May 25, 2024

మరమనిషి

రచన: ప్రభావతి పూసపాటి “ఉన్నపళంగా బయలుదేరి రా ప్రమీలా! మీ అన్నయ్య అన్నంత పని చేసేలా వున్నారు” ఫోన్ లో దాదాపుగా అరుస్తున్నట్టు అంది లలిత. “రేపు శనివారం సెలవుకదా వస్తానులే” కొంచెం నిదానంగానే జవాబిచ్చాను. “లేదు ప్రమీల మీ అన్నయ్య ఈసారి చాలా దృఢ నిశ్చయంతో వున్నారు, బహుశా అన్ని మాట్లాడి వచ్చినట్టు వున్నారు, ఈసారి మాత్రం నేను ఎంత చెప్పిన వినిపించుకునే స్థితిలో లేరు “లలిత ప్రాధేయ పడుతోందో తెలియపరుస్తోందో తేల్చుకొనేలోపు ఫోన్ డిస్కనెక్ట్ […]

శునకం నవ్వింది

రచన: రాజ్యలక్ష్మి బి చైతన్యకు కుక్కలంటే పరమ అసహ్యం చదువుకునే రోజుల్లో రాత్రిపూట అందమైన కలలు కంటూ నిద్ర పోయే సయం లో ఒక కుక్క వల్ల తనకు జరిగిన అవమానం తల్చుకుంటే యిప్పటికీ కంపరమేస్తుంది చైతన్యకు ఒకరాత్రి ఒక కుక్క సరిగ్గా చైతన్య దుప్పటి కప్పుకుని తన కాలేజీలోని అందమైన వసంతను తల్చుకుంటూ తియ్యటి కల కంటున్నాడు అది అర్ధరాత్రి సమయం ఒక కుక్క మొరిగి మొరిగి అరిచీ అరిచీ చివరకు తనను యెవరూ పట్టించుకోవడం […]

చెద

రచన: శైలజ నానిశెట్టి వసంత ఆ రోజు పొద్దుటే ఫోన్ చేసి చెల్లెలు వేద దగ్గరికి వచ్చింది. వేద వయస్సు యాభై పైన. ఓ అయిదేళ్ల క్రితం భర్త సంతోష్ ఆక్సిడెంట్లో పోయాడు. అప్పటికే ఇంజనీరింగ్ చదువుతున్న పెద్ద కొడుకు విక్రమ్, టీనేజ్ లో అడుగు పెడుతున్న రెండో కొడుకు విశ్వాస్ తల్లిని జాగ్రత్తగా చూసుకొన్నారు. భర్త పోయినప్పటి నుండి, వేద ఎక్కడికీ రావడం మానేసింది. భర్త అకాల మరణం ను భరించలేకపోయింది. ఎంత బతిమాలినా, బలవంత […]

దేవీ భాగవతం – 1

రచన: వోలేటి స్వరాజ్యలక్ష్మి శుభమస్తు ఓం గణేశాయనమః అవిఘ్నమస్తు దేవీ స్తుతి శ్లో.1 నమో దేవ్యై మహాదేవ్యై శివాయైు సతతం నమః నమః ప్రకృత్యై భద్రాయైు నియతాః ప్రణతాః స్మతామ్‌ శ్రీమద్దేవీ భాగవతము నందు వేదములు స్వయంగా భగవతీ దేవిని ఈ విధముగా స్తుతించినవి. శ్లో.2 నమో దేవి మహా మాయే విశ్వోత్పత్తి కరే రామ్‌। నిర్గుణే సర్వభూతేశి మాతః శంకర కామదే ॥ త్వం భూమిః సర్వభూతానాం ప్రాణః ప్రణవతాం తథా । ధీః శ్రీః […]

విశ్వపుత్రిక వీక్షణం – రుబాయీలు

రచన: డా.పి.విజయలక్ష్మిపండిట్ 1. మనుషుల మనసులను చదవలేమని తెలుసుకో కవిత్వాన్ని నిర్వచించడం కూడా అంతేనని తెలుసుకో, నా గుండెలో కొట్లాడుతున్నాయి ఆలోచనా విహంగాలు నీవు వాటిని పట్టి బంధించి పసికట్టలేవని తెలుసుకో. 2. నీ పుట్టుక పెంపకం పరిసరాల పదనిసలే నీ కవిత్వం నిన్ను నీ వ్యక్తిత్వాన్ని ప్రదర్సించే దర్పణం నీ కవిత్వం, నీ కవిత్వం నీతో కూడా నడిచే నీ అక్షరసహచరి కాదా నీ జీవిత అనుభవాల అక్షర రూపమే కదా నీ కవిత్వం. 3. […]

విహారయాత్రలు ( మలేషియా ) – కౌలాలంపూర్

రచన: నాగలక్ష్మి కర్రా కౌల అంటే రెండు నదులు కలిసిన ప్రదేశం లేక నది సముద్రంలో కలిసిన ప్రదేశాన్ని స్థానిక భాషలో ‘ కౌల‘ అని అంటారు, ‘లంపోర్‘ అంటే బురద అని అర్ధం. కౌలాలంపూర్ కి ఒక కిలోమీటరు దూరంలో ప్రవహిస్తున్న ‘లంపూర్‘, నది ‘ గోంబర్‘ నదిలో కలుస్తోంది 1857 లో ఈ ప్రాంతం సెలంగోరు సుల్తాను పరిపాలనలో ఉండగాగోంబర్ నది క్లాంగ్ నదీ సంగమ ప్రాంతంలో టిన్ను గనుల త్రవ్వకాలు అప్పటి సుల్తాను […]

పివి మొగ్గలు

రచన:- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ నాడు దూరదృష్టితో నాటిన విదేశాంగ విధానాల పాదులు నేటికీ అంతర్జాతీయ బంధాలను సుసంపన్నం చేస్తున్నాయి ఆధునికవాణిజ్యానికి తెరలేపిన నవీన మార్గదర్శకుడుపివి రాజకీయంలో ఎప్పుడూ మౌనభాషియై ఒప్పారుతూనే అనేకవిమర్శలకు మౌనంతోనే సమాధానమిచ్చిన ఘనుడు మౌనాన్ని అలంకారప్రాయంగా ధరించిన జ్ఞానశిఖరం పివి భారత రాజ్యాంగాన్ని భారత సంవిధానంగా అనువదించి ఆంగ్లచట్టాలను తెలుగులోకి మార్చమన్న భాషాభిమాని తెలుగు భాషకు గండపెండేరం తొడిగిన ఠీవి మన పివి కలుషితమయిన రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తులు వేసి ఐదు సంవత్సరాలు […]

అగస్త్య మహర్షి

రచన: శ్యామసుందర్ రావు ఈ రోజుకి కూడా తల్లులు వారి పిల్లలకు ఆహారాన్ని పెట్టి ,”జీర్ణము, జీర్ణము వాతాపి జీర్ణము”అని అంటూ ఉంటారు ఎందుకో తెలుసా? అగస్త్యుడు వాతాపి అనే రాక్షకుడిని తిని జీర్ణించుకుంటాడు కాబట్టి తల్లులు వారి పిల్లలకు కూడా ఆవిధమైన జీర్ణ శక్తి కావాలని కోరుకుంటూ అగస్త్య మహర్షిని స్మరించుకుంటారు. అలాగే భారతావనిలో అనితర సాధ్యమైన మహత్కార్యాలను చేసిన మహాత్ముడు అగస్త్యుడు ఎన్నో ఇతిహాసాలు, పురాణాలలో కనిపిస్తాడు.ముఖ్యముగా రామాయణ, మహాభారతాలలో అయన ప్రస్తావన వస్తుంది […]