March 19, 2024

‘నేను వడ్డించిన రుచులు – చెప్పిన కథలు’ (సమీక్ష)

రచన: శ్రీమతి నండూరి సుందరీ నాగమణి ‘నేను వడ్డించిన రుచులు , చెప్పిన కథలు’ రుచి చూసారా? కథలు విన్నారా? ఈ కమ్మని పుస్తకమును వండిన పాక శాస్త్రవేత్త శ్రీమతి సంధ్య యల్లాప్రగడ గారు. ఇవి వంటలు మాత్రమేనా? కాదు… కాదు… వంటలతో పాటు, రుచులతో పాటుగా కమ్మని కథలు, కబుర్లూ… రచయిత్రి సంధ్య గురించి కొత్తగా చెప్పవలసినదేమీ లేదు. పాఠకులందరికీ తాను పరిచయమే. గద్వాలలో పుట్టి, కొల్లాపూర్ లో పెరిగి, హైదారాబాద్ వచ్చి, వివాహానంతరము అమెరికా […]

మాలిక పత్రిక డిసెంబర్ 2020 సంచికకు స్వాగతం

Jyothivalaboju Chief Editor and Content Head పాఠక మిత్రులు, రచయితలందరికీ నమస్సుమాంజలి. కృతజ్ఞతలు. ప్రపంచం మొత్తాన్ని కదిలించేసిన కరోనా 2020 సంవత్సరాన్ని మింగేసింది/చెడగొట్టింది అని చెప్పవచ్చు.  కరోనా మూలంగా లాక్ డౌన్,  క్వారంటైన్ అంటూ ఎవరినీ కలవకుండా ఇంట్లోనే ఉంటున్నాము. వ్యాధి తగ్గుముఖం పట్టినా ఇంకా ప్రమాదంలోనే ఉన్నాం. వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. వచ్చే 2021వ సంవత్సరం మనందరికీ సుఖఃసంతోషాలను, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎదురుచూద్దాం.. మీ రచనలను పంపవలసిన చిరునామా: […]

రాజీపడిన బంధం – 9

రచన: ఉమాభారతి కోసూరి “మమ్మీ మమ్మీ” అంటూ సందీప్ నన్ను తట్టి లేపుతున్నట్టయింది. కలలోలా మగతగా కళ్ళు తెరిచాను. కల కాదు, నిజంగానే సందీప్ తన చేతులతో నన్ను తడుతున్నాడు. వాడి వెనుక చిత్ర నిలబడుంది. సందీప్ ని చూసిన సంతోషంతో … నా కళ్ళ వెంట ఆగని కన్నీరు చూసిన చిత్ర కళ్ళు కూడా చమర్చాయి. ఆ క్షణాన నా స్నేహితురాలు నా పాలిట దేవతలా అనిపించింది. సందీప్ ని రెండురోజులు తన దగ్గరే ఉంచుకుంటానంటే […]

తామసి – 3

రచన: మాలతి దేచిరాజు లైబ్రరీలో తనకి కావాల్సిన పుస్తకం కోసం వెతుకుతున్నాడు గాంధీ. ఎంతకీ అది దొరకటం లేదు. దాదాపు లైబ్రరీ అంతా వెదికాడు. విసుగొచ్చి వెనుతిరిగాడు. చాలా రోజులైంది, పేపర్ పై పెన్ను పెట్టి. కొత్త నవల రాద్దామంటే ఏమీ ఇన్స్పిరేషన్ రావడం లేదు. పోనీ, ఏవైనా పుస్తకాలు చదివితే అందులో ఏదో ఒక పాత్రని పట్టుకుని కథ అల్లుకోవచ్చు అన్నది అతని ఉద్దేశం. అలా రాసిన నవలలు కూడా ఉన్నాయి. అవి డబ్బైతే తెచ్చి […]

అమ్మమ్మ – 20

రచన: గిరిజ పీసపాటి తెనాలిలో పది రోజుల పాటు కష్టపడినా రాని సొమ్ము హైదరాబాదులో ఒక్కరోజు వంట చేస్తే వచ్చింది. అదే అమ్మమ్మకి చాలా అబ్బురంగా అనిపించింది. “రాజేశ్వరమ్మా! వాళ్ళు పొరపాటున ఎక్కువ ఇచ్చినట్లున్నారు. ఒక్కసారి ఫోన్ చేసి వాళ్ళకు ఎక్కువ ఇచ్చారని చెప్తాను” అన్న అమ్మమ్మను ఆపేసారు రాజేశ్వరమ్మ గారు. “ఈ ఊరిలో వంట చేసేవారు ముఖ్యంగా మన గుంటూరు వంట చేసే బ్రాహ్మణ స్త్రీలు దొరకడం కష్టం. అందుకే వాళ్ళు మీ పని మెచ్చుకుని […]

చంద్రోదయం – 10

రచన: మన్నెం శారద “రెండు మూడేళ్ళు ఆగితే ఆ ముసిలోడు అంటే నీ మామగారు గుటుక్కు మనేవాడు. నీకా ఒక్కగానొక్క బిడ్డ. ఆస్తంతా చచ్చినట్లు నీ చేతికి దొరికేది. మొగుడు లేకపోతేనేం మహారాణిలా వుండేది జాతకం! ఈ పనికిమాలిన పెళ్లి వల్ల ఆ ఛాన్సు కాస్తా చక్కాబోయింది.” స్వాతి తేలిగ్గా ఊపిరి తీసుకుంది. అవన్నీ ఆమె చెప్పకపోయినా తనకీ తెలుసు. ఇది క్రొత్త విషయం కాదు. తను అన్నింటికి సిద్ధపడే ఈ పెళ్ళి చేసుకుంది. “నాకు తెలుసు […]

కంభంపాటి కథలు – ‘మొహమా’ ట్టం

రచన: రవీంద్ర కంభంపాటి సర్వేశ్వరరావుదంతా అదో తరహా.. వాడు నాలుగో క్లాసులో ఉన్నప్పుడు అనుకుంటా.. క్లాసులో నాలుగు లెక్కలు బోర్డు మీద రాసి, వాటిని చెయ్యమని కుర్చీలో చిన్న కునుకు తీసిన కమలా టీచర్ గారికి ‘టీచర్ ‘ అంటూ ఎవరో పిలిచినట్టు అనిపించి మెల్లగా కళ్ళు తెరిచి ఒక్కసారి అదిరిపడిందావిడ! ఎదురుగా మొహం మీద మొహం పెట్టి, ‘నా పెన్సిల్ ఇరిగిపోయిందండి.. చెక్కుదామంటే ఎవరి దెగ్గిరా బ్లేడు లేదంటున్నారండి’ అంటున్న సర్వేశ్వర్రావుని చూసి కోపంతో ఊగిపోయిందావిడ […]

జీవితమంటే..

రచన: విజయలక్ష్మీ పండిట్ ఉదయం ఐదు గంటలకే లేచి మిద్దె పైన వాకింగ్ చేస్తున్నాను. రోజు తూర్పున ఇంటిముందు మెల్లమెల్లగా తన ప్రత్యూష కిరణాలు సంధించి చీకట్లను పరుగులు పెట్టిస్తూ ఎఱ్ఱని బంతిలా ఆకాశం పొత్తిళ్ళలో వెలిగిపోయే ఉదయించే బాలభానుడి అందాలను తిలకిస్తూ నడవడం నా కెంతో ఇష్టం. ఇంటి చుట్టూ ఎత్తుగా పెరిగిన చెట్ల కొమ్మలనుండి వీచే చల్లని గాలి ఒకవైపు శరీరాన్ని మృదువుగా తాకుతూంటే, ఆదిత్యుని లేత కిరణాల స్పర్శతో శరీరానికి మనసుకు చెప్పలేని […]

తేనె మనసులు

రచన: పరేష్ బాబు ఎన్నో వ్యాపారాలు చేసి నష్టపోయి ఆఖరి ప్రయత్నంగా శంకర్ విలాస్ భోజన హోటల్ ప్రారంభించాడు శంకరరావు. హోటల్ కు వచ్చే కస్టమర్ల కోసం ఆయన భార్య అన్నపూర్ణమ్మ వంటలు చేసేది. సరిగ్గా హోటల్ ప్రారంభం రోజే ఎక్కడినుంచి వచ్చాడో ఒక యువకుడు వచ్చి శంకర్రావును కలిసాడు ‘సార్. నా పేరు సుందరం. నాకు మీ హోటల్లో సర్వర్ ఉద్యోగం ఇవ్వండి సార్. నమ్మకంగా పనిచేసుకుంటా’. అడిగాడు ‘చూడు బాబూ. నేను నా భార్య […]

బందీలైన బాంధవ్యాలు

రచన: డా. కె. మీరాబాయి కూరగాయలు, ఇంటికి కావలసిన సరుకులు కొనుక్కుని ఇంటి దారి పట్టిన రమణకు పిచ్చికోపం వచ్చింది. రెండు చేతుల్లో నిండుగా ఉన్న సంచీలు మోస్తూ నడవడం వలన ఆయాసం వస్తోంది. వూపిరి ఆడకుండా చేస్తూ ముక్కును నోటిని కప్పిన మాస్క్ ఒకటి. చెమటకో ఏమో ముక్కు మీద దురద పెడుతోంది. మాస్క్ పీకి పారేసి గోక్కొవాలని వుంది. కానీ భయం. చుట్టూ జనం వున్నారు. ఎక్కడినుండి వచ్చి మీద పడుతుందో కరోనా భూతం […]