May 20, 2024

కర్ణాటకలో పండుగలు

రచన: రమా శాండిల్య నేను బెంగుళూర్ వచ్చి మూడు సంవత్సరాలు పూర్తి అయింది. ఇక్కడ ఉండి నేను తెలుసుకున్న విషయం ఏమిటంటే, కర్ణాటక రాష్ట్ర ప్రజలు సంప్రదాయాన్ని చాలా విధిగా పాటిస్తారు. వీరి జీవితంలో సంప్రదాయము, సాహిత్యము, సంగీతం, నృత్యం వంటి విషయాలన్నీ పరంపరగా వస్తున్నాయి. వాటిని వీరు అంతే శ్రద్ధగా అనుసరిస్తున్నారు కూడా! వీరు చేసే పండుగలన్నీ, చాలా మట్టుకు నేను స్వయంగా చూసాను. రంగులమయం వీరి జీవితం. వీరు చాలా విషయాలు పరంపరాగతంగా ఆలోచిస్తారు, […]

వెంటాడే కథ – 21

రచన: … చంద్రప్రతాప్ కంతేటి విపుల / చతుర పూర్వసంపాదకులు Ph: 80081 43507 నా వృత్తిలో భాగంగా దేశ దేశాల కథలు, మన దేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా వారి […]

కర్ణాటక సంగీతంలో రాగమాలికలు – 4

రచన: కొంపెల్ల రామలక్ష్మి ఇప్పటి వరకూ మనం రాగమాలికల గీతాల గురించి, వర్ణాల గురించి చర్చించుకున్నాము కదా… ఈ భాగంలో రాగమాలికా కృతుల గురించి మాట్లాడుకుందాము. రాగమాలికాకృతులు రచించిన వాగ్గేయకారుల్లో ముఖ్యంగా చెప్పుకోవలసిన వారు – 1. శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ 2. శ్రీ స్వాతి తిరునాళ్ 3. శ్రీ సీతారామ అయ్యర్ ఒక్కొక్క వాగ్గేయకారుల గురించి, వారి రచనల గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా శ్రీ ముత్తు స్వామివారి అతిపెద్ద రచన ‘చతుర్దశ రాగమాలిక’, గురించి […]

సుందరము సుమధురము – 7, (ఆదిభిక్షువు వాడినేది కోరేది?)

రచన: నండూరి సుందరీ నాగమణి సుందరము సుమధురము ఈ గీతం: ‘ఆదిభిక్షువు వాడినేది కోరేది? బూడిదిచ్చే వాడినేది అడిగేది?’ ఈ పాటను గురించి కొంతమంది వివరణ అడిగారు. అందుకని ఈ నెల సుమధుర గీతంగా ఈ పాట గురించి వ్రాస్తున్నాను. ఒక భక్తుడు ఆ మహాదేవుడైన శివుడిని ఇలా స్తుతిస్తున్నాడు. ఈ ప్రక్రియను ‘నిందాస్తుతి’ అని అంటారు. పైకి నిందిస్తున్నట్టు, ఆక్షేపిస్తున్నట్టు అనిపించినా, లోలోపల శ్లాఘిస్తున్న భావం వస్తుంది. సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు అలవోకగా వ్రాసేసారు. మరి భావాన్ని […]

బాలమాలిక – ‘బామ్మ నేర్పిన పాఠం.’

రచన: ఉమాదేవి కల్వకోట స్కూల్ వాన్ ఆగే ప్లేస్ లో తన ఫ్రెండ్ వరుణ్ కోసం ఎంతో ఆరాటంగా ఎదురు చూస్తున్న బంటీ ముఖం వికసించింది. వరుణ్ కూడా నవ్వుతూ వచ్చి బంటీ పక్కనే నిలబడగానే వ్యాన్ రావటం, వీళ్ళు ఎక్కటం, వ్యాన్ కదలటం జరిగిపోయాయి. “హాయ్ రా వరుణ్…” “హాయ్ రా బంటీ…” “నిన్న సండే కదా… ఏంట్రా, ఏం చేసావు నిన్న?” కుతూహలంగా అడిగాడు వరుణ్. “నిన్న మేము ఒక బర్త్ డే పార్టీ […]

వాట్సప్ వాట్సప్ వల్లప్పా! (సామాజిక పద్య నాటకం)

రచన: తుమ్మూరి రామ్మోహన్ రావు 1 వ రంగము కాళి:- కం.అయ్యా లేలే లెండిక బియ్యము పప్పులు సరుకులు వే గమె తేవన్ దయ్యముగా నను దలచుచు కుయ్యో మొయ్యో అనకుడి కొట్టుకువెళ్లన్-1 దాసు:-ఓసినీ! తెలుగు పద్యాభిమానం గ్రూపు గగనమెక్క! హాయిగా వెనకటి లాగా సరదాగా,ఏవండోయ్ సరుకులైపోయాయి, తెస్తే తేండి.లేకుంటే పస్తులే -అనటంలో ఎంత ఆత్మీయత ఉండేది.ఈ మధ్య ఈ వాట్సప్ఛందోభాషణం పుణ్యమా అని మాటలు కరువై, పద్యాల ఊటలు షురువ య్యాయి గదే! కాళి:-కం.ఎప్పటి కెయ్యది […]

ఏమండీ కథలు (సమీక్ష)

రచన: రమ్య ఉద్దంటి పరిపూర్ణమైన ఆలుమగల జీవన విధానానికి అద్దం పట్టే కథలు. ఒక భార్య భర్తని ఇంతలా ప్రేమించగలదా .. ఒక భర్త భార్యని ఇంత ప్రోత్సహించగలడా అని పాఠకుల్ని ఆశ్చర్య పరిచే కథలు. ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు మూడు నాళ్ళ ముచ్చట అవుతున్నాయి.. కొత్తగా పెళ్ళైన జంటలకి “ఏమండీ కథలు” పుస్తకం బహుమతిగా ఇచ్చి చదవమని చెప్తే వాళ్ళ కొత్త కాపురం ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. యూట్యూబ్ లో ప్రభాతకమలం […]

శ్లోకం – పాట

రచన: మంగు కృష్ణకుమారి మన పద్యాలూ, సుప్రభాతాలూ, దండకాలూ దేన్నిచూస్తే అవే గొప్పవి. మన సినీపాటల రచయితల ప్రతిభని వేనోళ్ల కొనియాడినా, తక్కువే అనిపిస్తుంది. పెద్దలకి పాటంటే ఎంత భక్తి పారవశ్యమో! శ్రీ వెంకటేశ్వర‌ సుప్రభాతం తెలీని వాళ్లు లేనేలేరని చెప్పగలం. శ్రీమతి ఎమ్.ఎస్ సుబ్బలక్షిగారి గంధర్వగానంతో, ఇంటింటా ఆమె సుప్రభాతం తోనే తెల్లవారుతుంది. సముద్రాల రాఘవాచార్యుల వారు గృహలక్ష్మి సినిమా‌కోసం రాసిన ఈ పాట శ్రీమతి భానుమతి పాడేరు. కవిగారు ఇందులో స్వామి వారి సుప్రభాతపు […]

నవదుర్గా దేవి

రచన: ములుగు లక్ష్మీ మైథిలి నవరాత్రి ఉత్సవాలలో భక్తాభీష్ట ప్రదాయినిగా శ్రీచక్ర నివాసినిగా విలసిల్లిన శ్రీమన్ మహాలక్ష్మి నమోస్తుతే నవవిధ పూజలతో సర్వ సౌభాగ్యదాయినిగా అలరారే శోభతో వెలిగే కల్పవల్లి బాలా త్రిపురసుందరి నమోస్తుతే నవకాంతుల తేజముతో భక్తుల పాలిట కొంగుబంగారమై ఆదరించే అమృతమూర్తివై అన్నపూర్ణా దేవి నమోస్తుతే నవవిధ విద్యలతో జ్ఞానమొసగే వీణాపాణి సకల కళల ప్రదాతవై సరస్వతీ దేవి నమోస్తుతే నవనవోన్మేషమైన వేదశాస్త్రములకు మూలమంత్రమై పరబ్రహ్మ స్వరూపిణివై గాయత్రీ దేవి నమోస్తుతే నవావరణ అర్చనలతో […]

బంజారా తాండాలో తీజ్ సంబురాలు

రచన: రాథోడ్ శ్రావణ్ బంజారా సాంస్కృతి, సాంప్రదాయానికి చాటి చెప్పే పండుగలలో అతి ముఖ్యమైనది “తీజ్ పండుగ” తీజ్ అనగా గోధుమ మొక్కలు అని అర్థం. ఈ పండుగను మన తెలంగాణా రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల్లోనే కాక పోరుగునున్న ఆంధ్రప్రదేశ్, మహరాష్ట్ర, కర్ణాటక, గోవా మరియు ఉత్తర భారత దేశంలోని ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ ఛత్తీస్ గడ్, రాజస్తాన్, గుజరాత్ మొదలగు రాష్ట్రాల్లో బంజారాలు బాజాబజేంత్రీలతో చాలా గొప్పగా జరుపుకుంటారు. ఈ పండుగ మొదట ఎలా […]