April 27, 2024

నేను కాదు మనం…

రచన: జ్యోతి వలబోజు చిత్రం: కూచి చిత్రకారుడు “నాన్నా! మీరు పేపర్సన్నీ పెట్టుకుని, టాక్సీ మాట్లాడుకుని రేపు వచ్చేస్తారా.? నన్ను రమ్మంటారా..? లేక ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయనా?” ఫోనులో మాట్లాడుతున్నాడు కిశోర్. కొద్దిసేపు మాట్లాడి “సరే మీ ఇష్టం. జాగ్రత్తగా రండి. బయలుదేరేటప్పుడు కాల్ చేయండి” అంటూ ఫోన్ పెట్టేసాడు. పక్కనే ఉన్న అతని భార్య ప్రియ “ఏమంట? మామయ్యవాళ్లు ఎందుకొస్తున్నారు. ఏమైంది?” అని అడిగింది. “అమ్మకు, నాన్నకు రెగ్యులర్ హెల్త్ చెకప్ ఉందిగా. అలాగే […]

అన్నపూర్ణ తల్లి..

రచన: జ్యోతి వలబోజు వాడిపోయిన మొహంతో వచ్చి బ్యాగ్ సోఫాలో పడేసి దిగాలుగా కూర్చుంది వనజ.. తలుపు చప్పుడు విని హాల్లోకి వచ్చిన వనజ అత్తగారు లక్ష్మిని చూసి విస్తుపోయింది. “వనజా! ఏమైందమ్మా! రోజూ రాత్రి ఎనిమిది అయ్యేది, ఇవాళ ఇంత తొందరగా వచ్చేసావేమిటి? తలనొప్పిగా ఉందా? టీ ఇవ్వనా?” అంటూ పక్కనే కూర్చుంది. ఆ మాత్రం ఆప్యాయతను తట్టుకోలేక, అప్పటిదాకా మౌనంగా ఉన్న వనజ అత్తమ్మ చేయి పట్టుకుని భోరుమని ఏడ్చేసింది. “అయ్యో! ఏమైందమ్మా.. ఎవరేమన్నారు. […]

సర్దాలి….సర్దుకోవాలి…

రచన: జ్యోతివలబోజు ఉతికిన బట్టలు, విడిచిన బట్టలు ఇస్త్రీ చేసే బట్టలు అల కుప్పలా వేసారేంటి? సర్దుకుంటే కాదా… క్లాసు బుక్స్, హోంవర్క్ బుక్స్, అసైన్మెంట్ బుక్స్, రికార్డ్ బుక్స్, పెన్నులు, స్కెచ్ పెన్నులు అన్ని అల చెత్తకుండీల పెట్టుకుంటారేంటి బీరువా.. సర్దుకుంటే కాదా… బెడ్‌రూమ్‌లో టేబుల్ అవసరమా, అసలే రూం చిన్నగా ఉంది..ఇదొకటి అడ్డంగా ఉంది తీసేయమంటే వినరు. వాడని కుర్చీలు, పాత సామాను ఎవరికైనా ఇచ్చేసి కాస్త ఇల్లు నీటుగా సర్దుకుంటే కాదా… ఇది […]

మాలిక పత్రిక డిసెంబర్ 2019 సంచికకు స్వాగతం

  Jyothivalaboju Chief Editor and Content Head పాఠక మిత్రులకు, రచయితలకు ఈ సంవత్సరాంతపు సంచికకు తియ్యతియ్యగా స్వాగతం. నా అమెరికా పర్యటన కారణంగా నవంబర్ నెల సంచిక విడుదల చేయడం కుదరలేదు. దానికి క్షమాపణలు కోరుకుంటూ ఈ నెలలో కాసిన్ని ఎక్కువ సాహితీ మిఠాయిలు మీకోసం.. అప్పుడే కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పుకున్నాం కదా మళ్లీ సంవత్సరం చివరకి వచ్చేసామా అన్నట్టుంది కదా. ఏంటో ఈ కాలానికి ఇంత తొందరపాటు .. అలా వేగంగా […]

“స్వచ్ఛ” తరం

రచన: జ్యోతి వలబోజు “విజయా!! విజయా!” గట్టిగా అరుస్తూ ఇంట్లోకొచ్చాడు నరహరి. భర్త కోసం ఎదురుచూస్తూ టీవీ సీరియల్ చూస్తున్న విజయ గభాల్న లేచి వచ్చింది. “ఏంటీ పెద్దమనిషి? ఎప్పుడు లేనిది ఇవాళ చాలా కోపంగా ఉన్నట్టున్నాడు” అనుకుంది. గట్టిగా చప్పుడొచ్చేలా అడుగులేస్తూ హాల్లోకి వచ్చి కోపంగా చూసాడు భార్యను. “ఏమైందండి? ఎందుకలా కోపంగా ఉన్నారు? మీ స్నేహితులతో పార్టీ అని వెళ్లారుగా? అక్కడ ఏదైనా గొడవ జరిగిందా?” “ఫ్రెండ్స్ కాదు నీ పిల్లలే .. వాళ్లకు […]

మాలిక పత్రిక మే 2019 సంచికకు స్వాగతం

  Jyothivalaboju Chief Editor and Content Head ప్రియ పాఠకులు, మిత్రులు, రచయితలకు వేసవి శుభాకాంక్షలు. మండుతున్న రోజులకు కూడా శుభాకాంక్షలు చెప్పాలా అంటారా? ఏం చేస్తాం. ఈ రోజుల్లో ఏదో ఒక దినం వస్తోంది,  ఏదో ఒక పండగ వస్తోంది. శుభాకాంక్షలు చెప్పడం అలవాటైపోయింది.  ఆగండాగండి.. కోపం తెచ్చుకోవద్దు. వేసవి మండే ఎండలే కాదు.. సువాసనలు వెదజల్లే మల్లెపూలు, ముంజెలు, రకరకాల ఆవకాయలకోసం మరెన్నో రకాల మామిడికాయలు, తర్వాత వచ్చే తియ్యని మామిడిపళ్లు… పిల్లల […]

మాలిక పత్రిక ఏప్రిల్ 2019 సంచికకు స్వాగతం

    Jyothivalaboju Chief Editor and Content Head మా పాఠకులు, రచయితలు, మిత్రులందరికీ వికార నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు.. షడ్రుచుల సమ్మేళనం – తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని  అందించే యుగాది సందేశంతో మరో కొత్త […]

నవరసాలు..నవకథలు.. వీర 4

రచన: జ్యోతి వలబోజు ధైర్యం. రాత్రి తొమ్మిదిన్నర అవుతోంది. భాస్కర్ తన దుకాణం మూసేసి ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి రాగానే కూతుళ్లిద్దరూ మొహాలు మాడ్చుకుని డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తింటూ కనపడ్డారు. అమ్మానాన్నలు అప్పుటికే నిద్రపోయినట్టున్నారు. వాళ్ల రూమ్ తలుపు దగ్గరగా వేసుంది. చెప్పులు విప్పి తన రూమ్ లోకి వెళ్తున్న భాస్కర్ ని చూసి “నాన్నా!” అరిచినట్టుగా పిలిచారు పిల్లలిద్దరూ. “ఏంట్రా బంగారం? తినండి. నేను స్నానం చేసి వస్తాను.” అన్నాడు ప్రేమగా. “అదంతా […]

మాలిక పత్రిక అక్టోబర్ సంచికకు స్వాగతం

  Jyothivalaboju Chief Editor and Content Head ప్రియమైన పాఠకులకు, రచయితలకు, మిత్రులందరికీ ముందుగా దసరా పండగ శుభాకాంక్షలు. రాబోయే పండగలు మీకందరికీ శుభాలు కలుగజేయాలని మనసారా కోరుకుంటూ ఈ మాసపు మాలిక పత్రికను మీకు నచ్చిన, మీరు మెచ్చిన శీర్షికలు, కథలు, కవితలు, కార్టూన్స్, సీరియల్స్ మరియు వ్యాసాలతో  తీర్చిదిద్దడం జరిగింది. మీ రచనలను పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com మరి ఈ మాసపు విశేషాలను తెలుసుకుందాం. 1.గిలకమ్మ కథలు – పెత్తాట్టెంక, సింతాట్టెంక 2.  […]

మాలిక పత్రిక ఆగస్టు 2018 సంచికకు స్వాగతం

  Jyothivalaboju Chief Editor and Content Head పాఠక మిత్రులకు, రచయితలకు, రచయిత్రులందరికీ స్నేహితుల దినోత్సవ శుభకాంక్షలు..   పేదా, గొప్ప, చిన్నా పెద్దా, జూనియర్, సీనియర్ అన్న బేధాలు లేకుండా అందరికీ కలిపేది అక్షరమే. ఈ అక్షరాల సాక్షిగా మనమందరం తరచూ కలుస్తున్నాము. మన భావాలు, ఆలోచనలు, ఆవేదనలు, సంఘర్షణలను పంచుకుంటున్నాము. చర్చిస్తున్నాము. ఇది ఒక ఆరోగ్యకరమైన భావము, భావన కూడా. మాలిక పత్రికను ఆదరిస్తున్న మీ అందరికీ మనఃపూర్వక ధన్యవాదములు.  వచ్చే నెలలో ఇద్దరు […]