April 26, 2024

శ్రావణ పౌర్ణమి సంచికకు స్వాగతం

మాలిక మూడవ సంచికకు స్వాగతం. ఈ ప్రత్యేక సంచిక ఎన్నో వ్యాసాలు, కథలతో, పోటీలతో ముస్తాబై వచ్చింది. ఈ సంచికలో ప్రముఖుల రచనలు, బ్లాగర్ల అద్భుతమైన కథలు, వ్యాసాలు, అసలు బ్లాగులంటేనే తెలీనివారి రచనలు కూడా పొందుపరచాము. అవి మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాము. మీ విమర్శలు, సలహాలు మాకు సదా శిరోధార్యం.

అనివార్య కారణాల వల్ల రావు బాలసరస్వతిగారి ఇంటర్వ్యూ ప్రచురించడంలేదు. దీపావళి సంచికలో ప్రచురిస్తాము.

ఈ సంచికలో రెండు పోటీలు నిర్వహిస్తున్నాము. రెంటికీ నగదు బహుమతి ఉంది. పదచంద్రికను తప్పులు లేకుండా పూరించినవారికి నగదు బహుమతి వెయ్యి రూపాయలు. మరో పోటీ ఏంటంటే… ఈ సంచికలో ఒకే రచయిత/త్రి రాసిన రచనలు ఒకటికంటే ఎక్కువ ఉన్నాయి. ఆ శైలిని మీరు గుర్తుపట్టగలరేమో చూడండి. రచయిత/త్రి ని గుర్తించండి -బహుమతిగా 500 రూపాయలు తీసుకోండి.

వచ్చే నెల సెప్టెంబర్ 21 న గురజాడ నూట యాభయ్యవ జయంతి జరుపుకోబోయే సందర్భంగా గురజాడివారి రచనలపై విశ్లేషణతో కూడిన రచనలు రెండు సమర్పిస్తున్నాం.చదివి మీ అభిప్రాయం చెప్పగలరు.

మాలిక పత్రికలో మరో నలుగురు కొత్త సభ్యులు చేరారు. సుజాత , కల్లూరి శైలబాల, కుమార్.ఎన్ & కౌటిల్య.

వచ్చే సంచిక కోసం మీ రచనలు ఈ చిరునామాకు పంపగలరు editor@maaila.org

ఈ పత్రికకు తమ రచనలు పంపినవారందరికీ ధన్యవాదాలు. మీ నుండి మరిన్ని అమూల్యమైన రచనల కోసం మాలిక ఎదురుచూస్తోంది!

ఈ సంచికలో ప్రచురింపబడిన రచనలు:

1. శ్రావణ పౌర్ణమి సంచికకు స్వాగతం
2. సంపాదకవర్గం నుండి: ఒక చిన్నమాట!!
3. పెళ్లి చేసి చూపిస్తాం! మేమూ పెళ్లి పెద్దలనిపిస్తాం!!!
4. అంచేత నేను చెప్పొచ్చేదేమిటంటే
5. మీనా
6.పుత్రోత్సాహము తండ్రికి
7. చెప్పబడనిది, కవితాత్మ!
8.మహా సాధ్వి – గార్గి
9. అన్నమయ్య – ఒక పరిచయం
10. హిందోళరాగం
11. విశ్వనాధవారి నాయికలు – రణరంభాదేవి
12. ప్రళయమూ, ఆ తరువాతి జీవితమూ
13. ఓ పాలబుగ్గల జీతగాడా
14. రామానుజ
15. భారతంలో బాలకాండ
16. మనుచరిత్ర కావ్యారంభ పద్యము
17. కందిగింజ
18. అమలాపురం నుంచి అమెరికా దాకా షడ్రుచులు
19. ‘చందమామ’ విజయగాథ
20. నయాగరా! కవితా నగారా!
21. రఘునాథ నాయకుని గ్రీష్మర్తు వర్ణన
22. చిన్న భాషల్ని మింగేస్తున్న పెద్ద భాషలు
23. మనసులో మాట నొసటన కనిపించెనట
24. సహజ భాషా ప్రవర్తనం – 2
25. జయించు జగాన్ని
26. గురజాడ అంతరంగ నివేదనే – మధురవాణి పాత్ర
27. మొక్కగా వంగనిది
28. సత్రవాణి
29. స్త్రీ విద్యాభిలాషి గురజాడ
30. కూచిపూడి – నాతొలిఅడుగులు
31. ఏ రాయైతేనేం? 
32. ఆహా! ఆంధ్రమాతా? నమో నమ: 
33. తెల్లరంగు సీతాకోక చిలుకలు
34. ఆదర్శసతి సీత
35. చేపకి సముద్రం-భాషకి మాండలికం
36. ఓనమాలు
37. గిన్నీస్ రికార్డ్
38. మాలికా పదచంద్రిక – 3: 1000 రూపాయల బహుమతి

9 thoughts on “శ్రావణ పౌర్ణమి సంచికకు స్వాగతం

  1. షడ్రుచులనాలా ? నవరసాలనాలా ? వైవిధ్యభరితమైన రచనాకుసుమాల సమాహారంగా భాసిస్తున్న ‘మాలిక’ శ్రావణపూర్ణిమ సంచికకు స్వాగతం…ఇంకా అన్నీ చదవలేదు కాని గత సంచికలకన్న మిన్నగా వెలువరించారనే విషయం ఓ మెతుకు ముట్టగానే తెలుస్తోంది..విడివిడిగా అన్నీ చదివి దసరా సంచిక వెలువడకుండానే స్పందన తెలియజేయాలనివుంది..ఇందులో నా స్వార్థం కూడా ఉంది…నా రచన ‘హాస్యం’ విభాగంలో “గిన్నీస్ రికార్డు” మీరూ చదువుతారని ..స్పందిస్తారని..అందులో నేనూ మా శ్రీమతి నటించిన వీడియో కూడా ఉంది. చూడండి మిత్రులారా……ఈ విషయంలో ఆ రచనతో వీడియో క్లిప్పింగ్ కూడా తగిలించారు ‘మాలిక’ పత్రికవారు…చాలా సంతోషం. దానికి కారణమైన విశాల హృదయులందరికీ నా కృతఙ్ఞతలు. ‘మాలిక’లో ఓ కుసుమంగా మేమూ ఉన్నామంటే నాకు తెలిసిన కారణం శ్రీమతి జ్యోతిగారు. వారికి నా కృతఙ్ఞతలు.

  2. మీ తర్వాతి సంచిక ఎప్పుడొస్తుందంటారు?

  3. THE MAGAZINE IS VERY NON SERIOUS TO LITERATURE. TO RUN THIS MAGAZINE IS WASTE OF TIME. IF YOU ARE SERIOUSLY INTERESTED IN LITERATURE ATLEAST READ LITERARY PAGES PUBLISHED IN TELUGU LEADING MAGAZINES AND FIND SOME SERIOUS POETS, WRITERS AND CRITICS OF TELUGU LITERATURE AND SEND REQUEST TO SEND GOOD LITERATURE OR PASTE ALL GOOD LETERATURE ON YOUR MAGAZINE SIMPLY.SORRY TO SAY TRUTH…..

  4. మాలిక పత్రికా సంపాదకులకు,
    నమస్కారము..
    నేను రాసిన కధలు గాని, కవితలు కాని మీకు ఎలా పంపాలో దయచేసి తెలియజేయగలరు.

  5. మాలిక పత్రికా సంపాదకులకు,
    నమస్కారము..ఉగాది సంచిక ఇప్పుడే చూచాను.
    చాలా ఆనందం కలిగింది…నా రచనను ఇందు
    పొందుపరచి ప్రోత్సహించినందుకు కృతఙ్ఞతలు.
    మీరు ప్రస్తావించినట్లు..జ్యోతిగారు అభినందనీయురాలు.
    ఆమె ప్రోత్సాహమే నా ఈ రచన మీకు చేరుటకు
    కారణం. థాంక్స్ టు శ్రీమతి జ్యోతి….

Comments are closed.