May 10, 2024

మా నేపాల్ దర్శనం – ముక్తినాధ్

రచన: మంథా భానుమతి పోఖరా వచ్చిన మరునాడే ముక్తినాధ్ ప్రయాణం. అక్కడ వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరట. అందుకని, పోఖరాలో చూడవలసినవి వాయిదా వేసి, ముందే ముక్తినాధ్ దర్శనం ఏర్పాటు చేశారు. పొద్దున్నే ఫలహారాలు.. ఒక్కో సాండ్విచ్, ఫ్రూటీ, యాపిల్, కేక్ పొట్లాలు కట్టి ఇచ్చారు  మీరా హోటల్ వాళ్ళు. చాలా చిన్న విమానం. పద్ధెనిమిది మంది మాత్రమే పడతారు. అరగంట ప్రయాణం. హిమాలయాల్లో, మంచు కొండల మధ్య సూర్యోదయం చూస్తూ, నాలుగైదు ఫొటోలు […]

భారతీయసంస్కృతిలో నైమిశారణ్యం

రచన:ఏల్చూరి మురళీధరరావు      శ్రీ పరమేశ్వరుని నిస్సీమ కరుణాకటాక్షం వలన భారతీయధరిత్రిపై భక్తిపరులకు సర్వార్థచింతామణియై వెలసి విలసిల్లుతున్న పవిత్రసీమ నైమిశారణ్యం. నిర్మలభావంతో, నిండైన భక్తితో ఒక్కసారి అడుగుమోపినంత మాత్రాన జన్మజన్మల పాపసంచయాన్ని పటాపంచలు చేసి కేవలానుభవానందస్వరూపమైన నిశ్శ్రేయసాన్ని ప్రసాదించే పుణ్యక్షేత్రం. పూర్వం బ్రహ్మదేవుడు మనోమయమైన ఒక చక్రాన్ని సృష్టించి దానిని వాయుమండలంలోకి విడిచిపెట్టాడట. అది మహావేగంతో సాగుతుండగా ఎదురుగాలి తాకిడికి దాని నేమి (బండి చక్రాన్ని చుట్టివుండే కమ్మి) విరిగి నేలకొరిగింది. ఆ నేమి పడిన […]

మాయానగరం-10

రచన: భువనచంద్ర  జీవితాన్ని జీవించడం వేరూ.. జీవితాన్ని అనుభవించడం వేరు. వీటి కన్నా గొప్పది అనుభవాన్ని ఆస్వాదించడం. ఇదేమీ మాటలగారడీ కాదు. ఇది అర్ధం కావటానికి తెలివితేటలతో పనిలేదు. డిగ్రీలతోనూ, పదవులతోనూ అంతకన్నా పనిలేదు. కేవలం కొంచెం ఆలోచించగలిగితే చాలు. ఆ మాత్రం ఆలోచించగల తెలివితేటలు వెంకటసామికి వున్నాయి. శ్రీ వెంకటస్వామి ఒకప్పుడు వెంకటేశా విలాస్ కి ప్రొప్రయిటర్. అంతకుముందు నందినీ విలాస్ లో అప్పట్లో క్లీనర్ కమ్ సర్వర్ కమ్ కుక్. కాఫీ గ్లాసుల జలతరంగిణి […]

తెలుగు పాటల్లో మంచి సాహిత్యం లేదా?

రచన: దేవి చిత్రగీతాల్లో కొన్ని సందర్భానికి తగినట్టూ కొన్ని తగనట్టూ ఉంటూ ఉంటాయి. కొన్ని కాలక్షేపానికి మాత్రమే సరిపోయేవైతే కొన్ని పూర్తి పాట కూడా వినలేనట్టు ఉంటాయి. కానీ కొన్ని మాత్రం జీవనసత్యాలను, సత్యం యొక్క తత్త్వాన్ని ఆవిష్కరిస్తూ ఉంటాయి. అవి ఇప్పటికీ స్మృతిపథంనుంచి అలనాటి శ్రోతలకు తొలగకపోవడం మాత్రమే కాదు, కొత్తగా వినే వాళ్ళకూ  మన చిత్రగీతాల్లో కూడా ఇన్ని గూఢార్థాలు ఉండగలవా అన్న ఆశ్చర్యమూ కలుగ జేస్తాయి. మొదటగా జగమే మాయ బ్రతుకేమాయ అనే […]

ఉగ్గుపాలతో…

రచన: నండూరి సుందరీ నాగమణి “అప్పుడేమో వాడు వెళ్ళి పక్కింట్లోంచి మామిడి కాయలు తెంపుకుని వచ్చి వాళ్ళమ్మకి ఇస్తాడన్నమాట! అప్పుడేమో వాళ్ళమ్మ  వాడిని ముద్దు చేసి, ఆ మామిడికాయలతో పప్పు వండి, నెయ్యేసి, అన్నంలో కలిపి పెట్టిందట…” మేనత్త చెబుతున్న కథను ఎంతో ఆసక్తిగా వింటున్న చింటూని చూస్తూంటే, వేదనతో…దిగులుతో మానస మనసు బరువెక్కింది. “చింటూ, ఇటురారా…” పిలిచింది గట్టిగా. “కనపట్టంలా, అన్నం తింటున్నాడు… తినేసి వస్తాడులే…” తాపీగా చెప్పింది, అనంత. మానస నిట్టూర్చి పనిలో పడిపోయింది. […]

వాగుడుకాయ

రచన:  తాడిగడప శ్యామలరావు. అబ్బాయీ వట్టి వాగుడుకాయలాగా ఉన్నావే?  నీ నోరసలు మూతబడదా? అని ఎవరో అడిగారు. ఐతేనేం, తన నోటిని అదుపులో ఉంచుకోవటం అతని వల్ల కాలేదు. ఆయన పేరు గుర్తు లేదు. ఆయన ముఖమూ గుర్తులేదు. ఆ మాట మాత్రం అతనికి బాగా గుర్తుండి పోయింది. స్కూలు పిల్లలంతా అతనికి రాళ్ళడబ్బా అని పేరు పెట్టేశారు. ఐనా అతడి నోరు మూతపడటానికి చచ్చినా ఒప్పుకోలేదు. కాలేజీ చదువులకు వచ్చాడు కానీ నోరు మాత్రం కొద్దిగా […]

ఆరాధ్య – 3

రచన: అంగులూరి అంజనీదేవి                  http://www.angulurianjanidevi.com  anguluri.anjanidevi.novelist@gmail.com   మాటల మధ్యలో రాకేష్‌ గురించి వున్నది వున్నట్లు చెప్పింది ఆరాధ్య… అంతా విని ‘రాకేషే కాదు. రాకేష్‌కన్నా ఇంకా డేంజర్‌ ఫెల్లోస్‌  వున్నారు బయట. అమ్మాయిలు అంత త్వరగా ఎవరినీ నమ్మకూడదు. నమ్మినా ఒంటరిగా ఎక్కడికంటే అక్కడికి వెళ్లకూడదు. నీ పట్ల రాకేష్‌కి దుష్టబుద్ధి కలగనందుకు సంతోషించు..” అన్నాడు. అతనలా అంటుంటే నిజమే ఈ విషయంలో తను చాలా […]