May 9, 2024

జగన్మాత

రచన: ప్రకాశలక్ష్మి అక్రరమాలలోని మొదటి అక్షరం”అ”. అ అంటే అమ్మేగా మరి। ఆదికి,అనాదికి మూలం అమ్మ। సమస్త సృష్టికి మాతృరూపం అమ్మ। ధరణి పైన నడయాడే దేవత అమ్మ। దుష్ట శిక్షణ , శిష్టరక్షణ చేసి, సమస్త మానవాళికి రక్షణ ఇచ్చేది అమ్మ। అమ్మ ప్రేమ అమృతం,అదేకదా ..మనకు ఆధారం పాల సంద్రం లో పుట్టిన క్షీరాబ్ధి కన్యక అమ్మ। సృష్టి స్థితి లయ కారిణి అమ్మ। ముగ్గురమ్మల మూలపుటమ్మ జగన్మాత ఆషాడమాసం బోనాలజాతరలు, శ్రావణమాస లక్ష్మీ […]

ప్రకృతి మాత

రచన: లక్ష్మీ ఏలూరి ఎవరు సారె పెట్టారమ్మా ? పుడమి తల్లికి పచ్చలకోక। అమ్మ బిడ్డలకు ఆనందమాయా। కళకళలాడుతున్న అమ్మ ముఖబింబం కాంచి। ఆర్ణవంకి ఎవరు నేర్పారమ్మా? తను పరిశుభ్రంగా ఉండి, తనలోని, జీవజాలాన్ని పదికాలాలపాటు పదిలంగా ఉంచమని। తనమీద పదేపదే తిరిగే నౌకలకు, చెత్తాచెదారం, కాలుష్యభూతాన్నివదిలి, తనకూ,తనలోని జీవజాల మనుగడకు, ఆటంకం కలిగించవద్దని చేతులు జోడించి, వేడుకుంటుంది। పచ్చల పందిరేసి, తనతో మనుగడ సాగించే పులుగూ, పుట్రకూ స్వేచ్ఛగా, జీవించనీయమని , చేతులెత్తి వేడుకుంటూ, ఆ […]

అవును.. గాలిమేడలే.. అయితేనేమి..?

రచన: ముక్కమల్ల ధరిత్రిదేవి ఊహలకు రెక్కలొచ్చి ఊసులు వేనవేలు ఎగసి ఎగసి నింగిని చేరి కడతాయి మేడలు… గాలి మేడలు ! పునాదులే లేని ఊహాజనితపు కట్టడాలు! అంతులేని భావవీచికలు అందంగా మలిచి ఆశల తోరణాలతో అలంకరించిన ఆకాశహర్మ్యాలు !! అవును… అవి కలలే.. గాలిలో మేడలే ! నిజాలై కళ్లెదురుగా ఎన్నటికీ నిలవని వాస్తవ దూరాలే ! ఆ కలలన్నీ కల్లలే… ఎప్పటికీ కలలే ! తెలిసినా మారాం చేస్తూ మది వినదే ! ప్రతీసారీ […]

నా మనస్సు అనే దర్పణం-నా భావాలకు ప్రతి రూపం।

రచన: లక్షీ ఏలూరి అది ఒక మాయా దర్పణం-కొన్నిసార్లు నన్ను కూర్చోపెడుతుంది సింహాసనం మీద। మరి కొన్ని మార్లు తోస్తుంది అదః పాతాళానికి। అమ్మ కడుపు లోని శిశువును మావితో, నా హృది లోని కోరికలు అనే గుఱ్ఱాన్ని అజ్ఞానం కప్పి వేస్తే, మనసు అనే అద్దానికి పట్టిన మకిలిని అధ్యాత్మిక జ్ఞాన దీపాన్ని వెలిగించి పారద్రోలుతుంది। పరులాడు పరుషాలకు పగిలిన నా మాయా, దర్పణం వక్కచెక్క లయితే పవన మారుతాలు చల్లని నవనీతంపూసి సేద తీరుస్తాయి। […]

మనసులు మురిపిస్తా

రచన: గుండ్లపల్లి రాజేంద్రపసాద్ వెలుగునై ప్రసరిస్తా వదనాలను ప్రకాశింపజేస్తా గాలినై వ్యాపిస్తా సువాసనలను విరజిమ్ముతా పువ్వునై వికసిస్తా పరవశాన్ని పంచిపెడతా పాటనై రాగము తీయిస్తా ఆటనై నాట్యము చేయిస్తా పలుకులనై కులికిస్తా తేనెలను చిందిస్తా చిరునవ్వునై చెంపలకెక్కుతా అమృతాన్నై అధరాలలోకూర్చుంటా కలనై కల్పనలిస్తా కలమై కాగితాలపై రాయిస్తా అక్షరాలనై అల్లుకుంటా పదములై ప్రవహిస్తా ఊహనై ఊరిస్తా భావమునై భ్రమలు కలిగిస్తా అందమునై అలరిస్తా అంతరంగంలో ఆవాసముంటా కవితనై కవ్విస్తా మనసులను మురిపిస్తా

ఓ మనిషీ !

రచన: ధరిత్రి దేవి ఓ మనిషీ ! సమస్యల సుడిగుండాలెన్ని ముంచెత్తినా ప్రకృతి గర్జించి ప్రళయంతో వెల్లువెత్తినా ఎన్ని’కరోనా ‘లొచ్చి కన్నీటి కడగండ్లు చుట్టుముట్టినా సాగుతున్నావు అదరక బెదరక అడుగేస్తూ కొనసాగిస్తున్నావు జీవనయానం మున్ముందుకు! ఆటుపోట్ల తాకిడికి వెరవనంటావు అవాంతరాలను లెక్కచేయనంటావు ఆశా జీవిని నేనంటావు! మిన్ను విరిగి మీదపడ్డా ఆత్మస్థైర్యం కోల్పోనంటావు ! అదే కదా మరి, నీ తిరుగులేని ఆయుధం! ఏది ఏమైనా, ఆగదుగా కాలగమనం! అదో నిరంతర ప్రవాహం! కదుల్తూ కదుల్తూ తెచ్చింది […]

వనితా!

రచన: ఉమా పోచంపల్లి గోపరాజు ప॥ మరుమల్లెల తావిలా మందారం పూవులా నీవిలాగే ఇలాగే ఇంపుగా, సొంపుగా వికసిస్తూ, విరబూయుమా 1వ చ॥ పదములే పృథివిపైన మెత్తనైన అడుగులై సాగనీ పలుకులే రామచిలుక పలుకులై మాధుర్యములొలకనీ! 2వ చ॥ అడుగులే నడకలలో నాట్యమయూరిగా చూపులే శరత్జ్యోత్స్న కాంతికిరణ చంద్రికయై కనుపాపలోని కాంతివై 3వ చ॥ ఉరకలతో పరుగులతో చదువులలో ప్రఖ్యాతివై ఆటలలో పాటలలో అభ్యున్నతి నొందుమా 4వ చ॥ జగములనెల్లా జయించు లోకాలకు మేటివై మేలొనరెడు నేతవై […]

మనిషి ఎదుట మాట్లాడితే…

రచన: కంచరాన భుజంగరావు కొమ్మలపైనుండి లేచినప్పుడు రెక్కలున్న పచ్చనాకుల్లా అనిపిస్తాయి దొండపండులాంటి ముక్కులుండబట్టి సరిపోయింది లేకుంటే, ఆకుల్లో ఆకుల్లా ఉన్న వీటి ఆనవాలు పట్టుకోవడం కూడా కష్టమయ్యేది వీటి చురుకైన మొహంలో ఎన్నెన్ని చలాకీ నవ్వులాటలో! ముక్కూ ముక్కూ రాసుకుని మురిపెంగా సిగ్గుపడినప్పుడూ… దోరజామకాయలతో ఇష్టంగా ఎంగిలి పడినప్పుడూ… వీటి ఎరుపు ముక్కు మురిపెం మరింత పలకమారుతుంది! మెడచుట్టూ బంగారు తొడుగులా అమరిన రింగుతో రాజకుటుంబీకుల్లా ఉంటాయి దివ్యమైన తేజస్సు వర్చస్సుతో పచ్చని ఈకల పసిమి కొమ్మల్లా […]

ఫన్నీ కవిత…

  రచన: చంద్రశేఖర్     గతి తప్పిన మతి గురి తప్పిన పురి మనసు విప్పిన వయసు మది ఇమిడిన గది నోరు మెదపని పోరు వాన కురిసిన కోన కోట లోపల వేట ప్రేమ కుట్టిన దోమ బావి లో చూసిన టీవీ దారి తప్పిన పోరి అడుగు అడుగున మడుగు గుండె పై వాలిన దండ అండ నీవని వేసిన దండ గట్టు పై మొలిచిన చెట్టు విషం వేసిన వేషం మీసం […]

సుమహార కోశం

రచన: డా||బాలాజీ దీక్షితులు పి.వి ఈ సృష్టిలో ఎన్నో గంధర్వలోకాలున్నాయి ఆఘ్రాణించలేని దివ్యగాధాలున్నాయి మరుపురాని మకరందాలున్నాయి ఆత్మరాగం చలించి ఫలించి, వరించి, తరించే అపూర్వ సంగమాలున్నాయి ఇలాంటి ఈ విశ్వాన కళకోసం, కవితార్చన కోసం అమలిన ప్రణయ యాతన కోసం జీవిత సత్యం కోసం ఆనంద నృత్యం కోసం అనురాగ లక్ష్యం కోసం పరితపించే అమందానంద హృదయం నాది అందున వికసించే సుమహార కోశం నీది