May 12, 2024

“పోరనట్టి ఆలిగలదె?” ఆటవెలదులు

రచన: కిభశ్రీ ఏ మగాడైనా, భార్య పదే పదే ఏదైనా చెప్పిందంటే దాన్ని పోరు కింద పరిగణిస్తాడు. సరదాగా భార్య పెట్టే పోరుగానే వివరిస్తూ, తనమంచికే ఆమె చెబుతూందన్న భావాన్ని కొన్ని ఆటవెలది పద్యాలలో ….. ఏమగాడికైన ఇంట్లోన యేబాధలసలు పెట్టనట్టి ఆలి గలదె? చదువులెన్నియున్న చవటాయివేనీవుయనుచు పోరనట్టి ఆలి గలదె? సూర్యుడదిగొ లేచె చూడెంత బాగుండె మొద్దు నిదుర మాని ముసుగు తీసి జాగుచేయకుండ జాగింగుకే పొమ్మననుచు పోరనట్టియాలి గలదె? బానపొట్ట చూడు పనస పండంతయ్యి […]

మాయామాళవగౌళ రాగ లక్షణములు

రచన: భారతి ప్రకాష్. ఈ రాగము 15.వ. మేళకర్త రాగం. మూడవ చక్రమైన “అగ్ని” లో మూడవ రాగం. ఈ రాగం యొక్క అసలు పేరు ” మాళవగౌళ “. కటపయాది సూత్ర ప్రకారం 15.వ. సంఖ్య కోసం ” మాయా ” అనే పదం ఈ పేరుకు ముందుగా జేర్చబడింది. ఆరోహణ -> స రి గ మ ప ద ని స. అవరోహణ -> స. ని ద ప మ గ […]

లింగ పురాణము – విమర్శనాత్మక పరిశీలన

రచన: కొరిడే విశ్వనాథశర్మ ఓం గం గణపతయే నమః ఓమ్ శ్రీ వాగీశ్వర్యై నమః ఓం శ్రీ మాత్రే నమః ఒక పురాణప్రస్తావన మరొక పురాణమునందు కనబడున్నది. లింగపురాణప్రస్తావన లింగపురాణమునందే కాక ఏకాదశసాహస్రశ్లోకగ్రథితముగానూ, పదకొండవ పురాణముగానూ మత్స్యాగ్నినారద భాగవతాదులయఓదు కీర్తించబడినది. 12, 13 శతాబ్దీయుడైన బల్లాలసేనుడు తన ‘దానసాగరము’న “షట్సాహస్రమితం లింగపురాణమపరం తథా.” అని ఆరువేల శ్లోకపరిమితమైనది గా పేర్కొన్నాడు. కాని ప్రస్తుతం లభిస్తున్న లింగపురాణము తొమ్మిదివేల శ్లోకముల గ్రంథము లభించుతున్నది. కావున మూలలింగపురానగ్రంథము కాలప్రవాహమువలన శ్లోకముల […]

రాయినైనా కాకపోతిని…..

కన్నడ మూలం – ఎమ్. ఆర్ మందారవల్లి తెలుగు అనువాదం- బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి కంపెనీ బస్ లో ఇంటికి బయల్దేరాడు సుందరం. మొదటి ట్రిప్ కావడంతో బస్ కొంచెం ఖాళీగానే ఉంది. పండగరోజు కావడం వల్ల చాలామంది రాలేదు. బస్ మధ్య ఉన్న సీట్ లో కిటికీ ప్రక్క కూచున్నాడు. ఇంటికి చేరడానికి ఒక గంటకు తక్కువేమీ పట్టదు. హాయిగా ఒక కునుకేసేయవచ్చు. కళ్ళు మూసుకుని కూర్చోగానే అతనికి సుమతి మదిలో మెదలసాగింది. భార్యే అయినా, […]

వేద వాజ్మయము – పరిచయము

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు భారతదేశము పుణ్యభూమి అనడానికి కారణము వేదాలు పుట్టినచోటు కావటమే. అందుచేతే వేదభూమి అని కూడా అంటారు . వేదాలు భారతీయ ఆధ్యాత్మికతకు, సంస్కృతికి అదర్శజీవనానికి మూలాధారము. మనిషిని నడిపించే ధర్మార్ధ కామమోక్షాలనే నాలుగు పురుషార్ధలను తెలియజేసే శబ్దరాశే వేదము. వేదమనే శబ్దము”విద్” అనే సంస్కృత శబ్దము నుండి ఏర్పడింది . వేదాలు ఒక మతానికి, ఒకప్రాంతానికి లేదా ఒక వర్గానికి , దేశానికి చెందినవి కావు వేదాలను విశ్వవాజ్మయముగా పేర్కొనవచ్చు . […]