April 27, 2024

మహాకవి శ్రీశ్రీ ని గురించి కొందరు ప్రముఖులు

రచన: శారదాప్రసాద్   ఒక్కడే మహాకవి, అతని పేరు శ్రీశ్రీ –శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారు “ఆనందం ఆర్ణవమైతే అనురాగం అంబరమైతే అనురాగపుటంచులు చూస్తాం ఆనందపు లోతులు తీస్తాం. ” గిరి-అహో, ఏమిగీతం. ఎంత సొగసుగా వుంది. కవిత్వాన్ని వడబోసినట్లుందే. ఎవరయ్యా ఈ పాట రాసింది? హరి-ఈ పాట వ్రాసినతని పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. గిరి-కొత్త కవుల్లో ఇంతటి మహాకవులుంటారా? హరి-అట్టే మాట్లాడితే ఈ క్రొత్తకవుల్లో ఒక్కడే మహాకవి. అతని పేరు శ్రీశ్రీ. గిరి-అయితే శ్రీశ్రీ వంటి నవ్యకవిలో […]

నడక-నడత

రచన: శారదాప్రసాద్ ఈ రోజుల్లో ప్రతివారూ నడకను గురించి మాట్లాడేవాళ్లే! సాధారణ నడక చాలని నా అభిప్రాయం. బజార్ కెళ్ళి మన పనులు మనం చేసుకుంటే చాలు. అతిగా నడవటం వలన అనర్ధకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. గుండెను వేగంగా పరిగెత్తిస్తుంటారు. ఈ నడక పిచ్చివాళ్లల్లో విపరీతమైన పోటీ కూడా ఉంటుంది . నేను 10 రౌండ్లు వేశానని ఒకాయన అంటే మరొకాయన నేను 12 వేసాను అంటాడు! ఇంతకీ ఆ రౌండ్స్ ఏమిటో? నడక పూర్తి […]

ఆంధ్రపితామహుడు–శ్రీ మాడపాటి హనుమంతరావు గారు

రచన: శారదాప్రసాద్ మాడపాటి హనుమంతరావుగారు మొత్తం పదమూడు కథలు రాశారు. వీటిలో హృదయశల్యం, రాణీసారందా, ముసలిదాని ఉసురు, నేనే, అగ్ని గుండం, నాడు నీ పంతం, నేడు నా పంతం, ఆత్మార్పణం, తప్పు, ఎవరికి, విధిప్రేరణం అనే కధలు ‘మల్లికాగుచ్చం’ పేరుతో 1911 లో పుస్తక రూపంలో వచ్చాయి. మాడపాటికి రచయితగా శాశ్వత కీర్తిని అందించిన గ్రంధం ‘తెలంగాణా ఆంధ్రోద్యమం’. మాడపాటి హనుమంతరావుగారు బహుభాషావేత్త, సాంఘిక సంస్కర్త. వీరు 11 -11 -1970 న తెలుగు వారిని […]

సౌందర్యలహరిలోని ఓ పది శ్లోకాలు!

రచన: శారదా ప్రసాద్ కొంతమంది మిత్రులు, హితులు ‘సౌందర్యలహరి’ నుండి ఒక పది రోజులు పది శ్లోకాలకు, వాటి అర్ధాలు, వివరణలను క్లుప్తంగా చెప్పమని కోరారు. మనం చేయవలసిన పనులు ఇలానే మన వద్దకు వస్తాయి. నా వద్దకు వచ్చిన ఆ ప్రతిపాదనను అమ్మవారి ఆజ్ఞగా, ఆశీస్సుగా తీసుకొని వ్రాయటానికి ఉపక్రమించటానికి ముందుగా, అమ్మను కీర్తించే శక్తిని అమ్మనే ప్రసాదించమని ప్రార్ధించి శ్రీకారం చుట్టాను. నాకు తెలియకుండానే అలా ఒక పది శ్లోకాలకు అర్ధాలను, నాకు తోచిన […]

ఐఐటి(లెక్కల) రామయ్యగారు

రచన: శారదాప్రసాద్ ఖద్దరు పంచె, చొక్కా, భుజాన ఒకఖద్దరు సంచి వేసుకొని అతి సాధారణంగా కనిపించే ఈయనను చూసిన వారెవరూ ఆయనను అఖండ మేధావిగా గుర్తించలేరు. చికాకు లేని చిరునవ్వు ఆయన సొంతం. ఈ అసమాన్య మేధావే లెక్కల(చుక్కా) రామయ్య గారు. శ్రీ చుక్కా రామయ్య గారు 20 -11 -1928 న, వరంగల్ జిల్లాలోని గూడూరు గ్రామంలో ఒక బీద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తల్లితండ్రులు-నరసమ్మ , అనంతరామయ్య గార్లు. వీరి ప్రధాన వృత్తి పౌరోహిత్యం. […]

కథలరాజు- పద్మరాజు

రచన: శారదా ప్రసాద్ ప్రపంచ కథానికల పోటీలో ఒక తెలుగు కథానికకు ద్వితీయ బహుమతిని తెచ్చిపెట్టి ప్రపంచ సాహిత్యంలో తెలుగు కథానికకు వన్నె తెచ్చిన ఈ ప్రతిభామూర్తి, 24-06 -1915 న, పశ్చిమ గోదావరి జిల్లాలోని, అత్తిలి మండలానికి చెందిన తిరుపతిపురం అనే గ్రామంలో జన్మించారు. చదువుకునే రోజుల్లోనే, వీరిపైన యమ్. యన్. రాయ్ గారి ప్రభావం ఎక్కువగా ఉండేది. అందువల్ల హేతువాదిగా మారాడు. సైన్సులో మాస్టర్స్ డిగ్రీ చేసిన వీరు 1939 నుండి 1952 వరకు, […]

ఏనుగు లక్ష్మణ కవి

రచన: శారదా ప్రసాద్ ఏనుగు లక్ష్మణ కవిగారు క్రీ. శ. 18 వ శతాబ్దికి (1797) చెందిన వారు. ఈయన తల్లిగారి పేరు పేరమాంబ, తండ్రిగారి పేరు తిమ్మకవి. జన్మ స్థలము పెద్దాపురము (ప్రస్తుత తూర్పుగోదావరిజిల్లాలోని సామర్లకోటకు దగ్గరులో ఉన్నది). శ్రీ లక్ష్మణ కవిగారి ముత్తాతగారు “శ్రీ పైడిపాటి జలపాలామాత్యుడు”. ఈయన పెద్దాపుర సంస్థానీసాధీశ్వరుల యొద్ద ఏనుగును బహుమానముగా పొందుట చేత కాలక్రమేణ వీరి ఇంటిపేరు “పైడిపాటి” నుండి “ఏనుగు” వారిగా స్దిర పడినది. ఆ జలపాల […]

ఇస్లాం మతం

రచన: శారదా ప్రసాద్ భారతదేశంలో హిందూమతం తరువాత ఇస్లాం రెండవ స్థానంలో ఉంది . 2007 గణాంకాల ప్రకారం, 13.4% ముస్లింలు ఉన్నారు.ప్రస్తుతం భారత్ లో ముస్లింలు ఇండోనేషియా మరియు పాకిస్తాన్ ల తరువాత మూడవ స్థానంలో ఉన్నారు. ఇస్లాం తొలుత అరబ్బు వర్తకుల ద్వారా శాంతియుతముగా భారతదేశంలో ప్రవేశించింది.ఇస్లాం అనేది మానవజాతి కోసం అల్లాహ్ నిర్ణయించిన ధర్మం. దేవుడు ఒక్కడే అనే ప్రాతిపదిక పైన ముహమ్మద్ ప్రవక్త (ఆఖరి ప్రవక్త) స్థాపించిన మతం కాదు ఇది […]