May 8, 2024

ఆడాళ్లూ…. మీకు జోహార్లూ

రచన: పద్మజ యలమంచిలి   50వ దశకంలో..ఆధునికత అప్పుడప్పుడే వంటబట్టించుకున్న  కుటుంబాల్లో ఆడపిల్లలు చదువుకుని వారికి కావాల్సిన జీవితాన్ని బాగానే ఎంచుకుని జీవించగలిగినా..పల్లెటూరి పోకడలు, అజ్ఞానంతో కొట్టు మిట్టాడే కుటుంబాల్లోని ఆడపిల్లలు మాత్రం ఎంత ధనికులైనా తల్లి తండ్రులు చెప్పినట్టు బుద్దిగా పెళ్ళిచేసుకుని పిల్లలు ,సంసారం ఇదే ప్రపంచంగా బ్రతికేసే వారు.. అదిగో అలాంటి కుటుంబం నుంచి వచ్చిందే …మా ఇంటి పక్కన వుండే నా ఈడు ఈ సీతమ్మ తల్లి కూడానూ.. భర్తలేని పల్లెటూరి స్త్రీ […]

శాకుంతలం

రచన : శ్రీపాద   శకుంతలకు అన్నం సయించటం లేదు, కంటికి కునుకూ పట్టడం లేదు. కారణం ’అబ్బే ఏమీ లేదు ’ అన్నా ఆవిడకు తెలుసు ఏ మూలో ఉన్న దాని ఉనికి. అక్కడికీ ఆవిడకు పట్టు పరిశ్రమ అనేది బాగానే తెలుసు. ఎవరు ఏ కాస్త పనికి వస్తారనిపించినా అస్సలు వదలదు గాక వదలదు చీటికీ మాటీకీ చెట్టెక్కే భేతాళుడిని భుజాన వేసుకునే విక్రమార్కుడిలా. అ”రామ సీత గొప్ప మనిషి ఎంత చక్కని కవిత్వం […]

నా స్వామి పిలుపు వినిపిస్తుంది…

రచన, చిత్రం : కృష్ణ అశోక్ అరుణోదయ రాగాలు రక్తి కడుతున్న వేళ హృదికర్ణపు శృతిగీతం పరిపూర్ణం కాక మునుపే…. చల్లని మండుటెండల్లో భావుకతపు తరువుల నీడన గుండె వాయువంతా ఆక్సిజన్ ఆశలతో నిండకనే…. వెన్నెల కురిసే రాత్రుళ్ళు ప్రియ తారలు వెదజల్లే వెలుగు ధారల పరితాహాపు మోహ దాహం తీరకనే…. కాన్వాస్ రంగుల చిత్రాలు దేహం ప్రాణం దాటి నా ఆత్మాణువులుగా సంపూర్ణ పరిణామం పొందక మునుపే… కొద్దికాలం ఇంకొద్దికాలం గడువు పొడిగించు స్వామీ నీ […]

తపస్సు

రచన: రామా చంద్రమౌళి   జ్ఞానానికి రూపం లేదు.. గాలి వలె ప్రవహించడం జీవ లక్షణమైనపుడు స్థితి స్థల సమయ కాలాదులు అప్రస్తుతాలు అగ్ని ఎప్పుడైనా, ఎక్కడైనా దహిస్తుంది కదా జ్ఞానమూ, కళా అంతే దహిస్తూ, వెలిగిస్తూ, దీప్తిస్తూ.. లీనమైపోతూంటుంది – అది సంగీతమో, సాహిత్యమో, యుద్ధ క్రీడో శిష్యుడు తాదాత్మ్యతతో భూమై విస్తరించాలి విస్తృతమై .. ఎదుట అప్పుడు ముఖం రెక్కలు విప్పిన ‘ ఆంటెనా ‘ ఔతుంది బీజాలు బీజాలుగా, సంకేతాలు సంకేతాలుగా .. […]

హిమవత్పద్యములు 1

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు మన భూమిపైన ఉత్తర ప్రాంతాలలో, ముఖ్యముగా అమెరికాలో, కనడాలో, యూరోపులో జనవరి, ఫిబ్రవరి నెలలలో ఎక్కువగా మంచు కురుస్తుంది. మంచు (snow స్నో) అంటే మెల్లగా ఘనీభవించిన నీరు. మేఘాలలోని నీళ్లు నేలను తాకడానికి ముందు వాయుమండలములో స్ఫటికరూపములో మారుతుంది. అంటే ఉష్ణోగ్రత సున్న డిగ్రీల సెల్సియస్ (అనగా -32 డిగ్రీల ఫారన్‌హైట్) కంటె తక్కువ ఉంటుంది. నేలపైన మళ్లీ నీరుగా మారకుండా ఉండాలంటే దాని ఉష్ణోగ్రత కూడ సున్న […]

తేనెలొలుకు తెలుగు

రచన: తుమ్మూరి రామ్మోహనరావు తెలుగు భాషను వన్నెకెక్కించిన ప్రక్రియల్లో అవధాన ప్రక్రియ ఒకటి. ఇప్పటికీ ఈ ప్రక్రియ నిత్య నూతనంగా ఉందని చెప్పడానికి నిన్నమొన్న రవీంద్రభారతిలో జరిగిన ద్విగుణిత అష్టావధానం ఉదాహరణగా చెప్పవచ్చు. పద్దెనిమిదేళ్ల ప్రాయంలో ఎక్కడో దేశంగాని దేశం అమెరికాలో పుట్టి గీర్వాణాంధ్ర భాషలలో సమంగా అష్టావధానం చేయడం మాటలు కాదు. అతననే కాదు అష్టావధానం ఎవరికైనా కష్టావధానమే. పద్యం రాయడంలో పట్టుండాలి. పాండిత్యముండాలి. సద్యస్ఫూర్తి ఉండాలి. ధారణా పటిమ ఉండాలి. వాక్శుద్ధి ఉండాలి. ఉచ్ఛారణాపటుత్వం […]

ఆంధ్రపితామహుడు–శ్రీ మాడపాటి హనుమంతరావు గారు

రచన: శారదాప్రసాద్ మాడపాటి హనుమంతరావుగారు మొత్తం పదమూడు కథలు రాశారు. వీటిలో హృదయశల్యం, రాణీసారందా, ముసలిదాని ఉసురు, నేనే, అగ్ని గుండం, నాడు నీ పంతం, నేడు నా పంతం, ఆత్మార్పణం, తప్పు, ఎవరికి, విధిప్రేరణం అనే కధలు ‘మల్లికాగుచ్చం’ పేరుతో 1911 లో పుస్తక రూపంలో వచ్చాయి. మాడపాటికి రచయితగా శాశ్వత కీర్తిని అందించిన గ్రంధం ‘తెలంగాణా ఆంధ్రోద్యమం’. మాడపాటి హనుమంతరావుగారు బహుభాషావేత్త, సాంఘిక సంస్కర్త. వీరు 11 -11 -1970 న తెలుగు వారిని […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 34

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య అన్నమయ్య శ్రీనివాసునికి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు. స్వామీ నీలీలలు మాకు ఎన్నటికీ అర్ధం కావు. ఒకడు నిన్ను నిరంతరం కీర్తిస్తూనే ఉంటాడు. కానీ మరొకనికి సులభంగా కైవల్య పధం దక్కుతుంది. కొందరు భక్తులను అష్టకష్టాల పాలు చేస్తావు. మరొకరికి చిటికెలో సద్గతులు కలిగిస్తావు. ఏమిటి నీ మాయ మా లాంటి సామాన్యులు ఎలా అర్ధం చేసుకోవాలి అంటూ అడుగుతున్నాడు. కీర్తన: పల్లవి: పాటెల్లా నొక్కచో నుండు; భాగ్య మొక్కచోనుండు యీటు వెట్టి పెద్దతనా […]

దుఃఖమనే అనాది భాషలో..!

రచన: పల్లిపట్టు నాగరాజు   ఖాళీతనంతో మనసు కలవరపడుతున్నప్పుడు… గుండె సడి నాది నాకే వినిపిస్తున్న ఏకాకితనాన్ని నేను మోయలేని తండ్రీ….! జనారణ్యంలో ఏ ముఖమూ నాకు కనిపించడంలేదు… ఏ వెచ్చని చేయీ నా చేతిలో సంతకం చేయలేదు…. ఏ చూపుల తీగా స్వాగతాన్ని పరిమళించలేదు… తమకు తామే అంతస్తులల్లో ఆర్థిక సొరంగాల్లో ఖననం చేసుకుంటున్న ఈ రోజులు రోజాలుగా ఎప్పుడు పూస్తాయో…! ఏ ఎదపైనైనా వాలే పిట్టలెప్పుడవుతాయో…!! తండ్రీ… నన్ను విసిరేస్తావా ఆ సముద్రాల పైన […]