May 9, 2024

ఎవరు మారాలి?

రచన: రామలక్ష్మి కొంపెల్ల అనగనగా ఒక చిన్న ఊర్లో ఒక రైతు. పేరు సుబ్బయ్య. ఆయనకు ఒక కొడుకు. వాడి పేరు రాజు. అదే ఊరిలో ఉన్న జిల్లా పరిషత్ బడిలో ఆరో తరగతి చదువుతున్నాడు రాజు. అదే తరగతిలోని వేణుతో రాజుకి మంచి స్నేహం. వేణు తండ్రి అదే బడిలో ఉపాధ్యాయుడు. అతని పేరు రఘురామ్. పిల్లలకు ఎన్నో మంచి విషయాలు బోధించి వాళ్ళను సన్మార్గంలో పెట్టడానికి శాయశక్తులా కృషి చేసే ఉన్నతమైన వ్యక్తిత్వం కలవాడు […]

ఉరూరి – ఉరూరి

రచన: మంగు కృష్ణకుమారి రామారావుగారికి నలుగురు పిల్లలు.‌ కొడుకు విజయ్, తరవాత కవలలు వసంత, కవిత. ఆఖరి పిల్ల చిన్నారి. నలుగురు పిల్లలతో ఇల్లు కళకళలాడుతూ ఉండేది. అందరిలోకీ చిన్నది చిన్నారి. దీని అసలు పేరు రాధిక. అయినా అందరూ ‘చిన్నారీ’ అనే పిలుస్తూ ఉంటారు. ఈ చిన్నారి అందరికన్నా బాగా చిన్నదేమో ఇంట్లో అందరికీ చాలాముద్దు. చిన్నపిల్ల కదాని ఏదైనా ముందు దానికే ఇస్తారు. వాళ్ల నాన్నమ్మ, “నీ కోసమే ఈ‌స్వీ ట్ చేసేనే, ఈ […]

కర్ణాటక సంగీతంలో రాగమాలికలు – 7

రచన:- శ్రీమతి రామలక్ష్మి కొంపెల్ల ఈ సంచికలో మనం సెమీ క్లాసికల్ (తెలుగులో అర్ధ శాస్త్రీయమైన అని చెప్పచ్చు) రచనల్లో రాగమాలికల గురించి చర్చించుకుందాము. ఒక సంకీర్తన లాగా పాడే రచనలు అన్నీ కూడా ఈ విభాగంలో చేర్చుకోవచ్చు. శాస్త్రీయ సంగీతం విషయంలో రాగం, తాళం అన్నీ కూడా చాలా సాధన ద్వారా నేర్చుకుని, వాటిని ప్రదర్శించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా, నియమబద్ధంగా ప్రదర్శించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కానీ, సెమీ క్లాసికల్ రచనలు, భక్తిరసం తో […]

అన్నమాచార్యులు – హరి నీవే సర్వాత్మకుఁడవు

వ్యాఖ్యానము: చామర్తి శంకర నాగ శ్రీనివాస్   ఉపోద్ఘాతము: అన్నమాచార్యుల వారు ఈ కీర్తనలను సత్యమునకు దారి చూపు దివిటీలుగా మార్చి వ్రాసిరి. వారు ఆ వ్యక్తం చేయలేని భావనా స్థితి నుండి ప్రపంచమునకు సెలవిచ్చిన ఈ కీర్తనలను, ముఖ్యంగా అన్నమాచార్యుల అంతరంగమును పరిశీలించక; కేవలము పదముల అర్థములను విశదీకరించుట వలన ప్రయోజనం చేకూరదు. వారు తమ కాల పరిస్థితులకు దృష్టిలో ఉంచుకొని తమ విప్లవాత్మక ఉద్దేశములను సంప్రదాయము అను తెరల వెనుక దాచి ఉంచిరి. అతి […]

చివరి బోధ

రచన: నండూరి సుందరీ నాగమణి ఖిన్నుడై కూర్చుండిపోయిన మోహన్, తనకు వాట్సాప్ మెసేజ్‌లో వచ్చిన సమాచారాన్ని చూసి, నమ్మలేకపోయాడు. అప్పుడే కాఫీ కప్పుతో లోపలికి వచ్చిన సువర్చల పాలిపోయినట్టున్న భర్త ముఖం చూసి, అనుమానంగా “ఏమైంది?” అని అడిగింది. వెంటనే నోట మాట రాలేదు మోహన్‌కి. తడబడుతూ, ఏదో చెప్పబోయి ఆగి నుదురు రాసుకున్నాడు బాధగా. తరువాత గొంతు పెకలించుకుని, “మా సీనియర్ కొలీగ్ పద్మనాభంగారని చెబుతూ ఉంటానే, ఆయన ఈ రోజు ఉదయమే చనిపోయారట…” అన్నాడు […]

మనసు యొక్క ప్రాశస్థ్యం

రచన: సి.హెచ్.ప్రతాప్ మనసుపై ఆధిపత్యం సాధించినవాడే విజయుడు. మానసిక చిత్తవృత్తులను నిరోధించటమే మహారాజయోగం. మానవుడు నడవడిక మనసుపై ఆధారపడుతుంది. మనసే మానవుడుకి మకుటంలేని మహారాజు. మనస్సే మానవుడుకి మంచి మిత్రుడు, శత్రువు కూడా అవుతుంది. మనస్సును, చిత్తవృత్తులను నిరోధించడం కష్టసాధ్యమే అయినా అసాధ్యం మాత్రం కాదు. యోగం, ధ్యానం, ప్రాణాయామాలతో మనస్సును అదుపులో వుంచుకుంటే ఎన్నో అద్భుతాలను చేస్తుంది. మనస్సును నిరోధించలేకపోతే అది పరమ శత్రువుగా మారి మనలను చిత్రవధకు గురిచేస్తుంది. కేవలం మన శరీరం మీదే […]