May 19, 2024

ఊర్మిళ

రచన: నారాయణి టి.వి.లో రామాయణ ప్రవచనము జరుగుతోంది. అందులో ఊర్మిళాదేవి నిద్ర గురించి చెపుతున్నారు. భర్త అరణ్యవాసానికి వెళ్ళినప్పటి నుండి మళ్ళీ అయోధ్యకు చేరుకున్నంత వరకు ఊర్మిళ నిద్రపోతూనే ఉందిట. లక్ష్మణుని  నిద్ర కూడా ఆమె పుచ్చుకొని నిద్రపోయిందిట. అది విన్నాక ఒక  అనుమానము వచ్చింది. నిద్ర అయితే అలా పడుకునే ఉంది.. మరి ఆకలిదప్పికల మాటేమిటి? అది వరమా?  శాపమా? ఇలా ఆలోచిస్తూ నిద్రపట్టకపోవడంతో ఏదైనా మంచి పుస్తకం చదవాలనుకొంది ఊర్మిళ. అలమార దగ్గరకు వెళ్ళింది. […]

నా మార్గదర్శకులు

రచన: మాలా కుమార్ బహుశా భగవంతుడు స్త్రీ పక్షపాతేమో!అందుకే ప్రేమ, దయ, కరుణ,ఆప్యాయత అన్నీ కలబోసి , తన ప్రతినిధిగా అమ్మను సృష్టించాడు. అసలు అమ్మను అలా కాకుండా ఇంకోలా ఊహించుకోను కూడా ఊహించుకోలేము! నాకు ఊహ తెలిసింది అమ్మ సానిహిత్యంలోనే. నాకు ఎన్ని సంవత్సరాలో గుర్తులేదు, కాని బయట వరండాలో , వెన్నెల్లో అమ్మ దగ్గరగా కూర్చొని అమ్మ చెప్పే కథలు వినటం మాత్రం చాలా గుర్తుంది.. నాకు బాగా గుర్తున్న కథలు …  కర్ణుడిది, […]

మహిలో మహిళ

రచన: సి.ఉమాదేవి అంతర్జాతీయ మహిళాదినోత్సవం స్త్రీలకు ప్రత్యేకమైన రోజు. ఈ రోజున  ప్రగతిబాటన పడుతున్న స్తీల అడుగులు ఏ దిశగా పడుతున్నాయో, లక్ష్యం దిశగా నడచి గమ్యాన్నిచేరుకుంటున్నాయో లేదోనని బేరీజు వేసుకోవడం చర్వితచర్వణమే. సంవత్సరానికి ఒక రోజు వస్తుంది, వెళ్తుంది. కాలగర్భంలో ఆ రోజు కలిసిపోతుంది. మహిళా సంక్షేమం, మహిళాభివృద్ధి ఏ మేరకు జరిగిందో వెనక్కు తిరిగి చూసుకుంటే సాధించిన ప్రగతి పలుచగా అగుపడుతుంది తప్ప అభివృద్ది గ్రాఫ్ లో పురోగతి మందగమనమే.  అయితే మనమేమి సాధించలేదా […]

స్త్రీవాద సాహిత్యం

రచన:కొండవీటి సత్యవతి   వందేళ్ళ తెలుగు సాహిత్యాన్ని తీసుకుని, అప్పటినుండి తెలుగు సాహిత్యం గమనాన్ని పరికిస్త్తే- నూటపది సంవత్సరాలకు పూర్వమే ఒక స్త్రీ తెలుగు సాహిత్యంలో పలుప్రక్రియలకు ఆద్యురాలుగా నిలిచింది. తెలుగులో తొలికథ రాసి, తొలిసారి స్త్రీల చరిత్రనుగ్రంథస్థం చేసి, మొట్టమొదటిసారి స్త్రీల సంఘాలను/సమాజాలను స్థాపించిన భండారు అచ్చమాంబను ఈ సందర్భంగా మనం తప్పకుండా గుర్తుచేసుకోవాలి.  ఎవరి మనస్సు ఒప్పుకున్నా, ఎవరిమనస్సు నొచ్చుకున్నా చరిత్ర-చరిత్రే- దానిని వక్రీకరించడం ఇంక ఎంత మాత్రమూ కుదరదు. మహాకవి గురజాడ ఆశించినట్లు […]

సైరంధ్రి (నవపారిజాతం)

రచన: డా వి.సీతాలక్షీ     ఆంధ్ర మహాభారతములోని పదునెనిమిది పర్వములలో కవిబ్రహ్మ విరచితము, ’చతుర్థము’, ’హృదయాహ్లాది’, ’ఊర్జిత కథోపేతము’, ’ నానారసాభ్యుదయోల్లాసి’ అయినది విరాటపర్వము. ఉపాఖ్యానములు లేని చక్కని, చిక్కని కథ గల్గిన ఐదాశ్వాసముల పర్వమిది. పాండవులు ద్రౌపదితోపాటు మారుపేర్లతో, మారు వేషాలతో విరాటరాజు కొలువులో అజ్ఞాతవాస వ్రతాన్ని నిర్వహించడం ఇందలి ముఖ్యాంశం. ఒక సంవత్సర కాలం జరిగిన కథగల ఈ విరాటపర్వంలో పాత్రల ప్రవేశ్వం, వారి సంభాషణలు, అంగీకాభినయాలు, సన్నివేశాలు, కథాగమనం – ఇవన్నీ […]

మాతృస్వామ్య రాష్ట్రం మేఘాలయ

రచన: పి.యస్.యమ్. లక్ష్మి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళల హక్కుల పోరాటంకోసం మొదలయినా తర్వాత తర్వాత అనేక దేశాలలో అనేక విధాలుగా జరుపుకుంటున్నారు.  దానికి కారణం ఈ పోరాటం మొదలయినప్పటికీ, ఇప్పటికీ మహిళల పరిస్ధితుల్లో కొంత మార్పు రావటం, మహిళలకు ప్రాముఖ్యం పెరగటమే.  అయినా మహిళలు తమ పురోభివృధ్ధిలో సాధించాల్సింది ఇంకా ఎంతో వున్నది. అయితే ఈ మహిళా దినోత్సవాలు జరుపుకోవాల్సిన అవసరం లేనివాళ్ళు కూడా వున్నారంటే నమ్ముతారా   అదీ మన దేశంలో.   నమ్మి తీరాలండీ.  ఎందుకంటే…. […]

తానా వ్యాసరచన పోటీకి ఆహ్వానం.

డెట్రాయిట్ లో జరిగే 20 వ తానా సమావేశాల్లో (జూలై 2-4, 2015) తెలుగు సాహిత్య కార్యక్రమాల నిర్వాహక వర్గం ‘తెలుగుసాహిత్యంలో  స్త్రీ పాత్రల స్వభావ పరిణామం’ అనే అంశం పై చర్చావేదిక నిర్వహించనున్నది. తెలుగులో పురాణాలనుండి ఇప్పటి ఆధునిక సాహిత్యం వరకూ ఎంతో వైవిధ్యమున్న స్త్రీ పాత్రల చిత్రణ జరిగింది. ఇందులో పురాణాలతో పాటు కావ్యాలు, నాటకాలు, కధలు, నవలలు, కవితలు మొదలైన ఎన్నో ప్రక్రియలు పాలు పంచుకున్నాయి. ఇంతటి సుధీర్ఘమైన చరిత్ర ఉన్న సాహిత్యంతో […]

పద్యమాలిక – 5

  NagaJyothi Ramana   నలభీములదే వంటని నలుగురిలోనీ పురుషులు -నవ్వగనేలా? అలిగిన ఆ ఇల్లాళ్ళట తొలగిరి ఫేస్బుక్ తమకిక-తోడుగ దొరకన్ కుడి ఎడమేమున్నది లే సుడిగల భార్యలు తమకును-సులువగ దొరకన్ వడివడి గా భర్తలు తము పడిపడి జేతురు పనులను-పక్కా ప్రేమన్ !! సంపాదనతో సతులే నింపాదిగ జేబు తమది -నిండుగ నింపన్ పెంపొందగ ననురాగము సొంపుగ జేతురు పనులను-సోమరి పురుషుల్ !!(షోకుగ పురుషుల్)     Srinivas Iduri   పరువా పోయే మనకది […]

పద్యమాలిక – 4

  Goli Sastry   చూపులు నాపై బెట్టుచు నో పని మనిషీ వినుమనె నోయమ్మా ! సార్ చీపురు పట్టుచు నిట్టుల వీపును ముందునకు వంచవే యనుచుండెన్   భామ ! ప్రక్కకు నెట్టుచు పనుమనిషిని ఏల నీపని మీకంచు నెగిరి పడకు ” స్వచ్ఛ భారత ” మునకేగు సమయమునకు ఊడ్వ నేర్చుట మేలని యూడ్చుచుంటి.   చీ ! పురుషుడింటి లోపల చీపురుతో కసువునిట్లు చిమ్ముట తగునా ఈ పనికి ” మనియె […]

బాల్య, కౌమార్య దశలలో బాలికల సమస్యలు

రచన: డా.జయశ్రీ ఎర్రోజు   అమ్మాయి జననం ఇంటిల్లి పాదికి సంతోష దాయకం. బాల్య కౌమార్య దశల గుండా ప్రయాణించి పరిణతి చెందిన యువతిగా మారే దారిలో వివిధ శారీరక మరియు మానసిక వత్తుడులు అధిగమించవలసి వస్తుంది. బాల్య కౌమార్య దశలలోని ఈ మార్పుల పట్ల తల్లిదండ్రులకు ముఖ్యంగా తల్లులకు ఒక అవగాహన ఉండటం ఎంతైనా అవసరము. నా  ఈ వ్యాసంలో ఈ దశలలో ఏర్పడే మార్పుల పట్ల ఒక అవగాహన కల్పించే చిన్నిప్రయత్నం బాల్య దశ […]