April 27, 2024

మాలిక పత్రిక జనవరి 2021 సంచికు స్వాగతం

Jyothivalaboju Chief Editor and Content Head   ముందుగా రచయితలు, పాఠక మిత్రులందరికీ ఆంగ్ర నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా అందరూ 2020 ఎంత తోందరగా వెళ్లిపోతుందా అని ఎదురుచూసారు.. కల్లోలం, మారణహోమాన్ని సృష్టించిన 2020 సంవత్సరం వెళ్లిపోయింది. 2021 ఐనా అందరికీ మంచి చేస్తుందని. కరోనా మహమ్మారిని మట్టుపెడుతుందని అందరూ కోరుకుంటున్నారు. అలా జరగాలని విశ్వసిస్తూ మరో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడదాం. ఈ మాసంలో మీకోసం ఎన్నో కార్టూన్లు, కవితలు, కథలు, వ్యాసాలు, […]

రాజీపడిన బంధం – 11

రచన: ఉమాభారతి కోసూరి ఉన్నట్టుండి అర్ధమయింది. నాకు ఇలా సీమంతం కూడా ప్లాన్ చేసింది చిత్ర అని. చిత్ర, రమణిల వంక చూసాను. చిరునవ్వులే జవాబుగా నన్ను నడిపించుకుని లోపలి వరకు తీసుకువెళ్ళారు. శ్యాం, ఆనంద్, నాన్నగారు, మామయ్య కూడా కాస్త ఎడంగా నిలబడి ఉన్నారు. దూరం నుండే వారికి రమణి నమస్కారాలు తెలిపింది…. ** అంతా కలిసి నా ‘సీమంతం’ నిర్వహించారు. పద్ధతిగా, గాజులు వేయించారు. అమ్మ, అత్తయ్య, మిగతా పెద్దవాళ్ళ నుండి ఆశీర్వాదాలు కూడా […]

చంద్రోదయం – 11

రచన: మన్నెం శారద “నువ్వేలేరా బాబూ! ఎలాగూ ఆ అమ్మాయి నిన్నే చేస్కోబోతుంది కదా.. నువ్వు ఒప్పుకున్నావు. ఇంకా ఈ తతంగం దేనికి?” “జస్ట్ ఫర్ థ్రిల్!” “ఏం థ్రిల్లో. నా ప్రాణం తీస్తున్నావు” అన్నాడు సారథి నవ్వుతూ. శేఖర్ సీరియస్‌గా “చూడు సారథి! మనిషి బ్రతుకులో ఎన్నో లింకులు తెలీకుండానే ఏర్పడుతుంటాయి. నీ స్నేహం నాకు అలాంటిదే. ఈ రోజు మాస్టారి ఆనందం కోసం ఆయన ఆల్లుడిగా జీవితంలోకి ప్రవేశించబోతున్నాను. ఇదీ కొత్త లింకే. కాని […]

అమ్మమ్మ – 21

రచన: గిరిజ పీసపాటి తమ పక్కింటి వాళ్ళకు ఫోన్ ఉండడంతో, వాళ్ళ పర్మిషన్ తీసుకుని, తెలిసిన వాళ్ళకు వాళ్ళ నంబర్ ఇచ్చింది అమ్మమ్మ. కేవలం వంట పని ఉంటే తనకు చెప్పడానికి తప్ప ఇతర కారణాలకు ఆ నంబర్ కి ఫోన్ చెయ్యొద్దని అందరికీ మరీ మరీ చెప్పింది. దగ్గరలో ఉంటున్న భార్యాభర్తలను కూడా తనతో కలిసి వంట పనికి తీసుకెళ్ళసాగింది. పెద్ద పెద్ద గుండిగలతో అన్నం వార్చడం వంటి కొన్ని బరువు పనులకు అతన్ని వినియోగించసాగింది. […]