May 6, 2024

గృహలక్ష్మీ స్వర్ణకంకణ గ్రహీతలైన కవయిత్రులు

రచన: లక్ష్మీదేవి వరుస సాంస్కృతిక దాడులు, అణచివేతల వల్ల  స్త్రీ రక్షణకు తన్మూలకంగా స్త్రీ జ్ఞానార్జనకు వచ్చిన పలు సామాజిక, ఆర్థిక పరిమితులవల్ల కుంటువడిన స్త్రీల విద్యాభివృద్ధులు, దేశ స్వాతంత్ర్యోపార్జన తర్వాత అంటే  అర్ధశతాబ్దం క్రిందట వికాసానికి నోచుకున్నాయి. ఆ కాలంలో ఆధ్యాత్మిక పరంగా, సామాజిక పరంగా ఉన్నతికి మార్గాలను ఏర్పఱచుకుంటూ రచనా వ్యాసంగం ద్వారా అనేకులకు మార్గదర్శనమూ చేస్తున్న మహిళాలోకానికి ప్రోత్సాహకంగా  కె.యన్. కేసరి గారు 1934లో స్వర్ణకంకణము పురస్కారము ప్రారంభించి సాహిత్య, సాంస్కృతిక, తదితర […]

పెరుగుతున్న అత్యాచారాలు – కరవవుతున్న భద్రత

రచన: మణి కోపల్లె అనాదికాలం నుంచి సమాజంలో పురుషాధిక్యత వుంటోంది. మహిళలంటే చిన్న చూపు. బానిసలనే భావం, చెప్పింది చేయాలి అనే అధికార తత్త్వం.  తమ చెప్పు చేతల్లోనే ఉండాలనే తత్త్వం మహిళలపై వుంది.  అత్యాచారాలు, హత్యలు, కిడ్నాపులు, ఆసిడ్ దాడులు మహిళలపై అధికంగా జరుగుతున్నాయి  స్త్రీని ఒక కామకేళి వస్తువుగా చూస్తున్నారు. సంఘంలో స్త్రీలకి తీరని అన్యాయం జరుగుతోంది. న్యాయం జరగటం లేదు.  మహిళలపై వివక్షత నానాటికి ఎక్కువవుతోంది. పురాణాలలో స్త్రీని సమానంగా చూసేవారు. పూజించేవారు. […]

మహిళా సాధికారత సాధించామా..? సంపన్నులకే సొంతమా…???

రచన : రాణి సంధ్య మహిళా సాధికారత !!! నిజానికి ప్రపంచ దేశాలను వణికిస్తూ , కంటిపై కునుకు లేకుండా చేస్తున్న పదం ఇది. భారత దేశం మొత్తం మహిళా సాధికారత కోసం కలలు కంటుంది. అందుకు మన సమాజం,  ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు కూడా తమ వంతు కృషి చేస్తున్నారు. అయితే నిజంగా ఈ పోరాటం సాధికారత కోసమేనా??? అందరూ కోరినట్టు ఈ కృషి సాధికారత సాధించడం  కోసమేనా??? సాధికారత పేరుతో మహిళ తనని తాను […]

మాలిక పత్రిక మహిళా సంచిక – 3 , మార్చ్ 2015 కు స్వాగతం

Jyothivalaboju Chief Editor and Content Head మార్చ్ నెల ప్రత్యేక మహిళా సంచిక సంధర్భంగా మాలిక పత్రికలోని మూడవభాగం ఈరోజు విడుదల అవుతుంది. ఇందులో , వచ్చేవారం వచ్చే నాలుగవ భాగంలో విభిన్నమైన అంశాలమీద మహిళలు రాసిన వ్యాసాలు ప్రచురించబడతాయి.. ఈ భాగంలో … 01. న్యూస్ ఏంకర్లు vs రీడర్లు 02. స్త్రీ పురుష సమానత – ఒక మిథ్య 03. మలేషియా తెలుగు మహిళలు 04. పవిత్ర వృక్షాలు 05. ఊర్మిళ  06. […]

స్వర్ణయుగపు వార్తాహరులు

రచన: క్రిష్ణవేణి స్వర్ణయుగపు వార్తాహరులు బ్రేకింగ్ న్యూస్, స్కామ్ -అంటూ అరుపులూ, కేకలూ పెట్టే ఏంకర్లు. పానెల్ డిస్కషన్స్, టీఆర్‌పీలు, వీటిని బట్టి వచ్చే వాణిజ్య ప్రకటనల రాబడి. వీటన్నిటికీ తగ్గట్టు ఈ పానెల్ డిస్కషన్స్‌లో పాల్గొనే నిపుణులైన(?)వక్తలు- ‘గుడిగుడి గుంజం గుండారాగం’ అన్నట్టుగా- ఒకే రోజు, అదే న్యూస్ గురించిన డిస్కషన్స్‌లో వేరే వేరే ఛానెళ్ళలో కనిపిస్తారు. వక్తలేమిటి చెప్పబోతారో అని ఏంకర్లకి ముందే దివ్యదృష్టితో తెలుస్తుంది! కాబట్టి ఆ వక్తలని ఆహ్వానిస్తారే తప్ప వారికి […]

స్త్రీ – పురుష సమానత – ఒక మిధ్య

రచన: అజితా కొల్లా   ఆగండి ఆగండి – మహిళా దినోత్సవ సందర్భంగా మేము సంబరాలు చేసుకుంటుంటే, ఇలా నిప్పుల మీద నీళ్ళు పోస్తావు అని నన్ను ఆడిపొసుకునేముందు, కల్- ఆజ్ – కల్ రూపంలో నేను చెప్పేది , కాదు వ్రాసేది కాస్త చదవండి !!!!! కల్ – నిన్న……… “ఏవోయ్! నేను వచ్చేవరకు ఆలశ్యం అవుతుంది అని చెప్పా కదా , భోంచేసి పడుకోపొయావా?” “అదేవిటండి, మీరు తినకుండా నేను ఎప్పుడైనా తిన్నానా?” నిన్నటి […]

మలేసియా తెలుగు మహిళలు

రచన: శ్రీమతి దుర్గప్రియ “స్త్రీ” ఆత్మీయతలో ……………….అమ్మ సహనంలో……………………భూదేవి అణకువలో……………………అనసూయ పట్టుదలలో……………………సావిత్రి కరుణలో………………………థెరిస్సా ప్రేరణలో……………………….మాంచాల వీరంలో……………………….ఝాన్సీరాణి పౌరుషంలో…………………..రాణి రుద్రమ్మ అవసరమైతే ………………..ఆది శక్తి.. అటువంటి “స్త్రీ” శక్తికి నా అభివందనాలు. ఏ ఇంట్లో స్త్రీ గౌరవింపబడుతుందో ఆ ఇల్లు నందనవనమవుతుంది. ఏ దేశంలో స్త్రీలు గౌరవింపబడుతున్నారో ఆ దేశం సస్యశ్యామలంగా ఉంటుంది. అందుకనే ఒక కవి “స్త్రీ” ని గురించి ఇలా రాసాడు. “బ్రతుకు ముల్లబాటలోన…..జతగా స్నేహితురాలవైతివి, కన్నీళ్లు తుడిచే వేళ……….తోడబుట్టిన చెల్లలవైతివి, జీవితం లో వెనుకబడినప్పుడు…వెన్ను […]

పవిత్ర వృక్షాలు

రచన: జే.వేణీమాధవి. www.vedicvanas.com సనాతన హిందూ సాంప్రదాయాలు, ఆచారాలు ఒక ఉత్తమ జీవన విధానాన్ని ప్రతిభింబిస్తాయి.  మన పండుగలు మన ఋతువులు, వాతావరణ మార్పులు మరియు పరిసర ప్రకృతితో ముడిపడి వున్నాయి అనటం మనందరి ప్రత్యక్షానుభవం. రామాయణ భారత పురాణాల్లోని వనాల వర్ణనలు అప్పటి పుష్కలమైన వన సంపదను గురించి తెలుపుతున్నాయి. ఇప్పుడవి క్రమంగా కనుమరుగై పోతున్నాయి. ఒకప్పటి మన దేవాలయాలు పుణ్య క్షేత్రాలు కూడా అడవులు, పర్వత శిఖరాలు, నదీ తీరాలు మరియు సంఘమ తీర్ధాల […]