April 26, 2024

తెల్లరంగు సీతాకోక చిలుకలు

రచన: స్వాతికుమారి బండ్లమూడి అనుమానం; చిన్నరేఖ పక్కన మరగుజ్జు గీతలు కంటికి సమాంతరంగా సాగని చూపులు ఎక్కడానికీ, దిగజారడానికీ అవే మెట్లు   —–   నమస్కారం; తిరుగు రైలు లేదని తెలిసీ మా ఊరొచ్చిన స్నేహితులకి మనిషిగా ఎదగమని అడ్డుతొలగిన ఆనందానికి వైరాగ్యాన్ని అలవాటు చేసినందుకు వంచనకి   —–   అవసరం; గాయపడని చోట ముందు చూపుతో కాస్త మందు ఆత్మను కాపాడుకోడానికి అహానికో చెంపదెబ్బ ఇంకా నేర్చుకోని పాఠాలకి కాసేపు విరామ చిహ్నం […]

సంపాదకవర్గం నుండి: ఒక చిన్నమాట!!

రచన : సుజాత   దశాబ్దాల తరబడి అలవాటు పడిపోయాం! అడుగు పెట్టిన ప్రతి చోటా అవినీతి స్వాగతం చెప్తుంటే కొన్నాళ్ళకి అదేదో మామూలు విషయంగా మారిపోయి దాన్ని పెంచి పోషిస్తూ, అప్పుడప్పుడూ మనమూ దానికి కొమ్ము కాస్తూ, నిత్య జీవితంలో దాన్ని ఆక్సిజన్ కంటే అవసరంగా మార్చుకున్నాం! అయినా లోపల ముల్లుగా గుచ్చుతున్న అసౌకర్యాన్ని మాత్రం కడుపులో నిప్పులా భరిస్తూ వచ్చాం! అతి తక్కువ స్థాయి ఉద్యోగి నుంచీ మంత్రులూ, దేశపాలకుల వరకూ అవినీతి మంత్రం […]

ఆహా! ఆంధ్రమాతా? నమో నమ:

— రచన:  ?????? (మీరే చెప్పాలి)   మన బ్లాగ్లోకంలో వంటలు రాసేవాళ్ళు చాలా మందే ఉన్నారు….అదేంటీ, వంటలు వండుతారుగాని రాయటమేమిటీ అంటారా…..ఏమో మరి వాళ్ళంతా రాస్తుంటారు(నిజంగా వండుతారో లేదో తెలీదుగాని..;)..)…..ఒకాయన “బ్లాగునలుడూ”, ఇంకొకాయన  “బ్లాగుభీముడూ”…… ఒకావిడ ఆరో, పదారో,నూటయాభైయ్యారో “రుచులు”తెగ రాసేస్తుంటుంది…..మరొకావిడ “రుచులు” అని చెప్పి తెగ టెంప్ట్ చేసేస్తుంటుంది…..:)….. మరి వాళ్ళందరూ రాయగాలేంది నేను రాస్తే తప్పేవిఁట్టా! ఆహాఁ ఏంటీ తప్పు అనడుగుతున్నా….అందుకని వాళ్ళకన్నా గొప్పగా వండలేకపోయినా సారీ రాయలేకపోయినా, వాళ్ళల్లో ఒకళ్ళగానన్నా కాకపోతానా […]

ఏ రాయైతేనేం?

రచన : డా.శ్రీనివాస చక్రవర్తి  గడియారం పది గంటలు కొట్టింది. పగలు కాదు రాత్రి.  దిక్కుమాలిన టీవీ చూసి చూసి కళ్ళు లాగుతున్నాయి. దిక్కుమాలిన సోఫాలో కూర్చునీ కూర్చునీ కాళ్ళు లాగుతున్నాయి. ఇంత రాత్రయ్యింది. తను ఎప్పుడొస్తుందో తెలీదు. ‘ఇప్పుడే రాదులే పద డాళింగ్!’ అంటూ పీకపట్టుకుని నిద్రాదేవి వత్తిడి చేసింది. ‘ఛస్!ఊరుకో!’అనడానికి కూడా ఓపిక లేదు. ఇంతలో బాంబుపడ్డట్టు పెద్ద చప్పుడు. తుళ్ళిపడి నిద్రాదేవి పీక వదిలేసింది. కాస్త తేరుకుని కళ్ళు నులుముకున్నాను. ‘ట్రింగ్!’మళ్లీ అదే […]

కూచిపూడి – నాతొలిఅడుగులు

రచన: తరంగిణి || శ్రీ గురుభ్యోన్నమః || ||శ్రీ పర దేవతాయై నమః||         చిన్నప్పుడు దూరదర్శన్ లో చూసిన డాన్సుప్రోగ్రాముల వల్లనో, లేక చదివిన పుస్తకాల వల్లనో సంప్రదాయ శాస్త్రీయ నృత్యమంటే ఒక రకమైన యిష్టం, నేర్చుకోవాలనే ఒకలాంటి తపన ఉండేవి….సంగీత,నాట్యాలమీద నా ఆసక్తి చూసి,పల్లెటూళ్ళో ఉండటం మూలాన మాకు ఏమీ నేర్పించలేక పోతున్నందుకు నాన్న తెగ బాధపడుతుండేవారు…   సెలవులకి వెళ్ళినపుడు అక్క దగ్గర సంగీతంలో కాసిన్ని పదనిసలు పలకడం, […]

స్త్రీ విద్యాభిలాషి గురజాడ

రచన : జగద్ధాత్రి   “తెలుగు సాహిత్యంలో మీరే మొదటి స్త్రీవాద రచయిత కదా?” అన్న ప్రశ్నకు “కాదు, మూడవ వాడిని, మొదటి వారు వీరేశలింగం గారు, రెండవ వారు గురజాడ వారు” అంటూ తన స్థానం మూడవదని  చెప్పారు చలం గారు ఒక ఇంటర్వ్యులో.  బాల వితంతువుల మోడు వారిన  జీవితాలను  ఉద్ధరించడానికి నడుం కట్టింది వీరేశలింగం గారైతే,  స్త్రీ విద్యకు ప్రాముఖ్యత నిచ్చిన వారు  గురజాడ. ఇక చలం స్త్రీ లైంగిక స్వేచ్చను కూడా […]

సత్రవాణి

రచన : సత్య (ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన పరిభాషకు, ఒక తెలుగు‘మాట’అందించడానికే ఈ కథ) ఆరోజు రమణమూర్తిగారు దేనికోసమో టేబిలు మీదా,సొరుగులోనూ వెదికారు.అది కనిపించలేదు. హడావుడిగా తనగదిలోనూ,వరండాలోనూ వెదికారు.దొరకలేదు.అలా వెదికి వెదికి విసుగెత్తి భార్యను పిలిచారు. ఆవిడ హడావుడిగా వచ్చారు.”ఏదీ?నా సత్రవాణి?ఎక్కడా కనిపించదేంటి?”అన్నారాయన.”ఎక్కడో మీరే ఎడమచేత్తో పెట్టి మర్చిపోయుంటారు అదెవరికావాలి? వెదుక్కోండి, కనిపిస్తుంది”అన్నారావిడ. “అన్నీ వెతికాకే నిన్నడగుతున్నాను. మీరే ఎక్కడో పెట్టేసుంటారు.వెతికి కాసేపట్లో నాకు తెచ్చివ్వాలి”అని ఆజ్ఞ జారీ చేసారు. ఆవిడ విసుక్కుంటూ లోపలికి వెళ్ళి కూతుర్నిపిలిచారు.”మీనాన్న […]