May 6, 2024

సొరకాయ సొగసులు

ఆర్టిస్టు- రచన –డా.లక్ష్మి రాఘవ

cutting

 

సొరకాయ అని రాయలసీమలోనూ, ఆనపకాయ అని కోస్తా, తెలంగాణా జిల్లాలలోను పిలవబడే కూరగాయని తలచుకోగానే నోరూరించే హల్వా గానీ, రుచికరమైన పప్పుగానీ  గుర్తుకు రాక మానదు. దీని శాస్త్రీయ నామము Legeneria  vulgaris  [cucurbitaceae Family].

తినే ఆహారంలో ఉపయోగమే కాక దీనికి medicinal values కూడా ఎక్కువే. బి.పి కి,మూత్ర సంబందిత వ్యాదులకు మంచి మందు. దీని రసం ఒక క్రమపద్దతిలో తీసుకుంటే బరువు తగ్గవచ్చునని కూడా అంటారు. కొన్నిజబ్బులకు రక్షగా పిల్లల మెడలో సొరకాయ బిళ్ళ కట్టేవారు.

ఇంకా పూర్వానికి వెడితే సోరకాయను ఎండబెట్టి లోపలవున్న గుజ్జును, విత్తనాలను క్లీన్ గా తీసివేసి, ఎండిన ఈ బుర్రలో నీళ్ళు తీసుకొని దూర ప్రయాణాలకు వెళ్లేవారని, సాధువులు కమండలాలు గా ఉపయోగించేవారని చరిత్ర చెబుతుంది. సొరకాయలో సన్నటి భాగాన్ని కట్ చేసి వెడల్పాటి  భాగాన్ని బౌల్స్ గా ఉపయోగిస్తారు[ హవాయ్ లో] అంటారు.

పొలాల్లో అక్కడక్కడా సొర తీగలు మొలిచి, సొరకాయలు కాచినా అవి తినడానికి చేదుగా వుండటం వల్ల ఎవరూ కోయక అలాగే తీగలోనే ఎండి పోతాయి. అలాటివి దొరకకపోయినా అదేపనిగా ఎండపెట్టిన సొరకాయలు చూసినప్పుడు ఒక ఆర్టిస్టు ఆలోచనలు వేరుగా వుంటాయి. అలా లబ్యమైన సొరకాయలతో వివిధ ఆకృతులు తయారు చెయ్యాలని అనిపించక మానదు.

ఎండిన సొరకాయ గట్టిగా వుండటం వలన రంపపు అంచులు కలిగిన చాకుతో గానీ లేదా హెక్సాబ్లేడుతో నెమ్మదిగా కట్ చేసుకోవాలి . కాస్తంత ఓపికా, కూస్తంత కళాహృదయం వుంటే తప్పక అనేక ఆకృతులు తయారు అవుతాయి. కొన్నిసార్లు వాటి షేప్  ని బట్టి కట్ చెయ్యకుండానే చేపలు,పక్షులు లాటివి తయారు చెయ్యవచ్చు.

ఒక ఆర్టిస్టు గా నేను [లక్ష్మి రాఘవ ]తయారు చేసినవి ఈ క్రింది విధంగా చూడవచ్చు.

pic1 dried sorakayalu

పైన చిత్రంలో ఎండిన సోరకాయలను గమనించవచ్చు.

2a 2b 2c 2d 2e

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

పెన్ స్టాండ్– హెక్సా బ్లేడ్ తో సోరకాయను కట్  చేసే విధానం. అలా కట్ చేసిన తరువాత  పెన్ స్టాండ్ లాటివి తయారు చేసుకోవచ్చు.ఇక్కడ బేస్ కు కూడా  కట్ చేసిన సొరకాయ ముక్కే వాడిన విధానం గమనించవచ్చు.

faces

 డాన్సింగ్ డాల్ -ఇందులో సొరకాయ మొదలు కట్  చేసి నించునేలా చూసుకుని, వంగిన భాగం తల [ఫేస్] లాగా  పెయింటు చేసుకుని కొంచెం క్రింద రెండు సొరకాయ తొడిమ  భాగాలు అతికించి చేతుల మాదిరి చూపుతూ, వెడల్పాటి బుట్ట భాగంలో కొన్ని పిస్తా షెల్స్  అతికించి పరికిణీలాగా తయారు చేయడంవలన అందమైన డాన్సింగ్ డాల్ రూపు దిద్దుకుంది.

కాఫీ కేటిల్ -సోరకాయను అడ్డంగా పెట్టి పైన కట్ చేసి , సన్నటి ముందు భాగానికి కొంచం షేపు ఇచ్చి కాఫీ కేటిల్ లాగా తయారు చేసి  కట్  చేసిన బాగాన్ని మూత లాగా ,తొడిమ భాగం పక్కన handle లాగా అతికించుకుని ఒక చిన్న డిజైన్ వేస్తె అందమైన కాఫీ కేటల్ లాగా లేదా అల్లాఉద్దీన్ అద్భుతదీపం  లాగ అనుకోవచ్చు.

IMG_20150206_165721104

గణేష్–సొరకాయ షేప్ ని బట్టి వంగిన తొడిమ భాగం తొండంలాగా, కిరీటం భాగం కొరకు మరో చిన్న సొరకాయ మొదలును, చెవులు దంతాలు అన్నీ సొరకాయ కట్ చేసిన భాగాల తో అమర్చుకుని కిరీటాన్ని కాస్తంత అలంకరణ చేస్తే అందమైన గణేష్ తయారయ్యాడు.

 కాళియ మర్దనం -సొరకాయ వెడల్పాటి భాగాన్ని కట్ చేసి అడ్డంగా అమర్చుకుని, తొడిమను దీని మధ్య భాగానికి అతికించుకుని వంగిన భాగంలో పాము పడగని తయారుచేసి, పాము పోలుసులుగా సొరకాయ విత్తులనే ఉపయోగించుకుని కొద్దిగా పెయింట్ చేసి పడగ పైన  చిన్ని కృష్ణుడి అతికిస్తే కాళీయమర్దనం గుర్తు చేసుకోవచ్చు.

IMG_20150206_165644727

 లాంప్ షేడ్ – సొరకాయలో  వెడల్పాటి  బేస్ భాగాన్ని కట్ చేసి సన్నటి భాగంపై అమర్చి సొరకాయ విత్తులతో డిజైన్ చేస్తే అందమైన లాంప్  షేడ్ తయారైంది.

pic8 tabelu

 తాబేలు – సొరకాయ  వెడల్పాటి బాగాన్ని [ సైడ్ ] దిప్ప ఆకారంలో కట్ చేసి ,ఒక అక్రోట్ ని తలగాను చిన్ని ముక్కలు కాళ్ళ గాను అమర్చి, డిప్ప పైన మార్కర్ పెన్ తో తాబేలు డిప్పకున్న డిజైన్ గీస్తే అచ్చు తాబేలే కళ్ళ ముందు వుంటుంది.

గరిట

గరిట – వంగిన షేప్ ను బట్టి కాడను అలాగేవుంచి మిగిలిన బాగ౦ పైన కట్ చేస్తే ఎక్కువ కష్టపడకుండా గరిట తయారవుతుంది.

కూజా -కూజా ఆకారంలో వున్న సొరకాయ పైభాగం కొంచంకాట్ చేసి, మరో సొరకాయ తొడిమ బాగం పక్కన హేండిల్ లాగా అమర్చడం వలన అందమైన కూజా తయారవుతుంది.

చేప –చేప ఆకారంలో  వున్నా సొరకాయ కి పొలుసులు మార్కర్ పెన్ తో గీచి చేమ్కీలతో నగిషీలు దిద్ది ,fins కు,తోకకు సోరవిట్టులతో ఆకారాన్ని ఏర్పరచడం జరిగింది .

IMG_20150206_170149131

ఇక పక్షులు ,వీణ , మనుష్యుల ముఖాలు & కుండ అన్నీసొరకాయ షేప్ ను బట్టి  ఆర్టిస్ట్ ఉహాగానాలే. సొరకాయకు పూర్తి రంగులద్ది penguin జంట తయారు చేసిన సోరకాయగా గుర్తించక పోవచ్చు. అందుకనే వీలైనంతవరకు వాటి ఒరిజినల్ కలర్ అలాగే వుంచేయడం జరిగింది. పూర్తయ్యాక వార్నీసు పూయడం వలనమెరుపే కాదు ,పురుగు పట్టకుండా వుంటుంది.

veeena

**************************

 

 

 

 

 

 

 

12 thoughts on “సొరకాయ సొగసులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *