May 9, 2024

అర్చన 2020 – అమ్మ చెప్పిన మాట

రచన: డి. రామకృష్ణ

పసి పాపను నేను..
బోసినవ్వులతో ఆడుకుంటాను..
నాపై అఘాయిత్యాలకు పాల్పడకండి ప్లీజ్….

అమ్మాయిని నేను..
అలుపెరగని ఆశలతో ఉంది నా జీవితం..
నాపై హత్యాచారం చెయ్యకండి ప్లీజ్….

మీ స్నేహితురాల్ని నేను..
మీ సంతోషంలో భాగాన్ని..
నాపై అభిమానం నటిస్తూ ముంచెత్తకండి ప్లీజ్…

నేను నీ భార్యను..
నీతోనే నా జీవితం నువ్వే నాకు శాశ్వతం..
నన్ను అడడుగునా అవుమానించకు ప్లీజ్….

నేను మీ కుటుంబీకురాల్ని..
మిమ్మల్నే నమ్ముకొని ఉంటా..
నా నమ్మకాన్ని వమ్ము చెయ్యకండి ప్లీజ్….

నేను మీ అమ్మని..
నేనే నీకు సర్వస్వం..
ఏ స్త్రీ జీవితంతో ఆడుకోకు..
నీ వినాశనాన్ని నువ్వే కొని తెచ్చికోకు ప్లీజ్….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *