May 7, 2024

మా నేపాల్ దర్శనం-2

రచన:మంథా భానుమతి.   మరునాడు పొద్దున్నే ఏడుగంటలకి తయారయిపోయి, వాన్ లో పోఖరా బయలుదేరాము. దారిలో “మనకామనా దేవి” ఆలయ దర్శనం.. నాలుగు గంటలు పైగా పట్టింది. ఆలయం కొండ మీదుంది. కొండ కింద నున్న ‘కురింతర్’ అనే ఊరు చేరడానికి నాలుగు గంటలు పైగా పట్టింది. దూరం ఎక్కువ లేదు కానీ, అంతా ఘాట్ రోడ్డు. హిమాలయ శ్రేణుల్లోంచి మెలికలు తిరుగుతున్న బాటలో వెళ్తుంటే దారిలో దృశ్యాలు కన్నులకి విందే! కురింతర్ నుంచి కేబుల్ కారులో […]

వెటకారియా రొంబ కామెడియా 4

రచన: మధు అద్దంకి డయిటింగ్..డయిటింగ్..డయిటింగ్ ఉస్సూరంటూ ఇంట్లోకి వచ్చి కుర్చీలో కూలబడ్డాడు రామారావు… తలబద్దలయిపోతోంది కాస్త కాఫీ పడేస్తావా అంటూ అరిచాడు రామారావు… ఎక్కడా చప్పుడు లేదు..ఎమయ్యిందబ్బా అనుకుంటూ లోపలికి తొంగి చూశాడు. .టీ.వీ ఎదురుగా యోగా మాట్ వేసుకుని ఏదో ఆసనం వేయడానికి నానా తిప్పలు పడుతోంది భార్య గజలక్ష్మి.. గజం అంటూ నెమ్మదిగా పిలిచాడు .. ఉహూ పలకలేదు..ఆసనం వేసే ప్రయత్నంలో నిమగ్నమయ్యింది.. గజం అని పెద్దగా పిలిచాడు..ఉలిక్కిపడి తలతిప్పి చూసింది ఏంటన్నట్టు.. మొగుడనేవాడు […]

అమ్మాయి వెళుతోంది

రచన: దాసరాజు రామారావు   నా ఇంటిని నా ఇష్టానికే వదిలేసి సర్దిన తీరులో తన ఇష్టాన్ని ముద్దరేసి కాలానికి నా ఎదురుచూపులానించి అమ్మాయి వెళుతోంది   కట్ చేస్తే   గుండెల మీద ఆడినప్పుడు అ ఆ లు నేర్చుకోవాలన్నానేమో వీధిలోకి ఉరికినప్పుడు పట్టుకుపోయేటోడొస్తాడన్నానేమో చంకనెక్కి, చందమామని చూపినప్పుడు తెచ్చిస్తనని, మాట తప్పానేమో ముద్దులొలకబోసినప్పుడు మూట గట్టుకోవడం మరిచినానేమో   కట్ చేస్తే   రెండుజడలు వేసుకొన్నప్పుడు పేరొందే కవయిత్రి కావాలని అని వుంటాను అక్క […]

మా సినిమా బొమ్మల బాపు

రచన: బదరీనాథ్ దూర్వాసుల   తెలుగు లిపిలో ఒక వినూత్న శైలిని, కుంచెతో తనదైన చిత్రలేఖనా పాటవాన్ని, తెలుగు సినిమా ప్రపంచంలో ఉన్నతమైన కళా ప్రమాణాల్ని ఆవిష్కరించిన బొమ్మల బాపూ, ఇక మనకు లేరు! కానీ  నేటి సగటు తెలుగు సంస్కృతిపై వారు నిక్షేపించిన బీజాలు, చిరకాలం వర్దిల్లి  సొబగులిస్తాయి! రసజ్ఞుల హృదయాల్లో పదిలంగా పలు శతాబ్దాలు నిలుస్తాయి! చిత్ర పరిశ్రమలో ఒక వినూత్న శైలిని ప్రారంభించిన బాపూ-రమణల సాన్నిహిత్యం మరువలేని దృశ్య కావ్యాలను మన ముందుంచింది! […]

జ్ఞానపీఠ గ్రహీతలూ- మన పరిచయాలు

రచన: లక్ష్మీదేవి సహృదయానికి సాహిత్యం ఆనందప్రదాయకమైనది. సాహిత్య ప్రపంచంలో ఘనులై, మణులై, అక్షర ముత్యాల గనులై వెలసిన కవి పండితులు, రచనాకారులు మనకెందరో ఉన్నారు. వారిని మన మనసుల్లోనే  గౌరవించుకోవడంతో ఆగకుండా, మనప్రాంతంలో అందరికీ తెలుసునని ఊరుకోకుండా, భారతంలోని అన్ని రాష్ట్రాల్లో, ప్రపంచంలోని కొన్ని దేశాల్లోనైనా వారి రచనా పాటవాన్ని, భావ ప్రాభవాన్ని పరిచయం చేసే ప్రయత్నాల్ని “కువెంపు ప్రతిష్ఠానం” స్ఫూర్తితో  మనమూ చేపట్టాలి. కవుల భావజాలాలపట్ల, భాషాశైలుల పట్ల భిన్నాభిప్రాయాలున్నా వారి లేఖనా సామర్థ్యాన్ని, సమాజానికి […]

శివునికి ప్రీతికరమైన మాసం – కార్తీక మాసం

రచన–కర్రా నాగలక్ష్మి     మాసాలన్నిటిలోనూ  కార్తికమాసాన్ని  చాలా విశిష్టతమైనదిగా మన పురాణాలలో వర్ణించడం జరిగింది. కార్తీక మాసం పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనదని అంటారు భారతదేశంలో “సౌరమానము”  లేక “చాంద్రమానా”లని ప్రామాణికంగా తీసుకొని సంవత్సర పంచాంగాన్ని  తయారు చేస్తారు పండితులు. సౌరమానం ప్రామాణికంగా వాడతారు మన తమిళ సహోదరులు . వారి నెల సూర్యుడు మేష రాశిలో ప్రవేశిస్తే అది చైత్రమాసం , అలాగే సూర్యుడు వృషభ రాశి లో ప్రవేశిస్తే వైశాఖం అలా అన్న మాట. […]

హ్యూమరథం

రచన: రావి కొండలరావు   జోకుల ‘పుట్ట’ ప్రసాద్   పొట్టిప్రసాద్ అనీ, గట్టివాడు. ఒక దశలో పొట్ట పెరిగితే, “పొట్ట ప్రసాద్” అని తన మీద తనే జోక్ పేల్చుకున్నాడు.  ‘సాగరసంగమం’లో “వచ్చారండయ్యా” “అవునండమ్మా” అంటూ అందర్నీ ఆకర్షించాడు. అంతకుముందు చాలా సినిమాల్లో నటించినా, రెండు రెళ్లు ఆరు. రెండు జెళ్ల సీత, శ్రీవారికి ప్రేమలేఖ, రావుగోపాలరావు మొదలైనవి అతని ‘జంధ్యాల మార్కు’ సినిమాలు. స్టేజి మీద పులి. అక్కడే పెరిగాడు తొలినుంచి. కొర్రపాటి గంగాధరరావు […]