April 27, 2024

జామాత

రచన: గిరిజారాణి కలవల ‘ఇచట మీ చేయి చూసీ చూడగానే మీ జాతకం మొత్తం చెప్పబడును. జ్యోతిషపండిత రత్న శ్రీశ్రీ అనుగ్రహ స్వామి చేతిలో, మీచేయి పెట్టండి., గతి తప్పిన మీ గ్రహాలని దారికి తెచ్చుకోండి. రండి. చేయి చాపండి. మీ అతీగతీ తెలుసుకోండి.” తాటికాయంత అక్షరాలతో ఉన్న బోర్డు కనపడగానే, ‘యాహూ!’ అనుకుంటూ ఎగిరి గంతేసాడు చిదానందం. గత కొద్ది రోజులుగా తాను పడే సమస్యల నుంచి పరిష్కారం దొరికే మార్గం దొరికిందని సంబరపడిపోయాడు. వెంటనే […]

బుచ్చిబాబుకి పెళ్ళయింది

రచన… కలవల గిరిజా రాణి. “సార్! రేపు సెలవు కావాలి.” చేతులు నులుముకుంటూ అడుగుతున్న బుచ్చిబాబు వేపు జాలిగా చూసాడు మేనేజర్ సావధానం. ఆ చూపుకి అర్ధం తెలిసిన బుచ్చిబాబు నేలచూపులు చూడసాగాడు. “అలా నేలచూపులెందుకులేవోయ్ బుచ్చిబాబూ! ఇంతకీ రేపటివి ఎన్నో పెళ్ళిచూపులేంటీ?” “ముఫై నాలుగోది సార్!” ముఫై నాలుగు పళ్ళూ బయటపడేలా నవ్వుతూ అన్నాడు బుచ్చిబాబు. “నీ వయసు ముఫై నాలుగు దాటి, నాలుగేళ్లు అయిందనుకుంటా ను. ఈసారైనా పెళ్లి కుదుర్చుకునేదుందా? లేదా?” లీవ్ లెటర్ […]

‘కల వరం’

రచన… కలవల గిరిజారాణి. పెళ్ళిచూపుల సీన్ మొదలైంది. అసలే చక్కని పిల్లకి, తగిన అందమైన ‘అలంకారం’ తో చూడముచ్చటగా వుంది. పిల్లాడి ‘ఆకారం’, ఫర్వాలేదు, పిల్లకి ఈడూ జోడూ బాగానే వున్నాడు. అంతకు ముందే జాతకాలూ గట్రా కుదిరయానుకున్న తర్వాతే తరువాత ఘట్టం ఇది. తియ్యని స్వీట్లూ, ‘కారం’ కారంగా హాట్లూ, వేడి వేడిగా కాఫీలూ, చల్ల చల్లగా కూల్ డ్రింకులూ సేవించిన పిదప ముఖ్యమైన ఘట్టానికి ‘ఆవిష్కారం’ మొదలయింది. అదే బేరసారాలు. అన్నీ కుదిరితే పెళ్ళికి […]

ప్రాయశ్చిత్తం – 6

రచన: గిరిజారాణి కలవల అమెరికా నుంచి ఇండియాకి ఇరవై నాలుగు గంటల ప్రయాణం. కంటిమీద కునుకు లేదు. సురేంద్ర తలపుల నిండా తండ్రే మెదులుతున్నాడు. ఢిల్లీలో విమానం దిగి మరో రెండు గంటలలో, ముందుగా బుక్ చేసుకున్న కాశీ ఫ్లైట్ అందుకున్నాడు సురేంద్ర. పవిత్ర పుణ్యక్షేత్రం కాశీ మహానగరం. ముక్తి క్షేత్రం. గంగానది ఒడ్డున ఎక్కడెక్కడ నుంచో వచ్చినవారు, తమతమ పితృ దేవతలకు, అక్కడ బ్రాహ్మణులు చేయిస్తున్న శ్రాద్ధకర్మలని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుతున్నారు. అక్కడే ఒక […]

ప్రాయశ్చిత్తం – 5

రచన: గిరిజారాణి కలవల గరాజ్ లో కారు పార్కింగ్ చేసి లోపలికి రాగానే హాల్లో టివీ చూస్తున్న కొడుకు రుషి, “ఎక్కడకి వెళ్ళావు డాడీ! ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. ఫ్రెష్ అయి వస్తే డిన్నర్ చేద్దాం. విన్నీ బయట తినేసి వస్తానంది.” అన్నాడు. ఆ మాటలలో తల్లి ప్రసక్తే లేదు. నిట్టూరుస్తూ సురేంద్ర తన రూంలోకి వెళ్లి స్నానం చేసి నైట్ డ్రస్ వేసుకుని వచ్చేసరికి, రుషి రెడీమేడ్ చపాతీలని పెనం మీద కాల్చి తండ్రికీ, […]

ప్రాయశ్చిత్తం – 4

రచన: గిరిజారాణి కలవల ఆలోచనల నుండి బయటకి వచ్చి చుట్టూ చూసాడు. పార్క్ లో జనం పల్చబడ్డారు. చీకట్లు నెమ్మదిగా ముసురుకుంటున్నాయి.తను కూడా లేచి ఇంటి దారి పట్టాడు. పార్క్ లో ఇందాక విన్న మాటలే చెవిలో గింగిరాలు తిరుగుతున్నాయి. అన్యమనస్కంగా కారు నడుపుతున్న సురేంద్ర ఆలోచనలకి , ఫోన్ రింగ్ బ్రేక్ వేసింది. తనతో పాటు పని చేసే రమణ వద్ద నుంచి ఫోన్. లిఫ్ట్ చేసి, “ హలో! రమణా! చెప్పరా?” అన్నాడు. “హలో! […]

గోపమ్మ కథ… 8

రచన: గిరిజారాణి కలవల   గోపమ్మని అలాంటి పరిస్థితుల్లో చూసాక, ఎలా ఓదార్చాలో కూడా తెలీలేదు నాకు. “ఊరుకో! గోపమ్మా! వాడికి అంతవరకే రాసి పెట్టి వుంది. మన చేతుల్లో ఏముంది చెప్పు.” అన్నాను. “చేజేతులా చేసుకున్నాడమ్మగారూ! వాడి చావుని వాడే కొనితెచ్చుకున్నాడు. సంపాదించినదంతా… ఆ తాగుడికీ, చెడ్డ తిరుగుళ్ళకీ పెట్టి… నడి వయసులోనే చచ్చిపోయాడు. మా ఇళ్ళలో మగాళ్ళందరికీ ఇది మామూలే కదమ్మా! ఇలాంటి చావులు చస్తూనే వుంటారు. మా పీకల మీదకు తెస్తూనే వుంటారు.” […]

గోపమ్మ కథ – 7

రచన: గిరిజారాణి కలవల లక్ష్మి, కోటి కాపురం … ఇక వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు. మూడు పురుడులు పోసి … తన బాధ్యత తీర్చుకుంది గోపమ్మ. మరో పక్క… కొడుకు పిల్లలు పెద్దవుతున్నారు. కొడుకు, కోడలు, మనవలు అంటూ మళ్ళీ మొదలెట్టింది. చిలక్కి చెప్పినట్లు చెప్పాను. ‘పెళ్ళి చేసావు. వాడికీ పెళ్ళాం, పిల్లల బాధ్యతలు తెలియనియ్యి. తల్లి కోడిలాగా, నీ రెక్కల కిందే ఎన్నాళ్ళు చేస్తావు? నీకూ రెక్కల శ్రమ ఎక్కువ అవుతుంది.’ వింటే కదూ! […]

గోపమ్మ కథ – 6

రచన: గిరిజారాణి కలవల   నేను చెప్పినదేదీ పట్టించుకోకుండానే గోపమ్మ … తిరనాల అయిన పదిరోజులకే లక్ష్మి,  కోటిలకి లగ్గాలు పెట్టించేసింది.  ముందు నిశ్చయ తాంబూలాలకి వాళ్ళ భాషలో పప్పన్నాలు పెట్టుకోవడం.  అలా ఓ మంచి రోజు చూసుకుని,  రెండు కుటుంబాలతో పాటు బంధువులందరూ కలిసి  పెళ్ళి నిశ్చయం చేసుకున్నారు.  అదే పప్పన్నాలు పెట్టుకున్నారు.  పేరుకే పప్పన్నాలు… ఆరోజు కోడి పలావులు,  కల్లు ముంతలు ధారాళంగా కొనసాగాయని చెప్పింది గోపమ్మ. “ఎందుకు అలా అనవసరపు ఖర్చు గోపమ్మా? […]

గోపమ్మ కథ – 6

రచన: గిరిజారాణి కలవల ఇక అప్పటినుండి గోపమ్మ , లక్ష్మిని తనతోనే తను పనిచేసే ఇళ్ళకి తీసుకువెళ్ళేది. బడిలో చేర్పించి చదువు చెప్పిస్తానంటే ససేమిరా ఒప్పుకోలేదు లక్ష్మి. లక్ష్మి చేసే సహాయంతో గోపమ్మకి మరి నాలుగు డబ్బులు చేతిలో ఆడసాగాయి. లక్ష్మి ఈడేరినప్పుడు ఫంక్షన్ చేద్దామని తలచింది. నన్ను పదివేలు సర్దమని అడిగింది. ‘ఎందుకు గోపమ్మా! ఈ ఆర్భాటాల ఫంక్షన్లు. అనవసరంగా డబ్బు దండుగ కదా! అప్పు చేసి మరీ చేయాలా?’అని అడిగాను. “ఏం చేస్తామమ్మా! మా […]