May 6, 2024

రాగమాలిక – మోహన

రచన: విశాలి పేరి కర్ణాటక శాస్త్రీయ సంగీతములో ఇరవై ఎనిమిదవ మేళకర్త రాగము హరికాంభోజి రాగము. ఈ రాగానికి జన్య రాగము ‘మోహన రాగము ‘ ప్రసిద్ధ శుద్ధ మధ్యమ రాగము. ఈ రాగము ఉపాంగ, వర్జ్య, ఔఢవరాగం. మధ్యమం, నిషాదాలను గ్రహం చేస్తే మేచకళ్యాణి, ధీరశంకరాభరణ రాగాలు కూడా మోహనకు జన్యరాగాలుగా పేర్కోనవచ్చు. ముత్తుస్వామి దీక్షితార్ మనవడు బ్రహ్మశ్రీ సుబ్బరామ దీక్షితార్ రచించిన ‘సంగీత సాంప్రదాయ ప్రదర్శిని’లో మోహన మేచకళ్యాణి జన్యరాగంగా పేర్కొన్నారు. ఔఢవ-ఔఢవ రాగం. […]

Gausips : DEAD PEOPLE DON’T SPEAK-8

రచన: డా. శ్రీసత్యగౌతమి, అంటే.. “ఆ టైంలో సమాధి దగ్గిర వున్నది అనైటా? అదే నేను గూగుల్లో చూశానా? ఒకవేళ ఫెర్నాండేజ్ చెప్పినట్లు ఆ కొద్దికాలం పాటు అనైటా ఆ ఆత్మ తాలూకు అతీంద్రియ శక్తులకు లోనై ఆ కుర్రాడి ఆత్మ నడిపించినట్లుగా తానే రేడియో స్టేషన్ కి ఫోన్ చేసి మాట్లాడుతున్నదా? ఆ ఆత్మ అనైటాను వశం చేసుకొని తన ద్వారా అందరితో మాట్లాడుతున్నదా?” ఆశ్చర్యంతో కళ్ళింత చేసి నోరు వెళ్ళబెట్టాడు ఏరన్. కాసేపాగి మళ్ళీ […]

శుభోదయం 2

రచన: డి.కామేశ్వరి “ఎవరో నలుగురు రౌడీలండి. ఈ మధ్య ఓ నెలరోజులనించి నేను బస్సు దిగి యింటికేళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు కిళ్లీ బడ్డి దగ్గిర కూర్చుని వెకిలిమాటలు, వెకిలిచేష్టలు, ఒకటే నవ్వులు, వెధవ పాటలు పాడడం.. ఒకటేమిటి అసహ్యంగా వేషాలు వేసేవారు. మొదట కొన్నాళ్లు చూసీ చూడనట్లు వూరుకున్నాను. కొన్నాళ్లు కోపంగా, అసహ్యంగా చూసాను. నా కోపం చూసి మరింత వెకిలిగా మాట్లాడ్డం, నవ్వడం మొదలుపెట్టారు. ఒకరోజు వళ్లుమండి, కోపం పట్టలేక చరచర దగ్గిరకెళ్లి “ఏమిటి పేల్తున్నారు, వళ్లు […]

ఆరాధ్య – 12

రచన: శ్రీమతి అంగులూరి అంజనీదేవి ”నాకు ఆఫీసు నుండి ఇంటికొచ్చేటప్పటికే ఆ ట్రాఫిక్‌ జామ్‌లో రాత్రి 8, 9 కి తక్కువ కావటం లేదు. అప్పటికే అలసిపోతున్నాను. అందుకే షాపింగ్‌ చెయ్యలేదు. నా రిసెప్షన్‌ చీర కడతాన్లే! ఇవ్వు” అంది. ”ఇంటికి కలర్స్‌ వేసేటప్పుడు సామాన్లన్నీ సర్దుతూ ఆ చీర వున్న కవరు ఎక్కడ పెట్టానో ఆరాధ్యా! గుర్తు రావడం లేదు. మీ అక్కయ్యల దగ్గర కాస్ట్లీ డ్రస్‌లు వున్నాయి. అడిగితే ఇస్తారు. అవి వేసుకుంటావా?” ”వాళ్ల […]

త్రిక్షేత్రంగా ప్రసిద్ధి పొందిన గిరిజాదేవి మరియు ఘొటో తరిణి

రచన: నాగలక్ష్మి కర్రా ‘ఓఢ్యాణామ్ గిరిజాదేవి ‘ అని ఆది శంకరులచే, భిరోజాదేవి అని స్థానికులచే పిలువబడే అష్ఠాదశ పీఠాలలొ 11వ పీఠమ్ గా చెప్పబడే యీ పీఠమ్ ఒరిస్సా లోని ఖేంఝహార్ జిల్లాలో జాజిపూర్ కి 2 కి.మీ. దూరంలో వుంది . ఒరిస్సా లో వైతరిణీ నదీ తీరాన వున్న యీ క్షేత్రాన్ని త్రిక్షేత్రమని కుడా అంటారు . 1) ఓఢ్యాణ పీఠమ్, 2) భిరజా క్షేత్రం , 3) భైతంగి తీర్థమ్ యీ […]

వసంతం – గతాలు, స్వగతాలు

సమీక్ష: జ్యోతి వలబోజు ప్రతీ మనిషి జీవితంలో చిన్నప్పటినుండి ఎన్నో జ్ఞాపకాలు, అనుభూతులు ఉంటాయి. జీవనగమనంలో మరచిపోయామనుకుంటారు కాని ఒక్కసారి తట్టి లేపితే మళ్లీ అవి వెల్లువలా ఉబికి వస్తాయి. ఆ మధురమైన జ్ఞాపకాలు. వాటిని స్నేహితులతో పంచుకోవడం, డైరీలో రాసుకోవడం చాలామందికి అలవాటు. కాని ఎప్పుడంటే అప్పుడు స్నేహితులు ఉండరు కదా. అందుకే అందరికోసం అందుబాటులో ఉండి తమలా ఆలోచించే మరికొందరితో ఈ జ్ఞాపకాలు, ఆలోచనలు, ఆవేశాలు, అనుభూతులు మొదలైనవి పంచుకునే ఒక వినూత్నమైన వేదిక […]

అవగాహన

రచన: డా॥ చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి “నీ వయసు ఆడపిల్లలంతా పెళ్ళికూతుళ్ళు అయిపోతున్నారు. నువ్వు మాత్రం నా గుండె మీద కుంపట్లా ఇలాగే వుండు” అని అనుపమని వెటకారం చేసింది నిర్మల. “అమ్మా, ఏదో పెళ్ళయ్యింది అని అనిపించుకోవడానికి నేను పెళ్ళికి సిద్ధపడలేదు. ఇష్టపడినవాడు దొరికితేనే పెళ్ళి” నిక్కచ్చిగా చెప్పింది అనుపమ. “మీ నాన్నా, నేనూ కాదన్నామా? నీకు నచ్చిన వాణ్ణి పట్రా. మేము అక్షింతలు వేసేస్తాము”. “ఏదో మార్కెట్లో దొరికే సరుకు తెమ్మన్నట్టు అలా చెప్తావేంటమ్మా. […]

// ఏక్ తార //

రచన: కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్ రైలు వెళ్ళిపోతుందన్న హడావుడిలో ఆటో దిగిన సుధేష్ ని ఎవరో చెయ్యిపట్టుకు లాగుతున్నట్లనిపించి చిరాగ్గా చూశాడు వెనక్కి.. అయ్య..అయ్యా.. అయ్య.. ఒక్కరూపాయుంటే ఇయ్యయ్య.. అయ్యా.. అంటూ చేతిలోని ఏక్ తార ను వాయిస్తూ అడుగుతున్నాడు ఓ చిన్నోడు.. అయ్య.. అయ్య.. అయ్య.. అయ్య.. అయ్య.. అయ్య.. ” లేదు ఫో… ” అంటూ విదిలించుకుని అంటూ స్టేషన్ లోకి వడివడిగా పరిగెడుతున్న సుధేశ్ ని వెంటబడుతూనే ఉన్నాడు ఆ చిన్నోడు.. […]

అక్షర సాక్ష్యం – రంగనాథ్ కవితలు

రచన: రంగనాథ్ 1. (అ) సమర్ధత సముద్ర జలాలను జయించిన మానవుడు తాగునీరందరికీ చేర్చలేకున్నాడు- విద్యుత్తు నుత్పత్తి చేయగలిగినవాడు గ్రామాలన్నిటికీ తేలేకున్నాడు- సకల విద్యలలో ఆరితేరినవాడైనా సమంగా అందరికీ అందివ్వకున్నాడు వైద్యరంగాన అసాధ్యాలను సాధించినవాడు ఆరోగ్యపరంగా అందరికీ అందకున్నాడు- వైజ్ఞానికంగా ఎంతో ఎగబాకిన మానవుడు నైతికంగా నేడు దిగజారుతున్నాడు! 2. స్థితిగతులు పాతికేళ్ళ క్రితం – రామయ్యకి రోజుకొక్క పూటే- నోట్లోకి నాలుగు వేళ్లు పోయేవి…… పాపం – పేదరికం ! ఇప్పుడతను రామయ్యగారు…. కోటీశ్వరుడైపోయాడు- ఇప్పుడా […]