May 2, 2024

చేరేదెటకో తెలిసి – 3

రచన: స్వాతీ శ్రీపాద రీతూ నీతూ కవలలు. ఇద్దరిని పెంచే సరికే చుక్కలు కనిపించాయి. అందుకే ఇహ చాలానుకుంది. ఇద్దరూ శ్రీ చైతన్యలో చదువుతున్నారు. ఏడో క్లాస్ ఓ పక్కన ఎలెక్ట్రిక్ రైస్ కుక్కర్లో బియ్యం కడిగిపెట్టి మరో వంక వంకాయలు మూకుట్లో వేసి, ఫోనందుకుంది సౌమ్య . ఎన్ని సార్లు ప్రయత్నించినా స్విచ్ ఆఫ్ అనే వస్తోంది. ఇది వరలో అయితే బిజీగా ఉన్నాడేమోనని సరిపెట్తుకునేది గాని ఇప్పుడు మనసలా ఒప్పుకోడం లేదు. మరో సారి […]

మాయానగరం – 15

రచన: భువనచంద్ర హింస అనేది ఎప్పుడు పుట్టిందో తెలుసా? జీవుల పుట్టుకలోనే హింస ఉంది. నొప్పి లేకుండా ప్రసవం జరుగుతుందా? పోనీ అలాంటి నెప్పులు వెరచి అన్నా మానవుని మనసు అహింస వైపు కంటే హింస వైపే ఎక్కువ మళ్ళుతుంది. ఓ హీరో వందమందిని చావగొట్టాడు. థియేటర్లో వాళ్ళు క్లాప్స్ కొడతారు. అదే హీరో ఒక గుడ్డివాడ్ని రోడ్డు దాటిస్తే ‘ ఓహో ‘ అనుకుంటారు గానీ చప్పట్లు కొట్టరుగా. అంతెందుకూ , ఎవడి మీద నీకు […]

ఆరాధ్య 9

రచన: అంగులూరి అంజనీదేవి ”కొంచెం కూడా కడుపులో మిగల్లేదు హేమంత్‌! మొత్తం పోయింది” అంటూ అబద్దం చెప్పింది. అతను నమ్మాడు ”అయ్యో! అలాగా! మళ్లీ తింటావా! కలిపి పెడతాను” అంటూ అన్నం ముద్దలు పెట్టబోయాడు. ”వద్దు హేమంత్‌! తిన్నా నిలవదు!” అంది పడుకుంటూ. ఇలా అయితే ఎలా అన్నట్లు ఆలోచనలో పడ్డాడు హేమంత్‌. హేమంత్‌ని క్రీగంట చూస్తూ ”నువ్వు తిను హేమంత్‌!” అంది ఆరాధ్య. అతను తినకుండా చేయి కడుక్కొని ఫ్రిజ్‌లోంచి యాపిల్‌ తెచ్చి, దాన్ని చిన్నచిన్న […]

గౌసిప్స్!!! Dead people don’t speak-5

రచన:డా.శ్రీసత్య గౌతమి ఏరన్..ఏరన్.. హలో..హలో… హలో….. ఆ..ఆహ్… యస్.. ఐ యాం హియరింగ్… గొంతు పెగిలింది ఏరన్ కి. ఇప్పుడు చెప్పండి ఏమి జరిగింది? అడిగింది అనైటా. ఏరన్ మొత్తం జరిగినదంతా చెప్పాడు అనైటాకి. అనైటా ఆశ్చర్యపోయింది. ఏరన్ ముఖం గంభీరంగా మారింది. ఎలాగైనా ఈ రహస్యాన్ని చేధించాలనే పట్టుదల కనబడింది ఆతని ముఖంలో. “ఈ రోజు మనమిద్దరం రేడియోస్టేషన్ కి వెళ్దాం” అన్నాడు ఏదో తనలో తాను ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా. “మరి ఇవాళ సమాధి […]

వెటకారియా రొంబ కామెడియా 10

రచన: మధు అద్దంకి ఎండలు – ఆవకాయ ” అబ్బబ్బా పాడు ఎండలు.. మాడు మంటెత్తించేస్తున్నాయ్” అని విసుక్కుంటూ లోపలికొచ్చాడు సు.రా ( సుబ్బా రావు) “ఏమోయ్” అని పిల్చాడు సు.రా.. ఉహు చప్పుడు లేదు. మళ్ళా “ఏమోయ్” అని కొంచం గట్టిగా పిల్చాడు సు.రా.. ఉహు ఐనా చప్పుడు లేదు.. “ఏమోయ్” అంటూ రంకేశాడు సు.రా ధన్ ధన్ ధన్ మంటూ శబ్దం చేస్తూ భూమి దద్దరిల్లేలా పరిగెడుతూ వచ్చింది గ.ల(గజ లక్ష్మి) “ఎందుకంత శబ్దం […]