May 2, 2024

జీవితం ఇలా కూడా వుంటుందా? 11

రచన: అంగులూరి అంజనీదేవి ”మేమూ అదే అనుకున్నాం. కానీ మాటల మధ్యలో అన్నయ్యను అనరాని మాటలు అన్నాడట. ఆనంద్‌ పైకి పద్ధతిగా అన్పిస్తాడు కాని కోపం వస్తే మనిషికాడు మోక్షా! అందుకే అన్నయ్య వదిన నగలు అమ్మి ఇచ్చేశాడు. ఎప్పటికైనా ఇవ్వాల్సినవే… ఇవ్వకుండా ఆపి ఇంటిఅల్లుడిని ఇబ్బంది పెట్టడం మాకు కూడా మంచిది కాదు. మా ఇబ్బందులు ఎప్పటికీ వుండేవి. ఇప్పటికే చాలా రోజులు ఆగాడు ఆనంద్‌. ఈ విషయంలో అతను చాలా ఓపిక మంతుడే అనుకోవాలి. […]

మాయానగరం – 36

రచన: భువనచంద్ర బోంబే లో ట్రైనింగ్ అయ్యాక అక్కడే ‘జూహూ’ లో పోస్టింగ్ ఇచ్చారు ఆనందరావుకి… ఇది కాస్త ఊహించని విషయమే. జనరల్ గా ఎవరి స్వరాష్ట్రానికి వారిని పోస్ట్ చేస్తారు…. ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడానికి. ఆనందరావు విషయంలో చిన్న తేడా జరిగింది. తొలి పోస్టింగ్ గనక చెయ్యక తప్పదు. ఛాయిస్ అడగటానికిప్పుడు వీలుండదు. బొంబే లో అన్నీ దొరుకుతాయి …. ‘ఇళ్ళు ‘ తప్ప. వెయ్యి అడుగుల అపార్ట్మెంట్ సంపాదించుకొన్న బాలీవుడ్ నటవర్గమే ఆనందంతో పొంగిపోతారు. […]

జీవితం ఇలా కూడా ఉంటుందా??? 10

రచన: అంగులూరి అంజనీదేవి ”అవి వాడి లోపల వున్న బేబీకి లంగ్స్‌ పెరిగేలా చేస్తారట. లంగ్స్‌ పెరిగితే బ్లెడ్‌ సర్కులేషన్‌ ప్రాపర్‌గా వుండి బాడీ పెరిగే అవకాశాలు వున్నాయంట…” ”అలా ఎన్ని వాడాలి?” ”ముందు ఒకటి వాడి రెండు వారాల తర్వాత స్కాన్‌ తీసి అవసరమైతే మళ్లీ ఇంకో ఇంజక్షన్‌ ఇస్తారట” ”మరి వాడారా?” ”అది నాకు ఇంకా చెప్పలేదు. హాస్పిటల్‌ నుండి రాగానే అమ్మ గొడవ పెట్టుకుందట. ఆ హడావుడిలో అంతవరకే చెప్పాడు నాన్న. స్టెరాయిడ్‌ […]

శుభోదయం

రచన: డి.కామేశ్వరి ఆమె మాటలకి మాధవ్ కూడా కాస్త విచలితుడయ్యాడు. అంతలోనే పౌరుషంగా “నాకెవరి సహాయం అక్కరలేదు” బింకంగా అన్నాడు. “నీకక్కరలేదు. కాని రేఖకి కావాలి” లోపల్నించి రాధాదేవి గొంతు గుర్తుపట్టిన రేఖ ఒక్క ఉదుటున పక్కమీద నుంచి లేచి వచ్చి రాధాదేవిని కౌగలించుకుని “ఆంటీ” అని బావురుమంది. ఈ హడావిడికి శారద కూడా లోపల్నించి వచ్చి “అక్కయ్యా, ఎంత పని జరిగిందో చూశావా? నీలాగే అయింది దాని బతుకూ, నిన్ను పెట్టిన ఉసురు మాకు కొట్టింది […]

మాయానగరం – 35

రచన: భువనచంద్ర “వాన్ని గమనించాను వెంకటస్వామి… నిస్సందేహంగా వాడు పరమశివమే! అయితే వాడు ఇటువైపు రాలేదు. వెనక వైపు నుండి వచ్చి మా పెరట్లోకి దూకాడు. యాక్ట్యువల్ గా ఇవాళ నాకు ఆఫ్. అయినా ఓ చిన్నవిషయం వల్ల ఆఫీస్ కు వస్తూ వాడ్ని చూశాను. వాడి కథంతా మహదేవన్ గారు నాకు చెప్పారు. వాడెంత క్రూరుడో కూడా చెప్పారు. నువ్వే ఎందుకో నాతో చెప్పడానికి సందేహించావు. వాడేదో క్రూరత్వమైన ఆలోచనలతోటే ఇక్కడికొచ్చాడు. బహుశా వాడొచ్చాడని మీకు […]

బ్రహ్మలిఖితం 6

రచన: మన్నెం శారద భగవంతుడు దుష్టులకెన్నడూ సహాయపడడని.. తాత్కాలికంగా కనిపించే విజయాలన్నీ తర్వాత శాపాలై వంశపారంపర్యంగా తింటాయని అతను గ్రహించే స్థితిలో లేడిప్పుడు. అదతని దురదృష్టం. ***** లిఖిత ఎంతో అవస్థపడి హైద్రాబాదు చేరుకుంది. తల్లి ఇచ్చిన ఎడ్రస్ ప్రకారం ఆమె ఎలాగోలా జుబ్లీహిల్స్‌లోని కేయూర లాబరేటరీస్‌కి చేరుకుంది. అంతవరకు ఆమె పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదని ఆమెకి గుర్తు కూడా లేదు. ఆమెకు ఆకలి, దాహం అన్నీ తండ్రిని చూడాలన్న ఆరాటంలోనే కలిసిపోయాయి. దూరం నుండే […]

శుభోదయం

రచన: డి.కామేశ్వరి “ఆత్మహత్యా.. ఆత్మహత్యకి తలపడిందా? ఏమయింది, ఎలా వుంది?… అసలేం జరిగింది?” అప్రతిభురాలై అడిగింది. “అమ్మా.. రేఖ టిక్ ట్వంటీ తాగిందట. ఎంతోసేపటికిగాని ఎవరూ చూడలేడుట. చూసి తీస్కొచ్చి ఆస్పత్రిలో జాయిన్ చేశారట. డాక్టర్లు చాలా ప్రయత్నించాక ఆఖరికి ప్రమాదం గడిచిందంటున్నారు.” “ఏం జరిగింది? ఎందుకింతపని చేసింది?” తెల్లపోతూ అంది. శ్యాం తల దించుకున్నాడు. “అమ్మా.. రేఖ.. ప్రెగ్నంట్ అయిందని, అందుకని… సిగ్గుతో, భయంతో ఆ పని చేసిందని అనుకుంటున్నారు. రేఖ ఫ్రెండు .. వాళ్ల […]

ఈ జీవితం ఇలా కూడా వుంటుందా? 9

రచన: అంగులూరి అంజనీదేవి అంకిరెడ్డి ఆఫీసు నుండి ఇంటికి రాగానే సతీష్‌చంద్ర ఫోన్‌ చేసినట్లు మాధవీలతతో చెప్పాడు. ఆమె మాట్లాడకుండా మౌనంగా విని ”సరే! మీకు కాఫీ తెచ్చిస్తాను” అంటూ అక్కడ నుండి కావాలనే లేచి వెళ్లింది. భార్య కాఫీ తెచ్చేంత వరకు ఖాళీగా కూర్చోకుండా లాప్‌టాప్‌ ఓపెన్‌ చేసి కొత్తగా వచ్చిన వెబ్‌సైట్లు చూసుకుంటూ కూర్చున్నాడు. ”ఊ… ఇదిగోండి కాఫీ” అంటూ ఆయనకు నాలుగు అడుగుల దూరంలో వున్నప్పుడే అంది. ”దగ్గరకి రా! అక్కడ నుండే […]