April 27, 2024

నాకు నచ్చిన కధ చెన్నూరి సుదర్శన్ గారి “అడకత్తెరలో పోక చెక్క-“

అంబడిపూడి శ్యామసుందర రావు చెన్నూరి సుదర్శన్ గారు ఉపాధ్యాయుడిగా పదవి విరమణ చేసి సెకండ్ ఇన్నింగ్ లో రచయిత అవతారమెత్తి వ్రాసిన కధల సంపుటి నుండి తీసుకున్న కధ. ఇప్పటివరకు నేను వివిధ పత్రికలలో (ఆన్ లైన్) చాసో, రావి శాస్త్రి మునిమాణిక్యం , కొడవటిగంటి వంటి పాత రచయితల కథలకే సమీక్షలు వ్రాశాను అనుకోకుండా సుదర్శన్ గారి “ఝాన్సీ హెచ్ ఎమ్ “అనే కధల సంపుటి చదవటం తటస్తించింది అందులో అడకత్తెరలో పోక చెక్క కధానిక […]

మనోవేదికపై నర్తించిన అక్షరరవళి

రచన: సి.ఉమాదేవి ఆంగికం భువనం యశ్య వాచికం సర్వవాఙ్మయమ్ ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్త్వికం శివమ్ అభినయ దర్పణములో ప్రారంభ శ్లోకంతో కోసూరి ఉమాభారతి రచించిన వేదిక నవలపై సమీక్ష ప్రారంభించడానికి కారణం నవల నడిచిన కాదు నర్తించిన తీరు. భరతముని రచించిన నాట్య శాస్త్రమును నాట్యవేదమంటారు. వేదిక నవల నాట్యశాస్త్రాన్ని గుర్తు చేయడం కాకతాళీయమే కాని విభిన్న నృత్యాంశాలకు చక్కటి మార్గదర్శినిగా నిలిచిన నాట్యశాస్త్రం నృత్యాభిలాష ఉన్నవారికి కరదీపిక అని పునశ్చరణ చేసుకోవడం నవలలో […]

జి. యస్. హాస్యకథలు / వదినగారి కథలు

రచయిత్రి; జి. యస్. లక్ష్మి సమీక్ష/మాటామంతీ: మాలాకుమార్ నవరసాలల్లో హాస్యరసం ప్రాధానమైనది అని నా భావన. నవ్వు నాలుగు విధాల చేటు అన్నారు . కాని అన్ని సమయాలల్లో కాదు. అసలు నవ్వని వాడు ఒక రోగి, నవ్వటం ఒక భోగం అన్నారు జంధ్యాల. చక్కగా నవ్వుతూ ఉండేవాళ్ళను చూస్తే ఎవరికైనా మాట్లాడాలనిపిస్తుంది. అదే చిటచిటగా ఉంటే దూరంగా ఉందామనిపిస్తుంది. మనసు బాగాలేనప్పుడు, ఏదైనా చికాకు కలిగినప్పుడు మనసు మళ్ళించుకునేందుకు ఓ హాస్య నవలో, కథో చదవాలనిపిస్తుంది. […]

తుషార మాలిక లఘు సమీక్ష …!!

రచన: మంజు యనమదల కవితలకు, కథలకు సమీక్షలు రాయడం అంటేనే చాలా కష్టమైన పని. సిరి వడ్డేగారు రాసిన త్రిపదలకు అది కూడా 1300 ల త్రిపదలకు నేను సమీక్ష రాయడమంటే సాహసం చేయడమే. అక్షరాలకు అందమైన పదభావాలను జత చేసి ముచ్చటైన మూడు వాక్యాల్లో త్రిపద కవితలను సిరి వడ్డే మనకు “తుషార మాలిక” తొలి త్రిపద సంపుటిగా అందించారు. ముందుగా వారికి నా ప్రత్యేక అభినందనలు. ఒక్కో వాక్యానికి 20 అక్షరాలకు మించకుండా మూడు […]

కొత్త కథలు – సమీక్ష

సమీక్ష: – నండూరి సుందరీ నాగమణి కొత్త కథలు – ౩౩ మంది రచయిత్రుల మంచి కథలతో వంశీ కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారు వెలుగు లోనికి తీసుకువచ్చిన ఒక మంచి పుస్తకం. ఈ పుస్తకములో సీనియర్ రచయిత్రుల దగ్గరనుండి, వర్థమాన రచయిత్రులవరకూ అందరి కథలూ ఉన్నాయి. ప్రతీ కథ కూడా కథా, కథనమూ ఆసక్తిని కలిగించేలా ఉండటం హర్షదాయకం. విపంచితో విద్యుల్లతకు చిన్ననాటి స్పర్థా పూర్వక స్నేహం, పెద్దయ్యాక, ఆమెను చూసి, కృషితో నాస్తి […]

అంతర్వాణి – సమీక్ష

సమీక్ష: నండూరి సుందరీ నాగమణి ‘అంతర్వాణి’ – శ్రీ కొసరాజు కృష్ణప్రసాద్ గారి కవితాసంపుటి పేరుకు తగినట్టే స్వగతంగా వ్రాసుకున్న కవితలతో కొనసాగుతుంది. చక్కని పద ప్రవాహంతో, లయతో సాగిన ఈ కవితలు అన్నీ విభిన్న కవితావస్తువులతో అలరించాయి. ‘మాతా పిత: నమామి’ అంటూ అమ్మానాన్నల తలచుకొంటూ, వారికి ప్రణామములు అర్పిస్తూ మొదలైన కవితా వాహిని, ఆద్యంతమూ చదువరుల మనసును ఆకట్టుకునే విధంగా కొనసాగింది. ‘వ్రాసితిని వ్రాసితిని’ అనే కవితలో తన కవితకు స్ఫూర్తి దాయకులైన కవులను […]

కాఫీ విత్ కామేశ్వరి – సమీక్ష

రచన: నండూరి సుందరీ నాగమణి కం. కామేశ్వరితో కాఫీ ఆమే చెప్పెను కబుర్ల నలవోకనిదే గోముగ విహరించగనే తామిక రండి, ముదమున తనివిని పొందన్! ‘కాఫీ విత్ కామేశ్వరి’ – అండ్ కబుర్లు… అదేనండీ, కామేశ్వరితో కాఫీ మరియు తను కమ్మగా చెప్పే కబుర్లు అన్న మాట! రోజుకో చక్కని అంశం తీసుకుని, వేడి వేడి ఆనంద్ సినిమాలాంటి కాఫీని తా(లా)గిస్తూ తన కబుర్లతో ఎక్కడెక్కడికో తీసుకుపోయి మళ్ళీ తీసుకువచ్చేస్తుంది కామేశ్వరి… ఒకటా రెండా, డెబ్భై ఏడు […]

కొత్త కథలు – సమీక్ష

రచన: ఎమ్మెస్వీ గంగరాజు అలనాటి మేటి తారకలు, శాంతా రంగస్వామి, పూర్ణిమా రావు, అంజుమ్ చోప్రా, డయానా ఇడుల్జీ మొదలగు వారూ, ఈనాటి తారకలు మిథాలీ, దీప్తీ, మంధానా, హర్పీత్, జూలన్ మొదలగు వారూ కలసి అద్భుతంగా ఆడుతూ అలరిస్తున్న క్రికెట్ మాచ్ ని వీక్షిస్తూంటే కలిగే అనుభూతి లాంటిదే, నిన్నా. మొన్నటి మేటి రచయిత్రులూ, నేటి వర్ధమాన రచయిత్రుల కలాల నుండి జాలువారిన ఈ 33 “కొత్త కథలు” కదంబాన్ని అవధరించడంలో కలుగుతుంది అని చెప్పక […]

స్త్రీ ఎందుకు బానిసైంది? – ముళ్ళ కంచెల మూలాలు

రచన: జ్వలిత భార‌తదేశానికి స్వాతంత్య్రం రాక ముందు, స్త్రీవాదం గురించిన ఆలోచ‌న భార‌త‌దేశంలో మొల‌కెత్త‌క ముందే 1942లోనే “స్త్రీ ఎందుకు బానిసైంది”. అనే ప్ర‌శ్న‌ను లేవ‌నెత్తి చ‌ర్చించి వివ‌ర‌ణనిచ్చారు “ఆత్మ గౌర‌వ ఉద్య‌మకారుడు” యాక్టివిస్ట్ ఈరోడ్ వెంక‌ట‌ప్ప రామ‌స్వామి పెరియార్‌. వారు ఆంగ్లంలో రాసిన “Why were women Enslaved” ర‌చ‌న‌కు తెలుగు సేత ఎ.జి. య‌తిరాజులు చేయ‌గా ప్ర‌జాశ‌క్తి బుక్ హౌస్ వారు 2010లో ప్ర‌చురించారు. క‌వ‌రు పేజీతో క‌లిపి 52పేజీల పుస్త‌కం. ఇందులో మొత్తం […]

“ఆదివాసి రాసిన ఆదివాసీ శ‌త‌కం”

స‌మీక్ష‌ : జ్వలిత శ‌త‌కం అంటే మ‌న‌కు భ‌క్తి శ‌త‌కాలు, నీతి శ‌త‌కాలు, కొండొక‌చో శృంగార శ‌త‌కాలు గుర్తుకు వ‌స్తాయి. కానీ, అస్తిత్వ శ‌త‌కాలు అసలు లేవు అన‌వ‌చ్చు. కోసు ప్ర‌సాద‌రావు తూర్పు గోదావ‌రి జిల్లా, రంప‌చోడ‌వ‌రం మండ‌లం, బంద‌ప‌ల్లి ఆశ్ర‌మ పాఠ‌శాల ఉపాధ్యాయులు. “ఆదివాసీల‌” మీద శ‌త‌కం రాసిన వాళ్ళ‌లో మొద‌టివారై ఉంటారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన వీరు మొత్తం నాలుగు శ‌త‌కాలు ర‌చించారు. అవి (1) మాతృశ్రీ గండి పోశ‌మ్మ శ‌త‌కం, (2) శ్రీ షిర్డి […]