June 24, 2024

మాలిక పత్రిక జులై 2019 సంచికకు స్వాగతం

  Jyothivalaboju Chief Editor and Content Head వేసవి చిటపటలు తగ్గి చిరుజల్లులు మొదలయ్యాయి కదా. ఇంకా పూర్తిగా తడవలేదు. చూద్దాం. దోబూచులాడుతున్న ఈ వానలు ఎప్పుడు వచ్చి తిష్టవేస్తాయో. పాఠకులకు, రచయితలకు  ధన్యవాదాలు. ఆసక్తికరమైన సీరియళ్లు, కథలు, కవితలు, వ్యాసాలతో ప్రతీనెల మిమ్మల్ని అలరిస్తోన్న మాలిక పత్రిక  ఈసారి కూడా మరింత అందంగా, ఆకర్షణీయంగా ముస్తాబై వచ్చింది.  మీకు నచ్చని శీర్షికలు, రచనలు ఉంటే చెప్పండి. ఎలా ఉంటే బావుంటుందో కూడా చెప్తే చాలా […]

మార్మిక శూన్యం

రచన: రామా చంద్రమౌళి నిజానికి చాలాసార్లు మనకు  ఏమి కావాలో మనకు తెలియదు ఖాళీ గ్లాస్‌ వంటిది జీవితం అని ఒక ఉవాచ గ్లాస్‌ సగం నిండి ఉందా.. సగం ఖాళీగా ఉందా అని  ఒక చతురుడి  ప్రశ్న అసలు ఈ ‘ ఖాళీ ’ ఏమిటి  లోపల .. ఆత్మలో అని ఒక మీమాంస ఇక అన్వేషణ మొదలౌతుంది అప్పుడు ఏదో అభౌతిక ప్రతిద్రవ్యం ( anti matter ) దేహమంతా విసరిస్తూ మనిషి  ఒక […]

నీ జ్ఞాపకంలో

రచన, చిత్రం : కృష్ణ అశోక్. గుండె గూటిలో నీవు అనే జ్ఞాపకం ఒక అద్భుతం… ఈ జీవితానికి జతకాలేమేమోకానీ మనసులో నిరంతరజతగా మరుజన్మ వరకూ జీవిస్తూ.. నిర్జీవిస్తూ… నీ జాబిలి చెక్కిలి చుంబనాల చెమరింపుల వర్ణాల జిలుగులలో భ్రమిస్తూ.. పరిభ్రమిస్తూ… చుక్కలను తాకే నీ జ్ఞాన పరిపక్వత వెలుగుల ఆరాలను చేరేందుకు శ్రమిస్తూ.. విశ్రమిస్తూ… అంతర్యామివై నాలో నగ్నంగా కదిలే నీ ఆత్మతో అలౌకిక స్వప్నంలో రమిస్తూ.. విరమిస్తూ… గుండెల కౌగిళ్ళలో బిగించాలనిపించే దేహారహిత నీ […]

చీకటి మూసిన ఏకాంతం 3

రచన: మన్నెం శారద “ఇక చాలు!” వసుంధర మరో రెండు ఇడ్లీలు వెయ్యబోతుంటే చెయ్యడ్డం పెట్టింది నిశాంత. “తిను. మళ్ళీ అర్ధరాత్రి వరకూ తిరగాలిగా!” అంది వసుంధర కటువుగా. నిశాంత తల్లివైపదోలా చూసింది. రాత్రి సాగర్ తనని స్కూటర్ మీద వదలడం ఆమె కంటపడింది. పొద్దుటే ఆ సంగతిని ఎలా అడగాలో అర్ధంకాక విశ్వప్రయత్నాలు చేస్తున్నదావిడన్న సంగతి నిశాంతకి అర్ధమయింది. ఎదురుగా కూర్చుని టిఫిన్ తింటున్న కూతురి వైపు పరిశీలనగా చూశాడు నవనీతరావు. నిశాంత తల్లిమాటకెగిరి పడకుండా […]

అమ్మమ్మ – 4

రచన: గిరిజ పీసపాటి తన ఆస్తిని ఇంకమ్ టాక్స్ వారు సీజ్ చేసి, అందులో నుండి ఒక్క పైసా కూడా తను వినియోగించరాదనే ఉత్తర్వులు జారీ చెయ్యడంతో, ఏం చెయ్యాలో తెలియక వేదనకు లోనైన పీసపాటి తాతగారితో తెలిసిన వారు తెనాలి తాతయ్య పేరు చెప్పి, వారు పూనుకుంటే పని అవుతుందని చెప్పడంతో, పీసపాటి తాతయ్య తెనాలి తాతయ్యను కలిసి, విషయం చెప్పి ఎలాగైనా తనను ఈ సమస్య నుండి గట్టెక్కించమని కోరారు. తెనాలి తాతయ్య పీసపాటి […]

మజిలీ

రచన: డా.కె.మీరాబాయి మారుతీ కారు గుత్తి బస్ స్టేషన్ లో హోటల్ ముందు ఆగింది. “ఇక్కడ దోసె బావుంటుంది.” కారులోనుండి దిగుతూ అన్నాడు మాధవమూర్తి. మంజుల చిన్నగా నవ్వింది. మాధవమూర్తి భోజన ప్రియుడు. ఎప్పుడో పదేళ్ళ క్రిందట నెల్లూరు మనోరమ హొటల్ లో తిన్న పూరీ కూర రుచి ఇప్పటికీ గుర్తు చేసుకుంటాడు.. మంజుల చేతి గడియారం చూసుకుంది. రెండు గంటల సేపు ఎక్కడా ఆపకుండా కారు నడిపిన అలసట భర్త ముఖంలో కనబడింది. ఎండ ఎక్కక […]

చిన్నారి మనసు….

రచన: మణి గోవిందరాజుల అత్తకు, అత్త పిల్లలకు జరుగుతున్న వైభోగాన్ని కుతూహలంగా ఇంతలేసి కళ్ళేసుకుని పరిశీలిస్తున్నది ఎనిమిదేళ్ళ చిన్నారి. నిన్ననే దర్జీ వాడొచ్చి అత్తకు కుట్టిన కొత్త జాకెట్లూ ,అత్త పిల్లలకు కుట్టిన పట్టు లంగాలూ ఇచ్చి వెళ్ళాడు. . “పట్టు లంగాలైతే ఎంత బాగున్నాయో చెప్పలేను. ఒక్కసారి ముట్టుకుని చూట్టానికి కూడా ఇవ్వలేదు” గొణుక్కుంది చిన్నారి మనసులో. నాక్కూడా కావాలని చిన్నారి గొడవ చేసింది. కాని అమ్మ పక్కకు తీసుకెళ్ళి నోరు మూసి రహస్యంగా తొడపాశం […]

నేను…

రచన- డా లక్ష్మి రాఘవ నన్ను అందంగా తయారు చేస్తున్నారు అన్న ఆనందం నన్ను నిలవనీయడం లేదు. నా ముఖం ఇంకా ఎంత అందంగా ఉండాలో అని మాట్లాడుతూంటే సిగ్గుపడి పోయాను. అసలే నా నిండా అందమైన ఆలోచనలు, వాటికి తోడు అలంకరణతో అద్బుతంగా అవుతుందంటే ఎవరికీ ఆనందం కలగదు? పైగా “ఎంత ఖర్చయినా పరవాలేదు ఎంత బాగుండాలంటే చూడగానే కావాలని అనిపించాలి” అన్నారు నా వాళ్ళు. ఇక నా ఆనందానికి హద్దులు లేవు! చూడ్డానికి బాగుండటానికి, […]

జలజాక్షి.. సంగీతం కోచింగ్..

రచన: గిరిజారాణి కలవల ఎప్పుడో చిన్నప్పుడు.. కాసిని వర్ణాలూ.. ఇంకాసిని కీర్తనలూ గట్రా.. ఏవో నేర్చుకుంది మన జలజం.. వాళ్ళ బామ్మ బతికున్ననాళ్ళూ సంగీత సాధన చేసాననిపించి.. ఏవో కొన్ని రాగాలని ముక్కున పట్టింది. ఇంటి ఆడపిల్ల చక్కగా సంగీతాలాపన చేస్తోంటే.. సరస్వతీదేవి నట్టింట వీణ వాయించినట్టే వుంటుందని బామ్మ పట్టుబట్టి.. మాష్టారిని ఇంటికి పిలిపించి.. జలజాక్షికి సంగీతం నేర్పించింది. ఆ మాష్టారు కూడా.. జలజానికి తగిన మనిషే… శంకరాభరణం సినిమాలో దాసు కేరక్టరే అనుకోండి.. చక్కటి […]

విశ్వపుత్రిక వీక్షణం – “మైండ్ సెట్”

రచన: విజయలక్ష్మీ పండిట్ “మనసును స్థిరం చేసుకోమ్మా గీతా! ఈ కాలప్రభావంవల్ల మనుషుల జీవితాలలో మా తరం ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. మనం చేసే మంచి ప్రయత్నం ఫలించనపుడు, పరిస్థితి మన చేయిదాటిపోయినపుడు, మనం జీవితమంతా వగచే బదులు కాలానికనుగుణంగా, పరిస్థితికి రాజీపడి మైండ్ సెట్ చేసుకుని మన జీవితాన్ని నరకం చేసుకోకుండా బతకాల్సి వస్తూంది. జరిగినదానికి నీ జీవితాన్ని బలి ఇవ్వకుండా, ధైర్యంగా ఆలోచించి మనసును సమాధాన పరచుకుని ఒక నిర్ణయం చేసుకో !” కాలం […]