May 2, 2024

10. సహవాసం

రచన: శ్రీదేవి కూసుమంచి

జగన్నాధం మాష్టారు గారికి లేకలేక  ఇద్దరు కుమారులు ..కలవ పిల్లలు .రాము,శరత్ .ఇద్దరి పిల్లలని ఎంతో ప్రేమతో పెంచేరు.పిల్లలు పెద్ద వాళ్ళ అయ్యారు.ఆ ఉరిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో 10వ తరగతి వరకూ చదివించేరు.
మాధ్యమిక విద్యకై పట్నములో  ఒక ప్రముఖ కాలేజీలో చేర్చడం
జరిగింది.అయితే పట్నము వెళ్ళేక రాము ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు.పూర్వములానే బాగ చదువుతూ ,ఇంటర్ మొదటి సంవత్సరములో కూడ మంచి మార్కులతో కాలేజి ప్రథమ స్థానములో పాసవ్వడం జరిగింది
కాని శరత్ ప్రవర్తనలోని పెద్ద మార్పు వచ్చింది.పెద్దలతో మాట్లాడేటప్పుడు గౌరవం ,మర్యాద లేకుండ మాట్లడటం,తినే తిండే లో మార్పు..ఇంటర్ ప్రథమ సంవత్సరములో మొత్తము సబ్జక్టులు ఫెయిల్ అయిపోయాడు..తండ్రి పిలిచి ఏంటిది..పదివ తరగతి వరకూ తరగతి ప్రథమ స్థానములో ఉండే వాడవు ఇప్పుడేమైంది.. పోనీలే గాని అక్కడ మూడు బుట్టలతో పువ్వులు ఉన్నాయి.
అందులో మొదటి బుట్ట తీసుకురా అన్నారు.సరే నాన్న గారు అంటూ మొదటి బుట్ట శరత్ తీసుకువచ్చాడు.తండ్రి దగ్గరకి..ఏంటి నాన్న గారు ఈ పువ్వులు మంచి పరిమళాన్ని వెదజల్లుతున్నాయి.. చాలా బాగుంది ఈ పరిమళం  అన్నాడు శరత్ ..తండ్రి వెంటనే
బాగున్నాయా..మంచి వాసన వస్తుందా..
సరేలే ..
ఇప్పుడు రెండో బుట్టతో వున్న పువ్వులు కూడా తీసుకురా..సరే నాన్న గారు..తెస్తుండగా ఇవి అసలు ఏ వాసన లేవండి..అయితే ఆ బుట్టలో సగం పువ్వులు ఈ మొదటి బుట్టలో వెయ్యు…అనగానే ఈ రోజు మా నాన్న కేమైంది..అనుకుంటూ బయటికి ఏమి అనకుండా రెండో బుట్టలో పువ్వులు మొదటి బుట్టలో వేసాడు.ఇప్పుడు మూడో బుట్ట తీసుకురా..ఏంటి నాన్న ఇదంతా..ముందు తీసుకురా..
అని జగన్నాధం అనగానే..సరేలెండి అని మూడవ బుట్ట వద్దకు వెళ్ళేడు వెళ్ళగానే..భయంకరమైన ధుర్గాంధాన్ని వెదజల్లుతున్నాయి ఆ పుష్పాలు..ఏంటి నాన్న గారు భరించలేకపోతున్నా ..చూడటానికి అందంగా ఉన్నా ఇంత భయంకరమైన వాసనని వెదజల్లుతున్నాయని అడిగేడు..జగన్నాధం దానికి సమాధానం చెప్పకుండా…ఈ వాసన లేని రెండో బుట్టలో మిగిలి ఉన్న పుష్పాలు   మూడో బుట్టలో వేసి ..ఈ రెండు బుట్టలు పెరటిలో ఉన్న గదిలో పెట్టు అన్నారు..ఏమైందో అర్థం కావటం లేదు.తప్పదు మరి..ఏమి చేస్తాములే అంటూ బయటికి విసుగు కనబడకుండా
తండ్రి చెప్పినట్టు చేసాడు శరత్ .
మరుసటి రోజు తెల్లవారేక..తండ్రి శరత్ ..శరత్ అంటూ పిలవడం మొదలుపెట్టేరు..ఏమైంది..ఏమైంది అంటూ విసుగుగా శరత్ వచ్చాడు
శరత్ నిన్న పెరటి గదిలో పెట్టిన పూల బుట్టలు రెండూ తీసుకుని రా ..
ఎందుకు నాన్న..
తీసుకుని రా
చెపుతున్నాను ..

సరే నాన్న…రెండు బుట్టలు తెచ్చి తండ్రి దగ్గర పెట్టేడు శరత్ .నిన్న నువ్వు వాసన లేని పువ్వులను రెండు బుట్టలలో వేసావు కదా..వాటిని మరల వేరు వేరుగా తీసి వాసన చూడు..ఏంటొ ఇతని ఛాదస్తం అని మనసులోనే అనుకుని వాసనలు చూసే సరికి ..నిన్న ఏ వాసన లేని పుష్పాలు .నేడు వాసన సంతరించుకున్నాయి..మంచి పరిమళాలు వెదజల్లే పువ్వులపై వేసే వాటికి మంచి మరిమళపు వాసన..దుర్గంధమైన వాసన వెదజల్లే పువ్వులు పై వేసే పువ్వులు భరించలేని వాసనతొ ఉన్నాయి..
అసలేమిటి దీని అంతరార్థం అనుకునే సరికి ..శరత్ కి అర్థమైంది…నేను చెడ్డ వారితో సహవాసం చేయబట్టే కదా…నేను ఇంటర్ ప్రధమ సంవత్సరం ఫెయిల్ అయ్యాను..అన్నయ్య మంచి వారితొ స్నేహం చేయబట్టి కాలేజీ ప్రధమ ర్యాంకులో ఉత్తీర్ణుడైనాడు..ఏదేన సహవాసంతోనే మన గుణాలు కూడ మారుతుంటాయి అని తలచి తండ్రి పాదాలపై పడి మన్నించండి..మరెప్పుడు నేను చెడు సావాసాలు చేయను..నేటి నుండి బుద్దిగా చదువుకుని మునుపటి శరత్ లా మంచి మార్కులు తెచ్చుకుంటాను..నన్ను నమ్మండి అని బోరున ఏడవటం మొదలుపెట్టేడు..
నువ్వు తప్పుని గ్రహించావు ..చాలు ఇక నుంచి మంచిగా చదువుకో….జీవితములో  కాలము చాలా విలువైనది..దాని వృధా చేసేమంటే ..జీవితమే వ్యర్థమౌతుంది..కష్టపడే వయసులో కష్టపడాలి..సుఖపడే సమయంలో సుఖపడాలి..అందుకే నీతో ఈ పని చేయించా అని తండ్రి బిడ్డని ఓదార్చి సన్మార్గములోకి నడిపించాడు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *