May 7, 2024

పరవశానికి పాత(ర) కథలు – ఊరకే రాకోయి అతిధీ!

రచన: డా. వివేకానందమూర్తి   రోజూలాగే నేను రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో యిల్లు చేరాను. రోజూ ఆ టైముకి పిల్లల్ని పడుకోబెట్టి, పెద్ద లైట్లన్నీ ఆర్పేసి మా శ్రీమతి నా కోసం ఎదురుచూస్తూ వుంటుంది. కానీ ఇవాళ మాత్రం ముందుగదిలో పెద్దలైటు ఇంకా వెలుగుతోంది. తలుపులు కూడా తెరచివున్నాయి. ఎవరా! అని ఆలోచిస్తూ గదిలోకి ప్రవేశించాను. గదిలో ఒక పక్క మంచం మిద దాదాపు నలభై అయిదేళ్ళ ఆసామి ఒకాయన గురక పెట్టి గాఢంగా నిద్రోతున్నాడు. నేను […]

అర్చన కనపడుటలేదు – 5

రచన: కర్లపాలెం హనుమంతరావు   వానలో తడుస్తూనే గేటు తెరిచి రోడ్డు మీదకు వచ్చి పరుగులాగా అందుకున్నాడు చిన్న కర్రపోటేసుకుంటూనే.  అంతకన్నా వేగంగా ఆటో ముందుకు వెళ్ళి పోయింది. వీధి చివరలో ఆగింది ఎందుకో ! ఇంట్లోని పోను గణగణ మోగింది.  పరుగెత్తుకుంటూ వెళ్లి ఫోను అందుకుంది కాంతమ్మగారు.  అర్చన గొంతు! ‘నిన్నూ, చిన్ననూ చూసాను ఇప్పుడే.  నా కోసం ఇక ఎదురుచూడద్దు.  చిన్నను బాగా చదివించు పిన్నీ! మంచి డాక్టర్ని చెయ్యి! బ్యాగులో మీ కోసం […]

పక్కవారిది పరమానందం

రచన:వేణి కొలిపాక ఇల్లంతా హడావిడిగా ఉంది. కమల అన్ని, ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటోంది. సోఫా కవర్లు మళ్ళీ సర్ది, ఫ్లవర్ వాసులు వాటి స్థానాల్లో పెట్టి!! సంగతి ఏమిటంటే వాళ్ళింట్లో ఈరోజు కిట్టి పార్టీ ఉంది. కమల లాయర్ గా మంచి పేరు తెచ్చుకుంది. ఆ విధంగా ఆమెకు వివిధ రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న ఆడవారు స్నేహితులయ్యారు.’ “వంట అయిపోయినట్టే కదా అత్తయ్య” అంటూ,  వంట పర్యవేక్షిస్తున్న అత్తగారిని అడిగింది..’ఆ..అంతా అయినట్టే,  ఇదిగో ఈ […]

రాతి మనసు

  రచన: యశస్వి జవ్వాది   చేతిలో ఉన్న సారా ప్యాకెట్‌ను మూలగా కొరికి నోట్లో పెట్టుకుని అరచేతితో గట్టిగా నొక్కాడు రంగడు.  నిషా మత్తు గొంతు నుండి బుర్రకెక్కగానే గుడారం నుండి బయటకు అడుగులు వేశాడు.  ఎండ గూబని తాకింది.  భుజం మీదున్న కండువా తీసుకుని నెత్తికి చుట్టుకుని,  రిక్షా దగ్గరకెళ్లాడు.  రిక్షా మీద చెక్కిన రుబ్బురోళ్ళు,  సనికలు రాళ్లు ఉన్నాయి.  వాటి పక్కనే గంట్లు పెట్టడానికి అవసరమయ్యే సుత్తి,  శానాలు వున్నాయి.  శానాలకు ఉన్న […]

బాల మాలిక – ప్రోత్సాహంతోనే విజయం..

రచన: భోగా  పురుషోత్తం   ‘‘నమస్తే అంకుల్‌!’’  గుమ్మం బయటి నుంచి అంది పక్కింటి ప్రియాంక తలెత్తి చూశాడు పరంధామయ్య. ప్రియాంక నవ్వుతూ నిల్చొని వుంది. ఆ అమ్మాయిని చూస్తే పరంధామయ్యకి చిరాకు. ‘‘రవి లేడా అంకుల్‌ ’’ ప్రశ్నించింది ప్రియాంక. ‘‘ఉన్నాడు’’ పుస్తకం కింద పెడుతూ అన్నాడు పరంధామయ్య. టీవీ ఆపేసి పక్కకి తిరిగి చూశాడు రవి. పరీక్ష రాయడానికి ఏదో ఒకటి చదవమని పుస్తకం వంక చూడబోయింది ప్రియాంక. హిస్టరీ పుస్తకం అందించాడు రవి. […]

విరించినై విరచించితిని … వంటింట్లోనే కాదు మార్కెటింగ్‌లోనూ వీరు అసాధ్యులే!

రచన: ఉంగుటూరి శ్రీలక్ష్మి   గృహిణిలు వ్యాపారం చెయ్యటం సాధ్యమా? సాధ్యమేనని నిరూపించారు విజయలక్ష్మి, శకుంతల, కృష్ణవేణి, నాగలక్ష్మి. గృహిణులు కూడా వ్యాపారం చేసి ఎలా విజయం సాధించగలరో తెలుసుకోటానికి వీరిని పాఠకులకు పరిచయం చేస్తున్నాము.   ప్ర. విజయలక్ష్మిగారూ! మీరు ఈ ఒన్‌ గ్రామ్ గోల్డ్ బిజినెస్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? జ. మొదట్లో లక్ష రూపాయల పెట్టుబడితో 2001లో బంగారు నగల వ్యాపారం ప్రారంభించాను. బంగారం రేటు పెరగటంతో 2003 నుంచి ఒన్ గ్రామ్ […]

రిమెంబర్ – రీమెంబెర్

రచన: శ్యామదాసి   రిమెంబర్ (సదాస్మరణ) రీమెంబెర్ (మళ్ళీ ప్రపంచంలోకి) అద్దoలో చూస్తేగాని మన ముఖం మనకు తెలియదు శాస్త్రాల ద్వారాగానే గురుముద్రతతో ఆత్మ దర్శనం కలుగుతుంది.  గురువు అనే దర్పణం మన స్థితిని మనకు చూపిస్తుంది,  కర్తవ్యాన్ని బోధిస్తుంది.  శ్రీకృష్ణ పరమాత్మను గురువుగా స్వీకరించి నష్టోమోహ: స్మృతిర్లబ్ధా త్వత్ప్రసా దాన్మయాచ్యుతI స్థితో స్మి గతసన్దేహ: కరిష్యే వచనం తవ భగవద్గీత 18-73 “ఓఅచ్యుతా నా మోహము తొలగినది,  నీ కరుణచే నా స్మృతిని తిరిగి పొందితిని. […]

సంస్కృతీ సంప్రదాయాల ప్రతిబింబం

పండుగలు ముత్యాల హారాలు సమీక్ష: కందుకూరి భాస్కర్ ఇటీవలి కాలంలో తెలుగు సాహిత్యంలో అనేక సాహితీ ప్రక్రియలు పుట్టుకొస్తున్నాయి. అందులో కొన్ని తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. ఎందరో కవులు, సాహితీవేత్తలు అనేక రకాల నూతన కవితా ప్రక్రియలను రూపొందించి తెలుగు భాషాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నారు. ఇలా వచ్చిన ప్రక్రియల్లో కొన్ని పాఠకుల ఆదరణను చూరగొంటున్నాయి. ఈ మధ్యకాలంలో వచ్చిన కవితా ప్రక్రియల్లో నవకవుల, సాహితీ అభిమానుల ఆదరణ పొందిన వాటిలో “ముత్యాల హారం” ఒకటి. […]

కవిత్వం పరమార్ధం

రచన: అజయ్ పారుపల్లి కవిత్వం అర్థం లేని మౌన గోస కాకూడదు కవిత్వం సాగరఘోషై నినదించాలి నిద్రాణమైన జనులందరికి ….. కవిత్వం కామాంధుల పాలిట కరాళ మృత్యువై కదలాడాలి … కవిత్వం పీడిత, తాడిత ప్రజల్లో విప్లవాలను రగిలించాలి ….. కవిత్వం అసహాయుల చేతుల్లో ఆయుధమై మిగలాలి … కవిత్వం చెడును సంహరించే చండికలా చెలరేగాలి ….. కవిత్వం దానవ సమాజాన్ని మానవ సమాజంగా మార్చగలిగేదై నిలవాలి ….. కవిత్వం మంచి కి మారుపేరై మమతల కోవెలలా […]