April 27, 2024

గిరిజా సదన్

రచన: ప్రభావతి పూసపాటి “కాత్యాయిని” ప్రశాంతం గా వున్న “గిరిజాసదన్” లో ఒక్కసారి మారుమోగినట్టు వినిపించింది ఆ పేరు. గిరిజాసదన్ స్థాపించింది నేనే అయినా అంతా తానే అయి చూసుకొంటున్నారు రామనాథంగారు. గిరిజాసదన్ కేవలం ఎవరి పిల్లలు ఉద్యోగరీత్యా విదేశాల్లో స్థిరపడిపోయారో అక్కడ జీవన విధానంలో ఇమడలేని వారి తల్లితండ్రులకి మాత్రమే ఆశ్రయం కల్పిస్తుంది. అందుకు ఇక్కడికి చేర వచ్చేవారి వివరాలు పూర్తిగా తెలుసుకొంటే కానీ వసతి కల్పించరు రామనాధంగారు. ఆ వివరాలు సేకరిస్తున్నారు. “కాత్యాయిని” ఈ […]

రాములమ్మ- బంగారు కమ్మలు

రచన: డా. కె. మీరాబాయి నేను కాలేజీ నుండి వచ్చేసరికి అలవాటుగా మా ఇంటి గుమ్మం ముందు కూర్చుని ఎదురు చూస్తోంది రాములమ్మ. గేటు తాళం తీసి లోపలికి రాగానే కొబ్బరి పొరక చేతపట్టి ఇంటి ముందున్న కడప బండల మీద రాలిన సుంకేసుల చెట్టు ఆకులు వూడవడం మొదలు పెట్టింది. ” వచ్చి ఎంత సేపు అయ్యింది రాములమ్మా? అందరింట్లో పని అయిపోయిందా? ” ముందు గదికి వేసిన తాళం తీస్తూ యథాలాపంగా అడిగాను. ” […]

చిన్న బతుకులు

రచన -డా. లక్ష్మీ రాఘవ రామయ్య కాలుచాపి దారం పేడుతూ కూర్చున్నాడు. “ఎన్ని దారాలు పేడుతావు? బయట పోయేది లేదు, పైసా సంపాదనా లేదు. ఇంట్లో పొయ్యి ముట్టించి ఎన్నాళ్ళయిందో… రోజువారీ ఎవరో ఒకరు రోడ్డు మీద పంచినప్పుడు తినడమే. రాత్రిపూట అదీ గతిలేదు” భార్య శివమ్మకు ఏడుపు ఆగటం లేదు. “ఏడ్చినా పని దొరుకుతుందా? బయటకే పోకూడదాయే ఏమి చెయాల?” అన్నాడు చెప్పులు కుట్టే రామయ్య శివమ్మను జాలిగా చూస్తూ. రోడ్డు మీద చెప్పులు కుట్టి, […]

చంద్రోదయం – 6

రచన: మన్నెం శారద ఆ అమ్మాయి సారధి వైపు చూసి వూరుకుంది. సినిమా జరుగుతున్నా తమకదేం పట్టనట్లు అమ్మాయిలంతా పెద్దగా జోక్ చేసుకుంటూ, రకరకాలుగా గట్టిగా నవ్వుతూ, పాప్‌కార్న్ నములుతూ సినిమా చూస్తున్నారు. సారధికి అసహ్యంగా వుందా వాతావరణం. సినిమా బాగుంది. వాళ్ల అల్లరివల్ల సరిగా ఫాలో కాలేకపోతున్నాడు. స్వాతి వంక చూసేడు. ఆ అమ్మాయి ఏమీ పట్టనట్లు సినిమా చూస్తోంది. ఇంటర్వల్‌లో చాలా అర్జెంటు పని వున్నట్లు అందరూ లేచారు. స్వాతి లేవలేదు. “స్వాతి, బయటకు […]

” ఇస్పేటు రాజు ❤ ఆఠీను రాణి”

రచన: గిరిజారాణి కలవల ” కంచం ముందు కూర్చుని ఏం ఆలోచిస్తున్నావురా ? నెయ్యి వేసాను, ముక్కలు కలుపు” అంటూ కొడుకుని గదిమింది సావిత్రి. ” ఏంటీ ముక్కలు వేసావా? కోసిందెవరూ? జోకరేంటీ ? ” అన్నాడు రాజు. ” ఏడిసినట్టే ఉంది నీ జోకు.. జోకరట, జోకరు, పొద్దస్తమానం ఆ పేకముక్కల్లో పడి దొర్లుతూంటే, కంచంలో వేసినవి కూరముక్కలని కూడా తెలీకుండా ఉంది నీ బుర్రకి. నా ఖర్మ కొద్దీ దొరికారు ఆ తండ్రీ, ఈ […]

అమ్మమ్మ – 16

రచన: గిరిజ పీసపాటి నాగకు, పాపాయికి ఇరవై ఒకటవ రోజున పెద్ద పురిటి స్నానం చేయించారు. పిల్ల పుట్టిన ఇరవై నాలుగవ రోజు పీసపాటి తాతయ్య మక్కువ వచ్చి మర్నాడు మంచిరోజు కనుక, భార్యని, కోడలిని, మనుమరాలిని రాముడువలస తీసుకెళ్తానని, ఇన్నాళ్ళూ నాగను తమ ఇంట కన్న బిడ్డకన్నా ఎక్కువగా చూసుకుని పురుడు పోసినందుకు డాక్టర్ గారికి, వారి భార్యలిద్దరికీ కృతజ్ఞతలు తెలిపి, బారసాలకి తప్పకుండా రమ్మని ఆహ్వానించారు. మర్నాడు అంటే ఇరవై ఐదవ రోజున నాగను, […]

మనసున సుగంధం నింపిన అక్షరపూదోట

సమీక్ష: సి. ఉమాదేవి పోలాప్రగడ రాజ్యలక్ష్మిగారు జగమెరిగిన రచయిత్రి. వారి సాహితీప్రస్థానంలో బహుమతులు, బిరుదులు, పురస్కారాలు అనేకం అందుకున్న రచయిత్రి. సాహితీబాటలో వారందుకున్న సన్మానాలకు తప్పక అభినందించాలి. వీరి కథలలో అంతర్లీనంగా ప్రవహించే సామాజికాంశాలు కుటుంబసభ్యులకు బాధ్యతలను, విలువలను, బంధాలను గుర్తుచేస్తాయి. వీరి అక్షరనావలో పన్నెండు నవలలు, ఆరు కథాసంపుటాలు నిక్షిప్తం గావించబడ్డాయి. వీరి రచనలపై పి. హెచ్. డి, ఎమ్. ఫిల్ పరిశోధనలు చేసిన వారున్నారు. లోపాముద్ర బిరుదు, రమ్యకథారచయిత్రి బిరుదులు వీరందుకున్నారు. బెజవాడ గోపాలరెడ్డిగారు […]

చేనేత మొగ్గలు

(ఆగష్టు7 న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా) రచన- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ నాగరిక మనిషి నగ్నత్వాన్ని వస్త్రాలతో కప్పుతూనే సమాజానికి హుందాతనాన్నిచ్చే సాంస్కృతిక పతాక దేహసంరక్షణకు పాటుపడిన చేతివృత్తి చేనేతరంగం బంగారు జలతారులతో సీతాకోకచిలుకల బొమ్మలను చీరంచులకు సుందరంగా నేసి వెలుగులు విరజిమ్ముతారు పసిడివెన్నెల వెలుగుజిలుగులు చేనేత పట్టుచీరలు బతుకంతా అప్పుల ఊబిలోనే కూరుకుపోతూనే మగ్గం గుంతలోనే పానాలను వదులుతుంటరు నేత నేసిన మగ్గం గుంతలే నేతన్నలకు సమాధి విదేశీవస్త్రాల మోజులో స్వదేశీ నూలువస్త్రాలను మరచి […]