May 17, 2024

పూలగుత్తులు-1

హలో దెబ్బకు ఉత్తరం చచ్చింది ఆత్మీయతా! నువ్వెక్కడున్నావ్? చుక్కలు పగలు కూడ ఉంటాయి చీకటి దయవల్ల రాత్రి కనపడతాయి. అమ్మకూడా చీపురులాంటిదే అవసరం తీరగానే వారి స్థానం మూలనే. వస్త్రాలు నేసే నేతన్నకు మిగిలేది వేమన్న రూపమేనా? వృద్ధాశ్రమానికి దానిమిస్తున్నాం డబ్బులు కాదు కన్నవారిని..

ఆంధ్ర భారత భారతి – కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతంలోని హృద్య పద్యాలకు వ్యాఖ్యానం

రాజకులైక భూషణుడు, రాజమనోహరు, డన్య రాజ తే జో జయ శాలి శౌర్యుడు, విశుద్ధ యశశ్శరదిందు చంద్రికా రాజిత సర్వ లోకు, డపరాజిత భూరి భుజా కృపాణ ధా రాజల శాంత శాత్రవ పరాగుడు, రాజ మహేంద్రు డున్నతిన్! సుందరానుప్రాసతో, సుమధుర సంస్కృత సమాసాలతో శోభిల్లిన ఈ పద్యం ఆదికవి నన్నయ భట్టారక ప్రణీతమైన శ్రీమదాంధ్రమహాభారత మహాకావ్యంలో ప్రథమాశ్వాసంలోని అవతారికలోనిది. తనకు ఆశ్రయమిచ్చి మహా భారత మహేతిహాస నిర్మాణానికి ప్రేరేపించిన మహనీయుడు, మహారాజు రాజరాజ నరేంద్రుని ప్రస్తుతించడం […]

మహారాజ్ఞి మండోదరి

శ్రీరామ చంద్రుడు సద్ధర్మ ప్రతిష్ఠ చేసి శిష్ట రక్షణ చేయడానికి దుష్టశిక్షణ చేయడానికి పుట్టినాడని, మానవ మాత్రుడు గాడని గోపీనాథ రామాయణంలో అటనట చెప్పబడిన విషయమే. శ్రీరాముని ఔన్నత్యాన్ని, ధర్మ స్వరూపాన్ని కూడ చాల సందర్భాలలో పాత్రల ముఖతః వినిపింపచేసాడు కవి. అలాంటి కొన్ని పాత్రలలో రాక్షస స్త్రీలూ వున్నారు. ప్రతినాయకుడైన రావణాసురుని పట్టమహిషి మండోదరి కూడ ప్రథమంగా చెప్పదగినది. ఎందరో రఘురామచరిత్ర కల్లగాదు, కల్పితం కాదు అని అంగీకరించారు. “మానవులకు గల దురంత చింతనాల వల్ల […]

పంచామృతాలు-1

దేవి! నీ దర్శనములేని దినమున నొక కవిత రాదు, వచ్చినదేని కలుగదందు ప్రాణమొక్కింత, తెలిసెను ప్రాణమీవె నాకు, డెందము నలరించు నా కవితకు. దేవి! నీవుగాక మరొక్క దేవుడు కల డటె భువనమందు? ఒకడెవడైన నుండె నేని, అతడు, నీ శక్తినే ఒకించు కంత పొందియెకద అట్టలరుచుండె. తల్లితండ్రులు లేని ఈ తనయుని కొక ముద్దులేదు లేదొక్కింత మురిపెమైన అనుచు జాలితో దేవి! నన్ననునయింప తల్లివై ఇంటిలోనికి తరలి రావా! దేవి! బిసతంతువు వలెనె నీవు సన్న […]

స్ఫూర్తి

మేము ఈ పత్రిక ప్రారంభించటానికి స్ఫూర్తినిచ్చినవి మా సభ్యుల ఉత్సాహం, శ్రేయోభిలాషుల ఆలోచనలతోపాటు కొన్ని ప్రముఖ వెబ్ పత్రికలు, వెబ్ సైటులూ కూడా.ఆంగ్ల అక్షరక్రమాన్ననుసరించి వాటి పేర్లని క్రింద ఇస్తున్నాం: * ఆవకాయ * ఈమాట * పొద్దు * ప్రాణహిత * పుస్తకం * తెలుగుపీపుల్ ఆ పత్రికల గురించి ఆయా సంపాదక బృందాల మాటల్లోనే విందామా? ఆవకాయ ఉద్దేశాలు & లక్ష్యాలు: ఒక చిన్ని చినుకు, నీటిపాయగా, వాగుగా, నదిగా మారి పారినట్టు-ఒక ఆలోచన […]

కృష్ణం వందే జగద్గురుం

करारविंदॆन पदारविंदं मुखारविंदॆ विनिवॆशयंतं वटस्य पत्रस्य पुटॆ शयानं बालं मुकुंदं मनसा स्मरामि. శ్రీ కృష్ణా! కమనీయ చంద్ర ముఖుఁడా! చిద్రూప! సద్వేద్యుఁడా! శోకాదుల్ మము నాశ్రయించి, మది నిన్ జూడంగ రానీక, పల్ చీకాకుల్ కలిగించు చుండె. కనితే? శ్రేయస్కరా! మమ్ము నీ వే కాకున్నను కాచు వారెవరొకో! విశ్వంభరా! తెల్పుమా! భావము:- కమనీయమైన ఓ చంద్ర బింబము వంటి ముఖము కలిగిన వాడా! చిత్స్వరూపుడా! సత్స్వరూపుడుగా తెలియబడువాడా! ఓ శ్రీ కృష్ణా!దుఃఖము […]

సరస్వతి నమస్తుభ్యమ్

ప్రకృతిమాత అని ఒక ఏకాండీనామంతో వ్యవహరిస్తున్నప్పటికీ అనుభవంలో ఆ ప్రకృతి అంతా ఒకే శక్తిగా లేదు. నానా విభిన్నశక్తుల సమ్మేళనంగా భాసిస్తూ ఉన్నది. వీటిల్లో కంటికి దృశ్యమానమయ్యే శక్తులు కొన్ని, మన బుద్ధికి మాత్రమే గమ్యమానమయ్యే శక్తులు కొన్ని, అనుభవగోచరాలు మాత్రమే అయిన శక్తులు మఱికొన్ని. స్వయంవ్యక్తాలుగానే తెలియదగినవి ఇంకొన్ని. గ్రహాలూ, సూర్యచంద్రులూ, పంచభూతాలూ, నదులూ, పర్వతాలూ, సముద్రాలూ – ఇలాంటివన్నీ కంటికి కనిపించే ప్రకృతిశక్తులు. శృంగారోద్రేకం, గర్భదోహదక్రమం (కడుపులో బిడ్డ రూపుదిద్దుకోవడం), వివిధరోగాలూ మొదలైనవి అనుభవగోచరాలైన […]

నేచురల్ లాంగ్వేజి ప్రాసెసింగ్

నేచురల్ లాంగ్వేజి ప్రాసెసింగ్ (Natural Language Processing) అంటే ఏమిటి? అన్న ప్రశ్నకు తేలిగ్గా జవాబు చెప్పాలంటే, కృత్రిమ మేధ కు(ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్) సంబంధించిన పరిశోధనకు గల ఉపశాఖల్లో ఒకటిగా చెప్పవచ్చు. క్లుప్తంగా దీన్ని ఎన్నెల్పీ అందాము. ఎన్నెల్పీ అన్న సంక్షిప్త నామం న్యూరో లింగిస్టిక్ ప్రోగ్రామింగ్ (Neuro Linguistic Programming) అన్న శాఖకు కూడా వాడతారు కానీ, ఈ వ్యాసం లో ఎన్నెల్పీ అంటే మాత్రం‌ సహజ భాషా ప్రవర్తనం (బూదరాజు ఆధునికవ్యవహారకోశం ప్రకారం ప్రాసెసింగ్ […]

గృహహింస నిరోధక చట్టం తెచ్చిన చేటు

ఈ మధ్యకాలంలో భారతీయ గృహహింస నిరోధక చట్టం సృష్టించిన వివాదం అంతా ఇంతా కాదు. ఆ చట్టం బాధిత స్త్రీలకు ఉపశమనం కలిగిస్తుందని సాధారణ ప్రజల అభిప్రాయం. అయితే దాని దుర్వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించిన ఆకాశరామన్న గారు తన దృక్కోణాన్ని ఈ వ్యాసం ద్వారా మనతో పంచుకుంటున్నారు. A,B అనే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక తగాదా వచ్చి పడింది. దాన్ని పరిష్కరించమని మరో వ్యక్తి దగ్గరకి వెళ్ళారు. ఆ వ్యక్తి ఒక నిబంధన ప్రకారమే […]

ప్రపంచీకరణ & సంక్షోభం

గత రెండు దశాబ్దాలనుండీ దేసంలో ప్రతీమూలా మార్మ్రోగుతున్న పదాలు “ప్రపంచీకరణ, పరిశ్రామీకరణ”. ఆ పదాలు వినగానే మనకి స్ఫురించేవి – కష్టాలు లేని ప్రజలూ, ఇబ్బడి ముబ్బడిగా ఉద్యోగాలూ, సుఖశాంతులు గట్రా. అయితే వాటితోపాటుగా వచ్చే అనర్ధాల గురించి ఎక్కువగా ఎవరూ ఆలోచించలేదు. ఆ దృక్కోణంలో ఆలోచించిన కేక్యూబ్ వర్మ గారు మనకందిస్తున్న వ్యాసం ఇది నేను మీముందుంచుతున్న ఈ అంశాలన్నీ మనందరికీ ఎరుకలో వున్నవే. గణాంకాల పట్టికల ద్వారా మిమ్మల్ని ఒప్పించే ప్రయత్నం చేయడానికి నేను […]