May 1, 2024

సుందరము సుమధురము – 4

రచన: నండూరి సుందరీ నాగమణి ఈ శీర్షికలో ఇటీవలే ఎంతో వైభవంగా మనం జరుపుకున్న శ్రీరామనవమి సందర్భంగా, ఈ నెల భూకైలాస్ చిత్రంలోని ఒక మంచి పాటను గురించి ముచ్చటించుకుందాం. నందమూరి తారకరామారావు గారు రావణ బ్రహ్మగా నటించిన ఈ చిత్రానికి శ్రీ కె. శంకర్ గారు దర్శకత్వం వహించగా, ఎవియం పతాకం పై, శ్రీ ఎలా మొయ్యప్పన్ గారు నిర్మించారు. చిత్రకథ, సంభాషణలు, గీతాలు సముద్రాల సీనియర్ రచించగా సంగీతాన్ని ఆర్. సుదర్శనం, ఆర్. గోవర్ధనం […]

సుందరము – సుమధురము – 2 – అందెల రవమిది

రచన: నండూరి సుందరీ నాగమణి చిత్రం:స్వర్ణకమలం   సుందరము – సుమధురము నండూరి సుందరీ నాగమణి   సుందరము సుమధురము ఈ గీతం: ‘స్వర్ణ కమలం’ చిత్రంలోని ‘అందెల రవమిది’ గీతాన్ని గురించి ఈ నెల వివరించాలని అనుకుంటున్నాను. భాను ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై, 1988లో విడుదల అయిన ఈ చిత్రానికి, కళాతపస్వి  శ్రీ కె. విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించారు. శ్రీ కె. యస్. రామారావుగారి సమర్పణలో శ్రీ సి.హెచ్. అప్పారావుగారు ఈ చిత్రాన్ని నిర్మించారు. […]

సుందరము – సుమధురము – 1

రచన: నండూరి సుందరీ నాగమణి సుందరము సుమధురము ఈ గీతం: ‘భక్త కన్నప్ప’ చిత్రంలోని కిరాతార్జునీయం గీతాన్ని గురించి ఈ నెల వివరించాలని అనుకుంటున్నాను. 1976లో విడుదల అయిన ఈ చిత్రానికి శ్రీ బాపు గారు దర్శకత్వం వహించారు. కృష్ణంరాజు గారు గీతాకృష్ణా మూవీస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో కన్నప్పగా తానే నటించారు. అతని భార్య నీలగా వాణిశ్రీ నటించారు. ఈ పాట, పాశుపతాస్త్రం కోరి, అడవిలో తపస్సు చేస్తున్న అర్జునునికి, అతడిని పరీక్షించటానికి కిరాతరూపం […]

బాల మాలిక – కందికాయలాంటి కమ్మని కథ

రచన: నండూరి సుందరీ నాగమణి అనగనగా… మరేమో… ఒకానొక దేశంలో… ఉల్లిపాయంత ఊరుండేదట. ఆ ఉల్లిపాయంత ఊరిలో బుడమకాయంత బుల్లోడు ఉండేవాడట… ఆ బుడమకాయంత బుల్లోడికి తామరకాయంత తండ్రి ఉన్నాడట. ఆ తామరకాయంత తండ్రి కాకరకాయంత కార్యాలయంలో పని చేస్తూ ఉండేవాడట. బుడమకాయంత బుల్లోడు బంగాళాదుంపంత బళ్ళో చదువుకుంటున్నాడట. ఆ బడిలో వీడికి చదువు చెప్పే పనసకాయంత పంతులమ్మ చెర్రీ పండంత చదువు చెప్పేదట. పుచ్చకాయంత ఫ్రెండ్స్ తో అనాసపండంత ఆటలా చదువు నేర్చుకుంటున్నాడు మన బుడమకాయంత […]

అక్షరపరిమళమందించిన పూలమనసులు

రచన: సి. ఉమాదేవి నండూరి సుందరీ నాగమణి బ్యాంక్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తూనే అక్షరఆర్తి నింపిన స్ఫూరినందుకుని విభిన్న అంశాలతో నవలలు, కథలు మనకందించడం ముదావహం. శాస్త్రీయసంగీతంలో ప్రవేశం వీరికున్న సంగీతాభిలాషను మనకు విశదపరుస్తుంది. గడినుడి ప్రహేళికలు వీరందించిన ఆటవిడుపులే. పూలమనసులు కథాసంపుటి వైవిధ్యభరితమైన కథాంశాలతో సమస్యలను స్పృశిస్తూనే పరిష్కారాన్ని సూచించడం రచయిత్రి మనసులోనున్న సామాజిక అవగాహనను ప్రస్ఫుటం చేస్తుంది. పిల్లలు విదేశాలకు వెళ్లినప్పుడు తల్లిదండ్రులను రమ్మని వారికి ఆ దేశంలోని ప్రదేశాలను చూపించాలని ఆశిస్తారు. […]

‘ఉషోదయం’

రచన: నండూరి సుందరీ నాగమణి   “స్వాతంత్ర్యమె మా జన్మహక్కనీ చాటండీ!”రేడియో లో వినిపిస్తున్న ఘంటసాల వారి దేశభక్తి గేయాన్ని వింటూ మేను పులకించిపోతుండగా రెండు చేతులూ జోడించి కళ్ళుమూసుకుని ఒక ధ్యానంలో ఉండిపోయాడు గిరిధారి. “అంకుల్, అంకుల్!”తలుపు కొట్టటంతో ధ్యాన భంగమై లేచి తలుపు తీసాడు. ఎదురుగా ఎదురింటి వారి మనవరాలు కుముద.ఆ పిల్ల వెనకాలే మరో పిల్లవాడు… “మేమంతా ఆడుకుంటూ ఉంటే బంతి కిటికీలోంచిమీ ఇంట్లో పడింది…” అంది సోఫా క్రింద చూపిస్తూ. తీసుకోమన్నట్టు […]

నవరసాలు..నవకథలు.. అద్భుతం 9

రచనః శ్రీమతి నండూరి సుందరీ నాగమణి. నదీ సుందరి నర్మద ఆకాశంలో ఇంద్రధనువును చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో నర్మదను చూసినా అంతే నాకు. పూలలోని మకరందాన్ని, ఆకాశంలోని అనంతాన్ని, కడలిలోని గాంభీర్యాన్ని, హిమవన్నగాల ఔన్నత్యాన్ని, సంగీతంలోని మాధుర్యాన్ని, సూరీడి వెచ్చదనాన్ని, జాబిల్లి చల్లదనాన్ని, మల్లెపూవుల సౌరభాన్ని కలిపి రంగరించి నర్మదను తయారుచేసాడేమో ఆ బ్రహ్మ! అదీ నా కోసం. ఆమె ఎప్పుడూ అద్భుతమే మరి నాకు! *** నేను వేదిక మీద పాడినపుడు పరిచయమైంది నర్మద. […]