March 28, 2023

చందమామ పాటలు 1

కూర్పు: మురళీకృష్ణ మామలకు మామ చందమామ. చిన్నపిల్లలకు బువ్వ తినిపించడానికి ఆ మామను పిలుస్తారు తల్లులు. ప్రేయసీప్రియులు చందమామ ద్వారా తమ ప్రేమ సందేశాలను ఇచ్చిపుచ్చుకుంటారు. భార్యాభర్తల అన్యోన్య దాంపత్యంలో చందమామ తన వంతు సాయం చేస్తూనే ఉంటాడు. చందమామ చల్లగానూ ఉంటాడు. వేడిగానూ ఉంటాడట. ఆశ్చర్యంగా ఉంది కదా. మన తెలుగు సినిమాలలో చందమామ ప్రస్తావనలో వచ్చిన పాటలను గూర్చి తెలుసుకుందాం. ఈ పాటలలో సంగీతం, సాహిత్యం, అభినయానికి కూడా పెద్ద పీట వేసారు. సంగీత, […]

ఎందుకీ మహిళా దినోత్సవాలు??

రచన: శ్రీమతి నిర్మల సిరివేలు అణకువ కలగిన ఇల్లాలుగా, ప్రేమను పంచే మాతృమూర్తిగా , స్నేహాన్ని పంచే ఆత్మీయ వ్యక్తిగా ఉన్న ఒక మహిళ మహిళా దినోత్సవాల సందర్భంగా మొదటిసారిగా తనలోని ఆలోచనలను, భావాలను ఎంత అందంగా వ్యక్తీకరించారో చూడండి. పెద్దలకు, ఇంకా పెద్దలకు, ఈ సభకు వచ్చినందుకు మీకందరికి మా ధన్యవాదాలు. స్త్రీ శక్తి స్వరూపిణి. అన్నింటా తెలివిగలది. చదువులో, వంటలో, తల్లిగా, భార్యగా, చెల్లిగా, ఇల్లాలిగా అందరి మన్ననలు అందుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నది. […]

తేనెలొలుకు తెలుగు-1

రచన: తుమ్మూరి రామ్మోహనరావు మాలిక పాఠకులకు నమస్సులు. తేనె కడలి తెలుగు మాట పూల పడవ తెలుగు పాట వెన్నెలగని వెలుగు బాట వెన్న పూస తెలుగు భాష నన్నయాది కవులచేత వన్నెతీర్చబడిన భాష అన్నమయ్య పదములతో అందగించబడిన భాష కన్నడభూరమణునిచే సన్నుతించబడిన భాష దేశభాషలందు తెలుగు లెస్స ఎన్నబడిన భాష త్యాగరాజు కీర్తనలతొ రాగమయిన యోగభాష రామదాసు భజనలలో రంగరింపబడిన భాష పద్యమందు గద్యమందు హృద్యముగా నిముడు భాష చోద్యమొప్ప గేయములో జయమునొందె జనులభాష అని […]

సినీ ‘మాయా’లోకం 1 – సైరాట్

రచన: సరితా భూపతి సైరాట్ అంటరానితనం, కులాంతర ప్రేమ వివాహాలు తరహాలో వచ్చిన సినిమాలు తక్కువే. అలాంటి సినిమాలు రావాలంటే ముందు ఇండస్ట్రీలో కులం పట్టింపులు పోవాలేమో! డబ్బు, పదవి, కుల అహంకారాన్ని ఎదిరిస్తూ, పెద్ద హీరోలు, భారీ డైలాగులు, డాన్సులు, వెకిలి కామెడీలతో ఏ మాత్రం సంబంధం లేకుండా అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ కి దూరంగా విభిన్నంగా వచ్చిన మరాఠీ సినిమా “సైరాట్”. కుల ద్వేషాల వల్ల జరిగే భయంకర విధ్వంసాలు ఎలా ఉంటాయో చూపటానికి, […]

ఆదర్శ మహిళా శాస్త్రవేత్త మేరీక్యూరీ

రచన: శారదాప్రసాద్ (మేరీక్యూరీ దంపతులు) రెండు సార్లు నోబెల్‌ బహుమతి పొందిన మేరీక్యూరీ తన అద్వితీయ ప్రతిభాపాటవాలతో రేడియంను కనుగొన్న గొప్ప శాస్త్రవేత్త . రెండు శాస్త్రాల్లో నోబెల్‌ బహుమతి అందుకున్న అరుదైన ఘనత అమెకే దక్కింది. 1903 ఫిజిక్స్‌లోను, 1911లో కెమిస్ట్రీలోను నోబెల్‌ బహుమతులు పొంది సరికొత్త చరిత్రను సృష్టించింది. 1857లో ఒక బానిస దేశంగా ఉన్న పోలండ్ లో ఒక సామాస్య కుటుంబలో జన్మించింది మేరీక్యూరీ. బాల్యంలో ప్రతిభావంతమైన విద్యార్థిగా గుర్తించబడినా పేదరికం వల్ల […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 25

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య ఊరకనే ఉన్న శాస్త్ర గ్రంధాలన్నీ చదవడం ఎందుకు అందులో ఉన్నదంతా బుర్రలోకి ఎక్కించుకుని బాధపడడం ఎందుకు అని వ్యంగ్యంగా బోధిస్తున్నాడు అన్నమయ్య ఈ గీతంలో. ఇక్కడ మనం ఒక సంఘటనను గుర్తుచేసుకోవ్చ్చు. ఆదిశంకరులు ఓ రోజు దారిలో నడచి వెళ్తూ ఉండగా ఒక పండితుడు “డుకృంకరణే” అంటూ సంస్కృత వ్యాకరణం వల్లె వేస్తూ కనిపించాడు. మహాత్ములకున్న సహజమైన కనికరం వల్ల శంకర భగవత్పాదులు అతడ్ని సమీపించి ఇలా అన్నారు.”భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే! […]

ఒక ప్రాతః వేళ

రచన: రామా చంద్రమౌళి ఒక సీతాకోక చిలుక వచ్చి భుజంపై వాలినట్టనిపించి చటుక్కున మెలకువ వస్తుంది నిజానికి ప్రతిరాత్రీ నిద్రపోవడం ఎంత చిత్రమో మర్నాడు మనిషి మేల్కొనడం అంతకన్నా విచిత్రం జీవించీ జీవించీ అలసి రాతిశరీరాలతో తిరిగొచ్చిన తర్వాత ఏమి కనిపిస్తాయి .. అన్నీ ఖండిత స్వప్నాలు .. రక్త రేకులు తప్పితే ఎవరో తరుముతున్నట్టు ఎవరో ప్రశ్నిస్తున్నట్టు ఎవరో లోపల నిలబడి గునపంతో తవ్వుతున్నట్టనిపిస్తున్నపుడు కళ్ళుమూసుకుని మాంసవిగ్రహమై నిద్ర మోసుకొచ్చే రాత్రికోసం నిరీక్షణ తనకోసం తను […]

అప్పుడు – ఇప్పుడు

రచన: భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు. అప్పుడు-ఇప్పుడు అమ్మ అప్పుడు అంతర్యామిగా అమ్మ, ఇప్పుడు అంత్యదశలో అమ్మ. అప్పుడు ఆదిశక్తిలా అమ్మ, ఇప్పుడు అత్యల్పప్రాణిలా అమ్మ. అప్పుడు దీనార్తపరాయణియై అమ్మ, ఇప్పుడు దీనాతిదీనంగా చూస్తూ ఆమ్మ. అప్పుడు అందరినీ ఘనంగా చూసిన అమ్మ, ఇప్పుడు అందరితో హీనంగా చూడబడుతున్నఅమ్మ. అప్పుడు కంటికిరెప్పలా మనని కాపాడిన అమ్మ, ఇప్పుడు కంటికి మింటికి ధాటిగా ఏడుస్తూ అమ్మ. అప్పుడు జడలో పువ్వులతో అమ్మ, ఇప్పుడు కంటిలో పువ్వులతో అమ్మ. అప్పుడు తన […]

మత్తు వదలరా

రచన: కొసరాజు కృష్ణప్రసాద్ పరుచుకున్న చీకటి, ప్రయాసతో గర్భిణి, పర్లాంగులో ఆసుపత్రి, మధ్యలో మద్యం షాపు! మత్తులో మందు బాబులు, వళ్లు తెలియని కామాంధులు, మఱ్ఱెల మధ్య మానభంగం, ఆక్రందనాల అమావాస! మద్యం షాపులో కాసుల గలగల, మానభంగమై బాధిత విలవిల, మద్యం డబ్బుతో నిండెను ఖజానా, బాధితకందెను పరిహార నజరానా! మారే ప్రభుత్వాలు, మారని ఆలోచనలు, ఖజానాపై దృష్టి జాస్తి, గోడుపై మాత్రం నాస్తి. మద్యంతో వచ్చిన డబ్బుతో ఆరోగ్య, సంక్షేమ పథకాలా?! ఇది కొనితెచ్చుకున్న […]

స్వాగతం

రచన: ములుగు లక్ష్మీ మైథిలి ప్రత్యూష కాంత నీలి వస్త్రం ధరించి మేలి పొద్దును స్వాగతిస్తోంది చైత్ర మాసపు గానరవళులతో తెలుగుతనపు మధురభావనలతో తొలిపండగ తెలుగువారి ముంగిట్లో శ్రీకారం చుట్టింది. ఏ చిత్రకారునికి అందని మనోహరదృశ్యం .. పచ్చ పచ్చని లేమావి చివురులు అరవిచ్చిన మల్లెల గుబాళింపులు ఆమని రాకతో ప్రకృతిశోభ ద్విగుణికృతమైంది మనుగడలో మకరందాన్ని నింపి షడ్రుచుల పరమార్ధం తెలిసేలా జీవితంలో వసంతమై రావమ్మా.. తెలుగు తల్లిని వేనోళ్ళ కీర్తిస్తూ మాతృభాష కు అక్షర హారతులతో […]

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

April 2018
M T W T F S S
« Mar   May »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30