తండ్రి కాదు. ఆ బిడ్డకు కేవలం తల్లి మాత్రమే ఉంటుంది. ఇది విచిత్రంగా అనిపించవచ్చు. బిడ్డ పుట్టిన తరువాత తల్లి తండ్రి లేకుండా ఎలా ఉంటారు, అనే సందేహం రావచ్చు. తండ్రి ఉన్నా, అతను తండ్రిగా ఎటువంటి బాధ్యతలు తీసుకోనక్కర్లేదు. ఎందుకంటే, ఒక స్త్రీకి తను తల్లి అవ్వాళా లేదా అని పురుషుడితో సంబంధము లేకుండా నిర్ణయం తీసుకునే హక్కు ఉన్నప్పుడు, పురుషుడికి మాత్రం తాను తండ్రి అవ్వాలా వద్దా అని నిర్ణయించుకునే హక్కు ఎందుకు ఉండకూడదు? ఖచ్చితంగా ఉండి తీరాలి. ఈ విధంగా పురుషుడికి తాను తండ్రి అవ్వాలా లేదా అని నిర్ణయించుకునే హక్కు కల్పించడమే మేల్ అబార్షను ముఖ్య ఉద్దేశ్యం.

ఇక్కడ ఖచ్చితంగా చాలా సందేహాలు వస్తాయి. పురుషులకు తమ బాధ్యతలనుండి తప్పుకునే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అనిపించొచ్చు. లేదా మోసగాళ్లైన మగవాళ్లకు ఇది ఆయాచిత వరంగా మారుతుందని అభ్యంతరాలు లేవనెత్తవచ్చు. పుట్టిన బిడ్డకు తండ్రిని లేకుండా చేయడం కౄరత్వం అవుతుంది అని వాదించొచ్చు. అసలు, దీన్ని సక్రమంగా అమలు చేయడం వీలవ్వదని కూడా అనిపించొచ్చు. కొంచెం కష్టమే అయినా దీన్ని ఆచరించడం వీలవుతుంది. స్త్రీ-పురుషులిరువురూ బాధ్యతగా వ్యవహరిస్తే పైన చెప్పుకున్న సమస్యలలో చాలా వాటిని అధిగమించవచ్చు. మన దేశ చట్టం ప్రకారం, స్త్రీ 20 వారాలలోపు అబార్షను చేయించుకోవచ్చు. ఒక వేళ పురుషుడికి బిడ్డను కనడం ఇష్టం లేకపోతే, ఏమి చేయాలి అన్నది నిర్ణయించుకోవడానికి ఆ స్త్రీకి తగినంత సమయం ఉంటుంది. పురుషుడి అంగీకారం పెద్దల సమక్షములో కానీ, అధికారికంగా గానీ రిజిస్టరు చేయిస్తే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తవు.

17 thoughts on “మేల్ అబార్షన్

  1. @Rambhakta Padmavathi,

    ప్రపంచములో అబార్షన్ను వ్యతిరేకించే వాల్లూ దాన్ని సమర్ధించే వాల్లు చాలా మందే ఉన్నారు. ఇక్కడ నేను కేవలం సిద్దాంతాల గురించి మాత్రమే రాయలేదండీ. ప్రస్తుతం మగవారు ఎదుర్కొంటున్న సమస్యను గురించి చర్చించ దలుచుకున్నాను. అబార్షన్ను చాలా మంది వ్యతిరేకిస్తుండవచ్చు, కానీ వాస్తవ పరిస్థితి మత్రం అందుకు బిన్నంగా అబార్షన్ను సపోర్టు చేసేదిగానే ఉన్నాయి. ఎందుకంటే, సిద్దాంతాలు వ్యక్తి స్వాతంత్రాన్ని కాలరాయనంత వరకే. ఒక సారి అది జరిగితే వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నది ఇక్క వారి ఫిలాసఫీ.

    అందుకే, దాదాపు చాలా దేశాలలో అబార్షను అన్నది స్త్రీల హక్కు. వారు కావాలనుకుంటే చేయించుకోవచ్చు, లేదా మానుకోవచ్చు. దురదృష్టవశాత్తూ మగవాడికి ఎలాంటి నిర్ణయాత్మక అధికారమూ ఉండదు. ఈ పరిస్థితి నుండి బయటపడి, మగవారి హక్కుల సాధన దిషగా వేసిన అడుగే ఈ మేల్ అబార్షన్. ఇప్పుడు అసలు సమస్య అబార్షన్ తప్పా ఒప్పా అనంది కాదు. అబార్షను అనే హక్కు మగవారికి కూడా ఉండాలా వద్దా అనేది మాత్రమే.

  2. Nenu mee andarari abhiprayalu chadivenu.Asalu mana bharatheeyulu modata alochinchalsindi sisu hatya enths varaku samanjasam ani.idi mana samskruthilo unda.okasari garbham vachaka aa pindanni champe hakku evvariki ledu.kastamo nastamo aa bidda ni kani penchalsindey.nenu mee article ki sambandham leni vishayam chepthunnanemo naku theliyadu.Manalo sunnithamaina bhavalani kapadudam.Abortion gurinchi asalu manam matladukovaddu.Naa abhiprayam tho yevarnaina noppisthe kshaminchandi.Kani alochinchandi.

  3. అబార్షను తప్పు అని బహుషా మీలాంటి కొంతమంది అంటూ ఉండవచ్చేమో కానీ ప్రపంచములోని చాలా దేశాలలో అబార్షను స్త్రీల హక్కు. ఆ విషయాన్ని మరిచిపోయి మీరు దీన్ని Crap అనో మరోటనో అభిప్రాయాలు పెంచుకుంటే చేయగలిగింది ఏమీ లేదు.

    మీరు మేల్ అబార్షన్ అనే కాన్సెప్టును సరిగా అర్థం చేసుకోలేదో లేక మరిచారో తెలీదు. నా వ్యాసములో నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. మేల్ అబార్షన్ అంటే స్త్రీలు అబార్షన్ చేయించుకోవాలి అని కండీషను పెట్టడం కాదు. మగవారికి ఇష్టము లేనట్టైతే ఆడవారికి రెండు మార్గాలున్నాయి. ఒకటి, అబార్షను చేయించుకోవడం, రెండు తనకు నచ్చినట్టుగా బిడ్డకు జన్మనివ్వడం. ఒక వేల రెండో మార్గాన్ని ఎంచుకుంటే మాత్రం ఆ బిడ్డకు తండ్రి ఉండడు (అది ఏరకంగా నైనా సరే), కేవలం తల్లి మాత్రమే ఉంటుంది.

    స్త్రీ బిడ్డకు జన్మనివ్వలా వద్దా అని విషయములో మగవాడికి ఎలాంటి ప్రాధాన్యముండదు , కానీ ఆమె బిడ్డకు జన్మనివ్వాలనుకుంటే మాత్రం తనకి ఇష్టమున్నా లేకపోయినా తండ్రి చావాల్సిందే. జీవితాంతం పాపం మోసినట్టు దాన్ని మోయాల్సిందే అంటే ఎలా? తనది కాకపోతే కాశీదాకా దేకమన్నాడని మీరు చెప్పిన సామెత ఇక్కడ వర్స్తిస్తుందేమో ఒక సారి ఆలోచించించండి.

    కేవలం మగాడికి ఇష్టంలేదు అనేకారణంగా ఇవన్నీ కుదరవు అంటున్నారు. ఇంకా ఏకారణాలు కావాలి, ప్రపంచాన్ని ప్రళయం నుండి రక్షించడం లేక దేశాన్ని శత్రువుల కోరలనుండి కాపాడడం లాంటివి కవాలా? (Sorry for asking like this but can’t control ). ఒక స్త్రీకి తనకు ఇష్టములేకపోతే మగవాడి ఇష్టా ఇష్టాలతో పనిలేకుండా అబార్షను చేయించుకునే హక్కు ఉన్నప్పుడు మగవారికి మత్రం ఉండడములో తప్పేముంది? స్త్రీకి అబార్షను వలన చాలా సమస్యలు వస్తాయంటున్నారు. కానీ అదేమీ బలవంతం కాదు, ఆమె కావాలనుకుంటే అబార్షను చేయించుకోవచ్చు లేదంటే బిడ్డకు జన్మనివ్వొచ్చు. It’s her choice.

    1. Typo in the above comment..

      స్త్రీ బిడ్డకు జన్మనివ్వలా వద్దా అని విషయములో మగవాడికి ఎలాంటి ప్రాధాన్యముండదు , కానీ ఆమె బిడ్డకు జన్మనివ్వాలనుకుంటే మాత్రం *తనకి ఇష్టమున్నా లేకపోయినా తండ్రిగా ఉండి చావాల్సిందే జీవితాంతం. పాపం మోసినట్టు దాన్ని మోయాల్సిందే అంటే ఎలా? తనది కాకపోతే కాశీదాకా దేకమన్నాడని మీరు చెప్పిన సామెత ఇక్కడ వర్స్తిస్తుందేమో ఒక సారి ఆలోచించించండి.

  4. In my personal opinion, this idea is a crap. Sorry.. అసలు అబార్షన్ అన్నదే తప్పు అంటుంటే ఇంకా మేల్ అబార్షన్, ఫీమేల్ అబార్షన్ ఏంటి? సేఫ్ పీరియడ్ లో చేయించుకున్నంత మాత్రాన అబార్షన్స్ సేఫ్ అనుకుంటున్నారా? ఒక స్త్రీకి శారీరకంగా, మానసికంగా అబార్షన్ ఎలాంటి పరిణామాలు తీసుకొస్తుందో తెల్సా? Just because a man is not ready to become a father or does not want to take the responsibility of a child, how can he expect ‘her’ to go through the pain physically and mentally something that she doesn’t have to? If it is the male who really goes through the physical strain, yes, he has every right to abort his child. తనది కాకపోతే కాశీ దాకా దేకమన్నాడట. అలా లేదు? ఇతగాడికి ఇష్టం లేదని ఆ అబార్షన్ కాన్సీక్వెన్సెస్ ఆ అమ్మాయి ఎందుకు భరించాలి? She may not even conceive at later time for this abortion. No doctor can predict that everything is going to be alright with the female after the abortion. If you have not taken enough care, if you have committed a mistake, it is you who have to pay for it, be it as a child support or an actual physical and mental strain. Since the second option is not possible by nature, you have to go for child support if the lady is not ready for abortion.

  5. @Uma,

    No, contrary to your belief, it is not pervert mentality. In fact it is very important in men empowerment. Men, like women, must have complete control on reproduction, that is the concept.

    Here you are ignoring one simple point, Giving birth to a baby is not a process happen in overnight. Women have enough time to get abortion, if man don’t want to be father of that child.

    Vasectomy defeats the very basic point of men empowerment. why men need vasectomy, if women don’t need contraceptions?

    Planning everything before is a good idea. But not possible always. Just as in the case of abortion, Ironically, it is considered disrespecting women’s rights if some one ask the women… why she didn’t plan all these before pregnancy.

    Once the baby is conceived, there is no abortion for men, because they are only walking away from fathering a child.
    That’s his right, if he don’t want to be a father within the safe period (for abortion). It is just exercising his right to not to be a father.

    If it increase single mothers or single women, it is just because of women’s choice. Nothing wrong in that. (no need to say, in western countries number of single mothers are growing anyway).

  6. It is a pervert mentality if one conceives a baby and then want to decide they do not want to father their child. This thought should have occurred prior to conception. If the man does not want a baby he should have had a vasectomy. Once the baby is conceived, there is no abortion for men, because they are only walking away from fathering a child. It is the case globally, resulting in increase of single women and single mothers.
    Why would they not think about this issue before taking the step that leads to progeny?

  7. దేశ శ్రేయస్సు దృష్ట్యా ప్రతి జంటకు ఒక్క బిడ్డ చాలు.మరో బిడ్డ కావాలంటే ఒక అనాధను దత్తత చేసుకోవటం మంచిది.కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు ఇచ్చే ప్రోత్సాహక మొత్తాన్ని పది వేలరూపాయలకు పెంచితే మంచిది.పదేళ్ళవరకూ మగవారికి సంతానోత్పత్తి చేసే కణాలను ఆపే ఇంజెక్షన్ (మేల్ పిల్) కూడా త్వరలో రాబోతుందట.

  8. Thank you , ఒక్క చదువు విషయాల్లోనే కాదండీ, అసలు అతనికి ఇష్టం లేని బిడ్డకి అతను తండ్రిగా ఉండాల్సిన అవసరం మగాడికి మాత్రమే ఉండడం దారుణం. స్త్రీకి తాను తల్లి అవ్వాలా వద్దా అని నిర్ణయించుకునే అధికారం ఉన్నప్పుడు, మగవారికి మాత్రం ఎందుకు ఉండకూడదు అనే ప్రశ్నతో మొదలైందే ఈ మేల్ అబార్షన్.

    ఒక ఉదాహరణ తీసుకోండి – భర్తకు బిడ్డను కనడం ఇష్టం కానీ భార్యకు మాత్రం కాదు. ఆమె, తన హక్కును వినియోగించుకొని అబార్షను చేయించుకోవాలని నిర్ణయించుకుంది. అప్పుడు భర్త తన భావాలన్నింటినీ వదిలేసి అబార్షనుకు అంగీకరించాలి. కొన్ని రోజుల తరువాత … భార్య మనసు మార్చుకుని బిడ్డకు జన్మనివ్వాలి అనుకుంటే, తిరిగి అతను తండ్రి కావడానికి సన్నద్దుడావ్వాలి. అతనికి వేరే మార్గం లేదు.ఇద్దరూ భాధ్యత వహించవలసిన విషయానికి ఒక్కరే నిర్ణయం తీసుకోవడం సమానత్వానికి చిహ్నంగా భావించడం దురదృష్టకరం.

    1. ఈ వ్యాఖ్య కింద వ్యాఖ్యానించిన రవిగారిని ఉద్దేశించి రాసినది.

  9. >>ఒకవేళ స్త్రీకి బిడ్డకు జన్మనివ్వడం ఇష్టమై, పురుషుడికి ఇష్టం లేకపోతే మాత్రం, ఆ >>స్త్రీ అబార్షనన్నా చేయించుకోవాలి లేదా ఆ పుట్టబోయే బిడ్డ విషయములో >>పురుషుడికి ఎటువంటి బాధ్యతా లేకుండా ఉండాలి. >>

    Sounds logical. కనీసం ఆ మగవాడికి బిడ్డకు సంబంధించిన చదువు, పెళ్ళి తదితర విషయాలలో బలవంతంగా బాధ్యత అంటగట్టకూడదు. ఒకవేళ అంటగడితే తనమాటకెవరూ అడ్డుచెప్పకూడదు.

    కనీసం స్త్రీ పురుషులిద్దరూ ఉద్యోగం చేసే సందర్భంలోనయినా ఈ వెసులుబాటు సముచితం.

Comments are closed.