June 14, 2024

రియాలిటీ – షో -రియాలిటీ

రచన: జొన్నలగడ్డ కనకదుర్గ “హాయ్ సుమ! రా ఎలా వున్నావు? ” పనిపిల్ల తలుపు తియ్యగానే సోఫాలో పడుకునే హుషారుగా పలకరించింది మా వదిన. ఆవిడ గొంతులో హుషారుకి నేను కొంచెం ఆశ్చర్యంతోనే “ బావున్నా వదినా! నువ్వు ఎలా వున్నావు? కాలు ఎలా వుంది? కొంచెం పర్వాలేదా?” అని పరామర్శించా. ఈ మధ్య మా వదిన కాలు స్ప్రెయిన్ అయింది, డాక్టరూ వారం రోజులు బెడ్ రెస్ట్ తీసుకోమన్నాడని అన్నయ్య పదిరోజుల క్రితం ఫోను చేసి […]

రిటైర్మెంట్ ( హాస్య కధ )

రచన : శర్మ జి ఎస్ అక్కడ దాదాపు 1000 గడపలుంటాయి . అంతమాత్రాన అది పట్టణమూ కాదు . అలాగని పల్లెటూరూ కాదు . పోనీ అటు పట్టణానికీ , యిటు పల్లెటూరుకూ నడుమ వరుసలో ఉందని అనటానికీ వీల్లేని ఓ సరిక్రొత్త అత్యాధునిక సిటీలా చెలామణీ అవుతున్నది హైదరాబాదుకి ఊరి చివర . అక్కడ వుంటున్న వాళ్ళు అందరికీ పుట్టుకతో వచ్చిన రెండు కాళ్ళే కాకుండా రకరకాల వాహన సంపత్తి సమకూర్చుకొన్నవాళ్ళే . హైదరాబాదు […]

అంతరంగం

రచన: శ్రీకాంత గుమ్ములూరి ఆరేళ్ళ అప్పూ అమ్మ కోసం అన్ని దెసలా వెతికాడు. అమ్మ కన్పించలేదని ఏడ్చి ఏడ్చి అలిసిపోయాడు. ఇంటా బయటా వాడంతా వెతికి వెతికి వేసారిపోయాడు . తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుని ఇంటివైపుకి నడిచాడు. చిమ్మ చీకట్లు. చీకట్లో చింత చెట్టు చింతాగ్రస్తంగా చిరుకొమ్మల్ని అటూ ఇటూ కదలిస్తోంది. మనసంతా అంధకారం అయోమయం. నిజంగానే అమ్మ తననలా ఒదిలిపెట్టి వెళ్లి పోయిందా? తాను చేసిన పనికి కోపం వచ్చే అలా వెళ్లిపోయిందా? అమ్మ కనబడగానే […]

అరుణోదయం

రచన: కర్రా నాగలక్ష్మి మధ్యాహ్నం మూడయింది, మంచం మీద నడుం వాల్చిందన్నమాటే గాని కళ్లు మూతలు పడటం లేదు . అంతూపొంతూ లేని ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి అలకలో . గత మూడు సంవత్సరాలుగా తన జీవితంలో జరిగిన మార్పులు తనని అంధకారంలోకి నెట్టేసేయి . ఎందుకిలా జరిగింది అని ప్రశ్నించుకుంటే విధిలిఖితం అని తప్ప మరో సమాధానం రాలేదు . మూడేళ్ల కిందట యెర్రని పారాణి కాళ్లకు పెట్టి ఫెళ్లున ఆకాశమంత పందిరి వేసి అయిదు […]

పెళ్లి

రచన: అప్పరాజు నాగజ్యోతి సాయిగార్డెన్స్ లో విశాల్, శిల్పల పెళ్లి జరుగుతోంది. ఒక వేపు పెళ్ళికూతురు తల్లితండ్రులైన సుమతి, రాజారావులు పెళ్ళికొడుకు తరఫు వారికి జరగవలసిన మర్యాదలకి ఏ లోటు లేకుండా చూసుకునే హడావిడిలో ఉంటే, మరో వేపు పెళ్ళికొడుకు అమ్మానాన్నలైన ఉష , భానుమూర్తీ తమ వైపు నుండి వచ్చిన ముఖ్యులందరినీ స్వయంగా రిసీవ్ చేసుకుంటున్నారు. పెళ్ళికి వచ్చినవారిని నవ్వుతూ పలకరిస్తున్నప్పటికీ “కొడుకు పీటల మీద ఏం పేచీలు పెడతాడో, ఈ పెళ్లి సవ్యంగా జరుగుతుందో, […]

అమ్మ రాసిన వీలునామా

రచన: పద్మా త్రివిక్రమ్ ప్రియాతి ప్రియమైన నా బంగారు తల్లికి, ప్రేమతో నీ పుట్టినరోజునాడు అమ్మ ఆశీర్వదించి వ్రాయు వీలునామా. నాకు అన్నింటికీ తొందరే అనుకుంటున్నావా, అవునే, నీలాగే నాకు తొందరెక్కువే… ఏమి చేస్తాము చెప్పు, అప్పుడే నీకు ఇరవయ్ రెండో పుట్టినరోజా, అసలు నాకు బొత్తిగా నమ్మబుద్ది కావట్లేదు. ఏ పసిపిల్లల్ని చూసినా, ఏ స్కూల్ కి వెళ్ళే పిల్లలని చూసినా నువ్వే గుర్తుకు వస్తావు. ఆ తప్పటడుగులు, ఆ చిలకపలుకులు, ఆ ప్రశ్నించే విధానం, […]

బెస్ట్ ఫ్రెండ్

రచన: లక్ష్మీ YSR “అమ్మా!నాకు 500రూపాయలు కావాలి. “అన్నాడు మూడవ తరగతి చదువుతున్న 7యేళ్ళ చింటూ. “ఎందుకురా?”అడిగింది విజయ. “న్యూ ఇయర్ వస్తోంది కదా!మా ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోటానికి” “మీరా?పార్టీనా”ఆశ్చర్యంగా అడిగింది విజయ. “మేమే! చేసుకోకూడదా?” “నీ కిలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది?” “ఆ రోజు డాడీ పార్టీకని బయటకు వెళ్ళిపోతారు. అన్నయ్య అంతే. నువ్వేమో టివి లో కొత్త ప్రోగ్రాములు వస్తాయని చూస్తా కూర్చుంటావు. పిలిచినా పలకవు. మా ఫ్రెండ్స్ అందరూ న్యూ ఇయర్ […]

నా పక్కనే ఉన్నావు గదరా

రచన, సంగీతం, గానం: శ్రీనివాస భరద్వాజ్ కిశోర్ (కిభశ్రీ) ఎక్కడో దూరాన గిరిపై ఎక్కి కూర్చున్నావనందురు చక్కగా ఓస్వామి నువు నా పక్కనే ఉన్నావురా ఎత్తి తల చుట్టూర చూడగ మొత్తమగపడు నీలిగగనము ఉత్తముడ నీ రూపమే అది చిత్తరువువలెనుండెగదరా మొక్కలందూ మానులందూ రెక్కలుండిన పక్షులందూ ఎక్కడెక్కడ చూడదలచిన అక్కడగుపించేవుగదరా మొక్కుటకు గుడి గోపురమ్ములు అక్కరేలర భక్తితోడను ఎక్కడున్నా నిన్ను మనసున నిక్కముగ నిలిపేనుగదరా కుమ్ములాటల మధ్యనొకతోల్ బొమ్మలాటైయున్న బతుకిది నమ్మకము ననుబ్రోతువన్నది వమ్ము చేయవు తెలుసుగదరా […]

జయలలిత.

రచన: డా.బల్లూరిఉమాదేవి. మేదినందు జూడ మైసూరు సీమలో మేలుకోటి చెంత పాండవపురాన జయరామునకు పత్ని వేదవల్లకినీ కోమలవల్లి తా కూతురయ్యె నావల్లియే పెరిగి జయలలితయ్యె కూర్మిపంచుచు తా కన్నవారికచట చిరుతప్రాయమందె తండ్రి మరణించంగ చెన్నపురిని చేరె తల్లి యావేదవల్లి చిత్రసీమలోన కాలూనె జయలలిత పదునైదు యేడుల ప్రాయమందే దక్షణాది యందు నగ్రతారలచెంత నాయిక యై నటించి మన్ననందె తెలుగు తమిళ కన్నడ భాషలందు నటియించి మెప్పించె నఖిల ప్రేక్షకులను పరస్కృతులు బహుమతులంది చిత్రజగతిని రిడు దేశప్రగతినికోరి రాజకీయములందు […]

గొర్ల మంద

రచన:కృష్ణ మణి నేనే పరాన్నజీవిని పరాన్నబక్కు అని కూడా అంటారు ఏదైతే ఏందిరాబై మంది మీద బతుకుడే గదా మనమందరమూ సోదరా అవును బై పక్కొల్లది గుంజుకు తింటేగని నిద్రబట్టదు అయితేంది ? అట్లా కాదుగని ఒక్కసారి ఆలోచించు సృష్టిలో జీవులన్నీ పరాన్నజీవులు కాకుంటే ఏం జరిగేదో ఏమయితుండేబై సముద్రంలో చేపలు నిండి నీళ్లన్నీ పైకొచ్చి జమీనుని ముంచి ఈ భూగోళం ఒక వింత ఆకృతితో పంది మసలినట్లు ఉండేది మనిషి ఎంతకాలమని నీటిమీద బతుకుతడు ఎన్నడో […]