April 27, 2024

నాటి ‘కచుడు’ నేటికీ ఆదర్శమే

రచన: సీతాలక్ష్మి వేలూరి ఆంధ్రమహాభారతంలో ఉపాఖ్యానాలకు కొఱతలేదు. అద్భుతమైన కథలకు కొలువు కూటమి భారతం. ముఖ్యంగా నన్నయభట్టారకుని రచనలో ఉపాఖ్యానాలకు వన్నెలెక్కువ. ఆయన ప్రసన్నకథాకలితార్థయుక్తికి తార్కాణాలైన కథలలో యయాతి వృత్తాంతం ఒకటి. అందులో ఒక చిన్న పాత్ర ‘కచుడు’. కేవలం 33 గద్య పద్యాలకు మాత్రమే పరిమితమైన పాత్ర ఇది. అయినా పఠితల మనస్సునమితంగా ఆకర్షించి వారి హృదయాలలో శాశ్వతస్థానాన్ని ఏర్పరచుకుంటుదనడంలో విప్రతిపత్తి లేదు. కచుడు ఈ కథలో కేవలం 4 పద్యాలలోను, ఒక వచనంలో మూడు […]