చిత్రం, గేయరచన: వారణాసి నాగలక్ష్మి
పల్లవి :
తరుణి నీవు సాగాలి తారాపథానికి
తేవాలి బహుమతి – ప్రమదావనికి
ప్రథమ బహుమతీ – భరతావనికి //
చరణం 1.
సృజన నీకు సహజ గుణం, సహన శక్తి నీకు ఆభరణం
క్షమాగుణం దయాగుణం కలబోసిన వ్యక్తిత్వం
జోహారు జననీ జోతలివే మహిళామణి
జగతి లోని అత్యుత్తమ సృష్టి నీవె , స్రష్ట నీవె ! //
2.
సద్గుణాలు కారాదు నీ ప్రగతికి ఆటంకం
కాకూడదు కరుణ నీ ఎదుగుదలకు అవరోధం
సహజమైన ఔన్నత్యం కారాదు అబలత్వం
బలహీనత కానీయకు, నీదైన సుగుణధనం //
3.
అఖండమైన శక్తివమ్మ అబలవు కానేకావు
అతివ నీవు అంతులేని ఆత్మ విశ్వాసానివి
ఎంచుకో గమ్యాన్ని అందుకో అంబరాన్ని
చేష్టలుడిగి వీక్షించగ నిఖిలజగతి నిన్నుగని //
4.
భారత కోకిలవు సరస్వతీ పుత్రికవు
దుష్టుల పాలిట నువ్వు కాళికవు చండికవు
పదవి ఏదైనా నువ్వు ప్రతిభతో నడిపేవు
ప్రగతి శీలవై మహిళల ప్రతిష్టనే పెంచేవు //
5.
బిడ్డల శిక్షణలో భరతావని రక్షణలో
సంగీతం సాహిత్యం వైద్యమూ వాణిజ్యం
ఏ రంగమందైనా ఏ శాఖలోనైనా
నీ ప్రతిభ అసమానం, హద్దు నీకు ఆకాశం //
పదవి ఏదైనా నువ్వు ప్రతిభతో నడిపేవు!
ప్రగతి శీలవై మహిళల ప్రతిష్టనే పెంచేవు!
nice 🙂
Chaalaa bagumdmdi.
Chaalaa baagunDi, Nagalakshmi nee geetam! Abhinandanalu!
చాలా బాగుంది గీతం. అభినందనలు.
very very gud
good poem
Nice !!!