April 26, 2024

బ్రహ్మలిఖితం .. 11

రచన: మన్నెం శారద అతను తలదించుకుని టాయిలెట్స్ దగ్గర నిలబడ్డాడు. కోయదొర లిఖిత వైపు చూసి చిరునవ్వుతో “మేం కూడా కూటి కోసం అబద్ధాలడతాం. కాని మా సమ్మక్క జాతరలు నిష్టగా చేస్తం. పూజలో వుంటే పెళ్ళాన్ని కూడా తల్లిలానే చూస్తం. ఇపుడు చెప్పు. పుస్తకల్లో చ్ అదివి నాగరికత తెలుసుకునే మీ బస్తీ జనాలు పరగడుపునే పాపాలు చేస్తారా లెదా? ఇంతోటీ గోరాలు మా అదవిలో చిత్తకార్తి ఊరకుక్కలు కూదా సెయ్యవు!” అన్నాడూ. లిఖిత అతనికి […]

Gausips – ఎగిసే కెరటాలు-14

రచన: -శ్రీసత్య గౌతమి కానీ పాపం సింథియాకు తెలియలేదు, ఆమె మాట్లాడే ప్రతి మాట సోఫియా, శామ్యూల్ లు రికార్డ్ చేస్తున్నారని. సోఫియా అడిగింది “మరి అంతా అఫీషియల్ గానే జరుగుతున్నది కదా. లహరి ని ఆ డిఫెన్స్ ప్రోజెక్ట్స్ నుండి తొలగించవచ్చుగా? అనధికారికంగా నిన్ను అప్పాయింట్ చేసి ఆమె మీద, ఆమె వర్క్ మీద నీ నిఘా ఎందుకు?” దానికి ఏం చెప్పాలో అర్ధం కాలేదు సింథియా కు. వెంటనే … “ఏమో … నా […]

మనుగడ కోసం.

రచన: ఓలేటి శశికళ శ్రావణ శుక్రవారం. వరలక్ష్మీ వ్రతం రోజు. సాయంత్రం పేరంటంపెట్టుకుని, అరవైమందిని పిలుచుకున్నాను. చాలా సందడిగా జరిగింది పేరంటం. పిలిచినవారంతా చక్కటి ముస్తాబుతో, అందమయిన పట్టుచీరలు కట్టుకుని, కొత్త, పాత నగలు అలంకరించుకుని, అపర లక్ష్మీదేవుల్లా ఒచ్చి పసుపు, కుంకుమ, తాంబూలాదులు తీసుకుని వెళ్ళి పోయారు. ”అమ్మయ్యా! ఒకరిద్దరు తప్ప అందరూ ఒచ్చేసినట్టే”. ఇంక వీధి తలుపు వేద్దామని వెళ్తూ, నా అమ్మవారిని ఒకసారి తేరిపార చూసుకున్నా. పాలరాతి మందిరంలో, స్థాపించిన అష్టలక్ష్మీ కలశంలో, […]

కథ చెప్పిన కథ

రచన: విజయలక్ష్మీ పండిట్. ఆ రోజు రాత్రి భోజనాలయినాక భారతి వాళ్ళ అమ్మతో అంది, ” అమ్మా రేపు మా టీచర్‌ పెద్ద కథ చెపుతానన్నది. . ., కథ అంటే ఏమిటమ్మా. . ! “అని అడిగింది. “కథ అంటే. . . మన, జంతువుల జీవితాలలో రోజు జరిగే సన్నివేశాలే కథలు నాన్నా “అని అన్నది భారతి వాళ్ళ అమ్మ. కాని ఆ సమాధానంతో సంతృప్తి కలుగలేదు భారతికి. కథను గురించి మరలా మరలా […]

కృషితో నాస్తి దుర్భిక్షం’’

రచన: కె.ఇ.ఝాన్సీరాణి 36వ ఇంటర్వ్యూ పూర్తి చేసిన మురారి బయటకు వచ్చాడు. ఈ ఉద్యోగం వచ్చే అవకాశం లేదని అక్కడ వారి మాట వల్ల తెలిసింది. ఏమితోచని పరిస్థితి. డిగ్రీ చేసి, కంప్యూటర్‌ కోర్సు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ కోచింగ్‌ అలా ఎన్నో అర్హతలు, సర్టిఫికెట్లు ఉన్నా ఉద్యోగం మాత్రం సున్నా. ఈ మధ్యనే ఒక అయిదుగురు ఎనిమిది ఇంటర్వ్యూ నుంచి ప్రతి ఇంటర్వ్యూలో కలుస్తున్నారు. వాళ్ళకు కూడా ఉద్యోగం రాలేదన్నమాట. కాని వాళ్ళు నిరుద్యోగంలో తనకు జూనియర్లు […]

ఫ్యామిలీ ఫోటో

రచన – డా. లక్ష్మి రాఘవ “వాసూ” రామచంద్ర గొంతు విని రూం నుండి బయటకు వచ్చాడు వాసుదేవరావు. హాల్లోకి వచ్చిన రామచంద్రను చూస్తూ” రా …రా… రామూ” అని ఆహ్వానిస్తూ ముందుకు వచ్చి సోఫాలో కూర్చోమంటూ సైగ చేసి తానూ రామచంద్ర పక్కనే కూర్చున్నాడు. “ఏమైంది నీకు? ఫోను స్విచ్చ్ ఆఫ్ చేస్తే అందరికీ కంగారు కాదా అదీ రెండు రోజులు?” “నీవు ఫోను చేసావా?” “నేను చేస్తే రెండుసార్లు చూసి ఏకంగా ఇంటికే వచ్చి […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 19

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య ఒకరోజు అల్లరికృష్ణయ్య ఎక్కడా కనుపించడంలేదు. మళ్ళీ ఏమి తగాదాలు, గొడవలు తీసుకోస్తాడోనని హడలిపోతూ యశోదమ్మ బాలకృష్ణునికై వెదకింది. కృష్ణయ్య అలా మోచేతిపై తలవాల్చి పడుకుని వుండగా రహస్యంగా తల్లి తొంగి చూచింది. నిద్రలో ఉన్నాడు నల్లనయ్య. నోరు కొంచెం తెరుచుకుని ఉంది. ఆనోట్లో సర్వలోకాలు..సూర్య చంద్రులూ, గ్రహసంతతీ కనిపించాయి. యశోదమ్మ హడలిపోయింది. అప్రయత్నంగా చేతులు జోడించి నిలబడింది. అంతలో క్రిష్ణయ్య లేవనే లేచాడు. “అమ్మా!” అన్నాడు. అన్నమయ్య ఇలాంటి జనశృతులను అధారం చేసుకొని […]

అంతర్వాణి – సమీక్ష

సమీక్ష: నండూరి సుందరీ నాగమణి ‘అంతర్వాణి’ – శ్రీ కొసరాజు కృష్ణప్రసాద్ గారి కవితాసంపుటి పేరుకు తగినట్టే స్వగతంగా వ్రాసుకున్న కవితలతో కొనసాగుతుంది. చక్కని పద ప్రవాహంతో, లయతో సాగిన ఈ కవితలు అన్నీ విభిన్న కవితావస్తువులతో అలరించాయి. ‘మాతా పిత: నమామి’ అంటూ అమ్మానాన్నల తలచుకొంటూ, వారికి ప్రణామములు అర్పిస్తూ మొదలైన కవితా వాహిని, ఆద్యంతమూ చదువరుల మనసును ఆకట్టుకునే విధంగా కొనసాగింది. ‘వ్రాసితిని వ్రాసితిని’ అనే కవితలో తన కవితకు స్ఫూర్తి దాయకులైన కవులను […]

కాఫీ విత్ కామేశ్వరి – సమీక్ష

రచన: నండూరి సుందరీ నాగమణి కం. కామేశ్వరితో కాఫీ ఆమే చెప్పెను కబుర్ల నలవోకనిదే గోముగ విహరించగనే తామిక రండి, ముదమున తనివిని పొందన్! ‘కాఫీ విత్ కామేశ్వరి’ – అండ్ కబుర్లు… అదేనండీ, కామేశ్వరితో కాఫీ మరియు తను కమ్మగా చెప్పే కబుర్లు అన్న మాట! రోజుకో చక్కని అంశం తీసుకుని, వేడి వేడి ఆనంద్ సినిమాలాంటి కాఫీని తా(లా)గిస్తూ తన కబుర్లతో ఎక్కడెక్కడికో తీసుకుపోయి మళ్ళీ తీసుకువచ్చేస్తుంది కామేశ్వరి… ఒకటా రెండా, డెబ్భై ఏడు […]

కొత్త కథలు – సమీక్ష

రచన: ఎమ్మెస్వీ గంగరాజు అలనాటి మేటి తారకలు, శాంతా రంగస్వామి, పూర్ణిమా రావు, అంజుమ్ చోప్రా, డయానా ఇడుల్జీ మొదలగు వారూ, ఈనాటి తారకలు మిథాలీ, దీప్తీ, మంధానా, హర్పీత్, జూలన్ మొదలగు వారూ కలసి అద్భుతంగా ఆడుతూ అలరిస్తున్న క్రికెట్ మాచ్ ని వీక్షిస్తూంటే కలిగే అనుభూతి లాంటిదే, నిన్నా. మొన్నటి మేటి రచయిత్రులూ, నేటి వర్ధమాన రచయిత్రుల కలాల నుండి జాలువారిన ఈ 33 “కొత్త కథలు” కదంబాన్ని అవధరించడంలో కలుగుతుంది అని చెప్పక […]