May 7, 2024

నేస్తం

రచన: శ్రీసత్య గౌతమి

నేస్తం: స్నేహితుడు లేదా స్నేహితురాలు అంటే మానవులకు సహాయంచేసేవారు అని అర్ధం. ఈ స్నేహితులు అనే పదానికి చాలా పెద్ద విశ్లేషణలున్నాయి.

ఆపదలో ఆదుకునేవాళ్ళు స్నేహితులు,
మొదటినుండి జీవితంలో అంటిపెట్టుకుని వుండేవాళ్ళు స్నేహితులు,
మంచి సలహాలతో ముందుకి నడిపించేవాళ్ళు స్నేహితులు.
జీవితమనే ఉద్యానవనంలో అందమైన పుష్పాలు స్నేహితులు.

స్నేహానికి మరికొన్ని లక్షణాలున్నాయి- విశ్వాసం, నిస్వార్ధం, జ్ఞాపకం, నిరహంకారం. శత్రువు ఒక్కడైనా ఎక్కువే, మిత్రులు వందయినా తక్కువే అనేది వివేకానందులవారి ఉవాచ. కష్టకాలంలోనే మిత్రులెవరో తెలుస్తుంది అనేది గాంధీగారి మంత్రం. నీ తప్పులను, నీ తెలివితక్కువ పనులను మనస్సు దాచుకోకుండా నీ ముందుంచువారే నిజమైన స్నేహితులు అని బెంజిమన్ ఫ్రాంక్లిన్ ప్రస్తావించారు. మాటలకు మాత్రమే పరిమితమయ్యే మిత్రులు మిత్రులేకారు. చెడ్డ మిత్రులకన్నా అసలు మిత్రులు లేకపోవడమే మంచిదన్నారు మార్టిన్ లూథెర్ కింగ్. అంతే కాదండోయ్ మిత్రులని బట్టి మనిషిని అంచనా వేయొచ్చు అని కూడా అంటారు. ఈ సృష్టిలో నా అనేవారు, బంధువులేనా లేనివారుంటారేమో కాని స్నేహితులు లేని వారుండరు. స్నేహం సరియైనదైతే భావం సరియైందవుతుంది, భావం సరిగ్గావుంటే ప్రేరణ సరిగ్గా వుంటుంది, ప్రేరణ సరియైనదయితే కార్యాచరణ సరిగ్గావుంటుంది. కార్యాచరణ సరిగ్గావుంటే విజయం మనదవుతుంది. ఇవన్నీ జరగడానికి ఒకటే మార్గం శాశ్వత నేస్తం స్వీయ ప్రేరణ.

ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ వుంటుంది అంటారు. అంటే ఆ వ్యక్తికి విజయాన్ని సాధించడంలో ఆమె పూర్తి సహాయ సహకారాలందించినదై వుండాలి లేదా తానొక ప్రేరణ కాగలిగి వుండాలి. ఈ రెండు విషయాలు ఆమెలోని స్నేహశీలతను చాటి చెప్తున్నాయి. తనకు జన్మతః అబ్బిన స్నేహశీలతతో నేటి స్త్రీ ఎన్నో పన్లు చేయగలుగుతుంది. తాను పుట్టింట్లోవున్నా, అత్తగారింట్లో వున్నా ఇంటిని తీర్చిదిద్దడం, ఇంట్లో వారికి కావలసిన సౌకర్యాలను ఏర్పరచడం, భోజన తయారీ, మంచి ఆహారాన్ని అందించడం, అలాగే ఆరోగ్యం, అందం, వ్యాయామం, ఫేషన్ ప్రపంచాలలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నది నేటి స్త్రీ. అఫ్ కోర్స్ దీనికి ఇంట్లో మగవారి మరియు పిల్లల సహకారాలు కూడా తోడవుతున్నాయి. ఇటువంటి సహాయ సహకార సమన్వయాలు ఇంట్లో నెలకొల్పగలిగే నేర్పు చేర్పు ఆ స్త్రీకి ఉన్నప్పుడు విజయం ఆమె వెనుకే కాదు ఆమెని అనుసరించుకుని వున్న వారందరి వెనుక వుంటుందని నా ప్రగాఢ విశ్వాసం. దీనికి ఆ స్త్రీలో ఉండవలసిన ముఖ్యమైన లక్షణాలు మంచితనం, స్నేహశీలత, క్రొత్త విషయాల్ని నేర్చుకోవాలనే జిజ్ఞాస, యోగ్యత కలిగిఉండడం, కష్టపడి పైకి రాగలిగే సామర్ధ్యం కలిగి ఉండడం, పరనిందలకు దూరంగా వుండడం, పరులకు సహాయం చెయ్యడం, దైవభక్తి లాంటి లక్షణాలను కలిగివున్న స్త్రీలో వృత్తిపరంగా మరియు ఇంట్లో సంసార పరంగా కూడా ఎదురయ్యేది కేవలం విజయమే. మహిళాదినోత్సవ సంధర్భంగా అటువంటి విజయాలను చవిచూసిన మహిళలను చేరి వారి జీవితంలో మర్చిపోలేని వ్యక్తుల గురించి, వారి ద్వారా వీళ్ళు ప్రభావితమైన విషయాల గురించి చెప్పమని అడిగినప్పుడు… వారి అనుభవాల ద్వారా సాటి స్త్రీలకు (నాతో సహా) వారిచ్చిన సందేశాలు చూద్దాం.

m and s
వెంకటసుశీల జలగడుగుల, ఎం.ఏ. (సోషియాలజీ)
పబ్లిక్ హెల్త్ నర్సింగ్ సూపర్ వైజర్

“తల్లిని చూస్తే పిల్లని చూడక్కరలేదు- తల్లిని బట్టే పిల్ల గుణగణాలు” అని పెళ్ళి సంబంధాలు కుదుర్చుకుని వెళ్ళేవారు గతంలో. కారణం బిడ్డల భవిష్యత్తు, బిడ్డల పెంపకం, భర్త యొక్క విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అలాగే ఒక కుటుంబం లేదా.. వ్యక్తిగతంగా తీసుకుంటే ఒక మగవాడి యొక్క పరువు-ప్రతిష్ఠ, సభ్యతాసంస్కారం, సాంప్రదాయం, వంశం కూలిపోయి సర్వనాశనమైందన్నా కూడా ఆడదే కారణభూతమవుతుంది. అందుకే కుటుంబం ఒక వ్యవస్థ, దానికి ఆడదే ఆధారం. మహిళాదినోత్సవ సంధర్భంగా నేను తప్పకుండా నా ఆలోచన్లని, ఎన్నో విషయాల్లో నన్ను ప్రభావితం చేసిన మొదటి వ్యక్తిగురించి చెప్తాను.

మానవ మనుగడ తప్పకుండా మహిళల మీద ఆధారపడిఉంది. ఆవిడ ప్రాబల్యము ఇంటినుండే ప్రాంభమవుతుంది. పిల్లలు మొదట ఎడ్యుకేట్ అయ్యేది గృహంలోనే. సంస్కారం అక్కడినుండే మొదలవుతుంది. నాకొక తమ్ముడు, చెల్లెలు. మాకు అక్షరాభ్యాసం చేసిన మొదటి గురువు మా తల్లిగారే. తానొక మిలిటరీ సుబేదార్ కూతురు కావడం వలన అటువంటి క్రమశిక్షణలోనే పెరిగారు, మాకు కూడా అదే క్రమశిక్షణని అలవరిచారు. తాను ఆ రోజుల్లో ఎస్.ఎల్.సి. వరకు చదువుకున్నారు, ఇంకా చదవాలని ఆశపడినా ఇంట్లో పెండ్లి చేసేయడం వల్ల కుదరలేదు. అలాగని తాను చదువుకు స్వస్తి చెప్పలేదు. తన దృష్టిలో చదువు అంటే తరగతులు మారుతూ చదివి, మార్కులు తెచ్చుకుని పాస్ అవ్వడం కాదు, చదువు అంటే విజ్ఞాన సముపార్జన, దానికి సముద్రంలాగే అంతం లేదనేవారు. తాను కాలేజీకి వెళ్ళి చదవలేకపోయినా.. ఇంటికి తెలుగు న్యూస్ పేపర్ వేయించుకుని..జరుగుతున్న విశేషాలన్నీ తెలుసుకుండేవారు, అలాగే వారపత్రికల్లో కధలు, సీరియళ్ళు..తన స్నేహితుల మధ్య పుస్తకాలు, నవళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుని చదివేవారు. ఇదేదో కేవలం వంటంతా అయిపోయాక ఖాళీగా కూర్చునే సమయంలో సరదాగా చదవడం కాదు. తాను చదివే ప్రతి పుస్తకం నుండి, పేపర్ నుండి విషయాలను సేకరించి నాతో చెప్పి విశ్లేషించేవారు. తనకు నచ్చిన అంశాలను ఒక పుస్తకంలో రాసుకుండేవారు. తనకు నచ్చిన కధలను, సీరియళ్ళను వారపత్రికలనుండి సేకరించి..ఎంతో ఇష్టంగా మళ్ళీ కధాంశాలను బట్టి..వాటి లోని మోరల్స్ ని బట్టి తనకు తానే సంపుటీకరణ చేసి బైండింగు కూడా చేయించి ఇంట్లోనే ఒక లైబ్రరీ ని మెయింటైన్ చేసేవారు. తనతో ఎవరైనా ఏదైనా సమస్య చెప్పుకోవడానికి వస్తే వాళ్ళతో చర్చిస్తూ తన లైబ్రరీలోని కధలనో, సీరియళ్ళలోని రిలేటడ్ అంశాలను వాళ్ళకు చెప్పి మోటివేట్ చెయ్యడమో.. సమస్యల్ని పరిష్కరించడానికి వాటిని ఉద్దేశించడమో చేసేవారు. ఆ వచ్చిన వాళ్ళు ఎంతో సంతృప్తిగా ఏదో సమాధానం దొరికినట్లుగా వెళ్ళిపోయేవారు. అలా ఆవిడ నలుగురికీ ముఖ్యమైన వ్యక్తి అయ్యింది. అలాగే మా పిల్లలకు, తన అక్కచెల్లెళ్ళకు మిగితావారితో కూడా ఇదే వరుస. విషయసేఖరణ, విశ్లేషణ..విజ్ఞాన సముపార్జన..అది అందరికీ అనుకూల పద్దతిలో పంచడం లో ఆమెకామే సాటి. తమ్ముడు, చెల్లి బాగా చిన్నవాళ్ళవ్వడం మూలాన.. పెద్దగా వాళ్ళివన్నీ at times చూడలేదు. కానీ వాళ్ళు పెరిగాక వాళ్ళకీ ఇదే శిక్షణ. పెద్దదాన్నవ్వడం వల్ల ఫాలో అవ్వడానికి నాకోక గొప్ప అవకాశము కలిగింది, అలాగే నాకు నేనుగా కధలు రాయడం, దాన్ని వారపత్రికలకు పంపి బహుమానాలు పొందడం జరిగింది. దీనంతటికీ మా అమ్మగారే నాకు ప్రేరణ. ఆమెకి చదువంటే ఎంతో ఇస్టం. She was a self-motivated person. తన సిద్దాంతంగా..చదువుని ఒక విజ్ఞాన సముపార్జనగా చూడాలి, ఏదో ఒక మొక్కుబడిగా చదవకూడదు అనేది నేను ఇప్పటికీ పాటిస్తాను. రాత్రి నిద్రపోయే ముందు ఒక మంచి పుస్తకాన్ని చదువుతూ నిద్రపోవాలనే అలవాటును తన నుండే నేను ఇప్పటికీ పాటిస్తాను. ఆమె నేర్పిన ప్రతి మాట మా జీవితాల్లో ఒక భాగం… జీవన మార్గాలు మా ముగ్గురివి వేరే వేరే అయినా.

అంతే కాకుండా మా అమ్మగారు విద్యార్ధులకు విద్యాదానం చేశారు. ఉచితంగా నోట్సులు రాసిచ్చేవారు, పేద విద్యార్ధులకు ఉచితంగా చదువు చెప్పేవారు. ఆమె పొదుపు చేసుకునే డబ్బుతో బాగా చదువుకునే పేద విద్యార్ధులకు ఫీజులు కట్టేవారు. చదువుకోసము వచ్చిన వాళ్ళని ఏదో ఒక సహాయం చెయ్యకుండా వదిలేవారు కారు.. అలా విద్యాదానం చేసిన విద్యావరదాయిని ఆమె.

మా ఫాదరు ఉద్యోగరీత్యా ఎంతో బిజీ. ఫాదరు మేజిస్త్రేట్..తర్వాత రెవిన్యూ లో తహసిల్దార్ గా కూడా పనిచేసి రిటైర్ అయ్యారు. వృత్తిరీత్యా మా నాన్నగారి విజయాల వెనుక ఆవిడ సహాయ సహకారాలు మెండు. అంటే ఏవీ లేదు.. చాలా సింపుల్. డిమాండ్స్ అనేవీ లేకుండా సింపుల్ గా ఆలోచించేవారు, ఆ ఆలోచన్లకు తగ్గట్టుగా జీవించేవారు. దాని వల్ల కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండడమే కాకుండా.. ముఖ్యంగా ఫాదర్ తన గోల్స్ ని రీచ్ అవ్వడానికి ఎంతో అనుకూలమైన పరిస్థితులు ఇంట్లో నెలకొన్నాయి.

అంతే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఆమె మాకు సద్గురువు. ఇంట్లో వాళ్ళకే కాకుండా. బయటివారికి కూడా భక్తిమార్గాలు సూచించేవారు, సత్ సంఘాలు నడిపేవారు కూడా, మహా శివభక్తురాలు. ఆమె మా వంశానికి, మాకు కూడా ఒక వరం.

మా తల్లి గారు 2009 వ సంవత్సరం, మే నెల 4 వ తేదీన శివసాన్నిద్యాన్ని చేరుకున్నారు. ఇప్పటికి అయిదు సంవత్సరాలు దాటినా అందరి హృదయాల్లో (ఆమెతో బంధం, అనుబంధం, స్నేహబంధం మరియు రక్తబంధం ఉన్న వాళ్ళందరి) అమరజీవి ఈ ఆదర్శ మహిళ!

ఇటువంటి మహిళలు నాకే కాదు… పదుగురికీ ఆదర్శమహిళలు. ఇటువంటి మహిళందరికీ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు

shobha

డా. శోభాదేవి పొట్లకాయల, పి.హెచ్.డి
బయాలజీ డిపార్ట్మెంట్
అసిస్టెంట్ ప్రొఫెసర్
పెన్ స్టేట్ యూనివర్సిటీ, యునైటడ్ స్టేట్స్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో ఎం.ఎస్.సి పూర్తిచేసుకుని, ఖరగ్ పూర్ ఐ.ఐ.టి లో ఎం.టెక్ ఇన్ బయోటెక్ చేస్తున్నరోజులు. కోర్సు ఆఖరున 6 మాసాలు ఏదో ఒక ఇన్స్ టిట్యూట్లో ప్రాజెక్ట్ చెయ్యలి. నేను హైదరాబాద్ వాస్తవ్యురాలినవ్వడం వల్ల, హైదరబాద్ లో ని ICRISAT అగ్రికల్చర్ ఇన్ స్టిట్యూట్లో ప్రాజెక్ట్ కు జాయిన్ అయ్యాను. అక్కడ ఒక వ్యక్తి పరిచయమయ్యింది, తన పేరు వర్షా విస్లే. ఖరగ్ పూర్ నుండి కేవలం ఆరు మాసాల ప్రాజెక్ట్ చెయ్యడం కోసం వచ్చిన నాకు.. వర్షాతో స్నేహం ఒక మంచి పాఠం, ఒక రిచ్ అనుభవం, ఇంకా ఒక అదృష్టం. ఆమె నాకన్నా ఒక ఆరేడు సంవత్సరాలు పెద్ద వుండవచ్చు. ఆమె చెప్పగా ఎన్నో విషయాలు నా ఫీల్డ్ లో నేర్చుకున్నాను, ఆమె పాటించే క్రమశిక్షణను చూసి క్రొత్త విషయాలను నేర్చుకున్నాను. ఆరు మాసాల ప్రాజెక్ట్ తన స్నేహ, సహకారాలతో ఇట్టే గడిచిపోయింది. వర్షా వైరాలజీ యూనిట్లో వర్క్ చేసేది, నాకు కూడా ఆమె యూనిట్లో రికమెండ్ చేసింది. ఆరునెలల ప్రాజెక్ట్ అయిపోయాక, సునాయాసంగా అక్కడే జాయిన్ అయిపోయాను. వృత్తిపరంగా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ మీటింగ్స్ కి కలిసి వెళ్ళేవాళ్ళం. ఎన్నో రిచ్ అనుభవాలు. ఇప్పుడు వర్షా ఆస్ట్రేలియా వెళ్ళిపోయి వృత్తిపరంగా ఇంకా ఎదిగి, అక్కడే భర్త, పిల్లలతో సెటిల్ అయిపోయింది. ఎన్ని సంవత్సరాలయినా ఇప్పటికీ తానే నాకు ఒక గైడ్.

ICRISAT లో కొన్నాళ్ళు పనిచేసాక కెనడా వెళ్ళిపోయి పి.హెచ్.డి. పూర్తిచేసుకుని, నాకు ICRISAT లోనే పరిచయమయిన వ్యక్తినే పెళ్ళిచేసుకున్నాను. ఇప్పుడు ఇద్దరం అమెరికాలో పెన్ స్టేట్ యూనివర్సిటీ లోనే ఉద్యోగం చేస్తున్నాం. తను కూడా సైంటిస్ట్ మరియు యూనివర్సిటీ ప్రొఫెసరు. నేను బ్యాచిలర్ స్టూడెంట్స్ కి బయాలజీ టీచ్ చేస్తాను. నేను ఇక్కడ ఒక ముఖ్యమైన అంశాన్ని చర్చిద్దామనుకుంటున్నాను. అది వర్షా ని చూసి అలవరచుకున్న గొప్ప విషయం, అది ఇప్పుడు నాకు వరం. స్టూడెంట్స్ అందరూ ఒకేలా చదవరు కదా. ఒక స్టూడెంట్ కు ఫోకస్ తక్కువ వుండేది. క్లాసెస్ కి సరిగ్గా రాకపోవడం, లేజీ గా ఎసైన్మెంట్స్ సబ్ మిట్ చెయ్యడం, తక్కువ మార్కులు వచ్చినా కూడా పట్టించుకునేది కాదు ఆ అమ్మాయి (స్టూడెంట్). ఎందుకో ఆమెకి తగు గైడన్స్ కావాలని అనిపించి, అందివ్వడానికి ఆమెకి దగ్గిరయ్యాను. ఆ అమ్మాయితో కొద్ది గంటలు మాట్లాడాను, నా స్వంత లైఫ్ అనుభవాలను ఆమెకు పాఠాలుగా చెబుతూ వచ్చాను. ఎందుకో తాను isolated గా ఫీల్ అయ్యేది. ఆ ఫీల్ ని పోగొట్టడానికి క్లాస్ రూం కి సంబంధించిన విషయాలన్నిట్లో తనను involve చేసేదాన్ని, ఇక ఆ అమ్మాయి క్రొత్త విషయాల్లో మునిగిపోయి బిజీ అయిపోయింది. వంటరితనాన్ని వదిలేసింది. క్రొత్త క్రొత్త విషయాలను నేరుచుకోవడానికి మొగ్గు చూపేది. తక్కువ సమయం లోనే తాను మారగలిగింది.

ఆ చిన్న వయసులో పిల్లలకి immediate sense of gratitude ఉంటుంది. అదే బెస్ట్ వయసు వాళ్ళకి మంచి విషయాలు నేర్పడానికి, మంచివైపు లాగడానికి. దానికి కావలసినది, టీచర్ లో ఓర్పు, వృత్తి పట్ల అంకిత భావం. ఈ రెండూ నేను వర్షా నుండి నేర్చుకున్నవే. ఈ రోజు నా స్టూడెంట్ అందరిలోకి చాలా క్లియర్ గా వుంది, తను నెక్స్ట్ ఏ కోర్స్ లో జాయిన్ అవ్వాలి, ఎక్కడ జాయిన్ అవ్వాలి మొదలైన విషయాల్లో తానే సంత నిర్ణయాలు తీసుకుంటున్నది. తనపై తనకు ఎంతో బాధ్యత పెరిగింది. తాను కోర్స్ పూర్తి చేసుకుని వెళ్ళిపోతూ ఒక అందమైన నోట్ వ్రాసింది.. stating that you are like my mother! దీన్ని నేనొక గొప్ప accomplishment గా భావిస్తాను. ఒక బెస్ట్ టీచర్ గా నేను విజయం సాదించినట్టే. ఈ విజయంలో ఒక noble friendship యొక్క motivation ఉంది. Friendship is an unmeasurable component of life and priceless.

వృత్తిపరంగా నేర్చుకున్న ఈ నేర్పు, ఓర్పు, చేర్పు లు ఇల్లాలిగా ఇంటి వ్యవహారాలను చక్కబట్టేందుకు కూడా ఉపయోగ పడ్డాయి. ముఖ్యమైనది తల్లి పాత్ర. ఒక ఉద్యోగిని గా, ఇల్లాలిగా రెండు పాత్రలు పోషించడం కష్టతరమే అయినా .. I am enjoying both especially motherhood. కాలానుగుణం గా జీవితాన్ని అర్ధం చేసుకున్నాను. భర్తని కూడా అర్ధం చేసుకున్నాను. వృత్తిపరంగా తాను ఎంతో బిజీ. అయినా మేము తప్పుపట్టకుండా ఎదురుచూస్తాం. తనకు ఏ మాత్రం వీలుకుదిరినా మాకోసమే టైం కేటాయిస్తారు. In life, everything cannot be measured. The thought and whatever little things he does is most important. డిమాండ్స్ చెయ్యకుండా, చిన్న చిన్న విషయాలకు సర్దుకుపోతూ వుంటే రెండు పడవల్లో ప్రయాణం చెయ్యవచ్చు. అది ఈ తరం స్త్రీ కి అవసరం కూడా.

Rani

Dr. Rani Ratna Prabha, J. Ph.D
Assistant Professor in Economics Dept.
Central University of Hyderabad, Hyderabad

Briefly about myself, I born in a small town from Godavari district in Andhra state. I have finished my bachelor’s in St. Anns college, Eluru and then moved to Central University of Hyderabad for post graduation and then Ph.D in economics. Currently, I am working as an Assistant Professor in the same department.

I would like to share some of my experiences and inspirations that I have received from some women close to my heart.

1) The first person who inspired me is none other than my mother, who was a teacher (retired now) gave me a constant support and encouragement towards my education and career planning. Being a teacher, she received so much of respect from the society which inspired me since my childhood to get the same respect and appreciation in my future. Therefore I thank my mother for her innumerable support and encouragement.

2) Sometimes not only good experiences, also the bad experiences of other people give a direction to frame our future endeavors. One of such experiences I got from a friend from the same town. She was married at the age of 13, had two girl children immediately and lost her husband at the age of 18. Being a small town girl from middle class and no education, she faced lot of obstacles and problem for money to bring her children up. Lack of education was the forth most reason for all her sufferings and money also comes into feature. Though she suffered a lot, she did not lose her hope for kids. She is brave woman I ever saw. I was inspired by her hard working nature and bravery by following her closely.

3) I never forget another friend Lakshmi who came from Machilipatnam joined for the post-graduation in the same year, but in Hindi department, Central University. Another girl who was of city brought up said both of us satirically that you both came to University in a red bus (ఎర్ర బస్సేక్కేసి… వచ్చేసారా?) and made fun of us in front of her other friends. The very next moment Lakshmi told me “Rani, we have to prove ourselves to them and must take a Phd degree from this university”. Her strong words had a great impact on me to study hard and go for Ph.D. Unfortunately, Lakshmi could not pursue further studies due to her family reasons. Moreover, the city girl also did not do her Ph.D. But I got Ph.D. degree eventually.

4) Next it’s you Gauthami…met you in the university after my post-graduation, kept telling me not to leave education in the middle even the sky fall on the head when I was indecisive of some of the on goings in my home. Especially a long discussion that we both had before you guys were leaving to USA made a remarkable change and helped me to take a firm decision about life. You were always advised to prioritize studies, job and then marriage as only education makes sense of life. I am happy that I got an opportunity to thank you this way.

5. Lastly… but not least I should thank my mother-in-law who took care of my son and extended her support during my PhD completion. Of course, there are other family members who extended their timely help and support throughout my career.

Like this… at every stage of my life I met good women and got constant advice, encouragement and help in all my life endeavors.

Manjula Bhanoori

డా. మంజుల భానూరి, పి.హెచ్.డి
బయాలజీ డిపార్ట్మెంట్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్

నిన్న (ఫిబ్రవరి 8,2015) ఫేస్ బుక్ లో గౌతమితో చాట్ చేస్తూ..నీ జీవితాన్ని ప్రభావితం చేసిన మహిళ గురించి చెప్పమని అడగగానే.. ఒక్క ఉదుట్న..ఎన్నో పాత జ్ఞాపకాలు, ఆలోచనలు ముసురుకున్నాయి. ఆ జ్ఞాపకాల మధ్య నా కళ్ళ ముందుకొచ్చి నిలిచిన రూపం రుక్మిణమ్మ. ఆమె మా అమ్మమ్మకి పెద్దమ్మ. ఏడేండ్ల ప్రాయం లోనే వివాహమై, వివాహమైన ఆరు నెలలకే భర్తను పోగొట్టుకుని విధవగా మారింది. ఆపై తల్లిదండ్రులను కూడా పోగొట్టుకుని ఏకాకి గా నిలిచింది. జీవితం నేర్పిన పాఠాల వల్లేమో ఆత్మ స్థైర్యంతో ఎప్పుడూ నిండు గానే కనబడేది. పిల్లల్ని ఎంతో ప్రేమించేది. నాకప్పుడు ఏడేండ్ల వయసుమాత్రమే. అమె అంటే నాకు ఎంతో ఇష్టం. ఎంత ఇష్టమంటే… నా కిడ్డీ బ్యాంకులో నేను కూడబెట్టుకున్న 25 పైసలతో ఆమెకి ఐస్ క్రీం కొనిపెట్టాను. అది చూసి, ఎంతో మురిసిపోయి నన్ను దగ్గిరతీసుకు హత్తుకున్నది. ఇప్పటికీ అది నాకు గుర్తే. మర్చిపోలేని ఇష్టమైన జ్ఞాపకం! అప్పటినుండి కూడా రిక్మిణమ్మ కోసం కూడా డబ్బులు దాచేదాన్ని. నేను సంగారెడ్డి (మెదక్ జిల్లా, తెలంగాణారాష్ట్రం) లో చదువుకునేదాన్ని. ఆమెజోగిపేట లో (సంగారెడ్డి 30 కి.మీ. దూరంలో) అమ్మమ్మ వాళ్ళింట్లో ఉండేది. నేను ప్రతినెలా రెండో శనివారం కోసం ఎదురుచూసేదాన్ని జోగిపేటకి వెళ్ళడానికి. రుక్మిణమ్మ ప్రేమానురాగాలకి ప్రతిరూపం. తనకేమైనా ఇస్తే (ఒక పండైనా) నలుగురికీ పంచేది. ఆమె చదువుకోలేదు. ఎవ్వరికీ కూడా ఇది చెయ్యండి, అది చెయ్యొద్దు అని బోధనలు చేసేటంతటి తెగువ కూడా పాపమామెకి లేదు. ఆమె జీవితం, నడవడి, ఆమె మంచితనం నాపై చెరగని ముద్ర వేసింది. నేను ఏడవతరగతికి వచ్చేసరికి తాను స్వర్గస్థురాలయ్యింది. ఇప్పటికీ చుట్టాలలో ఆమె త్యాగ బుద్ధిని, మంచితనాన్ని, అందరికీ తల్లో నాలిక లాగ వుండి..అందరి మంచితనాన్ని పొందింది, అలాగే తన కష్టాలను ఆత్మ స్థైర్యంతో ఎలా అధిగమించిందీ చెప్పుకుంటుంటే.. ఆమె గురించి నాకు తెలియని విషయాల్ని ఎన్నో తెలుసుకున్నాను. రుక్మిణమ్మ భౌతికంగా నాకు దూరమయినా..నా అలోచ్న్లలో ఇప్పటికీ తాను బ్రతికేవుంది. తాను నావెన్నంటి ఉన్నట్టే ఫీల్ అవుతాను.

నాకు చిన్నతనం నుండు డాక్టర్ కావాలనే కోరిక వుండేది. తగిన కృషి చేసాను గానీ ఎంసెట్ లో కొద్దిమార్కులతో మిస్ అయ్యాను. ఆ బాధతో ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. చిన్నప్పుడు కూడా ఏ కష్టం కలిగినా.. నాకు రుక్మిణమ్మే గుర్తొచ్చేది.. ఏజన్మ బంధమో మాది. ఎంసెట్ లో సరిపడిన ర్యాంకు రాలేదని బాధపడుతున్నప్పుడు.. రుక్మిణమ్మే గుర్తొచ్చింది, ఊరట కలిగింది. తానే విధంగా కష్టాల్ని నవ్వుతూ ఎదుర్కొందో విన్న కధలన్నీ గుర్తొచ్చి నన్ను నేను సందాయించుకుని, మళ్ళీ మామూలు మనిషినయ్యాను. ఇలాగే నా ఆలోచన్లలో ఉంటూ నాకు దైర్యాన్ని ఇస్తూనే ఉంది రుక్మిణమ్మ. మా వూళ్ళోనే డిగ్రీ పూర్తిచేసి, ఎం.ఎస్ సి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో పూర్తిచేసి, ఫి.హెచ్.డి ఉస్మానియాలో యూనివర్సిటీ లో పూర్తి చేసాను. ఇప్పుడు ఈ యూనివర్సిటీలోనే అస్సిస్టంట్ ప్రొఫెసర్ గా అప్పాయింటయ్యాను. కాలానుగుణంగా జీవితాన్ని చదువుతున్నాను.

జీవితం క్షణభంగురం, ఏక్షణం ఏమవుతుందో ఊహకు అతీతం. అందుకే ప్రతిక్షణం జీవించాలి అనేది రుక్మిణమ్మ జీవితం నాకిచ్చిన స్పూర్తి. దీనిని నా జీవితానుభవాలకి కలగలపి ఆత్మ స్థైర్యాన్ని పెంచుకున్నాను. ఎంతటి సమస్యనైనా తట్టుకుని నిలబడి తక్షణం దానికి పరిష్కారాని అన్వేషిస్తానే తప్ప.. ఒకప్పటిలా నీరుగారిపోను. మొన్నటిదాకా ఎండోమెట్రియోసిస్ తో బాధపడి నిలదొక్కుకుని బయటపడ్డాను. ఇప్పుడు నా జీవితాశయాన్నే మార్చుకున్నాను. ఈ వ్యాధిపై పరిశోధనలు చేసి.. ఈ వ్యాధి మొదటి దశలో ఉంటుండగానే వ్యాధి నిర్ధారణ జరిపేందుకు అవసరమైన బయోమార్కర్స్ ని కనిపెట్టాలనేదే నా ఆశయం. దీనికి ఎన్నో అంతరాయాలు కలుగుతున్నా కూడా అనుకున్నది సాధించాలనే పట్టుదలను క్షణ క్షణం పెంచుకుంటున్నాను. దీని వెనుక రుక్మ్ణమ్మ ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది, నేను అనుకున్నది సాధిస్తాననే నమ్మకం నాది. ఈ నమ్మకం, ఈ పట్టుదలే నేను రుక్మిణమ్మకి ఇచ్చే నివాళి. మరొక ఆశయం కూడా ఉంది నాకు. రుక్మిణమ్మ జీవితాన్ని ఒక పుస్తంగా రాయాలని. 1995 లో మొదలుపెట్టి ఓ మూడు పేజీలు రాశాను. అనివార్య కారణాలవల్ల ఆగిపోయింది, మళ్ళీ కుదరలేదు. ఇదిగో, మళ్ళీ ఇప్పుడే.. ఆమెను తలుచుకుంటూ నా జ్ఞాపకాలను ఇలా కాగితంపై అవాకాశాన్ని కలిగించిన గౌతమికి ధన్యవదాలు. బై ద వే.. గౌతమి సెంట్రల్ యూనివర్సిటీలో నా ఎం.ఎస్.సి క్లాస్ మేట్.

*******************************

నా చివరిమాటగా… “నాతో సహా”.. అని నేను పైన చెప్పినట్లుగా, పైన నలుగురూ చెప్పిన విషయాలను విన్నాక … కొన్ని విషయాలు నాకు కూడా తెలిసినవే అయినా కొన్ని యాంగిల్స్ నుండి నేను చూడలేదేమో అనిపించింది. క్రొత్త విషయాల్ని తెలుసుకున్నాను. అంతేకాకుండా నా స్నేహితురాళ్ళలో ఎప్పుడూ నేను చూసే స్నేహం, అభిమానం, వృత్తిపరమైన ఆలోచనలే కాకుండా ఒక కోణంలో గంభీరత్వాన్ని మొదటిసారిగా చూసి.. వాళ్ళని మరొక్కసారి appreciate చెయ్యకుండా ఉండలేకపోతున్నాను. ఈ నలుగురికీ వారి అనుభవాల్లో స్నేహ బంధం రూపంలో తిరిగి మహిళలే ప్రేరణకావడం ముచ్చటగొలిపే విషయం. ఇందులో పాల్గొన్నవాళ్ళకే కాదు, మాలిక పాఠకులకు, నాకు తెలిసిన వాళ్ళకు, మీకు తెలిసిన వాళ్ళకు అందరికీ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు !!!

2 thoughts on “నేస్తం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *