May 2, 2024

అనగనగా బ్నిం కధలు 9 – పాల యాదగిరి

రచన: బ్నిం చదివింది : ఝాన్సీ…   ఫాక్టరీ స్ట్రైకులో పడింది మిడిల్ క్లాస్ బతుకుబండి గతుకుల్లో పడింది… యాజమాన్యానికి, వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్‌కీ మధ్య జరిగే పోరాటంలో మధ్యతరగతి వర్గం నలుగుతూనే వుంటుంది. అవసరమైన ఖర్చులు కూడా నియంత్రించుకోవాల్సిన ఆపత్కర పరిస్థితిలో.. హేమ అనే తల్లికీ… కిట్టూ అనే చిట్టిబాబుకీ.. రోజూ పాలు పోసే యాదగిరికీ మధ్య జరిగిన మనసు కథ… మనసులు నలిగే కథలో మమతలు విరిసిన కథ… ఇష్టపడి చదివింది – ఝాన్సీ… […]

అండమాన్ డైరీ – 4

రచన: దాసరి అమరేంద్ర             మూడు రోజులు గడిచిపోయాయి. హేవలాక్‌లో ఇరవై గంటలు. చనువు వచ్చేసింది. కొత్తదనం దూరమయింది. గైడు గారి కోసం ఎదురు చూడ్డం అన్న ప్రసక్తే లేదు. నా అలవాటు ప్రకారం ఆ నాలుగో నాడు ఉదయం అయిదున్నరకల్లా రూంలోంచి బయటపడ్డాను. రోడ్డును పక్కన బెట్టి తిన్నగా ఉండీ లేని కాలి దారుల్లో సముద్ర తీరం చేరాను. ప్రకృతి నిజంగా వరప్రసాదిని. ఎర్లీ పక్షులకు కీటకాలు దొరకడం సంగతి ఎలా ఉన్నా నాకు […]

మౌనరాగం – 6

రచన: అంగులూరి అంజనీదేవి http://www.angulurianjanidevi.com anguluri.anjanidevi.novelist@gmail.com http://www.angulurianjanidevi.com/ anguluri.anjanidevi.novelist@gmail.com – See more at: http://magazine.maalika.org/2014/02/01/%e0%b0%ae%e0%b1%8c%e0%b0%a8%e0%b0%b0%e0%b0%be%e0%b0%97%e0%b0%82-4/#sthash.iMqJo7rG.dpuf http://www.angulurianjanidevi.com/ anguluri.anjanidevi.novelist@gmail.com – See more at: http://magazine.maalika.org/2014/03/10/%e0%b0%ae%e0%b1%8c%e0%b0%a8%e0%b0%b0%e0%b0%be%e0%b0%97%e0%b0%82-5/#sthash.nzAr66KW.dpuf సుభాష్‌చంద్ర మరణం దేదీప్యకి పెద్ద షాకయింది. దేదీప్యను ఎలా ఓదార్చాలో అర్థం కాక, ఆ స్థితిలో ఆమెను ఒంటిరిగా వదిలెయ్యలేక, తన ఇంటికి తీసుకొచ్చుకొని, ఆ రాత్రికి తన గదిలోనే పడుకోబెట్టుకొంది యశోదర. దేదీప్యలోని నిరాసక్తత చూస్తుంటే సుభాష్‌చంద్ర చావు ఆమె మీద ఎంత ప్రభావం చూపిందో అర్థమవుతోంది.  ఏ […]

మాయానగరం – 3

రచన: భువనచంద్ర ఆనందరావు ఆలోచిస్తున్నాడు. “మూడో యింటివాళ్లు అకస్మాత్తుగా కాఫీ టిఫెన్ పంపడంలోని  అంతరార్ధం ఏమిటా” అని. వాళ్లకి పెళ్ళీడుకొచ్చిన కూతురున్నట్టు ఎలాంటి దాఖలాలూ లేవు. మరెందుకీ ‘ఉచిత’ కాఫీ టిఫెన్ పథకం? ఆంధ్రదేశంలో బ్రహ్మచారులకి ‘ప్రత్యేక’ సదుపాయాల్నీ’సంసారులు’ సమకూర్చడంలో ఎన్నో అర్ధాలుంటాయి. పెళ్లి కావలసిన కూతురో, చెల్లెలో, మరదలో ఉంటేగానీ ఇలాంటి ‘అర్ధాంతర ఆప్యాయతల  వర్షం  కురవదు’. ఇది అతని నిశ్చితాభిప్రాయం. కాఫీ తాగటం, కప్పూ సాసరూ, టిఫెన్ ప్లేటు తిరిగివ్వడం ఎప్పుడో జరిగిపోయినా, ఆలోచనలు […]

అలా మొదలైంది….

రచన: డా. జె. గౌతమి సత్యశ్రీ     రాజ్, జూలీ తమకున్నంతలో హాయిగా, ప్రేమగా జీవించే జంట. జూలీకి జీవితం లో పెద్దగా కంప్లైంట్స్ లేవు, ఆశలు లేవు. కాబట్టి రాజ్ కూడా చాలా హ్యాపీ గా జీవితాన్ని   నెట్టుకొచ్చేస్తున్నాడు. ఎవరో తెలిసిన వాళ్ళు డిపార్ట్ మెంటల్ స్టోర్ లో పార్ట్ టైం ఉద్యోగం ఇస్తామంటే జూలీ స్టోర్ లో చేరింది, ఏదో కొంచెం ఎక్స్ ట్రా మనీ ఇంటికి వస్తుంది కదా అని. ప్రతిరోజూ  […]

అనుపమ దర్శక నిర్మాత కె. బి. తిలక్ – అనుభవాలు-జ్ఞాపకాలు-3

రచన: వనం జ్వాలా నరసింహారావు పొట్టి శ్రీరాములును బలి చేసారు సమాజంలో గుర్తింపు వచ్చిన వ్యక్తికి, రాని వ్యక్తికి కూడ, వారివారి గత చరిత్రల్లో స్పూర్తి దాయకమైన కొన్ని సంఘటనలు వుండటం సహజం. ఆ వ్యక్తి ధనవంతుడు కావచ్చు, పేదవాడూ కావచ్చు. జీవన పోరాటంలో స్వయం కృషితో ఓ సముచిత స్థాయికి వచ్చిన వారెందరో వున్నారు. అలాంటి వారిలో తాను సహితం ఒకడిని అవునో కాదో ఇదమిద్ధంగా తేల్చి చెప్ప లేకపోయినా, తన జ్ఞాపకాలను మాత్రం ఇతరులతో […]

మిధ్య, చరిత్రల మేళవింపు ( The Hindus )

రచన: శ్రావ్య   యా కుందేందు తుషార హర ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా యా వీణా వరదండ మండిత కరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి భిర్దేవ్యై సదా పూజితా సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహ భారతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహ   What is myth? A myth is a story that may or may not be true. Myths are generally very […]

భార్యాభర్తలు – 2 (వెండితెర నవల)

రచన: ముళ్లపూడి వెంకటరమణ రచన: ముళ్లపూడి వెంకటరమణ హాసం ప్రచురణలు హైదరాబాద్ కలకత్తా, బొంబాయి, మద్రాసు నగరాలనుండి దేశమధ్యంలో విశాఖపట్నం, బెజవాడ, రాజమండ్రి, అంగలకుదురు వగైరాలకు వెళ్లే రైళ్లు కొడుకుల దగ్గరనుంచి తండ్రులకు మనియార్డర్లకోసం ఎస్.ఒ.ఎస్. ఉత్తరాలనే తరచు మోసుకు వెళ్తూ ఉంటాయి. కొన్ని దుర్మార్గపు రైలు ముఖ్యంగా ఇలాంటి ఉత్తరాలను ఆలస్యం కూడా చేస్తూ ఉంటాయి. కాని హేమ రాసిన ఉపద్రవపు ఉతరాన్ని ఆ రోజు రైలు క్షణాలమీద పట్టుకెళ్ళి విశాఖపట్నంలో పబ్లిక్ ప్రాసిక్యూటరు ధర్మారావుగారి […]

హ్యూమరధం – 4

రచన: రావి కొండలరావు హాసం ప్రచురణ నీకు నేను.., నాకు నువ్వు రికమెండేషన్…   జూనియర్ భానుమతి అనీ – హాస్యపాత్రధారిణి. ఒక షూటింగ్‌లో రమణారెడ్డి తక్కిన వాళ్లు ఉన్నారు. భానుమతి కూడ ఉంది. మధ్యాన్నం భోజనాలారగించాక అంత తీరిగ్గా కూచుని ఉండగా – సదరు భానుమతి రెడ్దిగారిని ఓ మాట అడిగింది. “సర్… మీరు భరణీ వాళ్ళ సినిమాలో బుక్కయినారట మీ పక్కనో వేషం వుందిట – దానికి నా పేరు చెప్పరా?” అని అడిగింది. […]

అలరించిన అక్షర సయ్యాట ఆకుపాట

రచన: సి.ఉమాదేవి మనసు తోటలో వీచిన భావవీచికలకు పులకరించి రాలిన పత్ర పల్లవులు శ్రీనివాస్ వాసుదేవ్ గారి ఆకుపాటలోని కవితలు. అక్షరం పదమై, పదం వాక్యమై అల్లబడిన కవితల కలనేత చిక్కుముడులు విప్పుతూ, దాంపత్య బంధాలకు సప్తవర్ణాలనద్దుతూ, బాల్యపు జ్ఞాపకాలను జాతరలో రంగులరాట్నంలో…. కాదు కాదు రోలర్ కోస్ట్ లో మనోవేగంతో తిప్పుతారు. చినుకులందించే సాంత్వనకు చాపిన అరచేతిపై కురిసిన అనునయ చినుకులు అరచేతి నుండి దొర్లుకుంటూ వచ్చి మనసును తడుపుతాయి. వర్షం  కవితలో  వర్షం బహురూపిణిగా […]