April 26, 2024

బ్రహ్మలిఖితం 22

రచన: మన్నెం శారద ఆమె ఆందోళనగా కంపార్టమెంటంతా గాలించింది. ఎక్కడా కార్తికేయన్ జాడలేదు. రైలు దిగి ప్లాట్‌ఫాం మీద నిలబడింది. నిస్తేజమైన ధృకులతో ప్రతి మనిషినీ పరిశీలంగా చూస్తూ. ప్లాట్‌ఫాం మీద రైలు వెళ్ళిపోయింది. అమ్ముకునేవాళ్ల రద్దీ తగ్గిపోయింది. ఎక్కడా కార్తికేయన్ కనిపించలేదు. ఆమె తల గిర్రున తిరిగిపోతోంది. తన తండ్రి ఏమయ్యేడు. తిరిగి ఆయన మానసిక పరిస్థితి క్షీణించి ఎక్కడో రైలు దూకెయ్యలేదు కదా. ఒక వేళ తనకంటే ముందే ఇల్లు చేరుకున్నారేమో. అది సరికాదని […]

కంభంపాటి కథలు – దేవతలాంటి నిన్ను…

రచన: రవీంద్ర కంభంపాటి డోర్ బెల్ రింగైన వెంటనే పరిగెత్తుకెళ్లి తలుపు తీసింది శిరీష. తలుపు బయట నుంచున్న దేవిని చూసి, ‘అయ్యో.. నీకు వొంట్లో బాగోలేదని మీ అమ్మ ఫోన్ చేసింది.. ఇవాళ పన్లోకి రావనుకున్నానే ?’ అంది ‘ఆఁ.. ఏదో కొంచెం జొరంగా అనిపించి మా అమ్మకి చెబితే, వెంటనే మీకు ఫోన్ చేసేసిందమ్మా.. కానీ మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుందని వచ్చేసేను ‘ అంటూ లోపలికెళ్ళిపోయింది. దేవి వెనక్కాలే కిచెన్ లోకి నడుస్తూ […]

దారి తప్పిన స్నేహం

రచన: గిరిజ పీసపాటి ఏడవ తరగతి చదువుతున్నప్పటి నుండి శైలజ, సరిత ప్రాణ స్నేహితులు. శైలజ చాలా బిడియంగా, నెమ్మదిగా ఉంటూ ఎవరితోనూ పెద్దగా మాట్లాడేది కాదు. సరిత తప్ప వేరే స్నేహితులు కూడా లేరు. కానీ సరిత గలగలా మాట్లాడుతూ తను ఎక్కడ ఉంటే అక్కడే చొరవగా కొత్త స్నేహితులను తయారుచేసుకునేది. స్కూల్ లో మొదలైన వారి స్నేహం కాలేజ్ లో కూడా కొనసాగడంతో ఏ చిన్న విషయాన్నైనా ఇద్దరూ షేర్ చేసుకునేవారు. కాకపోతే ఇద్దరి […]

చిన్న చిన్నవే కానీ….

రచన: మణి గోవిందరాజుల “యెన్నిసార్లు చెప్పాలి ఆ సెంట్ కొట్టుకోవద్దని? నాకస్సలు నచ్చదని నీకు తెలుసుకదా?” విసుక్కున్నాడు శేఖరం. వుత్సాహంగా బయల్దేరబోతున్న సంధ్య మొహం చిన్నబోయింది. నిజమే శేఖర్ చెప్తుంటాడు తనకు సెంట్ వాసన నచ్చదని, కాని మొదటినుండీ . తనకేమొ చక్కగా తయరయ్యి కొద్దిగా పెర్ఫ్యుం స్ప్రే చేసుకోవడం ఇష్టం. ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అని. అందుకని చాలా లయిట్ గా స్ప్రే చేసుకుంది. అయినా పట్టేసాడు. మౌనంగా లోపలికి వెళ్ళబోయింది చీర మార్చుకోవడానికి. “ఇప్పుడు […]

విశ్వపుత్రిక వీక్షణం – “డిప్రెషన్‌”

రచన: విజయలక్ష్మీ పండిట్ మోగుతున్న ఫోన్‌ను తీసి ‘హలో’ అంది సుమతి. అవతలివైపు ‘హలో మేడమ్‌ నమస్కారమండి, బాగున్నారా? నేను సుధను మేడమ్‌, గుర్తుపట్టారా,” సుమతికి వెంటనే ‘సుధ’ ఎవరో గుర్తుకు రాలేదు. సుధ ”నేను మేడమ్‌ డిప్రెషన్‌ నుండి నన్ను రక్షించి నాకో భవిష్యత్తు నిచ్చారు ”. ”ఓ… సుధ బాగున్నావా అమ్మా, నీ టోన్‌లో మార్పుంది. ఎవరో అనుకున్నా, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు” అడిగింది సుమతి సంతోషంతో. “మేడమ్‌ హైదరాబాద్‌లో నాకు ఇంగ్లీషు లెక్చరర్‌గా […]

మన( నో) ధర్మం

రచన: డా. తంగిరాల. మీరా సుబ్రహ్మణ్యం తెల్లని రాయంచ లాటి బెంజ్ ఎస్ యూ వి గంటకు యాభై మైళ్ళ వేగంతో ఆరు వందల ఎనభై ఫ్రీ వే మీద కాలిఫోర్నియా లోని శాన్ రామన్ నుండి మిల్పిటాస్ వైపుకు దూసుకు పోతోంది. లోపల కూర్చున్న వారికి మాత్రం పూలరథం మీద ప్రయాణిస్తున్నట్టు ఉంది. కారులో స్టీరియో నుండి ‘ దిద్ద రానీ మహిమల దేవకి సుతుడు” అంటూ బాలకృష్ణ ప్రసాద్ పాడిన అన్నమయ్య పాట వస్తోంది. […]

బద్ధకం- అనర్ధం

రచన: కన్నెగంటి అనసూయ రాజానగరంలో నివశించే వ్యాపారి రామయ్యకి చాలా కాలానికి ఇద్దరు మగపిల్లలు జన్మించారు. అసలే పిల్లలంటే ఇష్టం. దానికితోడు లేక లేక పుట్టారేమో ఆ పిల్లల్ని ఎంతో గారాబంగా పెంచసాగారు భార్యాభర్తలు. దాంతో ఇంట్లోనూ, బయటా వాళ్ళిద్దరూ ఆడిందే ఆట, పాడిందే పాటగా నడిచేది. కష్టమన్నదే ఎరుగనీయని ఆ గారాబం కాస్తా ఆ పిల్లల్లో బద్ధకంగా మారిపోయింది. దాంతో ఆలస్యంగా నిద్రలేవటం, లేవగానే అతిగా తినటం, తినగానే నిద్రపోవటం చెయ్యసాగారు. దాంతో బాగా లావుగా, […]

సంస్కరణ

రచన: శ్రీ మహాలక్ష్మి మృదుల – ఆనంద్ ఇద్దరూ ఉద్యోగస్తులు. వారికి ఒక పాప. ఇద్దరూ ఉద్యోగస్తులు అవటం వల్ల పాపా సంరక్షణ మృదుల వాళ్ళ అమ్మ చూసుకుంటుంది. ఏ చీకు చింత లేని కాపురం. అన్ని సమకూర్చినట్టు ఉన్న జీవితం. మృదులకి ఆఫీస్ లో తెలివైంది అని, కలుపుగోలు మనిషి అని, మంచి సమర్థురాలని ఇలా మంచి పేరుంది.ఆ పేరుని అలాగే నిలబెట్టుకోవాలని చాలా తాపత్రేయ పడుతుంది. ఆ రోజు తన ప్రతిభను చూపించగలిగే ఒక […]

కౌండిన్య హాస్య కథలు – తప్పెవరిది?

రచన: రమేశ్ కలవల   భార్యా భర్తలన్నాక సవాలక్షా ఉంటాయి. వారి విషయంలో మనం జోక్యం  చేసుకోకూడదు. కానీ ఇది జోక్యం జేసుకోవడం కాదేమో, ఏం జరిగిందో తెలుసుకుంటున్నాము అంతే కాబట్టి ఓ సారి ఏం జరిగిందంటే… ఆఫీసు నుండి వచ్చి బట్టలు విడిచి భార్యకు వాటిని ఉతకడానికి  అందజేసాడు చందోళం. ఆ ప్యాంటు చూస్తూ “ఉతుకడానికేనా?” అంది ఇందోళం. “ఏంటి, నన్నా” అని అడిగాడు హాలులోకి వెడుతూ అప్రమత్తం అవుతూ. “మీ ప్యాంటు తో మాట్లాడుతున్నానండి. […]

అన్యోన్య దాంపత్యం

రచన: నిష్కల శ్రీనాథ్   ‘అలనాటి రామచంద్రునికి అన్నింటా సాటి ..” అంటూ టీవీలో వస్తున్న పాటకు కూనిరాగం తీస్తూ బాల్కనీలో కుండీలలో ఉన్న మొక్కలకు నీళ్లు పోస్తుంది శ్రావణి. ఆ ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తూ పక్కింటి నుండి పెద్దగా అరుపులు వినపడ్డాయి , రోజు అవి విని విని అలవాటు పడిన శ్రావణి మాత్రం తన పని తాను చేసుకోసాగింది. ” మొదలైయిoది మళ్ళి ” అంది పని మనిషి సత్తెమ్మ ఇల్లు తుడిచిన […]