April 26, 2024

*శ్రీగణేశ చరిత్ర*

రచన: నాగమంజరి గుమ్మా 61 వ పద్యం దండమయా విఘ్నేశ్వర దండమయా ఏకదంత దానవనిహతా కొండవు విద్దెల కెల్లను ఖండపరశు ముద్దుపట్టి కామితమిమ్మా భావం: విఘ్నేశ్వరా నీకు వందనం. ఏకదంతుడవైన నీకు వందనం. దానవులను సంహరించిన వాడా, అన్ని విద్యలకు నిలయమైనవాడా, శివునికి ముద్దుల కొడుకా మా కోరికలు తీర్చవయ్యా ఖండపరశువు: శివుడు 62 వ పద్యం కొలిచెద నే కుడుముల దొర కొలిచెద నే తొలుత వేల్పు కోర్కెలు తీరన్ పులకపు ముద్దలు పెట్టెద వెలయుచు […]

మనసే ఒక పూలతోట

రచన: గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ మనసే ఒకపూల తోట తీయని తలపుల ఊట అందాల ఆస్వాదనకు బాట ఆనందాల అందించే మూట నా మనసులో సుమాలున్నాయి సొగసులున్నాయి సౌరభాలున్నాయి సంతసాలున్నాయి నాకు అందాన్ని చూపుతున్నాయి ఆనందాన్ని కలిగిస్తున్నాయి మందారాలు మురిపించి మరందమును మధుపములవలె క్రోలుకొనుమను ఎర్రగులాబీలు ఎదనాక్రమించి ఎర్రబుగ్గలపై మోజుకలిగించు ఎందుకాలశ్యమనుచు పరుగులుతీయించు మల్లెపూలు మత్తెక్కించి మయిని మరిపించు ముద్దూముచ్చటలు తీర్చుకొనుమను పున్నాగపూలు పలకరించి పరిహసములాడు పరిమళాలను పీల్చుకొనుమను బంతిపూలు భ్రమలుకల్పించి బ్రతుకును బహుధన్యము చేసుకొనుమను చామంతిపూలు చక్కదనాలుచూపి […]

వనితా ! ఓ వనితా !

రచన :ముక్కమల్ల ధరిత్రీ దేవి వందనం ! నీకు వందనం ! అవనిని సాటి లేనిది నీ ఘనత ధన్యమగు నీ చరిత ధరణిలో తిరుగు లేనిదట ! నీకు సరి లేరెవరన్నది జగమెరిగిన సత్యం ! అవధులెరుగని సహనం నీ సొంతం అంతులేని ఆత్మవిశ్వాసం నీ ఆయుధం ! ఆకాశమే హద్దుగా సాగుతోందిగా నీ పయనం ! ఇంట ఊడిగం చేస్తావు బయట ఉద్యోగం చేస్తావు రెండు పడవల ప్రయాణం నీకు మాత్రమే సాధ్యం నీ […]