May 1, 2024

!!అద్భుతమైన ప్రతిభ కి అక్షర రూపం, అసమాన అనసూయ !!

సమీక్ష: పుష్యమి సాగర్ ఒక మనిషి జీవితం మహా అయితే ఎంత ఉంటుంది ఇప్పటి కాలంలో అయితే ఎక్కువలో ఎక్కువ 50 అనుకుంటాను ..కానీ 95 వసంతాలు దాటినా ఇప్పటికి జీవితం పట్ల అదే స్ఫూర్తిని సంతోషాన్ని కొనసాగిస్తూ, నలుగురికి మార్గదర్శకంగా ఉండే వ్యక్తి గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము …వారెవరో కాదు కళాప్రపూర్ణ బిరుదాంకితులు Dr. అవసరాల (వింజమూరి ) అనసూయా దేవిగారు. వారి ఆత్మకథని వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికావారు ఒక పుస్తకంగా తీసుకురావడం […]

సినిమా పాట పుట్టుక

రచన: కందికొండ ఎం.ఎ. తెలుగు (పిహెచ్‌.డి.) పరిశోధకుడు, ప్రముఖ సినీ గీత రచయిత సినిమా పాట ఒక విక్షణమైన సాహిత్య ప్రక్రియ. నేడు జనజీవితంలో ఒక అందమైన లతలా పెన వేసుకుంది. అది ఎంతగానంటే! ప్రయత్నంగానో, అప్రయత్నంగానో మన అనుమతి లేకుండానే మన చేతనే ఆలాపింప చేసేటంతగా విందుల్లో, వినోదాల్లో, వేడుకల్లో పాటు వినిపించడం మనం నిత్యం వింటున్నాం, చూస్తున్నాం. సాహిత్య ప్రక్రియగా సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకునే క్రమంగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన సినిమా పాటను నాటి […]

పాటే మంత్రమో…

రచన: – రాజేష్ శ్రీ (మ్యూజిక్ వరల్డ్ వ్యవస్థాపకుడు) రేడియో లో వచ్చే ‘జనరంజని’ వింటూ జనాల మధ్య మావూరి బస్సులో ప్రయాణిస్తుంటే ‘జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీరాకకై..’ అంటున్న జానకమ్మ మధురగాత్రం నన్ను ముప్పైయ్యేళ్ళు వెనక్కి తీసుకెళ్ళింది.. అప్పటి జ్ణాపకాల్ని గుర్తు చేస్తూ ఆ రోజుల్లో ఆ పాట వింటున్న సందర్భాల్ని నెమరు వేసుకునేట్టు చేసి ఆ అనుభూతుల్ని మిగిల్చింది..!! నిజమే పాటకంత పవరుంటుంది.. అరుదైన పుష్పపు పరిమళమో లేదా అద్భుతమైన అత్తరు వెదజల్లే […]

ఓ చెట్టు పజ్యం

రచన: శ్రీనివాస్ వాసుదేవ్ ఒళ్ళంతా పూలుచేసుకుని, మరి కళ్ళకెదురుగా ఎప్పుడూ అక్కడొక గంభీరమైన చెట్టు హాయిగా, వర్షించినప్పుడల్లా స్నానిస్తూ! ఆకులల్లాడినప్పుడల్లా ఓ ఆకుపాట పరిభాష ఎగిరిపోతున్న పక్షులని పిలుస్తున్నాయనే అమాయకత్వం ఆకుచివర్ననుంచి పడుతున్న ప్రతీ బొట్టూ నాలోని ఘనీభవించినదేదో వెతికి మరీ బయటకులాగినట్టు….తడిమినట్టూ బొట్టుకొక కహానీ, కహానీకొక కలలాంటి కవిత కొన్ని కుర్రబెంగలనెప్పుడూ ఓదార్చే ఆ చెట్టంటే నాకు ఓ మూర్తిమంతమైన అమూర్తభావన *** దుర్జనలో, సజ్జనలో ఆమె నీడలో మనసుదాచుకున్న మనుషులెందరో క్రిమికీటకాదుల బాధలేదామెకు, పక్షుల […]

దేవులపల్లి కృష్ణశాస్త్రి

రచన: రమణ బాలాంత్రపు శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు పిఠాపురం దగ్గర చంద్రపాలెంలో పండిత కుటుంబంలో తమ్మన్న శాస్త్రి, సీతమ్మ పుణ్యదంపతులకి 1897 నవంబర్ 1వ తేదీన జన్మించారు. విజయనగరం కళాశాల నుంచి పట్టభద్రులయ్యారు. పెద్దాపురం మిషినరీ హైస్కూల్, కాకినాడ కళాశాలలో ఉపాధ్యాయులుగా, తరవాత ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ప్రయోక్తగా పని చేసారు. 1964లో మద్రాస్ చేరి సినీగేయ రచయితగా స్థిరపడ్డారు. భావకవి శ్రేష్టులుగా, సినీగీత రచయతగా తెలుగుజాతి గుండెల్లో పదిలమైన స్థానం సంపాదించుకున్నారు కృష్ణశాస్త్రిగారు. దేవులపల్లి వారి […]

ఏడుగడతో (నే) మేలి మనుగడ

రచన: పి.వి.ఆర్. గోపీనాథ్. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం… అంటే పురుషులను ఆదర్శప్రాయులుగా గుర్తించేందుకే. అనగా వారి హక్కులను గౌరవిస్తూ, బాధ్యతలు గుర్తుచేసేందుకే అనేది నా అభిప్రాయం. అందుకే పారిజాతాపహరణం ప్రబంధాన్ని మననం చేసుకుంటూ…. ——————————————————- —————- ఉ. తల్లివి, తండ్రివే మరియు దారకు నీవెగ దైవమెప్పుడున్ చల్లని మాటలన్ బలుకు, చక్కటి యొజ్జవు, దాత గావలెన్ మెల్లగ నేర్పుకోవలయు మేలగు విద్యయె నీవు భామకున్ చెల్లదు పౌరుషం బనగ చిల్లర వేషము లేటికిన్ సఖా ?! ఆ.వె. […]

కిం కర్తవ్యం !

రచన : నూతక్కి రాఘవేంద్రరావు. ఆధునిక వైద్య, ఆరోగ్య విధానాల వల్ల గాని, మారిన జీవన స్థితిగతుల వల్లనైతేనేమి, దేశవ్యాప్తంగా వృద్ధుల జీవన కాల దైర్ఘ్యం విశాలమౌతోంది.. అందువల్ల జీవించి వున్న వృద్ధుల సంఖ్యా పెరుగుతోందన్నది నిర్వివాదాంశం. అలా అని వారికి రుగ్మతలు లేవని కాదు వయసుతో వచ్చే కొన్ని సమస్యలు ప్రతీవారిని పీడిస్తూ ఉంటాయి. ప్రస్తుత సామాజిక స్థితిగతుల్లో, అస్తవ్యస్త రాజకీయ అస్తిరతలో ప్రభుత్వాలు, సేవా సంస్థలు దృష్టి సారించని,శాశ్వత పరిష్కారాన్నికనుగొనని సామాజిక సమస్యలు అనేకం […]

రెండు నిమిషాలు !!

రచన: జాజిశర్మ ” అపవిత్ర పవిత్రోవా ……. ” అంటూ రోజూ బాహ్యం, అంతరాలు శుద్ధిచేస్తూన్నట్లు నాటకం నడుపుతూ, గంటలు గంటలు మళ్ళీ మళ్ళీ ఆంతర్యంగా బురదలో పడి దొర్లేవాడికి మనం చెప్పగలిగేది ఎమీ ఉండదు. ఎందుకంటే వానిని చూస్తే, తను చేసే కర్మలన్నీ యాంత్రికంగానే చేస్తున్నాడనీ, దానిలో ఏమాత్రం చిత్తశుద్ధి అనేది లేదని అర్ధం అవుతునే ఉంటుంది. ఇఖ మరి మనం ఎవరికి ఏమి చెప్పాలి అనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. మనం చెప్పే విషయం […]

శ్రీ కాకుళ ఆంధ్ర మహావిష్ణు దేవాలయము.

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు, కృష్ణా నదీ తీరము తెలుగు సంస్కృతి వైభావాలకు ప్రముఖ దేవాలయాలకు నెలవైఉంది. అటువంటి ప్రదేశాలలో ఒకటి కృష్ణా జిల్లా,ఘంటసాల మండలములోని శ్రీకాకుళము గ్రామములోని శ్రీ కాకుళ ఆంధ్ర మహా విష్ణు దేవాలయము. ఆ గ్రామములోని ప్రముఖ దేవాలయాలు వాటి చరిత్ర గురించి కొంత తెలుసుకుందాము. శ్రీకాకుళము చిన్న గ్రామము కానీ ఆ గ్రామ చరిత్ర చాలా పురాతనమైనది. ఒకప్పుడు శాతవాహనుల రాజధానిగా ఉండేది క్రీ.శ 2 వ శతాబ్దములో శ్రీకాకుళాన్ని మహానగరంగా […]