May 1, 2024

‘కల వరం’

రచన… కలవల గిరిజారాణి. పెళ్ళిచూపుల సీన్ మొదలైంది. అసలే చక్కని పిల్లకి, తగిన అందమైన ‘అలంకారం’ తో చూడముచ్చటగా వుంది. పిల్లాడి ‘ఆకారం’, ఫర్వాలేదు, పిల్లకి ఈడూ జోడూ బాగానే వున్నాడు. అంతకు ముందే జాతకాలూ గట్రా కుదిరయానుకున్న తర్వాతే తరువాత ఘట్టం ఇది. తియ్యని స్వీట్లూ, ‘కారం’ కారంగా హాట్లూ, వేడి వేడిగా కాఫీలూ, చల్ల చల్లగా కూల్ డ్రింకులూ సేవించిన పిదప ముఖ్యమైన ఘట్టానికి ‘ఆవిష్కారం’ మొదలయింది. అదే బేరసారాలు. అన్నీ కుదిరితే పెళ్ళికి […]

అమ్మమ్మ – 54

రచన: గిరిజ పీసపాటి కాసేపు అంతా గిరిజ కోసం వెతకగా తెలిసొచ్చిన విషయం ఏంటంటే గిరిజతో పాటు మిగిలిన పిల్లలు కూడా కనిపించట్లేదని. ఇంతలో ఒక రైతు పిల్లలంతా కలిసి మామిడి తోటకు వెళ్తూ దారిలో ఎదురయ్యారని చెప్పడంతో ‘ఈ సమయంలో కట్టకట్టుకుని తోటకు అంత దూరం వెళ్ళడమేంటి?’ అని విసుక్కుం టూనే వసంతను పెళ్ళి కూతురితో పల్లకిలో విడిది తోటకు పంపించారు. విడిది తోట ఊరికి ఒకవైపు ఉంటే, పీసపాటి వారి తోట మరోవైపున దాదాపు […]

సుందరము సుమధురము – 10

రచన: నండూరి సుందరీ నాగమణి మనకెంతో నచ్చేది పాత చిత్రాల్లోని సంగీతం. ముఖ్యంగా ఆనాటి పాటలు ఎంతో మంచి భావాలతో, మధురమైన రాగాలలో కూర్చబడి, మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని చేకూర్చుతాయని అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేనేలేదు. అప్పటి చిత్రాలలో ఏదో ఒక స్టేజి డ్రామా రూపంలోనో, వీధి భాగోతంగానో కొన్ని పాటలు ఉండేవి. వాటిల్లో ఎన్నో నీతిసూత్రాలు, సమాజానికి అవసరమైన మేలైన సందేశాలను వ్రాసి, మంచి బాణీలు కూర్చి, మన మధుర గాయనీగాయకుల చేత పాడించి, చక్కని […]

లోపలి ఖాళీ – మృత్యువు యొక్క మృత్యువు

రచన: డా. రామా చంద్రమౌళి ఎదురుగా ఎర్రగా సూర్యోదయమౌతోంది. గత రెండేళ్లుగా తమ శాస్త్రవేత్తల బృందం జరుపుతున్న జన్యు మార్పుల, జన్యు పరివర్తనల ప్రయోగాలకోసం కొలంబియా ప్రభుత్వ అనుమతితో నిర్మించు కున్న విశాలమైన ప్రయోగశాల… వసతి గృహాల సముదాయంలోని… ఒక గృహంలో… కిటికీలోనుండి తదేకంగా చూస్తోంది నలభైరెండేళ్ల డాక్టర్‌ నీల. ‘ ద సైంటిస్ట్‌’ ప్రపంచాన్ని అబ్బురపరుస్తూ మృత్యువునే పరిహసిస్తూ…మనిషికి జరామరణాలు లేని ఇమ్మోర్టాలిటీని… శాశ్వతత్వాన్ని… పెర్పెట్యువాలిటీని… మనిషికి అమర త్వాన్ని ఆపాదించగల, పునర్‌ యవ్వనాన్ని ప్రసాదించగల […]

సినీ బేతాళ కథలు – సమ్‍అంతరరేఖ

రచన: డా. వివేకానందమూర్తతి విక్రమార్కుడు మళ్లీ బేతాళుడి శవాన్ని తన భుజంమీద వేసుకుని నడక సాగించాడు. ‘విక్రా! దారిలో నీకు శ్రమ అనిపించకుండా వుండేందుకు మరో కథ చెబుతాను విను!’ అని బేతాళుడు కథ మొదలెట్టాడు – “ఆ మధ్య బరబరరాయ్ అనే తెలుగు చిత్ర నిర్మాత వొకాయన వుండేవాడు. ఆయన బరబరా, గబగబా చిత్రాలు తీసి ప్రేక్షక ప్రజల మీదికి వదిలేసేవాడు. అన్ని చిత్రాలు అట్టరు ఫ్లాపులయిపోయేవి. అయినా తరతరాల ఆస్తికి వారసుడు కావడంవల్ల అతడి […]

గ్రహణం విడిచింది!

రచన: విజయా సుందర్. కాఫీ, మంచినీళ్ళు తీసుకొచ్చిన రాధని విసుగ్గా చూసి, విద్య “నాకిలా రాగానే కాఫీ తాగాలనిపించదని ఎన్నిసార్లు చెప్పానండీ… నేనే దన్నా అనేదాకా చేస్తారు.” కోడలి మాటలకి చిన్నబోయిన రాధ, మొహంలో భావాలు కప్పిపుచ్చుకుని, “ఓపలేని పిల్లవు కదా… ఇప్పుడు అలా అనిపించదేమోలే అని తెచ్చా నమ్మా… పోనీలే మంచినీళ్లు తాగి రిలాక్స్ అవు… కాస్సేపయ్యాక మళ్లీ కలుపుతాలే” అంటూ తలుపు దగ్గరకి వేసి వచ్చేసింది రాధ. “ఎందుకే నీకింత ఆరాటం?”…కారిపోతున్న కన్నీళ్లు తుడుస్తూ […]

స్వప్నాలూ, సంకల్పాలు, సాకారాలూ – 6

రచన: డా. లక్ష్మీ సలీం అనువాదం: స్వాతీ శ్రీపాద 13. మా జీవితల్లోకి ఒక అపరిచిత ఆగమనం. మా పని మేం చేసుకుంటూ, చిన్నారిని చూసుకుంటూ గడిపేస్తున్న సమయంలో జీవితం ఒక అనుకోని మలుపు తిరిగింది. అయితే అప్పుడు నాకా విషయం తెలీదు. వింటర్ సెమిస్టర్ సమయంలో ఒక ఆంధ్రా అమ్మాయి, నాగ్, పారామెడికల్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయింది. అక్కడ నేను మాత్రమే మరో ఆంధ్రా అమ్మాయిని కావడంతో ఆమె సోదరుడు నన్ను అడిగాడు. తనకు […]

ఎవరు మారాలి?

రచన: రామలక్ష్మి కొంపెల్ల అనగనగా ఒక చిన్న ఊర్లో ఒక రైతు. పేరు సుబ్బయ్య. ఆయనకు ఒక కొడుకు. వాడి పేరు రాజు. అదే ఊరిలో ఉన్న జిల్లా పరిషత్ బడిలో ఆరో తరగతి చదువుతున్నాడు రాజు. అదే తరగతిలోని వేణుతో రాజుకి మంచి స్నేహం. వేణు తండ్రి అదే బడిలో ఉపాధ్యాయుడు. అతని పేరు రఘురామ్. పిల్లలకు ఎన్నో మంచి విషయాలు బోధించి వాళ్ళను సన్మార్గంలో పెట్టడానికి శాయశక్తులా కృషి చేసే ఉన్నతమైన వ్యక్తిత్వం కలవాడు […]

ఉరూరి – ఉరూరి

రచన: మంగు కృష్ణకుమారి రామారావుగారికి నలుగురు పిల్లలు.‌ కొడుకు విజయ్, తరవాత కవలలు వసంత, కవిత. ఆఖరి పిల్ల చిన్నారి. నలుగురు పిల్లలతో ఇల్లు కళకళలాడుతూ ఉండేది. అందరిలోకీ చిన్నది చిన్నారి. దీని అసలు పేరు రాధిక. అయినా అందరూ ‘చిన్నారీ’ అనే పిలుస్తూ ఉంటారు. ఈ చిన్నారి అందరికన్నా బాగా చిన్నదేమో ఇంట్లో అందరికీ చాలాముద్దు. చిన్నపిల్ల కదాని ఏదైనా ముందు దానికే ఇస్తారు. వాళ్ల నాన్నమ్మ, “నీ కోసమే ఈ‌స్వీ ట్ చేసేనే, ఈ […]

కర్ణాటక సంగీతంలో రాగమాలికలు – 7

రచన:- శ్రీమతి రామలక్ష్మి కొంపెల్ల ఈ సంచికలో మనం సెమీ క్లాసికల్ (తెలుగులో అర్ధ శాస్త్రీయమైన అని చెప్పచ్చు) రచనల్లో రాగమాలికల గురించి చర్చించుకుందాము. ఒక సంకీర్తన లాగా పాడే రచనలు అన్నీ కూడా ఈ విభాగంలో చేర్చుకోవచ్చు. శాస్త్రీయ సంగీతం విషయంలో రాగం, తాళం అన్నీ కూడా చాలా సాధన ద్వారా నేర్చుకుని, వాటిని ప్రదర్శించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా, నియమబద్ధంగా ప్రదర్శించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కానీ, సెమీ క్లాసికల్ రచనలు, భక్తిరసం తో […]