May 6, 2024

నటరాజ నిలయం చిదంబరం

తమిళనాడు శివాలయాలకి పుట్టిల్లు అంటే అతిశయోక్తి కాదేమో. అక్కడ వున్నన్ని విశాలమైన, అద్భతమైన, అపురూపమైన కళా సంపదతో కూడిన దేవాలయాలు ఇంకెక్కడా కనబడవు. దీనికి ముఖ్య కారకులు తమిళనాడు పాలకులైన చోళ, పాండ్య చక్రవర్తులు అభినందనీయులు. ముఖ్యంగా చోళులు. శివుని పట్ల తమకు గల అత్యంత భక్తి ప్రపత్తులకు నిదర్శనంగా ఈ దేవాలయాలకోసం వారు ఖర్చుపెట్టిన డబ్బు అపారం, వెలకట్ట లేనిది. ఇన్ని తరాల తర్వాత కూడా మనమీ విశాలమైన దేవాలయాలను ఇంత భక్తి శ్రధ్ధలతో దర్శించి […]

వాహ్ ! తాజ్!!!

భారతదేశంలోని వివిధ ప్రాంతాలు రాజరికపు పాలనలో ఉండేవి. బ్రిటీషువారి ఆక్రమణ తర్వాత ప్రజాస్వామ్యపు పరిపాలన వచ్చి రాచరికాలు కనుమరుగైనాయి. వారి విలాస రాజభవనాలు ప్రభుత్వ కార్యాలయాలు, హోటళ్లుగా మారిపోయాయి. అటువంటి ఒక అద్భుతమైన రాజభవనం హైదరాబాదులోని ఫలక్‌నుమా ప్యాలెస్ .. “ఫలక్‌నుమా” అంటే ” స్వర్గలోకపు నక్షత్రం” అని అర్ధం. నిజంగానే ఇది ఆకాశంలో నక్షత్రంలా ఉంటుంది. 1893 లో ప్రారంభించబడింది. హైదరాబాదులోని చార్మినార్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక కొండపైన తేలు ఆకారంలో కనిపించే ఈ […]

తెలుగు సాహిత్యంలో హాస్యం

మన ప్రాచీనాలంకారికులు చెప్పిన నవరసాల్లో హాస్యం కూడా ఒకటి. హాసం అంటే నవ్వు. ఆ నవ్వును పుట్టించేదే హాస్యం. నవ్వు నాలుగందాల చేటని కొందరు నీరసవాదులు నిరసించినా, నేడు “నవ్వు” అన్నదానికి, ఆరోగ్యానికి చాలా మంచిదని గుర్తించడం వల్లే చాలా ఊళ్లలో ‘హ్యూమర్ క్లబ్స్’ వెలిసాయి. పనిగట్టుకుని రోజూ గంటసేపు నవ్వడం ఆరోగ్యం కోసమే అని ప్రకటన ఇచ్చేవాళ్లు ఎక్కువయ్యారు. అయితే ‘అతి సర్వత్ర వర్జయేత్’ కాబట్టి అదుపాజ్ఞలు లేని నవ్వు కూడా సమర్ధనీయం కాదు. ప్రసన్నమైన […]

పుస్తకం: శేషేంద్ర

“నేనింతా ఒక పిడికెడు మట్టే కావచ్చు, కానీ కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది.” – అని గర్జించిన గుంటూరు శేషేంద్ర శర్మ పరిచయం అవసరం లేని కవి. శేషేంద్ర శర్మ ను విప్లవకవి అనో, ఇజాల కవి అనో, వాదాల మరియూ నినాదాల కవి అనో ఒకగాటన కట్టేయలేం. ఆయన కవితల ద్వారా ఆయనేమిటో ఒక్క మాటలో చెప్పడం దుర్లభమేకానీ, ఒక్కమాటలోఆయనేమి కాదో మాత్రం తప్పకుండా చెప్పవచ్చు. ఆయన అకవి కాదు, కుకవి కాదు. […]

శ్యామాశాస్త్రులు

రచన : శ్రీ రాఘవ కిరణ్ భారతదేశంలో కర్ణాటకసంగీతం నేటిరూపును సంతసించుకోవటానికి కారకులైన వాగ్గేయకారులలో ప్రముఖులు జయదేవులు, తిరుజ్ఞానసంబంధులు, అన్నమాచార్యులు, పురందరదాసు, నారాయణతీర్థులు, క్షేత్రజ్ఞులు, భద్రాచల రామదాసు, సదాశివ బ్రహ్మేంద్రులు, ఊత్తుక్కాడు వేంకటసుబ్బయ్య, శ్యామాశాస్త్రులు, ముత్తుస్వామి దీక్షితులు, త్యాగబ్రహ్మము, వీణ కుప్పయ్య, మహారాజా స్వాతి తిరుణాళ్, పల్లవి శేషయ్య, పట్నం సుబ్రహ్మణ్యయ్యరు, రామనాథపురం శ్రీనివాస అయ్యంగారు, హరికేశనల్లూరు ముత్తయ్యభాగవతులు, మైసూరు వాసుదేవాచార్యులు, సుబ్రహ్మణ్య భారతి ప్రభృతులు. ఈ వాగ్గేయకారులలో పురందరదాసు “కర్ణాటకసంగీతపితామహు”నిగా పేరొందితే, “కర్ణాటకసంగీతత్రిమూర్తులు”గా పేరువడసినవారు త్యాగబ్రహ్మము, […]

ఖరహరప్రియరాగం

రచన: భారతీప్రకాష్ ( డైరెక్టర్, స్వరాలంకృత మ్యూజిక్ స్కూల్) – email : bharatiiyengar@yahoo.co.in             22వ మేళకర్త రాగం. 4వ  చక్రమైన “వేద” లో 4వ రాగం. మూర్చనకారక మేళరాగం.ఈ రాగము యొక్క ’రి’ ని షడ్జమం చేస్తే  హనుమత్తోడి, ’గ’ ని షడ్జమం చేస్తే మేచకల్యాణి, ’మ’ ని షడ్జమం చేస్తే హరికాంభోజి, ’ప’ ని షడ్జమం చేస్తే నటభైరవి, ’ని’ ని షడ్జమం చేస్తే ధీరశంకరాభరణం […]

కృష్ణ మృగం

రచన : శ్రీధర అయల   నీళ్లు నిండిన బిందె అరుగు మీదికి దించి, నెరసిన కబరీ భరం  జారిన  ముడి వేస్తూ, ‘అమ్మయ్య’ అంటూ నిట్టూర్చింది వరలక్ష్మమ్మ.. ‘ ఇక లాభం లేదు, ఈ ౫౨ పావంచాలూ గడచి నాగావళి ఏట్లో  బిందె ముంచి, ఇంటికి తెచ్చే  ఓపిక తనలో  క్షీణించి పోయింది. నిన్న మొన్నటి వరకూ, కొంగు వెనకాలే తిరుగుతూ నోటికీ, చేతికీ ఆసరాగా నిల్చిన ‘విశాలి’ కూడా వెళ్లిపోయింది. అయినా పెళ్లి అయిన […]

సంసారసాగరంలో సుడిగుండం

పెద్దల  ఆశీర్వాదాలతో   పెళ్లి పందిరిలో  ఫెళ్లుమని  కుప్పుస్వామి,   కుప్పుసానమ్మ మెడలో తాళి కట్టేసి అమ్మయ్య నాకు కూడా పెళ్లి అయిపోయింది అని సంతోషించేశాడు. పెళ్లి అయిన నాలుగు రోజుల తరువాత  కుప్పుసానమ్మ సమేతుడై   కుప్పుస్వామి ఉద్యోగం చేసే అస్సాం లోని జోర్హాట్ కి వచ్చేశాడు.  దూరభారం వల్ల ఎవరూ తోడు రాలేదు. కుప్పుసానమ్మ సంగీతం అయితే నేర్చుకుంది కానీ, చదువు స్కూలు దాటలేదు. తెలుగు తప్ప మరో భాష రాదు.  ఇన్స్టిట్యూట్ లో మూడు  తెలుగు కుటుంబాలు […]

పంచామృతాలు-2

ఆచార్య అనుమాండ్ల భూమయ్య ( వైస్ ఛాన్సలర్, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం)   దేవి! నీ పాదరజమింత తీసి, నా నుదుట తిలకముగ దిద్దగా తోచె కవిత యను మరాళమొకటి ..న్ ఈ వదన విశాల గగన మందున తెల్ల రెక్కలను విప్పి   దేవి! నేడు నీదు దివ్యమౌశ్రీపాద ములను నాయెడందమోపినంత కవిత  జాలువారి కడిగె నీ పాదాలు నిట్లు కుదిరె బంధమిద్దరికిని   దేవి! నీ దరహాస చంద్రికలు కురిసి తడిసి ఎంత మెత్తగ […]

పూలగుత్తులు-2

పోగుల విజయశ్రీ   హృదయం నిండా పూలగుత్తులు పరిమళాలు తుపాన్లు తీరాచూస్తే నానీలు. మా ఊరు ఒక బృందావనం తుపాను వచ్చిందా కడగండ్ల గానం మనిషికేమో కోరికల కుప్ప దేవుడికి మిగిలేది కొబ్బరిచిప్ప. మాటల పదును తూటాల కెక్కడ అందుకె గుండె ముక్కలు… ముక్కలు వెర్రోడా! చెట్టును అమ్ముకున్నావా? నమ్ముకోవాలిగాని రేపటి ప్రాణమిదే! పూలగుత్తులు (నానీలు) కవితామాలిక నుండి)