June 14, 2024

అల్లరి కార్టూన్ల శ్రీవల్లి !

  చాలా ఏళ్ళ క్రితం తెలుగు వార, మాస పత్రికల్లో ‘శ్రీవల్లి’ పేరుతో కార్టూన్లు వస్తుండేవి.  కార్టూన్ల హవా బాగా వెలిగిపోయిన, కార్టూనిస్టులు తామరతంపరగా పుట్టుకొచ్చిన రోజులవి.  అయితే ఇంతమందిలో కూడా శ్రీవల్లి కార్టూన్లు చాలామంది పాఠకులకు గుర్తుండిపోయాయి!   కార్టూన్ గీత లావుగానూ,  హాస్యస్ఫోరకంగానూ ఉండటం, విభిన్నమైన కోణాన్నుంచి అల్లరిగా దూసుకొచ్చే హాస్యధోరణి , సంతకం కూడా ప్రత్యేకంగా ఉండటం-  ఇవన్నీ దీనికి కారణాలు కావొచ్చు. బొమ్మకి ప్రాధాన్యం ఇస్తూ కాప్షన్ తక్కువుండేలా ప్రయత్నించటం,  సామాజిక […]

చింతామణి -సినిమా గోల

రచన : స్వాతి శ్రీపాద   పాపం చింతామణి పేరు నిజానికి అది కాదు. అప్పలమ్మా , వెంకాయమ్మ అసలే కాదు. అలాంటి పేర్లున్నవాళ్ళే నాజూగ్గా శ్రావ్య, శృతి అనీ మార్చుకుంటుంటే సీతామణి పేరు చింతామణి గా మారిపోవడం దురదృష్టమే కదా ! చిన్నప్పుడు వాళ్ళమ్మా నాన్న పెట్టిన పేరు సీతామణే. తెల్లారితే పుడుతుందనగా ఆ సాయంత్రం సీత వాళ్ళమ్మ లవకుశ సినిమా కెళ్ళొచ్చింది. సీతమ్మవారి కష్టాలన్నీ పక్కన పెడితే  కాంతి పుంజంలా మెరిసిపోతున్న బంగారు సీత […]

తెలివైన దొంగ

రచన : మల్లాది వెంకట కృష్ణమూర్తి ఓ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, ఓ ఖరీదైన రెస్టారెంట్‌లో బిజినెస్ లంచ్ చేస్తూ అనేకమందితో చర్చించాడు. బిల్ పే చేసి ఆఫీస్‌కి వెళ్లాక, తన లాప్ టాప్‌ని రెస్టారెంట్‌లో మర్చిపోయానని గ్రహించాడు. వెంటనే ఆదుర్దాగా వెనక్కి వచ్చాడు. అది రెస్టారెంట్‌లో తను కూర్చున్న చోట లేదు. దాంతో తన లాప్‌టాప్ పోయిన సంగతి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. “వాడు తెలివైన దొంగలా ఉన్నాడు. రెస్టారెంట్‌లోని అందరి కళ్ళు కప్పి ఎలా […]

సెంట్ ఫకీర్ తెలుగు మీడియం ఇంగ్లీష్ కాన్వెంట్!

రచన:  ఎన్. రహ్మతుల్లా   “ఇంటిపేరు క్షీరసాగరం వారు, ఇంట్లో మజ్జిగ చుక్కకు గతి లేదు” అన్నట్లు సెయింట్ల కాన్వెంట్లలో చదువు మహా డాబుసరి వ్యవహారంగా తయారయింది. ఇంటికూడు తిని, ఎవరి వెంటో పడినట్లుగా కాన్వెంట్ల యాజమాన్యం ప్రవర్తిస్తున్నది. అసలు ఈ ప్రపంచంలో ఏ మూల ఏ ప్రక్రియ సక్సెస్ అవుతుందో దాన్ని మనవాళ్లు ఇట్టే స్వతంత్ర్యం చేసుకుంటారు. ఆనవాలు పట్టడానికి కూడా వీలు లేకుండా దానికి నకిలీ తయారు చేస్తారు. నాణ్యతలో తప్ప మరి దేనిలోనూ […]

నేను నా పాట్లు (పాటలు)

  రచన :  హబీబుల్లా అహ్మద్ ఇండియాలో ఉన్నపుడే స్కూల్లోనూ కాలేజీలో బాగా పాటలు పాడేవాడిని. బాల సుబ్రహ్మణ్యం పాటల పుస్తకాలు కొని ప్రాక్టీస్ చేస్తుండేవాడిని.  కాలేజీలో మగ పిల్లలకంటూ వెయింటింగ్ రూములు ఆడపిల్లలకున్నట్టు లేకపోవడంతో ఖాళీగా ఉన్న క్లాసురూములు దొరకడం ఆలస్యం నాలాంటి ఔత్సాహికులు కబ్జా చేసి పాటలు పాడేస్తుండేవాళ్ళం! హైద్రాబాదులో ఉజ్జోగం వచ్చిన కొత్తల్లో త్యాగరాయ గాన సభ దగ్గరా, రవీంద్ర భారతి  దగ్గరా తచ్చాడుతూ ఉండేవాడిని. అక్కడైతే ఎప్పుడూ పాటల ప్రోగ్రాములు జరుగుతాయి. […]

ద బెస్ట్ ఆఫ్ బాపు కార్టూన్స్ !

రచన – వేణు   బాపు కార్టూన్లలో  నాలుగో,  పదో, ఇరవయ్యో  చూపించేసి ‘ఇవి బెస్ట్’ అనెయ్యటమా?  ‘హెంత ధైర్యం?’ అని ఎవరికైనా కోపాలొచ్చేస్తే  అది వారి  తప్పేమీ కాదు. కానీ  ‘నాకు నచ్చిన తెలుగు  కార్టూన్లేమిటబ్బా!’  అని ఆలోచించి చూస్తే ఎక్కువ  గుర్తొచ్చినవి బాపువే!   మిగిలిన కార్టూనిస్టులవి కూడా కలిపేసి కలగూరగంపగా  ఇచ్చే కంటే…  కొంటె నవ్వులు చిలికించే  బాపు  కార్టూన్లలో  కొన్నింటిని  ఎంచుకుని  ఓసారి తల్చుకుంటే బాగుంటుందనిపించింది.   బాపు గీసిన వందల వేల […]

రాముని మిత్రధర్మము

రచన: యఱ్రగుంట సుబ్బారావుగారు     సప్తాంగములతో కూడిన రాజతంత్రమందు మిత్రునకు స్థానమున్నది. అట్లే రాజునకున్న బలములలో మిత్రబలమొకటి. ఒక మహారాజ్యాధిపతితో యుద్ధము చేయవలసిన రామునకు మిత్రబలము అవసరమై ఉన్నది. రాముడు రావణునిపై దండెత్తనున్నాడని తెలిసిన సీత “రాముడు మిత్రులను సంపాదించెనా?” అని హనుమంతుని ప్రశ్నించినది. శాపవిముక్తిని పొంది, దివ్యుడైన కబంధుని ద్వారా రాముడు సీతావృత్తాంతము నెఱుగదలచినను, కబంధుడు – సీత ఉన్న స్థానము తనకు తెలియునో, తెలియదో కాని ఆ విషయమును స్పృశింపక, రాముడున్న స్థితిలో […]