April 26, 2024

మహా సాధ్వి – గార్గి

రచన : ఎ.జె. సావిత్రీ మౌళి

 

అంతశ్శత్రువులను అణచి, ఆదర్శాలకు విలువనిచ్చి, ధార్మిక జీవనాన్ని గడిపిన మహానుభావులు ఎందరో వున్నారుఅందుకు ఆడ, మగ తేడా లేదుప్రతిభ దైవ దత్తంప్రతిభకి స్త్రీ , పురుష బేధం లేదుప్రతిభావంతులు అన్ని దేశాలలో, అన్ని రంగాలలో, అన్ని కాలాల్లో వున్నారువేదాంత విద్యలో కూడా ప్రవీణులయిన బ్రహ్మవాదినులు వున్నారు. భారతీయులకు పరమ పవిత్రమైనది వేదంఅందులో మంత్రద్రష్టలయిన మహిళలున్నారు. వారిని ఋషీకలు అంటారుప్రాచీనకాలంనాటి రోమశ, ఛోష, విశ్వవర, ఇంద్రణి, శచి మొదలయిన శ్లోక రచయిత్రులు, ప్రతిభావంతులు..వారితో సాటిరాదగ్గ సాధ్వి గార్గి.

 

 వచక్ను మహర్షి గారాలపట్టి గార్గితండ్రికి తన పుత్రిక వాగ్మిగా, విదుషీమణిగా, వివేకవతిగా, విశిష్ట వ్యక్తిగా రాణించాలని ఆకాంక్షఅలాగే తన భావాలకు, అభిరుచులకు తగిన విధంగా ఆమెని పెంచాడుతండ్రి ప్రోత్సాహం, ఆశ్రమ వాతావరణ ప్రభావం  గార్గిలో ఆత్మ స్ధైర్యాన్ని పెంచిందిఆశ్రమంలో వున్నవారివలన ఆధ్యాత్మిక విద్యయందు ఆసక్తి, మునుల దీవెనలవలన మోక్ష జిజ్ఞాస ఆమెకు కలిగించాయిబ్రహ్మచారిణులతో సహవాసం పరమనిష్టకు సోపానమయింది. ఆమె సౌజన్యం, దీక్షకి తపోధనులు సంతసించారుగార్గి వాదబలానికి తోటివారు నిరుత్తరులవగా, ఆమె వైదుష్యానికి సహపాఠకులు తలలు దించారుక్రమంగా ఆమె కీర్తి ఆశ్రమం దాటి, ముని పల్లెల్లో ధ్వనించి, నగర పొలిమేరల్లో తచ్చాడి, కోట గోడల్లో విహరించి, కొలువుకూటం వరకూ ప్రాకిందిరాజస్ధానాల్లో మన్ననలు అందుకుందిగార్గి ప్రతిభ రాణించే రోజు వచ్చింది.

 

ఒకసారి మిధిలా నగరంలో జనక చక్రవర్తి సభ జరుగుతోందిధర్మజ్ఞులు, వేదాంతులు, నీతికోవిదులు, సకల కళాపారంగతులు, సర్వవిద్యావిశారదులు, పౌరాణికులు, లాక్షణికులు, తపోవరిష్టులు, కర్మనిష్టులు, ఋత్విక్కులతో సభ కిటకిటలాడుతోందికరవాలంతో కాక కనికరంతో, హింసలు, వంచనలు లేకుండా, హితబోధలతో శాసించి, పాలించే రాజర్షి ఆయనజనకుని సంపద అంతా దానాలకే పరిమితంఆధ్యాత్మిక రహస్యాల శ్రవణమే ఆయన ప్రవృత్తితన కొలువుకి వచ్చేవారిని నిశితంగా పరిశీలించేవాడు ఆయన. జనకుడు ఒక యాగం చేశాడు యాగానికి కురు పాంచాల దేశాలనుంచి వేద పండితులు వచ్చారువేద తత్వం తెలిసినవారు వీరిలో ఎవరు   – అని జనకునికి సందేహం వచ్చిందిసభలోని పండితులలోన బ్రహ్మవేత్తని తెలుసుకోవాలని కుతూహలం కలిగింది పరీక్ష పండితుల మధ్య తేలవలసిన అంశం అనుకున్నాడు ఆయన.

 

సమృధ్ధిగా పాలిచ్చే వెయ్యి గోవులను విశాలమైన మైదానంలో, స్వర్ణాభరణాలు, కొమ్ములకు ధనసంచులతో, అలంకరించి వుంచాడుఇంది ఎందుకో ఎవరికీ అర్ధం కాలేదుదానాలు యిస్తారని పేద బ్రాహ్మణులూ, విశిష్టయాగం కోసం అని హోతలూ, ఉత్తములని సత్కరిస్తారని సామాన్యులూ అనుకున్నారు. సభలో శాకల్యుడు, భుజ్యువు, విదగ్ధుడు మరియు యాజ్ఞవల్క్యుడు వున్నారువారిని వుద్దేశించి జనకుడు  –  “మహాత్ములారా  ఇది సభాంగణమే కాదు, సద్విషయ చర్చాంగణం, సత్యశీలుర ప్రాంగణంమీలో బ్రహ్మవేత్తలయినవారికి సభకి వెలుపల మైదానంలోని వేయి గోవులను అర్పిస్తాను” – అన్నాడు. సభలో కలకలం ప్రారంభమైందిభుజ్యుడు తలవంచగా, అహోబలుడు దిక్కులు చూడగా, శాకల్యుడు సభని పరిశీలించాడుసాహసం చేయడానికి ఎవరూ సిధ్ధం కాలేదు. జనకునికి యాజ్ఞవల్క్యునిపై దృష్టి ఆనిందిఆశ్వలుని వైపు చూపు పారిందిఇప్పటిదాకా ఆలోచనలో వున్న యాజ్ఞవల్క్యుడు తన శిష్యుడైన సామశ్రవుని చూచాడుఅతని ముఖం చంద్రునిలా ప్రకాశిస్తోందిఅతను వేదంలో సామభాగాన్ని సలక్షణంగా అధ్యయనం చేశాడు.

 

యాజ్ఞవల్క్యుడు జనకునితో, “నేను బ్రహ్మవేత్తనుఆధ్యాత్మవిద్యా విశారదుణ్ణికాబట్టి వేయి గోవులని నా ఆశ్రమానికి తరలించడానికి నా శిష్యుడికి అనుమతి ఇవ్వండి” – అని గంభీరంగా అన్నాడుజనకుడు మౌనంగా వున్నాడుమౌనం అంగీకారం అనుకుని సామశ్రవుడు గోవులని తరలించడానికి సిధ్ధమవుతుంటే అశ్వలుడు – “యాజ్ఞవల్క్యాఉత్తముడవని నీవే ప్రకటించుకోవటం అన్యాయంవిద్వాంసుడవయితే నా ప్రశ్నలకి సమాధానం చెప్పుఅనగా  “నేను సిధ్ధం”  –  అన్నాడు యాజ్ఞవల్క్యుడుబ్రహ్మతత్వం అనగా ఏమిటి  అని అశ్వలుడు అనగా –  నాకు తెలియదునేను బీద బ్రాహ్మడినినాకు గోవులు అవసరంఅని వ్యంగంగా అన్నాడు మహర్షితదుపరి కొన్ని ప్రశ్నలు అశ్వలుడడుగగా చక్కని సమాధానాలు చెప్పాడు మహర్షిఇంకా అడిగే ధైర్యంలేక వెనకడుగు వేశాడు అశ్వలుడు.  ఇంతలో మహిళామణులవైపు అందరిచూపులు మళ్ళాయిఅక్కడ వున్న స్త్రీలలో ఆర్షవిద్యాస్వరూపిణి, సరస్వతీ సారూప్యము, వేదమాతగా భావించే నారీ కూర్చుని వుందిఆమెయే గార్గిఆధ్యాత్మిక విద్యా రహస్యం తెలిసిన అద్వితీయ సాధ్వీ శిరోమణిఆమె యాజ్ఞవల్క్యుని తపశ్శక్తిని మెచ్చిందిబ్రహ్మ స్వరూపం తెలిసినవాడైన బ్రాహ్మణుడుఎదుటివారి సందేహాలు తీర్చగలిగేవాడే పండితుడు, అనుకొని లేచి నిలబడి, జనకునితో – “మహారాజా, నేను గార్గినిఆధ్యాత్మిక అంశాలపై నాకు కొన్ని సందేహాలున్నవిఅందుకే నేను ఇక్కడికి వచ్చానుఅనుమతిస్తే యాజ్ఞవల్క్యులవారిని అడుగుతాను”  అనెనుఅంతేసభలో అలజడి ఎవరూ ఊహించని సన్నివేశంస్త్రీలకు అమిత సంతోషంగావుంది.

 

జనక చక్రవర్తి గార్గిని, మహర్షిని చూచి – “మహర్షీ, ఇది విద్వత్సభసరస్వతి విద్యాస్వరూపిణిఇచ్చట ఎవరయినా, ఏదయినా అడగవచ్చుసందేహాలు తీర్చుకోవచ్చుఅనగా, యాజ్ఞవల్క్యుడు సరే అన్నాడు.

 

గార్గి   మహాత్మా  జగత్తులోని వస్తుజాలానికి ఆధారభూతం ఏది  అనగాఆకాశం అన్నాడు మహర్షితదుపరి ప్రశ్నల పరంపర క్రింది విధంగా వుంది.

 

ప్రశ్న    అకాశం అనే పదార్ధం ఎక్కడ వుంది

జవాబు   గంధర్వలోకంలో

ప్ర          గంధర్వలోకం ఎక్కడవుంది

         సూర్యలోకంలో

ప్ర         సూర్యలోకం ఎక్కడ వుంది

         చంద్రమండలంలో

ప్ర         చంద్రమండలం ఎక్కడ

         నక్షత్రమండలంలో

ప్ర         నక్షత్రమండలం ఎక్కడ

          దేవలోకంలో

ప్ర          దేవలోకం ఎక్కడవుంది

          ఇంద్రలోకంలో

ప్ర         మరి ఇంద్రలోకం ఎక్కడ

         ప్రజాపతి రాజ్యం

ప్ర          ప్రజాపతి రాజ్యం ఎక్కడ

         బ్రహ్మలోకంలో

ప్ర          బ్రహ్మలోకం ఎక్కడ   స్ధిరంగా అడిగింది గార్గి.  మహర్షి చికాకుచెంది, “గార్గీ చొప్పదంటు ప్రశ్నలు వెయ్యకుసమయం వ్యర్ధంఇలా అడుగుతూవుంటే తలపగిలి నేల పడుతుందిఅన్నాడు

 

ఇదంతా గమనించిన జనకుడు, గార్గితో, “గార్గీ, ప్రస్తుతాంశం బ్రహ్మవేత్త ఎవరి  అనేది నిష్కర్షసంబంధిత ఒకటి, రెండు ప్రశ్నలకి అనుమతి ఇస్తున్నానుఅన్నాడు. గార్గి తలవూపింది.   రెండు ప్రశ్నలలో మొదటిదిఆకాశానికి పైన వున్నది, భూమికి క్రింద వున్నదీ, భూమ్యాకాశాల మధ్యన వున్నదీ ఏమిటి  వివరించండి అన్నదిసభలో జిజ్ఞాస పెరిగింది. మహర్షి విషయం గ్రహించి – “గార్గీఆకాశం ఒకటే సర్వవ్యాపకంభూత, వర్తమాన, భవిష్యత్తులో కూడా నిరంతరం వుడే తత్వం ఆకాశం ఒక్కటే”  – అన్నాడు.  మరో ప్రశ్నభూత భవిష్యద్వర్తమానాలకు గుర్తులేవి  – అని ఆమె అడుగగా –  అదే పరబ్రహ్మంఅది చిన్నదీపెద్దదీ కాదుపొడుగూపొట్టీ కాదురంగులూ, రుచులూ, వాసనలూ లేవుకళ్ళకు కనబడదు.  ఎవరూ భుజించలేరుఅగ్నిలా అరుణిమకాదుజలంలా తరళంకాదుఛాయాతిమిరాలు లేవు శక్తే సూర్యచంద్రుల్ని నడిపిస్తుందిఅదే అక్షర బ్రహ్మ. ఈ బ్రహ్మయే కాలాన్ని నడిపించటం, భూమ్యకాశాల్ని క్రమ పధ్ధతిలో తిరిగేలా చేయటం, దివారాత్రాలు, వారాలు, మాసాలు, ఋతువులు, సంవత్సరాలు, యుగాలు, మన్వంతరాల్ని ఏర్పరుస్తున్నది అగోచర శక్తి చేతనే నదులు, సముద్రంలో కొన్ని ఒక వైపునుండి, మరికొన్ని మరో వైపునుండి సాగరంలో కలుస్తున్నవి అక్షర బ్రహ్మ కనబడదు, కానీ అన్నీ చూస్తుందివినబడదు, కాని అన్నీ వింటుంది. తానెవర్కీ తెలియదు, తనకు అన్నీ తెలుసుఅది అక్షయం, అనంతం, చిరంజీవి, మహా శక్తి సంపన్నంఅని యాజ్ఞవల్క్యుడు సృష్టి రహస్యం చెప్పాడు.  ఈ సమాధానంతో గార్గి సంతృప్తిపడి, తన సందేహాలు తీరినట్లు తెలిపి, మహర్షి బ్రహ్మవిదులలో ఉత్తముడని, బ్రహ్మను తెలుసుకున్నవాడని నమ్మిందిసభమహర్షికి జేజేలు పలికిందిజనకుడు ఆధ్యాత్మిక రహస్యాలు తెలిసినందుకు ఆనందించాడువేయి గోవులు యాజ్ఞవల్క్యునికి ఇవ్వబడినవి.

 

గార్గి పేరు దశదిశలా వ్యాపించిందివిదుషీమణి అయింది ఆమెగార్గి మేధస్సును పండితులు ప్రశంసించారువాదబలానికి బ్రహ్మచారిణిగా జీవించాలనుకుంది ఆమెకుమార్తె నిర్ణయం తండ్రికి నచ్చలేదుఆమె విద్యావతి కావాలనుకున్నాడు, కాని అవివాహితగా వుండటం బాధ కలిగిందిఎన్నోసార్లు నచ్చచెప్పాడుకాని ఫలితం శూన్యంగార్గి బాల్యం ఎపుడో గడిచిపోయిందియవ్వనం జారిపోతోందివృధ్ధాప్యం స్వాగతం పలుకుతోందికాని ఇవేమీ పట్టించుకోకుండా సన్యాస దీక్షతో, ధ్యానంతో, కాలం గడుపుతూ వుంది ఆమె. ఒకనాడు నారదుడు రాగా, అతిధి సత్కారాలు చేసిన గార్గిని చూసిఅమ్మా, జీవితం క్షణ భంగురంవయోదారుఢ్యం నిలువదుసుఖ భోగాలు జీవికి అవసరం నియతి అందరికీ సమానంఅందుచేత వివాహం చేసుకోమ్మా  –  అన్నాడు. అందుకు గార్గి  మహర్షీ, స్త్రీపురుషులకు భిన్న భిన్న ఆచారాలు లేవుసాంసారిక  జీవితం గడపకుండా సన్యాసులయిన వారెందరో వున్నారుఅలాగే నేనూ సన్యాసినినిధ్యానంతో ముక్తి పొందాలని నా ప్రగాఢ వాంఛ  అని నారదుడితో అనగా,   అమ్మా, నీ ఆలోచన బాగుందికాని పురుష ధర్మాలు వేరు, స్త్రీ ధర్మాలు వేరువివాహిత కాని  స్త్రీ  దేహం అపవిత్రంవారికి మోక్ష ప్రాప్తి లేదు  అని నిక్కచ్చిగా నారదుడు చెప్పాడు.

 

సకల శాస్త్ర మర్యాదలు తెలిసిన సత్పురుషుడు, ధర్మోపదేశం చేసే దేవర్షి మాటలతో గార్గి తనలో తాను వితర్కించుకుందితాను కోరేది ముక్తి ముక్తి అవివాహితులకి లభ్యం కాదు అంటున్నారుకాబట్టి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుందిఅందుకు శృంగవంతుడనే ముని తగినవాడు అనుకున్నదిఆయన గార్గిని వివాహం చేసుకునేందుకు అభ్యతరం చెప్పలేదుఆయనతో గార్గిమహర్షీ, నేను నారదోపదేశానుసారం, ముక్తి కొరకు వివాహం చేసుకోవాలనుకుంటున్నానునాకు సంసారంపై రక్తి, కుటుంబ జీవితంపై అనురక్తిలేదుమన వైవాహిక జీవితం ఒక్కరోజు మాత్రమేఅందుకు సమ్మతిస్తే నిన్ను పెళ్ళాడుతా  అన్నది. ఒక్క రోజుకోసం పెళ్ళాడి, తదుపరి శాశ్వతంగా ఏకాకిగా జీవించడానికి శృంగవంతుడు అంగీకరించలేదుఅంతట గార్గి తన తపస్సులో సగం ఫలం ధారపోస్తాననీ, చరిత్రలో చరితార్ధుడిగా, గార్గి భర్తగా శాశ్వతంగా నిలిచిపోతావనీ చెప్పి ఒప్పించింది. గార్గి, శృంగవంతుల వివాహం జరిగిందిమాట ప్రకారం ఒక్కరోజు కాపురం గడపి భర్తని వదిలిపెట్టడానికి సంసిధ్ధమయిందిఅంతట శృంగవంతుడుగార్గీ, ఇది తగదుఆలోచించుమరి కొంతకాలం నాతో జీవించుఇదే నా కోరిక  అని దీనంగా ప్రార్ధించాడుకాని ఆమె ఒప్పుకోలేదు. గార్గి మగనిని వదిలి సన్యాసిని అయందిధ్యానంతో ముక్తి పొందింది.

 

బృహదారణ్యక ఉపనిషత్తులలో శాశ్వత స్ధానం సంపాదించుకున్న బ్రహ్మవాదినులలో గార్గి ఒకామె. వ్యాకరణ శాస్త్రంలో కూడా పాణిని గార్గిని ఉదాహరించాడుఆత్మ స్ధైర్యంతో, మనోబలంతో, యుక్తి యుక్త వాదనలతో, ఎలాంటి వారినైనా ప్రశ్నించగలిగిన వనితామణులలో గార్గి ప్రధమ గణ్యంచరిత్రలోనే వాగ్మిగా, విదుషీమణిగా, స్ధిరచిత్తగా నిలచిన మహోన్నత వ్యక్తి గార్గి.

 

                                                                        

1 thought on “మహా సాధ్వి – గార్గి

Comments are closed.