April 26, 2024

నల్ల పన్ను

రచన: ఎ.బి.వి. నాగేశ్వరరావు ఉప్పు మీద పన్నా! తెల్లవారికిదేమి తెగువ !! అనుకొంటిరి, ఆందోళితులైరి ఆనాడు మనవారు. దోపిడీ అనీ, దమన నీతనీ, ఆవేశపడి ఆగ్రహించిరి, ఏకతాటిన ఉద్యమించిరి మరి, మనవారు ఆనాడు. నీటి పై పన్ను, పాలపై పన్ను, పండ్లపై పన్ను, రోగమున తిను రొట్టె ముక్కకు పన్ను, ఔషధములపై పన్ను, వైద్య సేవలకు పన్ను, ఉసురు నిలిపే వస్తు పరికరాలపై పన్ను, విధి వక్రిస్తుంటే ఎక్కించే ప్రాణ వాయువుపై పన్ను, భద్రత పేరిట పన్ను, […]

మునికుల చూడామణి “కణ్వ మహర్షి”

రచన: శ్యామ సుందరరావు కణ్వుడు కశ్య ప్రజాపతి వారసుడైన అంగీరసుని వంశంలో ఘోరుడు అనే ఋషికి జన్మించాడు ఈయనను “మునికుల చూడామణి”అని అంటారు అంటే మునులలోకెల్లా శ్రేష్ఠుడు అని అర్ధం. ఈయన బాల్యము నుండి తపోనిష్ఠలో ఉండి బ్రహ్మచారిగా ఉండిపోయాడు కణ్వుడు మహా నిష్ఠాగరిష్ఠుడు. గొప్ప తపస్సంపన్నుడు అతను మన వేదాలలో పెక్కు మంత్రాలకు ద్రష్టగా నిలిచారన్న విషయంలో మాత్రం ఎలాంటి వివాదమూ లేదు. రుగ్వేదంలో కణ్వుడి పేరిట చాలా మంత్రాలే ఉన్నాయి. కణ్వుడు, అతని వంశజులు […]

ఓ మనిషీ !

రచన: ధరిత్రి దేవి ఓ మనిషీ ! సమస్యల సుడిగుండాలెన్ని ముంచెత్తినా ప్రకృతి గర్జించి ప్రళయంతో వెల్లువెత్తినా ఎన్ని’కరోనా ‘లొచ్చి కన్నీటి కడగండ్లు చుట్టుముట్టినా సాగుతున్నావు అదరక బెదరక అడుగేస్తూ కొనసాగిస్తున్నావు జీవనయానం మున్ముందుకు! ఆటుపోట్ల తాకిడికి వెరవనంటావు అవాంతరాలను లెక్కచేయనంటావు ఆశా జీవిని నేనంటావు! మిన్ను విరిగి మీదపడ్డా ఆత్మస్థైర్యం కోల్పోనంటావు ! అదే కదా మరి, నీ తిరుగులేని ఆయుధం! ఏది ఏమైనా, ఆగదుగా కాలగమనం! అదో నిరంతర ప్రవాహం! కదుల్తూ కదుల్తూ తెచ్చింది […]

మాలిక పత్రిక జనవరి 2022 సంచికకు స్వాగతం.. సుస్వాగతం

    పాఠక మిత్రులు, రచయితలకు 2022 నూతన సంవత్సర శుభాకాంక్షలు మనిషి ఎన్ని అవాంతరాలు, ఆపదలు, దుర్ఘటనలు, సమస్యలను ఎదుర్కున్నా కొత్త సంవత్సరం అనగానే ఒక కొత్త ఆశ కలుగుతుంది. జరిగిందేదో జరిగింది, ఇక రాబోయేవి మంచి రోజులు అన్న చిన్న ఆశ, నమ్మకంతో ముందుకు సాగుతాడు. ఇదే ఆశావహ దృక్పథం మనిషిని ముందుకు నడిపిస్తుంది.. ఈసారి నిజంగానే మంచిరోజులు రాబోతున్నాయి అని వార్తలు వస్తున్నాయి. కరోనా మహమ్మారి చివరి దశకు వచ్చింది. ఇంకో రెండు […]

ధృతి – 8

రచన: మణికుమారి గోవిందరాజుల “నాన్నా! దినేష్… కరణం గారింట్లో ఎంగేజ్మెంట్ రేపే కదా. వెళ్ళకపోతే ఆయనకు బాగా కోపం వస్తుంది. ఇక మేము బయలుదేరుతాము. అన్నట్లు శనాదివారాలే కదా? మీరంతా కూడా రావచ్చు కదా?” మర్నాడు సాయంత్రం కాఫీలయ్యాక పిచ్చాపాటీ మాట్లాడుకుంటుండగా చెప్పింది బామ్మ. “నాన్నా! నాన్నా… వెళ్దాం నాన్నా. ప్లీజ్ నాన్నా” ఆర్తీ కార్తీ తండ్రి వెంట పడ్డారు. “అమ్మా! ఒక పని చెయ్యి. నాకు రావడం కుదరదు కానీ పిల్లల్ని తీసుకెళ్ళు. రేపు రాత్రికి […]

మోదుగ పూలు – 6

రచన: సంధ్య యల్లాప్రగడ   వివేక్ మరుసటి రోజంతా స్కూల్లో చాలా బిజీగా ఉన్నాడు.  అతనికి ఆ సాయంత్రం ఆరింటికి సమయం చిక్కింది. ఆ టైంలో చంద్రన్న తాతాను అడిగాడు వివేక్‌ “ప్రసాదరావు సార్‌ చెప్పిన ఆ రిసెర్చుచేసేటాయన వచ్చాడా తాతా?” అంటూ. “లేదు సార్ ఏడు కొట్టంగ వస్తనన్నాడు!” బదులిచ్చాడు తాత. అతని కోసము వెయిట్‌ చేస్తూ బయట జండా పోల్ అరుగు దగ్గర కూర్చున్నాడు. అతనికి తన ప్రవర్తన ఆశ్చర్యంగా అనిపించింది.  “నేను చాలా […]

సాఫ్ట్‌వేర్ కథలు – 4.. పులుసులో కరివేపాకు

రచన: కంభంపాటి రవీంద్ర     ఆ రోజు ఆఫీస్ చాలా హడావిడిగా ఉంది.  యూరోప్ నుంచి ఎవరో క్లయింట్ వస్తున్నాడట.  ప్రాజెక్టు మేనేజర్ కి ఒకటే కంగారు,  టెన్షన్.  ఆ రోజు మీటింగులు ఎలా జరుగుతాయో,  వాటిని క్లయింట్ ఎలా రిసీవ్ చేసుకుంటాడో,  తమ టీం గురించి ఏం కామెంట్లు చేస్తాడో.. బుర్ర నిండా రకరకాల ప్రశ్నలు ! ఇవన్నీ ఓ పక్క.. ఇంకో వైపు..  తమ గురించి క్లయింట్ తమ మేనేజ్‌మెంట్‌కి ఎలాంటి ఫీడ్బాక్ […]

చంద్రోదయం – 23

రచన: మన్నెం శారద       సారథికి నిద్ర పట్టలేదు. అతనికి ప్రతీక్షణం శేఖర్‌తో తాను గడిపిన రోజులు గుర్తుకొచ్చి బాధని కలిగిస్తున్నాయి. సారథి వెన్నులోంచి జరజరా ఏదో ప్రాకినంతవరకు ఆ భయంకరమైన గతాన్ని తలచుకోవడం  యిష్టం లేనట్లు ప్రక్కకి తిరిగి కళ్లు మూసుకున్నాడు. అయినా మెదడు ప్రసారం చేసే ఆ గతకాలపు భయంకర దృశ్యాల్ని అతడు చూడక తప్పలేదు. ఆ సాయంత్రం.. శేఖర్, సారథి టి.బి. హాస్పిటల్ పక్కన సింహాచలం రోడ్డులో నడుస్తున్నారు. “అమ్మ, […]