రచన : డి.వి.హనుమంత్ రావు.
పాత్రలు : భార్య — శ్రీమతి విజయలక్ష్మి.. భర్త .. శ్రీ డి.వి.హనుమంత్ రావు..
భార్య.. (పాట)వాసంత సమీరంలా .. నులివెచ్చని గ్రీష్మంలా….. సారంగ సరాగంలా ..అరవిచ్చిన లాస్యంలా.. ఒక శ్రావణమేఘంలా…. సాధించాలి
భర్త : ఈ గోల మొదలైపోయింది..
భార్య : ఈసారి ఎలాగైనా సాధించాలి…
భర్త :(మధ్యలో ఆపి) అమ్మా! తల్లీ! ఈసారేమిటమ్మా నీ సంకల్పం?
భార్య: కస్తూరి..కస్తూరి.. (వినిపించుకోకుండా పాట కంటిన్యూ చేస్తూ వుంటుంది)
భర్త : ఏమిటి? ఏవిటి చేయదలుచుకున్నావు?
భార్య: ఇరవై నాలుగ్గంటలూ శాస్త్రీయ సంగీతం పాడి గిన్నీస్ బుక్కులో కెక్కిన మహానుభావులు ఉన్నారా?
భర్త : ఊ వున్నారు. వున్నారు.
భార్య: అలాగే ఇరవై నాలుగ్గంటలూ నాట్యప్రదర్శన చేసి గిన్నీస్ బుక్లోకి ఎక్కిన మహానుభావులూ వున్నారు ?
భర్త : అవును..మహానుభావులు…కెక్కారు..కెక్కారు…
భార్య: (ఆవేశంతో) అలాగే…వారి అడుగుజాడల్లో నడిచి నేను కూడా..ఇరవై నాలుగ్గంటలు. టి.వి.సీరియల్స్ టైటిల్ సాంగ్స్ పాడి, గిన్నీస్ బుక్లో కెక్కి ఆ రికార్డులన్నీ బ్రద్దలు కొడ్తాను. ఇదే…ఇదే నా శపధం. (ఆవేశంతో ఊగిపోతుంది).
భర్త : ఓర్నాయనోయ్ … ఓర్నాయనోయ్ … ఎప్పటికయ్యేనిది..
భార్య:(పాట) అంతరంగాలూ.. అనంత మానస చదరంగాలూ..
భర్త : ఓ! అనంతలక్ష్మీ.. ఈ లోపల కాస్త కాఫీ ఇచ్చి పుణ్యం కట్టుకో తల్లి!
భార్య:(పాట) మెట్టెల సవ్వడి.. ఓ. ఆ..మెట్టెల సవ్వడీ..
భర్త : మెట్టెల సవ్వడి సరే..కాఫీ ఇయ్యమ్మా!
భార్య : మెట్టెల సవ్వడీ .ఓ.. మెట్టెల సవ్వడి…మెడలో మాంగల్యం.. మదిలో అలజడులు..
భర్త : కాఫీ సరే…పోనీ కనీసం భోజనమైనా పెట్టేదుందా? అదీ లేదా?
భార్య:(పాట) ఎండమావులే నీ గుండెలోని ఆశలూ..
భర్త : బోజనం తల్లీ ఎండమావులంటావేం?
భార్య:(పాట కంటిన్యూ చేస్తూ) ఎండమావులే..నీ మనసులోని ఆశలు…
భర్త: ఆశ కాదమ్మా.. ఆకలి బాధ..క్షుద్బాధ..
భార్య : ఎందుకో నాకు ఈ ఆశలు…ఎందుకో నాకు ఈ ఆశలు..
భర్త : ఆకలి..ఆకలి..
భార్య: వంటవ్వలేదండి..
భర్త : ఇంకా వంటవ్వలేదా? నాకు తొమ్మిదిన్నరకే అలవాటు ? అప్పుడే పన్నెండున్నరైపోయింది .. ఇంకా వంటవ్వలేదా?
భార్య:(పాట) మనసంటే మమతల నిలయం మమతంటే తీరని బంధం..
భర్త : ఎప్పుడు చేస్తావ్? ఎప్పుడు వండుతావ్? ఎప్పుడు పెడతావ్? అబ్బెబ్బే!! దిమ్మెత్తిపోతుంది..
భార్య: ఏవండి! ఐదు నిమిషాల్లో వండి అక్కడ పడేస్తాను. ఏం వండమంటారు చెప్పండి?
భర్త : ఏవిటి? ఇప్పుడు అడుగుతున్నావా? (వ్యంగ్యంగా) ఏం వం డ మం టా రూ అంటూ.. ఎప్పటికి పెడతావ్??
భార్య:చెప్పండి .. ఆనపకాయా? అరటికాయా? ఏం వండమంటారు?
భర్త (కోపంతో) నాకు .చిర్రెత్తిపోతోంది తలకాయ వండు….
భార్య: ఆవేసి చేయనా? వేయించనా??
భర్త: ఆ..ఆ…
*******************************
Where is the first episode andee
ఎన్నెలగారు,, జీ కామెడిలో రెండు ఎపిసోడ్స్ గా వచ్చాయి.. ఆ తర్వాత వారి ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ కాలేకపోయాము.
ఇది జీ తెలుగులో వచ్చిందా..చాలా బాగుంది .అభినందనలండీ…
ఓ ప్రక్క ఆవెట్టనా అంటూంటే…కాలూ చెయ్యీ ఆడదు కదా గురువుగారు…అవాక్కయిపోయా..ఇంకప్పుడు ఆవెట్టిందా–
లేక ఉడకపెట్టిందా అన్నది ఏంతెలుస్తుంది స్వామీ….
మీ అభిమానానికి కృతఙ్ఞతలు..
మీ ఇద్దరి పెర్ఫార్మెంస్ చాలా బాగుంది మాష్టారు. ఇంతకీ మీ ఆవిడ గారు గిన్నీస్ రికార్డ్ బద్దలు కొట్టారా? ఆ వేళ ఆవ పెట్టారా లేక వేయించేశారా? తెలియపర్చలేదు.
Zee తెలుగు TV లో మీ ప్రదర్శనకు మీ ఇరువురికీ నా హృదయ పూర్వక అభినందనలు.